మిడుతల దండు

(మిడుతల దాడి నుండి దారిమార్పు చెందింది)

మిడుతల దాడి లేదా మిడుతల దండు (ఆంగ్లం:The locusts attack) మిడతలు ఉత్తర భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, తో పాటూ ఆరు రాష్ట్రాల్లో సుమారు 80 మిలియన్లు అనగా 8 కోట్ల మిడతలు పాకిస్తాన్ నుండి 1993లో భారత్ వీటి దాడి చేశాయి, మళ్ళీ మే నెల 2020 లో దాడి ప్రారంభం చేశాయి[1].

వంద సంవత్సరాల క్రితం

మార్చు

ఆఫ్రికా అడవుల్లో వీటి జననం వీటీ సంతానం అభివృద్ది చెందినట్టు ఒక అంచనా, వేసవి కాలం అక్కడి అడవులు పచ్చదనం లేక తగినంత ఆహారం వాటికీ లభించక ఇతర ప్రాంతాలకు దాడి ప్రారంభం మొదలవగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్ మీదుగా భారత్ లోకి ప్రవేశించాయి. మిడతలు గంటకు పదిహేను కిలోమీటర్లు ప్రయాణించగలవు సుమారు ఒక రోజులో 150 కిలోమీటర్లు ప్రయాణం చేయగలవు.మిడతల దండు మన దేశానికి కొత్తగాదు. గాలివాటంతో ప్రయాణం చేస్తూ ఇప్పటి వరకు ఉత్తర భారతదేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఈ మిడతల దాడి చేస్తుండగా గత ఇరవై ఏడు సంవత్సరాల క్రితం కూడా ఇలాగే దాడి చేశాయి[2].గత పదేళ్లుగా అప్పుడప్పుడు వీటి తాకిడివున్నా, చాలా స్వల్ప సంఖ్యలో రావడం.. రాజస్తాన్, గుజరాత్‌లలోని ఒకటి రెండు జిల్లాలకు సమస్య ఏర్పడటం ఉండేది. ఈసారి అవి కోట్లాదిగా వచ్చిపడ్డాయి. ఇంతటి భారీ సంఖ్యలో మిడతలు మన దేశం వచ్చిన ఉదంతాలు 1787–1796 మధ్య.. 1901–1908 మధ్య ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కూడా మిడ తల దండు రావడం రివాజైనా కోట్లాదిగా వచ్చిన దాఖలా లేదు. మన దేశం మాత్రమే కాదు...ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, అఫ్ఘానిస్తాన్, ఆఫ్రికాతోసహా 64 దేశాలు ఈ మిడతల దండువల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికి ఒక్క రాజస్తాన్‌లోనే అయిదు లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని అంచనా. ఈ మిడతల దండు పచ్చదనం అధికంగా వున్న నగరాలు, పట్టణాలను సైతం వదలటం లేదు.

వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ)

