కె.వి.మహదేవన్

సంగీత దర్శకుడు
(కె. వి. మహదేవన్ నుండి దారిమార్పు చెందింది)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (కె. వి. మహదేవన్) (జ. 1917 మార్చి 14 - 2001 జూన్ 21) దక్షిణ భారతీయ చలన చిత్ర సంగీత దర్శకుడు. తమిళ అయ్యర్ కుటుంబానికి చెందిన మహదేవన్ చిన్నతనం నుంచి సంగీతం వైపు ఆసక్తి చూపాడు. వీరి పూర్వీకులు కూడా సంగీత రంగంలో నిష్ణాతులే. ఏడవ తరగతి వరకు చదివి ఆపేసి నాటకాల్లో నటించాడు. తర్వాత చిత్రాల్లో పనిచేయడం కోసం మద్రాసు వెళ్ళాడు. మొదటగా కొన్ని చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. తర్వాత కొంతమంది మిత్రులు సంగీత రంగంవైపు మళ్ళమని సలహా ఇవ్వడంతో సంగీత దర్శకుడు ఎస్. వి. వెంకట్రామన్ దగ్గర సహాయకుడిగా చేరాడు. టి. ఎ. కల్యాణం దగ్గర కూడా పనిచేసి వృత్తి మెలకువలు నేర్చుకున్నాడు.1942 లో ఆనందన్ అనే చిత్రానికి మొదటగా సంగీత దర్శకత్వం వహించాడు. 1952 లో ఈయనకు మలయాళీ అయిన పుహళేంది తో పరిచయం ఏర్పడింది. పుహళేంది మహదేవన్ తో కలిసి చివరి దాకా పనిచేశాడు. 1962 లో విడుదలైన మంచి మనసులు సినిమాలో ఈయన స్వరపరిచిన మామ మామ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. ఈయనకు మామ అనే ముద్దు పేరు కూడా వచ్చింది. ఈయన ఎక్కువగా కవి పాట రాశాక స్వరపరిచేవాడు. చివరి దశలో నరాల బలహీనత వ్యాధితో బాధ పడ్డాడు. మాట పడిపోయి మతిస్థిమితం కూడా కోల్పోయాడు. శ్వాస తీసుకోవడం కష్టమై 2001 లో మరణించాడు. ఈయన సంగీతం కూర్చిన చివరి సినిమా కబీర్ దాస్ (2003).

కె. వి. మహదేవన్
కె.వి.మహదేవన్
జననం
కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్

(1917-03-14)1917 మార్చి 14
నాగర్‌కోయిల్‌, తమిళనాడు
మరణం2001 జూన్ 21(2001-06-21) (వయసు 84)
ఇతర పేర్లుమామ
వృత్తిసంగీత దర్శకుడు
తల్లిదండ్రులు
  • వెంకటాచలం అయ్యర్ (భాగవతార్) (తండ్రి)
  • లక్ష్మీ అమ్మాళ్ (తల్లి)

జీవిత సంగ్రహం

మార్చు

బాల్యం

మార్చు

మహాదేవన్ 1917లో మార్చి 14న తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో లక్ష్మీ అమ్మాళ్, వెంకటాచలం అయ్యర్ (భాగవతార్) లకు జన్మించాడు. తమిళ అయ్యర్ కుటుంబానికి చెందిన మహాదేవన్ తండ్రి వెంకటాచలం భాగవతార్ గోటు వాద్యంలో నిష్ణాతుడు. వాళ్ల కుటుంబమంతా సంగీతమయమే. మహాదేవన్ తాతగారు తిరువాన్కూరు సంస్థానంలో సంగీత విద్వాంసునిగా పని చేసేవారు. నాలుగేళ్ల ప్రాయంలోనే చిన్నారి మహాదేవన్ నాదస్వర వాద్యానికి ఆకర్షితుడై నాదస్వర విద్వాన్ రాజరత్నం పిళ్లై దగ్గర శిష్యరికం చేశాడు. అలాగే బూదంపాడి అరుణాచల కవిరాయర్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకొని కొన్ని కచ్చేరీల్లో పాల్గొన్నాడు. ఏడవ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆ తరువాత కొన్ని నాటకాలలో నటించాడు. సినిమాలో చేరాలని ఆశతో టి.వి.చారి గారి సహాయంతో మద్రాసులో అడుగుపెట్టాడు. "తిరుమంగై ఆళ్వార్" అనే తమిళ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం లభించింది.

