ముద్దుల మావయ్య

(ముద్దుల మామయ్య నుండి దారిమార్పు చెందింది)

ముద్దుల మావయ్య 1989లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన తెలుగు చిత్రం. బాలకృష్ణ, సీత, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నమోదైంది, 1989 లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.[1][2][3] ఈ చిత్రం బాలకృష్ణను హీరోల టాప్ లీగ్‌లోకి తెచ్చి అతనికి యువరత్న అనే బిరుదు సంపాదించి పెట్టింది. చిత్రం తమిళ చిత్రం ఎన్ తన్గచి పడిచావాకి రీమేక్[4] ఇది హిందీలో ఆజ్ కా అర్జున్ గా; కన్నడంలో రవిమామ గాను, బెంగాలీలో పబిత్రపాపీ గానూ పునర్నిర్మించారు

ముద్దుల మావయ్య
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం ఎస్. గోపాలరెడ్డి
తారాగణం బాలకృష్ణ
విజయశాంతి
సంగీతం కె. వి. మహదేవన్
సంభాషణలు గణేష్ పాత్రో
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ఒక గ్రామంలో ధనవంతుడైన రంగారావు ( రాజా కృష్ణమూర్తి ) గ్రామస్తులలో బీభత్సం సృష్టిస్తాడు. మద్యం కర్మాగారం నిర్మించడానికి వాళ్ల భూములను ఇవ్వమని గ్రామస్థులను బెదిరిస్తాడు. నిజాయితీగల పోలీసు అధికారి ( అహుతి ప్రసాద్ ) ని గ్రామానికి పంపిస్తారు. గ్రామస్థుల పిరికితనం వెనుక కారణం చెప్పామని అడుగుతాడు. ఎలాగైనా రంగారావును చట్టానికి పట్టివ్వాలని అనుకుంటాడు. హత్య కేసులో ఐదేళ్ల జైలు జీవితం గడిపిన తరువాత, రాజా ( నందమూరి బాలకృష్ణ ) తిరిగి తన గ్రామానికి చేరుకుంటాడు. రాజాకూ రంగారావుకూ ఎప్పుడూ చుక్కెదురే. రంగారావుతో శత్రుత్వానికి కారణం ఏమిటని ఇన్స్పెక్టర్ అతన్ని అడుగుతాడు.

గతంలో, రాజా ఒక చిన్న దొంగ. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ( విజయశాంతి ). ఆమెకు ఆ సంగతి తెలిసినపుడు, అతడిపై రిపోర్టు చేస్తుంది. అప్పుడు అతను తన గతాన్ని వెల్లడిస్తాడు. రాజా తన సోదరి లక్ష్మి ( సీత ) కోసం మాత్రమే జీవిస్తున్న అనాథ. ఆమె చదువుల కోసం అతను దొంగతనాలు చేస్తున్నాడు. లక్ష్మి, నగరంలో చదువు పూర్తయ్యాక తిరిగి తన గ్రామానికి వచ్చింది. ఆమె ఇంకా రంగారావు కుట్రకు వ్యతిరేకంగా ఉంది. లక్ష్మీ, రంగారావు కుమారుడు చిన్న (రవి) ఒకరినొకరు ప్రేమించుకుని రాజా మద్దతుతో పెళ్ళి చేసుకుంటారు. లక్ష్మి గర్భవతి అయ్యాక చిన్న కనబడకుండా పోతాడు. చిన్నా తన తండ్రి ఇంట్లో ఉన్నాడని, అది రంగారావు మాస్టర్ ప్లాన్ అని లక్ష్మికి తెలుస్తుంది. రాజా అక్కడికి వెళ్తడు. కాని అతన్ని వాళ్ళు అవమానిస్తారు. ఈలోగా, చిన్న లక్ష్మిని పొడిచి చంపుతాడు. చనిపోయే ముందు ఆమె పసికందుకు జన్మనిస్తుంది. కోపంతో ఉన్న రాజా చిన్నాను చంపుతాడు. తరువాత ఏం జరుగుత్ందనేది కథ క్లైమాక్సుకు దారితీస్తుంది.

తారాగణం

మార్చు
  • నందమూరి బాలకృష్ణ
  • విజయశాంతి
  • సీత
  • ఆహుతి ప్రసాద్
  • హేమ
  • శుభలేఖ సుధాకర్
  • గొల్లపూడి మారుతీరావు
  • రాజాకృష్ణమూర్తి
  • ఆనంద్ రాజ్
  • బ్రహ్మజీ
  • ఈశ్వరరావు
  • బాలాజీ
  • రవికిరణ్
  • కె కె శర్మ
  • టెలిఫోన్ సత్యనారాయణ
  • చిడతల అప్పారావు
  • కళ్ళు చిదంబరం
  • జుట్టు నరసింహం
  • అనిత
  • చంద్రిక
  • మాస్టర్అమిత్.

సాంకేతిక సిబ్బంది

మార్చు

పాటలు

మార్చు
  • హే రాజా, విలాసం నాది , ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, రచన: వెన్నెలకంటి
  • మామయ్య అన్న పిలుపు, మా ఇంటా ముద్దులకు పొద్దుపొడుపు , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, సుశీల , రచన: వెన్నెలకంటి
  • ఓం శాంతి ఓం శాంతి , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, రచన: వెన్నెలకంటి
  • ఆకు చాటున పిందె , బాలు, జానకి , రచన: సి..నారాయణ రెడ్డి
  • చేంగు చంగు ముద్దాడంగ , బాలు, జానకి, రచన: సి నారాయణ రెడ్డి
  • చుక్కేసుకొచ్చానమ్మ చూడు , శ్రీపండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి.
  • మంగళగిరి నేలు మహారాణి(సంవాద పద్యాలు), ఎస్.వరలక్ష్మి,రామకృష్ణ .

మూలాలు

మార్చు
  1. "Heading". IMDb.
  2. "Heading-2". Filmi Beat.
  3. "Heading-3". Nth Wall. Archived from the original on 2015-01-30. Retrieved 2020-08-21.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-28. Retrieved 2020-08-21.

5. ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.