మార్చు

భూతాపం వల్ల హిందూ మహాసముద్రంలోని పశ్చిమ ప్రాంత సముద్ర జలాలు వేడెక్కాయని, పర్యవసానంగా గత ఏడాది చివరిలో ఆఫ్రికా ఎడారి ప్రాంతంలోనూ, అరేబియా ద్వీపకల్పంలోనూ కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు కురిశాయని, అందువల్లే ఈ స్థాయిలో మిడతల బెడద వచ్చిపడిందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలకు ముందు ఇక్కడ కురిసిన వర్షాలతో ఆ దండు మన దేశం వైపు వచ్చివుండొచ్చునని వారి అంచనా. రాజస్తాన్‌లపై విరుచుకుపడి, అటుపై ఉత్తరప్రదేశ్‌ వైపు వెళ్తూ గాలివాటుకు రెండుగా చీలి ఒకటి మధ్యప్రదేశ్‌ దిశగా పోయి అక్కడ విధ్వంసకాండ సాగించింది. మరో దండు ఢిల్లీ, హర్యానా వైపు వెళ్లింది. మధ్యప్రదేశ్‌వైపు వెళ్లిన దండు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లవైపు మళ్లినట్టు చెబుతున్నారు. ఇవి పగటిపూట ప్రయాణిస్తూ ఏపుగా పెరిగిన పంట చేలపైనో, పచ్చని చెట్ల పైనో, పచ్చికబయళ్లపైనో వాలతాయి. ఆకులు, పండ్లు, కూరగాయలు, జొన్న, వరి... ఇలా ఏది దొరి కితే అది స్వాహా చేస్తాయి. చీకటి పడేవేళ వున్నచోటే వుండిపోతాయి. ఒక దండు కదిలిందంటే అందులో కనీసం నాలుగు కోట్ల మిడతలుంటాయని, అవి ఒక్క రోజులో 35,000 మంది తినే ఆహా రాన్ని ఖాళీ చేస్తాయని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) చెబుతోంది. అంత ర్జాతీయ స్థాయిలో మిడతల తీరుతెన్నులపై అధ్యయనం చేసే ఏకైక సంస్థ అది. మిడతల దండు తాకిడికి లోనైన దేశాలు ఇచ్చే సమాచారాన్ని అందుకుని, అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి, ఆ దండు ఎటువైపు పోయే అవకాశం వుందో అంచనాకు రావడం... ఆ దిశగా వున్న దేశాలను అప్రమత్తం చేయడం దాని బాధ్యత. నిజానికి ఇప్పుడేర్పడిన బెడద చిన్నదని, వచ్చే నెలకల్లా అది మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం వున్నదని ఎఫ్‌ఏఓ మన దేశాన్ని హెచ్చరించింది.

లోకస్ట్‌ వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌(ఎల్‌డబ్ల్యూ)

మార్చు

తూర్పు ఆఫ్రికా నుంచి పాకిస్తాన్‌ మీదుగా భారత్‌కి వచ్చిపడే ఆ మిడతల దండు మరింత పెద్దగా ఉండొచ్చు నంటున్నది. మన దేశంలో కూడా ప్రత్యేకించి మిడతల బెడదను పసిగట్టి ముందస్తు హెచ్చరికలు చేయడానికి, అవసరమైన చర్యలు సూచించడానికి రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌ కేంద్రంగా లోకస్ట్‌ వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌(ఎల్‌డబ్ల్యూ) పనిచేస్తోంది. ఇది ఎఫ్‌ఏఓతోనూ, వేరే దేశాల్లో ఇదే అంశంపై పనిచేస్తున్న సంస్థలతోనూ చర్చిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తుంది. మిడతల దండు వల్ల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. కోట్లాదిమంది వినియోగించే ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఫలాలు వగైరాలను అవి స్వాహా చేస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో వేసవిలో చేతికందే పప్పుధాన్యాలు, కూరగాయలు, పత్తి వగైరాలు ఈ మిడతల దండువల్ల నష్టపోయే అవకాశం వుంది. మిడతలు భారీగా గుడ్లు పెడతాయంటున్నారు. ఒక్కో ఆడ మిడత 750 గుడ్లుపెడుతుందని, వాటివల్ల రెండేళ్లపాటు సమస్యలేర్పడే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు.