సంగీత ప్రస్థానం

మార్చు

మహాదేవన్ మిత్రుడైన కొళత్తుమణి నువ్వు సంగీత దర్శకత్వ శాఖలో ప్రవేశిస్తే త్వరగా రాణిస్తావ్ అని సలహా యిచ్చాడు. దానితో కొళత్తుమణికి అప్పటి సంగీత దర్శకుడైన ఎస్.వి.వెంకట్రామన్తో మంచి పరిచయం ఉంది. ఆయన దగ్గర సహాయకునిగా చేరాడు. అప్పటికే అక్కడ సహాయకునిగా పనిచేస్తున్న టి.ఎ.కల్యాణంతో మంచి పరిచయం ఏర్పడింది. కల్యాణం దగ్గరే సినిమా సంగీతంలోని పట్లు, మెళకువలు నేర్చుకున్నాడు. 1942 వ సంవత్సరంలో "మనోన్మణి" అనే తమిళ సినిమాలో "మోహనాంగ వదనీ" అనే పాటకు సంగీతం సమకూర్చే అవకాశం లభించింది. ఎం.ఎస్ విశ్వనాథన్ సమకాలీకుడైన మహాదేవన్ 1942లో ఆనందన్ అనే తమిళ సినిమాతో చిత్రరంగములో అడుగుపెట్టారు ఆ తరువాత "దేవదాసి" అనే సినిమాకు సంగీతం సమకూర్చారు. కాని ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అంతగా పేరు రాలేదు. ఆ తరువాత చాలా కాలం వరకు మళ్లీ అవకాశం రాలేదు.

1952లో ఓ మలయాళీ కుర్రవాడు పరిచయం అయ్యాడు. చాలా కొద్ది కాలంలోనే మహాదేవన్ మనసు గెలుచుకున్నాడు. అతన్ని తన సహాయకునిగా పెట్టుకున్నారు. ఆ కుర్రవాడే పుహళేంది. ఈయన చివరి వరకు మహాదేవన్ తోనే పనిచేశారు. 1958 వ సంవత్సరంలో ప్రతిభా సంస్థ నిర్మించిన దొంగలున్నారు జాగ్రత్త అను సినిమాకు తొలిసారిగా తెలుగులో స్వరాలు అందించారు. అదే సంవత్సరంలో విడుదలైన ముందడుగు సినిమాతో మహాదేవన్ ప్రతిభ బయటపడింది. 1962 లో విడుదలైన "మంచి మనసులు" కేవలం పాటల వల్లే సినిమా హిట్టయిందన్నవారు కూడా ఉన్నారు. ఇది నూటికి నూరు పాళ్లు నిజం. ముఖ్యంగా మావా...మావా పాట బాగా జనాదరణ పొందింది. అప్పటి నుంచి మహాదేవన్ ను మామ అని పిలవడం మొదలుపెట్టారు. 1963లో వచ్చిన "మూగ మనసులు" మామను తిరుగులేని స్థానానికి చేర్చాయి. మామ తెలుగు సినిమా సంగీతంలో ఓ కొత్త బాణీకి ఊపిరిపోశారు. కాని ఈయనకు తెలుగు రాదు. అయినా సంగీతానికి భాష అనే ఎల్లలు లేవు అని నిరూపించిన వారిలో మహాదేవన్ ఒకరు. ఈయన కవి పాట రాశాక దానికి స్వరాలను అద్దేవారు. చివరి వరకు ఆయన ఇదే పద్ధతిని అనుసరించారు. మనం బాణీ చేసి ఇస్తే అందులో మాటలు పట్టక కవి ఇబ్బంది పడతాడు. అందుకే ఆ పద్ధతి వద్దు అని సున్నితంగా తిరస్కరించేవారు. పాటలోని సాహిత్యాన్ని అధిగమించకుండా స్వరాలను అల్లేవారు. ఒక్కోసారి సాహిత్యం కోసం బాణీల్లో మార్పులూ చేర్పులూ చేసేవారు. తెలుగు తెలియకపోయిన కవి రాసిన సాహిత్యం అర్థం కాకపోయినా అడిగి మరీ దానర్థం తెలుసుకొని సందర్భానుసారం స్వరాలను అందించేవారు.

