ముందడుగు (1983 సినిమా)

1983 సినిమా

ఇది 1983లో వచ్చిన తెలుగు సినిమా.సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత డి.రామానాయుడు , దర్శకుడు కె. బాపయ్య దర్శకత్వంలో ఘట్టమనేని కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి,జయప్రద , తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు.

ముందడుగు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాపయ్య
తారాగణం శోభన్ బాబు,
శ్రీదేవి,
కృష్ణ,
జయప్రద,
చలపతిరావు
సంగీతం కె.చక్రవర్తి
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • శోభన్ బాబు
  • కృష్ణ
  • శ్రీదేవి
  • జయప్రద
  • రావు గోపాలరావు
  • సత్యనారాయణ
  • అల్లు రామలింగయ్య
  • నూతన్ ప్రసాద్
  • ప్రభాకరరెడ్డి
  • గిరిబాబు
  • శివకృష్ణ
  • సూర్యకాంతం
  • జయంతి

చిత్రకథ

మార్చు

గుమ్మడి, శివకృష్ణ అన్నదమ్ములు. శివకృష్ణ అభ్యుదయభావలు కలవాడు. ఆస్తిని ప్రజల కొరకు ఖర్ఛు చేయబోతే అన్న గుమ్మడి వారిస్తాడు. వారి అభిప్రాయబేధాలను రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, చలపతిరావు పెంచి వారు విడిపోయెటట్లు చేస్తారు. శివకృష్ణ చావుకి కారణమౌతారు. వారి పిల్లలు చక్రవర్తి (శోభన్), తిలక్ (కృష్ణ). చుట్టరికం తెలియకనే కృష్ణ, గుమ్మడి సంస్థలో పనిచేస్తుంటాడు. జయప్రద గుమ్మడికి మేనకోడలు. కృష్ణకు ఆమెకు మధ్య ప్రేమ. చక్రవర్తి వారి సంస్థ లోని స్కూలు టీచరు కూతురు శ్రీదేవిని ప్రేమిస్తాడు. కృష్ణ మీద అవినీతి ఆరోపణ చేస్తారు రావుగోపలరావు బృందం. ఆ సమయంలో వచ్చి అన్నపూర్ణ గతాన్ని గుర్తు చేస్తుంది. తరువాత చక్రవర్తి, తిలక్ ల మధ్య సంఘర్షణ, కలయిక చిత్రకథ. పరుచూరి సోదరులు శక్తివంతమైన సంభాషణలు చిత్ర విజయానికి తోడ్పడ్డాయి. రావుగోపాలరావు బృందం అక్రమ సంపాదనను సుబ్రహ్మణ్యస్వామి గుడిలో పుట్టలో దాయడం, ముగింపులో పాముల చంపి సొమ్ము తీసుకోవడానికి ప్రయత్నించడం, దానిని కథానాయకులు ప్రతిఘటించడం, అప్పటి పాట - ఇవి దేవుడు చేసిన మనుషులు సినిమాలో క్లైమాక్స్ ను గుర్తు తెస్తాయి. ఈ చిత్రం గురించి రివ్యూలో 'సామ్యవాద ముసుగులో మసాలా సినిమా' అని సితార పత్రిక అభిప్రాయపడింది.

పాటలు

మార్చు
  1. ఏ తల్లి కన్నదో నిన్ను, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. పి సుశీల
  2. నాకొక శ్రీమతి కావాలి, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. చిలకలూరిపేట కాడ చిలకో రచన: వేటూరి సుందరరామమూర్తి,గానం,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. పోరా ఓ కంతిరి మావా, రచన: వేటూరి సుందర రామమూర్తి ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  5. ప్రేమకు నేను పేదను కాను, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. పి సుశీల
  6. వేయి పడగల మీద కోటి మణుగుల నేల మోసి అలసిన స్వామి , రచన: వేటూరి సుందర రామమూర్తి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం