మా ఊరి పొలిమేర

మా ఊరి పొలిమేర 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై భోగేంద్రగుప్త నిర్మించిన ఈ సినిమాకు డాక్టర్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించాడు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, రవి వర్మ, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో 10 డిసెంబర్ 2021న విడుదలైంది.[1]

మా ఊరి పొలిమేర
Maa oori polimera.jpg
దర్శకత్వండాక్టర్‌ విశ్వనాథ్‌
రచనడా. విశ్వనాథ్‌
స్క్రీన్‌ప్లేడా. విశ్వనాథ్‌
కథడా. విశ్వనాథ్‌
నిర్మాతభోగేంద్ర గుప్త
నటవర్గం
ఛాయాగ్రహణంజగన్ చావలి
కూర్పుకేఎస్ఆర్
సంగీతంజ్యానీ
నిర్మాణ
సంస్థ
ఆచార్య క్రియేషన్స్
విడుదల తేదీలు
10 డిసెంబర్ 2021, డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీ
భాషతెలుగు

కథసవరించు

జాస్తిపల్లి గ్రామంలో కొమిరి (సత్యం రాజేశ్‌), జంగయ్య(బాలాదిత్య) అన్నదమ్ములు. అదే ఊరిలో ఉండే బలిజ(గెటప్‌ శ్రీను) వారి స్నేహితుడు. కొమిరి, బలిజ ఇద్దరు ఆటోడ్రైవర్‌లుగా పని చేస్తుంటే, జంగయ్య పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో ఊరి సర్పంచ్‌ రవి వర్మతో పాటు, కవిత(రమ్య) అనే గర్భిణి అనుమానాస్పద రీతిలో చనిపోతారు. ఈ మరణాలతో వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి?? అనంతరం ఏమి జరిగిందనేది మిగతా సినిమా కథ.

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: ఆచార్య క్రియేషన్స్
  • నిర్మాత: భోగేంద్ర గుప్త
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డాక్టర్‌ విశ్వనాథ్‌
  • సంగీతం: జ్యానీ
  • సినిమాటోగ్రఫీ: జగన్ చావలి

మూలాలుసవరించు

  1. Eenadu (17 December 2021). "రివ్యూ: మా ఊరి పొలిమేర". Archived from the original on 23 జనవరి 2022. Retrieved 23 January 2022.
  2. TV5 News (16 December 2021). "'మా ఊరి పొలిమేర'.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?" (in ఇంగ్లీష్). Archived from the original on 23 జనవరి 2022. Retrieved 23 January 2022.

బయటి లింకులుసవరించు