మామ వారసులెవ్వరూ సినీ రంగంలోకి రాలేదు. తనలాగ తన పిల్లలు కష్టపడకూడదనుకున్నారాయన. మామకు 82 ఏళ్లు దాటాక "సహస్ర చంద్రదర్శనం" వేడుక చేశారు. అధిక మాసాలతో కలిపి వెయ్యి పున్నమి చంద్రులను చూసిన వారికి ఈ వేడుక చేస్తారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరుపుకున్నారు. చాలా కొద్ది మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. అందులో ఇప్పటి ప్రముఖ సంగీత దర్శకులైన ఎం. ఎం. కీరవాణి కూడా ఒకరు.

సంపూర్ణ రామాయణము, తిరువిళయదాల్ వంటి పౌరాణిక చిత్రాలకు పేరుమోసిన మహాదేవన్ శాస్త్రీయ సంగీతాన్ని, సినిమా సంగీతముతో మిళితం చేసే ఒరవడికి ఆద్యుడని భావిస్తారు. అనేక మంది సినీ సంగీత దర్శకులకు ఈయన గురువు. ఈయన సంగీతం సమకూర్చిన సినిమాలలో శంకరాభరణం, దసరా బుల్లోడు, గోరింటాకు, ఇక భక్తి చిత్రాలైనటువంటి అయ్యప్పస్వామి మహత్యం, అయ్యప్పస్వామి జన్మ రహస్యం, ఇంకా భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో వచ్చిన సుమారు అన్ని చిత్రాలకు మామే స్వరాలను అందించారు. ఇంకా తమిళంలో కందన్ కరుణై, వసంత మాలిగై, వియత్నాం వీడు, పడిక్కథ మీతై, వానంబాడి ప్రసిద్ధిగాంచినవి. ఈయన సంగీతము సమకూర్చిన చివరి సినిమా కబీర్ దాస్ (2003) లో చనిపోయిన తరువాత విడుదలైంది. చనిపోక ముందు చివరి సినిమా " కె. విశ్వనాధ్ తీసిన "స్వాతి కిరణం" నిజంగా చెప్పలంటే ఈ సినిమాకు రెండు పాటలనే మామ స్వరపరిచారు. ఆ సమయంలో ఆరోగ్యం సరిగా లేక మిగిలిన పాటలను పుహళేంది స్వరపరిచారు. అయినా మామ పేరునే టైటిల్స్ లో వేసి గురుభక్తిని చాటుకున్నారు పుహళేంది. అలాగే తమిళంలో చివరి సినిమా మురుగనే తుణై (1990).

మామకు చివర్లో నరాల బలహీనత వచ్చి తీవ్ర అస్వస్థులయ్యారు. దాంతో మాట కూడా పడి పోయింది. చివర్లో మతి స్థిమితం కూడా తప్పింది. ఏసి రూమ్ లో ఆయనను ఒంటరిగా ఉంచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎం. ఎం. కీరవాణి మామ ఇంటికి వెళ్లారు. తమిళంలో తను స్వరపరిచిన తొలి చిత్రం "పాట్రుట్ దిట్టన్" ఆడియో కేసట్ ను మామకు చూపించాలని ముచ్చట పడ్డారు. ఆ కేసట్ ను ఓ ఆట వస్తువులా ఆడుకున్నారాయన. అలా ఆ పరిస్థితిలో మామను చూసి కీరవాణి కంటతడి పెట్టుకున్నారు. ఆ తరువాత [1] మహాదేవన్ అంతిమదినాలలో శ్వాసపీల్చుకోవటం కష్టమై వారం రోజుల పాటు అస్వస్థతతో ఆసుపత్రిలో ఉండి 2001, జూన్ 22న 83 సంవత్సరాల వయసులో మద్రాసులో మరణించారు.[2]

