మీనాక్షి నటరాజన్

మీనాక్షి నటరాజన్ (జననం 1973 జూలై 23) భారతీయ రాజకీయ నాయకురాలు. నవలా రచయత. 2009 నుండి 2014 వరకు ఒక టర్మ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంటు సభ్యురాలుగా చేసింది.[2] ఆమె రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ జాతీయ అధ్యక్షురాలు కూడా.

మీనాక్షి నటరాజన్
మీనాక్షి నటరాజన్, మందసౌర్ నుండి భారత పార్లమెంటు సభ్యురాలు
పార్లమెంటు సభ్యురాలు - 15వ లోక్‌సభ
In office
20092014
అంతకు ముందు వారులక్ష్మీనారాయణ పాండే
తరువాత వారుసుధీర్ గుప్తా
నియోజకవర్గంమందసౌర్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1973-07-23) 1973 జూలై 23 (వయసు 50)
నాగ్దా, మధ్యప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
తల్లిఉమా నటరాజన్
తండ్రిఎ. ఆర్. నటరాజన్
నివాసంన్యూఢిల్లీ
చదువుఎం.ఎస్సీ
ఎల్ ఎల్ బి
కళాశాలహోల్కర్ సైన్స్ కాలేజ్, ఇండోర్
దేవి అహల్య విశ్వవిద్యాలయ, ఇండోర్
As of 9 డిసెంబరు, 2012
Source: [[1]]

మీనాక్షి నటరాజన్ 2009లో మంద్‌సౌర్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది, ఆ స్థానంలో 1971 నుండి భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నడూ గెలవలేదు. రాహుల్ గాంధీ యువ అభ్యర్థులను నిలబెట్టే ప్రణాళికలో భాగంగా ఆమెకు ఈ స్థానం దక్కింది. ఆమె 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ మందసౌర్‌లో పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికే చెందిన ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమైన మహిళా నేతల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది.

2022లో తెలంగాణలో భూదానోద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆమె పర్యటించింది. భూదానోద్యమం తెలంగాణలో ప్రారంభమయ్యి దేశ వ్యాప్తంగా విస్తరించిందని, లక్షలాది పేద ప్రజలకు భూదానోద్యమం వల్ల మేలు జరిగిందని ఆమె వెల్లడించింది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో మీనాక్షి నటరాజన్ ఎన్నికల పరిశీలకురాలిగానూ వ్యవహరించింది.

నేపథ్యం మార్చు

మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని బిర్లాగ్రామ్ నాగ్దాలో జన్మించింది. ఆమె ఇండోర్ లోని దేవి అహిలియా విశ్వవిద్యాలయం నుండి 1994లో బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అలాగే 2002లో న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.[3] ఆమె తన రాజకీయ జీవితాన్ని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) అధ్యక్షురాలిగా ప్రారంభించింది.

ఆమె "1857-భారతీయ పరిపేక్ష్" రచయిత "అప్నే-అప్నే కురుక్షేత్ర" ఆమె ప్రసిద్ధ నవల. ఆమె సండే నవజీవన్‌కి క్రమం తప్పకుండా వ్యాసాలు రాస్తూ ఉంటుంది.

రాజకీయ జీవితం మార్చు

ఆమె 1999 నుండి 2002 వరకు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలిగా పనిచేసింది.[4] ఆమె 2002 నుండి 2005 మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేసింది. 2008లో ఆమె రాహుల్ గాంధీచే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కార్యదర్శిగా ఎంపికయ్యింది.[5][6]

2009 భారత సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ నుండి పోటీ చేయడానికి రాహుల్ గాంధీచే ఆమె ఎంపిక చేయబడింది, ఆమె 1971 నుండి వరుసగా గెలుపొందిన తన భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థి లక్ష్మీనారాయణ పాండేపై 30,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచింది.[7] ఆమె "ప్రదేశ్ ఎన్నికలు" అనే నినాదాన్ని రూపొందించింది.

ఆమె పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ కమిటీ, మహిళా సాధికారత కమిటీ సభ్యురాలుగా పనిచేసింది.[8]

ఆమె 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీకి చెందిన సుధీర్ గుప్తా చేతిలో 300,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[9] కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయోగాత్మకంగా నిర్వహించిన ప్రాథమిక ఎన్నికల్లో ఆమె 'ఏకాభిప్రాయ అభ్యర్థి'గా అవతరించింది. ప్రాథమిక రిగ్గింగ్ జరిగిందని ఆమె ప్రత్యర్థి సురేంద్ర సేథీ ఆరోపించింది.

ఆమె 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ మందసౌర్ సీటులో పోటీ చేసింది కానీ 2014 ఫలితాల పునరావృతంలో సుధీర్ గుప్తా చేతిలో ఓడిపోయింది.

వివాదం మార్చు

2013లో, మందసౌర్‌లోని మహిళా కాంగ్రెస్ ఎంపీ అయిన మీనాక్షి నటరాజన్‌ని ఉద్దేశించి, ఆ పార్టీ అధికార ప్రతినిధి దిగ్విజయ సింగ్ ఆమెను వేదికపై పరిచయం చేస్తూ "సౌ తకా టుంచ్ మాల్" అని పేర్కొన్నాడు.[10][11]

"సౌ టంచ్ మాల్"కి "పూర్తిగా మచ్చలేనిది" అని ఆయన భాష్యం చెప్తున్నప్పటికి, టైమ్స్ ఆఫ్ ఇండియా "స్త్రీని 'సెక్సీ'గా వర్ణించడానికి తరచుగా వాడుతున్న వ్యవహారిక భాష అని పేర్కొన్నది.

ఈ వ్యాఖ్యలతో మహిళల హక్కుల కోసం వాదిస్తున్న న్యాయవాదులు కలత చెందారు. ఆయనపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు. అయితే, మీనాక్షి నటరాజన్ ఆయనకు మద్దతుగా నిలిచింది. ఆమె "స్వచ్ఛమైన బంగారం" లాంటిదని అతను అర్థం చేసుకున్నాడు అంది.

మూలాలు మార్చు

భారతదేశంలో మహిళలు

  1. "Detailed Profile: Km Meenakshi Natrajan". IndiaGov Archive. Lok Sabha. Archived from the original on 3 August 2018. Retrieved 3 August 2018.
  2. Team Rahul hopes to make a difference – Times Of India
  3. "About Meenakshi". Archived from the original on 12 December 2017. Retrieved 8 July 2012.
  4. The Telegraph - Calcutta (Kolkata) | Nation | Rahul’s backroom boys and girl
  5. The Telegraph - Calcutta (Kolkata) | Nation | Rahul’s backroom boys and girl
  6. A Really Stupid Idea | OPEN Magazine Archived 15 జూన్ 2012 at the Wayback Machine
  7. 100% success rate for Sonia in MP
  8. "Archived copy". Archived from the original on 12 October 2017. Retrieved 8 November 2010.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  9. "General Election to Lok Sabha Result 2014". Election Commission of India. Archived from the original on 19 మే 2014. Retrieved 6 June 2014.
  10. "Meenakshi Natarajan: Digvijaya calls Meenakshi Natarajan 'sau tunch maal', rapped for sexist remark | India News - Times of India". The Times of India.
  11. "Meenakshi Natarajan wins Mandsaur primary". The Hindu. 3 March 2014.