ముద్రగడ పద్మనాభం రెడ్డి

ముద్రగడ పద్మనాభరెడ్ది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కు చెందినా రాజకీయనాయకుడు. సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ లకు పనిచేసి, 2014 నుండి కొంతకాలం ఏ పార్టీ లోనూ చేరకుండా ఉన్నాడు. తరువాత 2024 సార్వత్రిక ఎన్నికలు సమయంలో 2024 మార్చి 16న వైసీపీలో చేరాడు.[1]

ముద్రగడ పద్మనాభం రెడ్డి
ముద్రగడ పద్మనాభం రెడ్డి



వ్యక్తిగత వివరాలు

నివాసం కిర్లంపూడి,తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
మతం హిందూ

జీవిత విశేషాలు

మార్చు

ముద్రగడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు.[2]ముద్రగడ తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962, 67 ఎన్నికల్లో విజయం సాధించారు.

రాజకీయ ప్రస్థానం

మార్చు

మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమానపాత్రుడైన ముద్రగడ వీరరాఘవరావు 1977లో హఠాన్మరణం పాలుకావడంతో నీలం వారి సూచన మేరకు 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం రెడ్డి జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో అతని తండ్రిని చూసుకున్నారు. ఆవిధంగా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం రెడ్డి మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై, జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీచేయనని ప్రకటించారు. 2009లో వై. ఎస్‌. ఆయనను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు, కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి గాక కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. మళ్ళీ ఓడిపోయారు. ఓటమి పొంది ప్రశాంతంగా ఉన్న పద్మనాభంను కొంతమంది కాపు సోదరులు, ‘కాపు ఉద్యమం’ను ముందుకు తీసుకుని వెళ్ళమని కోరిన మీదట, ఆయన ఉద్యమానికి సారథ్యం తీసుకున్నారు [3].

1988లో ఓ ఘటనకు సంబంధించి పద్మనాభం రెడ్డి అనుచరులైన కుర్రాళ్లను కొంతమందిని తీసుకెళ్లి ఉత్తరకంచి పోలీసులు అరెస్టు చేశారు. వారంతా దళితులు, బీసీలు. ఆ విషయం తెలుసుకున్న పద్మనాభం రెడ్డి స్టేషనుకు వెళ్లారు. ఆయనను పోలీసులు స్టేషనలోకి రానివ్వలేదు. దాంతో స్టేషన్ ముందు బైఠాయించారు. టెంట్లు వేశారు. 5 రోజులు గడిచినా ప్రభుత్వంలో చలనం కనబడలేదు. 5వ రోజు సాయంత్రం ‘ఆమరణ దీక్ష’ ప్రకటించారు. దీనితో జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా కోనసీమ నుంచి వందలాది కాపు కులస్తులు ఉత్తరకంచి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పోలీసులు అరెస్టు చేసిన యువకులను బేషరతుగా విడుదల చేయించారు. ఆ సంఘటన తరువాత ముద్రగడకు కాపు నాయకుడిగా గుర్తింపు లభించింది.

కాపు ఉద్యమం

మార్చు

1994లో పద్మనాభం ఒకసారి కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ఒక జీవో (జీవో నం. 30) జారీ చేయించారు. ఆ జీవోపై హైకోర్టు సింగిల్‌ జడ్జి స్టే ఇచ్చారు. తరువాత డివిజన్ బెంచి సమర్థించింది.

2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలోని వి. కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తరువాత ముద్రగడ పద్మనాభం, ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చినవారిని రోడ్లు - రైళ్ల రోకోలకు పిలుపు ఇచ్చారు. బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు రైల్వే ట్రాకులు దిగ్బంధించడానికి ప్రయత్నించడంతో చాలా విధ్వంసం జరిగింది.ఈ విధంగా ముద్రగడ పద్మనాభం గారు రైళ్ళను దగ్గరుండి తగలబెట్టించి తనలో హింసాత్మక మనస్తత్వం ని భయటపెట్టారు

2024 ఎన్నికలలో పేరు మార్పు చాలెంజ్

మార్చు

2024 ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిఠాపురంలో ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అలా జరక్కపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు.అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందారు.సవాల్‌ ఓడిపోవడంతో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు.[4]

మూలాలు

మార్చు
  1. Eenadu (16 March 2024). "వైకాపాలో చేరిన ముద్రగడ". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.
  2. information in national election watch
  3. http://www.andhrajyothy.com/Artical?SID=179396[permanent dead link]
  4. Telugu, TV9 (2024-06-20). "Andhra Pradesh: రాజకీయాల్లో ఇదో రేర్ ఫీట్.. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ". TV9 Telugu. Retrieved 2024-06-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)