పురస్కారాలు

మార్చు
  • జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు (1967) - కందణ్ కరుణై
  • జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు (1980) - శంకరాభరణం
  • జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారం అందుకొన్న మొదటి వ్యక్తి.
  • తిరై ఇసై తిలగం (1963) - (పద్మశ్రీ శివాజి గణేశన్ యిచ్చారు.)
  • మెల్లిసై చక్రవర్తి (1967) - (బొంబాయి మ్యూజిక్ డైరక్టర్స్ అసోసియేషన్ తరుపున సి.రామచంద్ర యిచ్చారు.)
  • స్వరబ్రహ్మ (1976) - (రాజమండ్రిలోని లలిత కళానికేతన్ వారు యిచ్చారు)
  • సంగీత చక్రవర్తి (1976) - హైదరాబాదు ఫిలిం సర్కిల్ వారు యిచ్చారు.)

తెలుగు చిత్రాలు

మార్చు

కె.వి.మహదేవన్ స్వరపరచిన కొన్ని తెలుగు చిత్రాలు:

  1. రోహిణి (జి.రామనాధంతో) (డబ్బింగ్) (1953)
  2. దొంగలున్నారు జాగ్రత్త (1958)
  3. సంపూర్ణ రామాయణం (1959)
  4. బొమ్మల పెళ్లి (1958)
  5. ముందడుగు (1958)
  6. ఆలుమగలు (1959)
  7. మాంగల్యం (1959)
  8. సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి (1960)
  9. మంచి మనసులు (1962)
  10. వీరపుత్రుడు (పామర్తితో) (డబ్బింగ్) (1962)
  11. ఆత్మ బంధువు (1962)
  12. నువ్వా? నేనా? (1962)
  13. ఎదురీత (1963)
  14. ఆత్మ బలం (1964)
  15. మూగ మనసులు (1964)
  16. హంతకుడెవరు (1964)
  17. దాగుడు మూతలు (1964)
  18. దొంగను పట్టిన దొర (డబ్బింగ్) (పామర్తితో) (1964)
  19. సుమంగళి (1965)
  20. తేనె మనసులు (1965)
  21. తోడు - నీడ (1965)
  22. అంతస్తులు (1965)
  23. వీరాభిమన్యు (1965)
  24. మాంగల్యమే మగువ ధనం (డబ్బింగ్) (1965)
  25. ముగ్గురు అమ్మాయిలు - మూడు హత్యలు (డబ్బింగ్) (పామర్తితో) (1965)
  26. రాజద్రోహి (డబ్బింగ్) (1965)
  27. ఇల్లాలు (1965)
  28. కన్నె మనసులు (1966)
  29. డాక్టర్ ఆనంద్ (1966)
  30. ఆస్తిపరులు (1966)
  31. శభాష్ రంగ (డబ్బింగ్) (టి.వి.రాజుతో) (1967)
  32. కంచుకోట (1967)
  33. ప్రాణ మిత్రులు (1967)
  34. ప్రైవేట్ మాస్టర్ (1967)
  35. సాక్షి (1967)
  36. ఉపాయంలో అపాయం (1967)
  37. సుడిగుండాలు (1967)
  38. సరస్వతీ శపథం (డబ్బింగ్) (1967)
  39. ధనమే ప్రపంచలీల (డబ్బింగ్) (1967)
  40. అదృష్టవంతులు (1968)
  41. బంగారు పిచిక (1968)
  42. నిలువు దోపిడి (1968)
  43. ఉండమ్మా బొట్టు పెడతా (1968)
  44. ముద్దు పాప (పామర్తితో) (1968)
  45. సుడిగుండాలు (1968)
  46. లక్ష్మి నివాసం (1968)
  47. దోపిడీ దొంగలు (డబ్బింగ్) (1968)
  48. అన్నదమ్ములు (1969)
  49. బుద్ధిమంతుడు (1969)
  50. భలే రంగడు (1969)
