ముంగేర్

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

ముంగేర్, బీహార్ రాష్ట్రం ముంగేర్ జిల్లా లోని పట్టణం. [4] ఇది ముంగేర్ జిల్లా ముఖ్యపట్టణం, ముంగేర్ డివిజనుకు పరిపాలనా ప్రధాన కార్యాలయం. ముంగేర్, జమాల్‌పూర్ అనే రెండు పట్టణాలను కలిపి జంట పట్టణాలుగా పిలుస్తారు. జనాభా ప్రకారం ముంగేర్, బీహార్‌ లోని పట్టణాల్లో 11 వ స్థానంలో ఉంది. [5]

ముంగేర్
ముంగేర్ is located in Bihar
ముంగేర్
ముంగేర్
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°22′52″N 86°27′54″E / 25.381°N 86.465°E / 25.381; 86.465
దేశం India
రాష్ట్రంBihar
జిల్లాముంగేర్
Area
 • Total17 km2 (7 sq mi)
Elevation
43 మీ (141 అ.)
Population
 (2011)[2]
 • Total2,13,101
 • Density13,000/km2 (32,000/sq mi)
భాష
 • అధికారికహిందీ[3]
Time zoneUTC+5:30 (IST)
PIN
811201 to 811214 , 813201
టెలిఫోన్ కోడ్+91-6344
Vehicle registrationBR-08

చారిత్రికంగా, ముంగేర్ ఒక ప్రాచీన రాజధానీ నగరంగా ప్రసిద్ది చెందింది. ఇది గంగా నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. [6] ఇది భాగల్పూర్‌కు పశ్చిమాన 60 కి.మీ., రాజధాని నగరం పాట్నాకు తూర్పున 180 కి.మీ. దూరంలో ఉంది.

జనాభా వివరాలు మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం ముంగేర్ మునిసిపల్ కార్పొరేషన్ మొత్తం జనాభా 2,13,101. అందులో 1,13,173 మంది పురుషులు, 99,928 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి 883 గా ఉంది. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 29,260. ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 81.83 శాతంగా ఉంది. [7]

ముంగేర్‌లో మతం
మతం
హిందూ మతం
  
81.01%
ఇస్లాం
  
18.02%
క్రైస్తవం
  
0.20%
సిక్కుమతం
  
0.04%
ఇతరాలు
  
0.34%
Distribution of religions[8]

రవాణా మార్చు

రైలు మార్చు

ముంగేర్‌లో జమాల్‌పూర్ జంక్షన్, ముంగేర్ రైల్వే స్టేషన్ అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మొదటిది నగరానికి ప్రధాన స్టేషను. రెండవ దాన్ని గతంలో పూరబ్‌సరాయ్ రైల్వే స్టేషన్ అనేవారు. ఇది సబర్బన్ స్టేషనుగా పనిచేస్తుంది. ఈ స్టేషన్లు సాహిబ్‌గంజ్ లూప్‌తో అనుసంధానించబడి ఉన్నాయి.

రోడ్లు మార్చు

ముంగేర్ వివిధ జాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది.  NH 33 ,  NH 80,   NH 333, ఇతర రాష్ట్ర రహదారుల ద్వారా పాట్నా, రాంచీ, భాగల్పూర్, పూర్ణియా, బీహార్ షరీఫ్, ముజఫర్పూర్, జంషెడ్పూర్, ధన్‌బాద్, గయ, బోకారో, దర్భాంగా వంటి బీహార్, జార్ఖండ్ రాష్ట్ర ప్రధాన నగరాలను చేరుకోవచ్చు. అన్ని ప్రధాన నగరాలకు, ఇతర గమ్యస్థానాలకూ బిఎస్ఆర్టిసి రెగ్యులర్ బస్సు సేవలను అందిస్తుంది. సిటీబస్సులు, టాక్సీలు, ఆటోరిక్షా, ఇ-రిక్షా మొదలైనవి మొత్తం నగరంలో రవాణా కోసం అందుబాటులో ఉన్నాయి.

ముంగేర్ విమానాశ్రయం ముంగేర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సఫియాబాద్‌లో ఉంది. [9] [10] వాణిజ్య సేవలు అందించే దేశీయ విమానాశ్రయం 180 కి.మీ. దూరం లోని పాట్నాలో ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం లో కోలకతా (480 కి.మీ.) లో ఉంది.

శీతోష్ణస్థితి మార్చు

ముంగేర్ వాతావరణం ఉపఉష్ణమండల (వేసవిలో వేడిగాను, శీతాకాలంలో చల్లగానూ ఉంటుంది). దీన్ని కొప్పెన్ వాతావరణ వర్గీకరణలో తేమతో కూడిన ఉపఉష్ణమండల శీతోష్ణస్థితిగా వర్గీకరించారు.

శీతోష్ణస్థితి డేటా - Munger, India
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 23.5
(74.3)
26.4
(79.6)
32.5
(90.5)
37.0
(98.6)
37.9
(100.3)
35.5
(95.9)
31.9
(89.4)
31.2
(88.1)
31.5
(88.7)
30.8
(87.5)
27.7
(81.9)
24.2
(75.6)
30.8
(87.5)
సగటు అల్ప °C (°F) 9.4
(48.9)
11.9
(53.4)
16.9
(62.4)
21.8
(71.3)
24.6
(76.3)
25.4
(77.7)
24.9
(76.8)
24.8
(76.6)
24.2
(75.5)
20.9
(69.7)
14.4
(57.9)
10
(50)
19.1
(66.4)
సగటు అవపాతం mm (inches) 15
(0.6)
18
(0.7)
13
(0.5)
13
(0.5)
41
(1.6)
170
(6.8)
300
(11.7)
280
(11)
230
(8.9)
81
(3.2)
5.1
(0.2)
2.5
(0.1)
1,160
(45.7)
Source: weatherbase[11]

పట్టణ ప్రముఖులు మార్చు

మూలాలు మార్చు

  1. "Munger City" (PDF). nagarseva.bihar.gov.in. Retrieved 22 November 2020.[permanent dead link]
  2. "Census of India Search details". censusindia.gov.in. Archived from the original on 18 May 2015. Retrieved 10 May 2015.
  3. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 3 January 2019.
  4. "CDP Munger" (PDF). Urban department, Government of Bihar. Archived (PDF) from the original on 3 March 2016. Retrieved 31 December 2017.
  5. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 29 July 2019.
  6. "CDP Jamalpur" (PDF). Urban Department, Government of Bihar. Archived (PDF) from the original on 9 May 2016. Retrieved 31 December 2017.
  7. "Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived (PDF) from the original on 7 May 2012. Retrieved 31 December 2017.
  8. "Census of india:Socio-cultural aspects". Government of India, Ministry of Home Affairs. Retrieved 9 March 2014.[permanent dead link]
  9. "मुख्यमंत्री ने हवाई अड्डा टर्मिनल का किया उद्घाटन". Dainik Jagran (in హిందీ). Munger. 24 May 2016. Retrieved 30 April 2017.
  10. Kashi Prasad (19 May 2016). "Nitish to open renovated airstrip". The Times of India. Munger. Retrieved 30 April 2017.
  11. "weatherbase.com". weatherbase. 2014. Archived from the original on 12 July 2017. Retrieved 31 December 2017. Retrieved on 8 April 2014.


"https://te.wikipedia.org/w/index.php?title=ముంగేర్&oldid=3686087" నుండి వెలికితీశారు