ముప్పవరం (జే.పంగులూరు మండలం)
ముప్పవరం బాపట్ల జిల్లా, జే.పంగులూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జనకవరం పంగులూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1105 ఇళ్లతో, 4038 జనాభాతో 864 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2003, ఆడవారి సంఖ్య 2035. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1017 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 277. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590747[2].
ముప్పవరం (జే.పంగులూరు మండలం) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 15°50′52.800″N 80°3′7.200″E / 15.84800000°N 80.05200000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | జే.పంగులూరు |
విస్తీర్ణం | 8.64 కి.మీ2 (3.34 చ. మై) |
జనాభా (2011)[1] | 4,038 |
• జనసాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,003 |
• స్త్రీలు | 2,035 |
• లింగ నిష్పత్తి | 1,016 |
• నివాసాలు | 1,105 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08593 ) |
పిన్‌కోడ్ | 523261 |
2011 జనగణన కోడ్ | 590747 |
సమీప గ్రామాలు
మార్చుబైటమంజులూరు 2 కి.మీ, కొండమంజులూరు 5 కి.మీ, కోటపాడు 5 కి.మీ,
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి జనకవరం పంగులూరులో ఉంది.సమీప జూనియర్ కళాశాల జె.పంగులూరులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కోటపాడులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెం టు కళాశాల, పాలీటెక్నిక్‌లు అద్దంకిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల అద్దంకిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు ఒంగోలులోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చుముప్పవరంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టరు ఒకరు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
మార్చుమురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుముప్పవరంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చుముప్పవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 84 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 22 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 29 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 4 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 20 హెక్టార్లు
- బంజరు భూమి: 118 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 584 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 547 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 175 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చుముప్పవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 175 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చుముప్పవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుగ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుఇది చుట్టు ప్రక్కల గ్రామాలకు రాకపోకలకు ప్రదానకూడలి. కనుక అందరు ఎక్కడికి వెళ్ళటానికైననూ ముప్పవరం దగ్గర బస్సు అందుకుంటారు.
త్రాగునీటి సౌకర్యాలు
మార్చుఈ గ్రామ ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చేటందుకు, 104 సంవత్సరాల క్రితం, గ్రామానికి చెందిన శ్రీ గరిమిడి వెంకటసుబ్బయ్య, శ్రీమతి అచ్చమ్మ దంపతులు ఒక బావిని త్రవ్వించారు. ఈ బావి కాలక్రమేణా పాడుబడింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయుచున్న నీరు-చెట్టు కార్యక్రమంతో స్ఫూర్తిపొందిన గ్రామానికి చెందిన శ్రీ వంకట సుబ్బయ్య మనుమలు, ధూళిపాళ్ళ స్వామి, సత్యం, పాణి సోదరులు, శ్రద్ధ తీసికొని, రు. 20,000-00 వ్యయంతో ఈ బావిలో పూడిక తొలగించారు. నూతనంగా గోడలు, గిలక నిర్మించారు. బావిచుట్టూ రక్షిత పళ్ళేం ఏర్పాటుచేసి, బావిని ఉపయోగంలోనికి తెచ్చారు. పశుపక్ష్యాదుల దాహార్తి తీర్చేటందుకు బావివద్ద ఒక నీటితొట్టెను ఏర్పాటుచేసి, నిత్యం నీటితో నింపేటందుకు ఏర్పాటు చేస్తున్నారు. []
బ్యాంకులు
మార్చుఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. కొటక్ మహీంద్ర బ్యాంక్
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
మార్చుముప్పవరం విద్యాపరంగా త్వరిత గతిన అభివృద్ధి చెందుతుంది. గ్రామంలో 3 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత ప్రమాణాలు కలిగిన పాటిబండ్ల శ్రీమన్నారాయణ కమిటీ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఇక్కడ సాంఘిక సంక్షెమ (బి.సి)బాలుర, బాలికల వసతి గృహములు ఉన్నాయి.
శ్రీ పాటిబండ్ల శ్రీమన్నారాయణ చౌదరి కమిటీ ఉన్నత పాఠశాల
మార్చు- ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు, 2012 లో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలో సమావేశమై, ఒక సంఘంగా ఏర్పడి, తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధికి కృషిచేయాలని తలచారు. ఈ క్రమంలో భాగంగా వారు, పాఠశాలలో ఐదు అదనపు గదుల నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి విరాళాలు ప్రకటించారు. వీరేగాక, మరికొంతమంది గ్రామస్థులు, దాతలు గూడా విరాళివ్వడానికి సంసిద్ధత ప్రకటించారు. ఈ అదనపు గదుల నిర్మాణం పూర్తి అయినచో, పాఠశాలలో, ప్రధానోపాధ్యాయులకు, కార్యాలయ నిర్వహణకు, కంప్యూటర్స్ భద్రతకు, ప్రయోగశాలకు, గ్రంథాలయానికి గూడా వసతి సౌకర్యం ఏర్పడుతుంది.
- ఈ పాఠశాలలో లోక్ సభ సభ్యుల నిధులు రు. 2 లక్షల నిధులతో నిర్మించిన ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి శుద్ధజల కేంద్రాన్ని, 2014,డిసెంబరు-8వ తేదీనాడు ప్రారంభించారు.