జాతీయ ఎమర్జెన్సీ

మార్చు

పంటపొలాలపై మిడుతల దండు విరుచుకుపడటంతో మే నెల 2020 లో పాకిస్తాన్‌లో జాతీయ ఎమర్జెన్సీని విధించింది. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్‌ ప్రావిన్స్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లోకి మిడుతల దండు దండెత్తడంతో వేలాది ఎకరాల్లో పంటలు నాశనం అవుతున్నాయి. దీంతో మిడుతలను తరిమికొట్టేందుకు ప్రణాళికలు రచించాలని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు. అలాగే దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. 1993లో కూడా ఇలాగే మిడుతల దండు సమస్య నెలకొన్నదని, అయితే ప్రస్తుత సమస్య దానికంటే తీవ్రంగా ఉన్నదని జాతీయ ఎమర్జెన్సీని విధించింది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి 7.3 బిలియన్ల రూపాయలు అవసరమయ్యే జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌ఎపి) ను కూడా ఆమోదించారు. మిడుతలు నిష్క్రమణకు ఆలస్యం కావడానికి వాతావరణ మార్పు ఒక కారణం. మిడతల సమూహాలు ప్రస్తుతం చోలిస్తాన్ వెంట పాకిస్తాన్-ఇండియా సరిహద్దులో ఉన్నాయని, చోలిస్తాన్, నారాలో నుంచి సింధ్, బలూచిస్తాన్ లోకి కీటకాలు ప్రవేశించాయి. మిడుతలు ఇరాన్‌కు వెళ్లేవి, కాని ఈసారి వేసవి కాలం అక్కడి అడవుల్లో పచ్చదనం లేక తగినంత ఆహారం వాటికీ లభించక వేడి ఉష్ణోగ్రతల కారణంగా అవి వేసవి కాలం పాకిస్తాన్‌లో పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. 1993 లో మిడుతలు పాకిస్తాన్‌లో దాడి చేసినప్పుడు, పరిమిత వనరులతో నాలుగు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దినట్లు నివేదిక ఉంది[3][4].

నష్టం

మార్చు

గత వంద సంవత్సరాల క్రితం నుండి ఆఫ్రీకా లో మధ్యప్రాచ్యం లో వీటీ సంతానం అభివృద్ది చెందినట్టు ఒక అంచనా, వేసవి కాలం అక్కడి అడవులు పచ్చదనం లేక తగినంత ఆహారం వాటికీ లభించక ఇతర ప్రాంతాలకు ప్రారంభమైన వీటి దాడి పంట పొలాల మూకుమ్మడి దాడి చేస్తుంటాయి.ఒక మిడత దానికి సమానమైన బరువు సుమారు రెండు గ్రాములు ఆహారంగా తీసుకుంటుంది ఒక ఎకరానికి సుమారు ఒక నాలుగు లక్షల మిడతలు 10 నిమిషాల్లో పంటను పూర్తిగా తినేస్తాయి పండ్ల తోటలు, కూరగాయల, ఆకుకూరల, పంటలకు చాలా ఎక్కువ మొత్తంలో నష్టం జరుగుతుంది. గాలివాటం తో ప్రయాణం చేస్తూ తెలంగాణ ఆంధ్ర వైపు కూడా వచ్చే ప్రమాదం ఉంది. నివారణ మార్గాలు పంటల పై రసాయనాలు స్ప్రే చేయడంవల్ల మందు నివారణ గా చేస్తే కొద్దిగా లాభం ఉంటుంది ఇతర దేశాల్లో డ్రోన్ల ద్వారా రసాయనాలు చల్లుతూ పళ్లాలు మోగించడం, వాహనాలపై లౌడ్‌స్పీకర్లు పెట్టి చెవులు చిల్లులు పడేలా సంగీతం పెట్టడం, డ్రోన్ల ద్వారా నిఘా తదితరాలు చేస్తు వీటి బారి నుండి కాపాడుకుంటున్నారు.

మిడుతల నియంత్రణ

మార్చు

భారతదేశంలో వ్యవసాయ భూములపైన మిడుతుల దాడి నుండి కాపాడడానికి ప్రధానమంత్రి వ్యవసాయం పంట కోతల విషయంలో కానీ, విత్తు నాటినప్పుడు కానీ ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటు మిడుతల నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పని చేస్తున్నాయి. బ్రిటన్ నుండి కొత్త యంత్రాలను కొనుగొలు చేస్తున్నాయి[5].

రాష్ట్ర ప్రభుత్వాలు

మార్చు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాం వ్యవసాయ భూములను మిడుతుల దాడి నుండి కాపాడడానికి మే నెల 2020 లో 5 సభ్యులతో ఒక కమిటినీ ఏర్పాటూ చేశారు.

చిత్రమాలిక

మార్చు

ఈ మిడతల దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, కొంత ఇతివృత్తంగా బందోబస్తు అనేే సినిమాలో ఉంటుంది.


మూలాలు

మార్చు