  51. మాతృదేవత (1969)
  52. మనుషులు మారాలి (1969)
  53. ముహూర్త బలం (1969)
  54. ఏకవీర (1969)
  55. కొండవీటి సింహం (డబ్బింగ్) (1969)
  56. అక్కా చెల్లెలు (1970)
  57. మళ్లీ పెళ్లి (1970)
  58. తాళిబొట్టు (1970)
  59. పెత్తందార్లు (1970)
  60. బాలరాజు కథ (1970)
  61. మరో ప్రపంచం (1970)
  62. ఎవరిని నమ్మాలి (1970)
  63. ఇద్దరు అమ్మాయిలు (1970)
  64. దసరా బుల్లోడు (1971)
  65. ప్రేమనగర్ (1971)
  66. కూతురు - కోడలు (1971)
  67. చెల్లెలి కాపురం (1971)
  68. అత్తలు కోడళ్లు (1971)
  69. అనూరాధ (1971)
  70. అందరికీ మొనగాడు (1971)
  71. అడవి వీరులు (1971)
  72. తాసిల్దారు గారి అమ్మాయి (1971)
  73. భార్యా బిడ్డలు (1971)
  74. బడిపంతులు (1971)
  75. సుపుత్రుడు (1971)
  76. శభాష్ వదిన (1972)
  77. సంపూర్ణ రామాయణం (1971)
  78. బీదలపాట్లు (1972)
  79. అబ్బాయిగారు - అమ్మాయిగారు (1972)
  80. కన్నతల్లి (1972)
  81. విచిత్ర బంధం (1972)
  82. కొడుకు కోడలు (1972)
  83. ప్రజానాయకుడు (1972)
  84. మరపురాని తల్లి (1972)
  85. ఇల్లు - ఇల్లాలు (1972)
  86. ఇన్స్‌పెక్టర్ భార్య (1972)
  87. బ్రతుకే ఒక పండగ (1972)
  88. స్త్రీ (1973)
  89. మమత (1973)
  90. అందాల రాముడు (1973)
  91. మాయదారి మల్లిగాడు (1973)
  92. మరపురాని మనిషి (1973)
  93. డబ్బుకు లోకం దాసోహం (1973)
  94. బంగారుబాబు (1973)
  95. దేశోద్ధారకులు (1973)
  96. పల్లెటూరి చిన్నోడు (1974)
  97. ఓ సీత కథ (1974)
  98. ఖైదీ బాబాయ్ (1974)
  99. మంచి మనుషులు (1974)
  100. అందరూ దొంగలే (1974)
  101. మంచివాడు (1974)
  102. చక్రవాకం (1974)
  103. అమ్మ మనసు (1974)
  104. శ్రీ రామాంజనేయ యుద్ధం (బి.గోపాలంతో) (1975)
  105. కథానాయకుని కథ (1965)
  106. జీవన జ్యోతి (1975)
  107. కొత్త కాపురం (1975)
  108. ముత్యాల ముగ్గు (1975)
  109. వైకుంఠపాళి (1975)
  110. గాజుల కిష్టయ్య (1975)
  111. గుణవంతుడు (1975)
  112. సోగ్గాడు (1975)
  113. ఎదురులేని మనిషి (1975)
  114. పండంటి సంసారం (1975)
  115. దేవుడులాంటి మనిషి (1975)
  116. పిచ్చిమారాజు (1976)
  117. పాడిపంటలు (1976)
  118. పొగరుబోతు (1976)
  119. ప్రేమాయణం (1976)
  120. సీతా కల్యాణం (1976)
  121. బంగారు మనిషి (1976)
  122. మాంగల్యానికి మరో ముడి (1976)
  123. రామరాజ్యంలో రక్తపాతం (1976)
  124. మగాడు (1976)
  125. మాదైవం (1976)
  126. మొనగాడు (1976)
  127. సెక్రటరీ (1976)
  128. పాడవోయి భారతీయుడా (1976)
  129. శీలానికి శిక్ష (1976)
  130. ప్రేమబంధం (1976)
  131. జడ్జిగారి కోడలు (1977)
  132. చిల్లర దేవుళ్లు (1977)
  133. స్నేహం (1977)
  134. మాబంగారక్క (1977)
  135. స్వర్గానికి నిచ్చెనలు (1977)
  136. అడవి రాముడు (1977)
  137. రాజా రమేశ్ (1977)
  138. జన్మ జన్మల బంధం (1977)
  139. సీత గీత దాటితే (1977)
  140. పంచాయితి (1977)
  141. పల్లెసీమ (1977)
  142. బంగారు బొమ్మలు (1977)
  143. సీతారామ వనవాసం (1977)
  144. గడుసు పిల్లోడు (1977)
  145. జీవిత నౌక (1977)
  146. చిలిపి కృష్ణుడు (1978)
  147. సీతామాలక్ష్మి (1978)
  148. గోరంత దీపం (1978)
  149. కేడి నెం.1 (1978)
  150. కాలాంతకులు (1978)
  151. మంచి బాబాయి (1978)
  152. పొట్టేలు పున్నమ్మ (1978)
  153. రామకృష్ణులు (1978)
  154. యుగపురుషుడు (1978)
  155. రాజపుత్ర రహస్యం (1978)
  156. సిరిసిరిమువ్వ (1978)
  157. ఎంకి - నాయుడు బావ (1978)
  158. కుమార రాజ (1978)
  159. మనవూరి పాండవులు (1978)
  160. సాహసవంతుడు (1978)
  161. స్వర్గసీమ (1978)
  162. ఇంద్రధనస్సు (1978)
  163. బంగారు చెల్లెలు (1979)
  164. ముద్దుల కొడుకు (1979)
  165. ఒక చల్లని రాత్రి (1979)
  166. కొత్త అల్లుడు (1979)
  167. అండమాన్ అమ్మాయి (1979)
  168. మండే గుండెలు (1979)
  169. గోరింటాకు (1979)
  170. శృంగార రాముడు (1979)
  171. ముత్తయిదువ (1979)
  172. సమాజానికి సవాల్ (1979)
  173. శంకరాభరణం (1980)
  174. కొత్తపేట రౌడీ (1980)
  175. సర్కస్ రాముడు (1980)
  176. పారిజాతం (1980)
  177. కలియుగ రావణాసరుడు (1980)
  178. సిరిమల్లె నవ్వింది (1980)
  179. కేటుగాడు (1980)
  180. వంశవృక్షం (1980)
  181. శుభోదయం (1980)
  182. రాజాధిరాజు (19800
  183. చుక్కల్లో చంద్రుడు (1980)
  184. శాంతి (1980)
  185. భలే కాపురం (1982)
  186. ఆడవాళ్లు మీకు జోహార్లు (1981)
  187. అగ్నిపూలు (1981)
  188. తిరుగులేని మనిషి (1981)
  189. గురుశిష్యులు (1981)
  190. క్రాంతి (1981)
  191. త్యాగయ్య (1981)
  192. పేదలబ్రతుకులు (1981)
  193. జేగంటలు (1981)
  194. సప్తపది (1981)
  195. అగ్గిరవ్వ (1981)
  196. రాధాకల్యాణం (1981)
  197. ఎవరు దేవుడు (1981)
  198. కలియుగ రాముడు (1981)
  199. త్రిశూలం (1982)
  200. ఏది ధర్మం? ఏది న్యాయం? (1982)
  201. శుభలేఖ (1982)
  202. కలవారి సంసారం (1982)
  203. కృష్ణావతారం (1982)
  204. గోల్కొండ అబ్బులు (1982)
  205. ఏకలవ్య (1982)
  206. బంధాలు అనుబంధాలు (1982)
  207. మనిషికి మరో పేరు (1983)
  208. పెళ్లి చూపులు (1983)
  209. పులి జూదం (1983)
  210. ఎస్.పి.భయంకర్ (1983)
  211. జననీ జన్మభూమి (1984)
  212. డాకు (1984)
  213. సంతోషిమాత వ్రత మహత్యం (1984)
  214. ఉద్దండుడు (1984)
  215. అభిమన్యుడు (1984)
  216. మంగమ్మ గారి మనవడు (1984)
  217. లంచావతారం (1985)
  218. అందరికంటె మొనగాడు (1985)
  219. మాపల్లెలో గోపాలుడు (1985)
  220. బుల్లెట్ (1985)
  221. తాతయ్య కంకణం (1985)
  222. ముద్దుల చెల్లెలు (1985)
  223. శిక్ష (1985)
  224. ప్రచండ భైరవి (1985)
  225. కొత్త పెళ్లికూతురు (1985)
  226. శ్రీవారు (1985)
  227. శ్రీ దత్త దర్శనం (1986)
  228. ముద్దుల కృష్ణయ్య (1986)
  229. సీతారామ కళ్యాణం (1986)
  230. సిరివెన్నెల (1986)
  231. అత్తగారు స్వాగతం (1986)
  232. మన్నెంలో మొనగాడు (1986)
  233. అష్టలక్ష్మి వైభవం (1986)
  234. సక్కనోడు (1986)
  235. కచ దేవయాని (విడుదల కాలేదు) (1986)
  236. జైలు పక్షి (1986)
  237. ప్రళయం (విడుదల కాలేదు) (1986)
  238. కులాల కురుక్షేత్రం (1987)
  239. కల్యాణ తాంబూలం (1987)
  240. లాయర్ భారతీదేవి (1987)
  241. మువ్వ గోపాలుడు (1987)
  242. శ్రుతిలయలు (1987)
  243. ఇంటిదొంగ (1987)
  244. శ్రీనివాస కళ్యాణం (1987)
  245. మనవడొస్తున్నాడు (1987)
  246. అక్షింతలు (1987)
  247. దొంగ కాపురం (1987)
  248. ప్రేమ కిరీటం (1988)
  249. ముద్దు బిడ్డ (1987)
  250. మురళీ కృష్ణుడు (1988)
  251. బాలమురళి ఎం.ఎ (1988)
  252. జానకి రాముడు (1988)
  253. అయ్యప్పస్వామి మహత్యం (1989)
  254. రక్త కన్నీరు (1989)
  255. అత్త మెచ్చిన అల్లుడు (1989)
  256. ముద్దుల మావయ్య (1989)
  257. సూత్రధారులు (1989)
  258. అడవిలో అభిమన్యుడు (1989)
  259. నా మొగుడు నాకే సొంతం (1989)
  260. అయ్యప్పస్వామి మహాత్యం (1989)
  261. అల్లుడుగారు (1990)
  262. నారీ నారీ నడుమ మురారి (1990)
  263. ముద్దుల మేనల్లుడు (1990)
  264. విచిత్ర ప్రేమ (1991)
  265. అగ్ని నక్షత్రం (1991)
  266. పెళ్ళి పుస్తకం (1991)
  267. సంసారవీణ (1991)
  268. అసెంబ్లీ రౌడీ (1991)
  269. శ్రీ వారి చిందులు (1991)
  270. మంజీరనాదం (1991)
  271. గోదావరి పొంగింది (191)
  272. స్వాతి కిరణం (1992)
  273. చిట్టెమ్మ మొగుడు (1992)
  274. సిరిమువ్వల సింహనాదం (విడుదల కాలేదు)
  275. కబీర్ దాస్ (ఆలస్యంగా విడుదలైంది) (2003)

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-01-17. Retrieved 2008-01-22.
  2. "హిందూపత్రికలో మహదేవన్ మరణవార్త". Archived from the original on 2008-03-13. Retrieved 2008-01-22.

యితర లింకులు

మార్చు