ముద్రగడ పద్మనాభం
ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా కు చెందినా రాజకీయనాయకుడు. సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ లకు పనిచేసి, 2014 నుండి ఏ పార్టీ లోనూ చేరకుండా ఉన్నారు.
ముద్రగడ పద్మనాభం | |||
![]()
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
నివాసం | కిర్లంపూడి,తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
మతం | హిందూ |
జీవిత విశేషాలు సవరించు
ముద్రగడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి లో జన్మించారు.[1]ముద్రగడ తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962, 67 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నిరుపేద దళితులకు ఆయన అభిమాన నాయకుడు. ఆయన జీవిత కాలమంతా నిరుపేదలకు ఏదో ఓ మేరకు ఉపశమనం కలిగించడం కోసమే కృషి చేశారు. కాపు కుల భుజకీర్తులను ఆయన తగిలించుకోలేదు.
రాజకీయ ప్రస్థానం సవరించు
మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమానపాత్రుడైన ముద్రగడ వీరరాఘవరావు 1977లో హఠాన్మరణం పాలుకావడంతో నీలం వారి సూచన మేరకు 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రిని చూసుకున్నారు. ఆవిధంగా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై, జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీచేయనని ప్రకటించారు. 2009లో వై. ఎస్. ఆయనను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు, కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి గాక కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. మళ్ళీ ఓడిపోయారు. ఓటమి పొంది ప్రశాంతంగా ఉన్న పద్మనాభంను కొంతమంది కాపు సోదరులు, ‘కాపు ఉద్యమం’ను ముందుకు తీసుకుని వెళ్ళమని కోరిన మీదట, ఆయన ఉద్యమానికి సారథ్యం తీసుకున్నారు [2].
1988లో ఓ ఘటనకు సంబంధించి పద్మనాభం అనుచరులైన కుర్రాళ్లను కొంతమందిని తీసుకెళ్లి ఉత్తరకంచి పోలీసులు అరెస్టు చేశారు. వారంతా దళితులు, బీసీలు. ఆ విషయం తెలుసుకున్న పద్మనాభం స్టేషనుకు వెళ్లారు. ఆయనను పోలీసులు స్టేషనలోకి రానివ్వలేదు. దాంతో స్టేషన్ ముందు బైఠాయించారు. టెంట్లు వేశారు. 5 రోజులు గడిచినా ప్రభుత్వంలో చలనం కనబడలేదు. 5వ రోజు సాయంత్రం ‘ఆమరణ దీక్ష’ ప్రకటించారు. దీనితో జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా కోనసీమ నుంచి వందలాది కాపు కులస్తులు ఉత్తరకంచి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పోలీసులు అరెస్టు చేసిన యువకులను బేషరతుగా విడుదల చేయించారు. ఆ సంఘటన తరువాత ముద్రగడకు కాపు నాయకుడిగా గుర్తింపు లభించింది.
కాపు ఉద్యమం సవరించు
1994లో పద్మనాభం ఒకసారి కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ఒక జీవో (జీవో నం. 30) జారీ చేయించారు. ఆ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. తరువాత డివిజన్ బెంచి సమర్థించింది.
2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలోని వి. కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తరువాత ముద్రగడ పద్మనాభం, ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చినవారిని రోడ్లు - రైళ్ల రోకోలకు పిలుపు ఇచ్చారు. బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు రైల్వే ట్రాకులు దిగ్బంధించడానికి ప్రయత్నించడంతో చాలా విధ్వంసం జరిగింది.ఈ విధంగా ముద్రగడ పద్మనాభం గారు రైళ్ళను దగ్గరుండి తగలబెట్టించి తనలో హింసాత్మక మనస్తత్వం ని భయటపెట్టారు