- ఈ పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ పోతుకూచి సునీల్ కుమార్, ఈ పాఠశాలలో ప్రతిష్ఠించడానికి చదువులతల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని బహుకరించారు. ఈ విగ్రహం విలువ సుమారు రు. 20,000-00 ఉంటుంది.
- ఈ పాఠశాల పూర్వవిద్యార్థులు, గ్రామస్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం సహకారంతో పాఠశాలకు, నూతనంగా 20 లక్షల రూపాయలతో, 5 అదనపు తరగతి గదుల నిర్మాణం చేసారు.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చువ్యవసాయ పరంగా ముప్పవరం మంచి వసతులు కలిగి ఉంది. నాగార్జున సాగర్ కాలువ అతి ముఖ్య నీటి వనరు. ఈ నీటి ద్వారా అధిక భాగం వ్యవసాయం జరుగుతుంది. ఇదే కాకుండా గ్రామానికి ఆనుకొని ప్రాచీన నిర్మితమైన చెరువు ఉంది. ఈ చెరువు పరిథిలో ముప్పవరం పొలాలతో పాటుగా క్రింద ఉన్న కొండమూరుకు చెందిన పొలాలు కూడా సాగవుతాయి.
గ్రామ పంచాయతీ
మార్చు- ముప్పవరం, జే.పంగులూరు మండలంలో రెండవ పెద్డ గ్రామం. ఈ గ్రామ జనాభా 7000. ఒటర్లు దాదాపు 3500 ఉన్నారు.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ఉపసర్పంచిగా శ్రీమతి లకింశెట్టి అంజనాదేవి ఎన్నికైనారు.
- ఈ పంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థ్ణకు చేరడంతో, నూతన భవన నిర్మాణం చేపట్టినారు. ఈ నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం నిధులు ఒకటిన్నర లక్షల రూపాయలు, ఉపాధి హామీ పథకం నుండి 13.5 లక్షల రూపాయలనూ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
మార్చుఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో శ్రీ రాజమల్లేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం), చెన్నకేశవాలయం ప్రధానమైనవి. ఈ ఆలయాలలో శివనారాయణులు కొలువై ఉన్నారు. ఇవి రెండూ ప్రక్కప్రక్కనే నెలకొని ఒక ఆలయ ప్రాంగణంలా ఉన్నాయి. ప్రతి పండుగ, పర్వదినంలలో చెన్నకేశవుడు గ్రామంలోకి ఊరెగింపుగా వస్తాడు. శివాలయంలో ప్రతి కార్తీకమాసము నిత్య పూజలు జరుగుతాయి. అలాగే మాసం చివరి రోజున కన్నులు పండువగా సమారాధన కార్యక్రమం జరుగుతుంది.ఈ ప్రాంగణంలో ఒక ఆంజనేయ స్వామి గుడి చెన్నకేశవుని విగ్రహం అభిముఖంగా ఉంది. ఈ గుడిలో ఆంజనేయుడుని, అభిముఖుడై ఉన్న దేవదేవునికి నమస్కరిస్తున్నట్లుగా గమనించవచ్చు. ఈ ఆలయాలు ప్రజలకు నిత్యం దీవెనలు అందిస్తూ ఉన్నారు.
శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం
మార్చుఈ ఆలయంలో ప్రతి గురువారం, శాశ్వత నిత్యాన్నదాన పథకం అమలుచేస్తున్నారు.
ఈ ఆలయ ప్రాంగణంలో 2016,ఫిబ్రవరి-11న తెల్లవారుఝామున 4 గంటలకు ఒక కళ్యాణమండపం ప్రారంభించెదరు.
శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం
మార్చుఈ పురాతన ఆలయం గ్రామ సరిహద్దున ఉంది. ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో, 25 లక్షల రూపాయల గ్రామస్థుల, భక్తుల విరాళాలతో, నూతన ఆలయ నిర్మాణం చేపట్టినారు.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చుఇక్కడి ప్రధాన పంట వరి. వరితో పాటుగా మెట్ట పంటలు అయిన మొక్కజొన్న, మినుములు, పెసలు, కందులు, పొగాకు (కొద్దిపాటి) మొదలగునవి సాగుచేస్తారు. ఈ గ్రామం తాటిముంజలకు ప్రసిద్ధి.
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
మార్చు- ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకమయిన వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఈ గ్రామం నుండి ఇద్దరు చైర్మన్ పదవులను అలంకరించారు. వారిలో ఒకరు కుక్కపల్లి వెంకటసుబ్బారావు కాగా, రెండవ వారు పులికం కోటిరెడ్డి (2011-2014).
- ఈ గ్రామంలో 105 సంవత్సరాల వయసు గలిగిన బామ్మగారు, 2013 జూలైలో జరుగబోవు ఎన్నికలలో తన ఓటు హక్కు వినియోగించుకొనటానికి సిద్ధంగా ఉన్నారు.
- ఈ గ్రామంలో పులికం లక్ష్మీదేవమ్మ అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 2014,నవంబరు-8న, 109 సంవత్సరాల వయసులో అస్వస్థకు గురై కాలం చేసారు, ముందురోజు వరకు గూడా ఈమె తన పనులు తాను చేసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నారు. [4] అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించిన పులికం కోటిరెడ్డి ఈమెకు మనుమడు.
- ