ముదునూరి ప్రసాదరాజు

ముదునూరి నాగరాజ వర ప్రసాద రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో నరసాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

ముదునూరి ప్రసాదరాజు
ముదునూరి ప్రసాదరాజు


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 3 జూన్ 2024
ముందు బండారు మాధవ నాయుడు
తరువాత బొమ్మిడి నాయకర్
నియోజకవర్గం నర్సాపురం, ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం 27 మే 1974
కలగంపూడి, ఎలమంచిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సత్యనారాయణ రాజు, వెంకట సరోజినీ
జీవిత భాగస్వామి శారద వాణి
సంతానం లక్ష్మి సింధూజ, శ్రీ కృష్ణంరాజు
నివాసం నరసాపురం

జననం, విద్యాభాస్యం

మార్చు

ముదునూరి ప్రసాదరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, ఎలమంచిలి మండలం, కలగంపూడి గ్రామంలో సత్యనారాయణ రాజు, వెంకట సరోజినీ దంపతులకు 27 మే 1974లో జన్మించాడు. ఆయన 10వ లెనిన్ మునిసిపల్ హై స్కూల్, నర్సాపురంలో పూర్తి చేసి ఇంటర్మీడియట్ వై.ఎన్ కాలేజీలో పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

ముదునూరి ప్రసాదరాజు తొలిసారిగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయి 2009 కాంగ్రెస్‌ అభ్యర్థిగా భారీ మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. వైఎస్‌ రాజశేఖర్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 4,464 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ప్రసాదరాజు 2014 ఎన్నికల్లో ఆచంటలో పోటీ చేసి ఓడిన అనంతరం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యునిగా పని చేసి 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

పోటీ చేసిన నియోజకవర్గం

మార్చు
సంవత్సరం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ మెజారిటీ ఫలితం
2004 నర్సాపురం కొత్తపల్లి సుబ్బారాయుడు తె.దే.పా ముదునూరి ప్రసాదరాజు కాంగ్రెస్ పార్టీ 3,518 ఓటమి
2009 నర్సాపురం ముదునూరి ప్రసాదరాజు కాంగ్రెస్ పార్టీ కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రజారాజ్యం పార్టీ 17,325 గెలుపు
2012 (ఉప ఎన్నిక) నర్సాపురం కొత్తపల్లి సుబ్బారాయుడు కాంగ్రెస్ పార్టీ ముదునూరి ప్రసాదరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4,464 ఓటమి
2014 ఆచంట నియోజకవర్గం పీతాని సత్యనారాయణ తె.దే.పా ముదునూరి ప్రసాదరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3920 ఓటమి
2019 నర్సాపురం ముదునూరి ప్రసాదరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ 6,436 గెలుపు
2024[3] నర్సాపురం బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ ముదునూరి ప్రసాదరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి

మూలాలు

మార్చు
  1. Sakshi (2019). "Narasapuram Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  2. Sakshi (18 March 2019). "శాసనసభా స్థానాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
  3. The Times of India (4 June 2024). "Narasapuram Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.