మా వింత గాధ వినుమా

ఆదిత్య మండల దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు చలనచిత్రం

మా వింత గాధ వినుమా, 2020 నవంబరు 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. సిల్లీ మాంక్స్ స్టూడియోస్ పతాకంపై ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ ప్లే అందించాడు. సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్, తనికెళ్ళ భరణి, శిశిర్ శర్మ, కమల్ కామరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల – రోహిత్ – జాయ్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆహా (ఓటిటి)లో విడుదలయింది.

మా వింత గాధ వినుమా
Maa Vintha Gaadha Vinuma Movie Poster.jpeg
మా వింత గాధ వినుమా సినిమా పోస్టర్
దర్శకత్వంఆదిత్య మండల
కథా రచయితసిద్ధు జొన్నలగడ్డ
నిర్మాతసంజయ్ రెడ్డి
అనిల్ పల్లాల
తారాగణంసిద్ధు జొన్నలగడ్డ
సీరత్ కపూర్
తనికెళ్ళ భరణి
శిశిర్ శర్మ
కమల్ కామరాజు
ఛాయాగ్రహణంసాయిప్రకాష్ ఉమ్మడిసింగు
కూర్పుసిద్ధు జొన్నలగడ్డ
సంగీతంజాయ్
శ్రీచరణ్ పాకాల
రోహిత్
నిర్మాణ
సంస్థ
సిల్లీ మాంక్స్ స్టూడియోస్
పంపిణీదారుఆహా (ఓటిటి)
విడుదల తేదీ
2020 నవంబరు 13 (2020-11-13)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశంసవరించు

సిద్ధూ (సిద్ధు జోన్నలగడ్డ)కు జీవతమంటే నిర్లక్ష్యంగా ఉంటాడు. కొన్నేళ్లుగా తను ప్రేమిస్తున్న వినీత (సీరత్ కపూర్) ప్రేమకోసం అనేక ప్రయత్నిస్తుంటాడు. వినీత కూడా సిద్ధూను ప్రేమిస్తుంది. ఒకరోజు సిద్ధుతో కలిసి వినీత తన సోదరుడి (కమల్ కామరాజు) ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం గోవాకు వెళ్తుంది. అక్కడ అనుకోని పరిస్థితులు ఏర్పడి తాగిన మత్తులో సిద్ధూ వినీత పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి వీడియో అందరికి వెలుతుంది. దాంతో వాళ్ళద్దరికిలో మనస్పర్థలు వచ్చి విడిపోతారు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: ఆదిత్య మండల [1]
 • నిర్మాణం: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లల
 • రచన, ఎడిటింగ్: సిద్ధు జొన్నలగడ్డ
 • సంగీతం: శ్రీచరణ్ పాకాల – రోహిత్ – జాయ్
 • సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
 • నిర్మాణ సంస్థ: సిల్లీ మాంక్స్ స్టూడియోస్
 • పంపిణీదారు: ఆహా (ఓటిటి)

నిర్మాణంసవరించు

కృష్ణ అండ్ హిస్ లీలా సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్ ఈ చిత్రంలో మళ్ళీ కలిసి నటించారు.[2] సీరత్ కపూర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.[3][4] 2020 సెప్టెంబరులో ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది.[5]

పాటలుసవరించు

ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల – రోహిత్ – జాయ్ సంగీతం అందించగా సిద్ధు జొన్నలగడ్డ, ఆదిత్య మండల పాటలు రాశారు.

No.TitleLyricsగాయకులుLength
1."జాన"అయాన్4:31
2."దూరంగా"సాహితి చాగంటి, పూజన్ కొహ్లి3:31
3."షాయర్-ఈ-ఇష్క్"సిద్ధు జొన్నలగడ్డ2:35
Total length:11:00

మూలాలుసవరించు

 1. Eenadu (30 May 2021). "ఓటీటీలో ఓహో అనిపించారు! - Sunday Magazine". EENADU. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 2. "Seerat Kapoor's "Maa Vintha Gaadha Vinuma" all set for Diwali release – Times of India". The Times of India.
 3. Pasupuleti, Priyanka. "Childhood love is innocent: Seerat Kapoor". Telangana Today.
 4. "Seerat Kapoor: I want to try out every genre possible". The New Indian Express.
 5. "Maa Vintha Gadha Vinuma team wraps up post-production work – Times of India". The Times of India.

ఇతర లంకెలుసవరించు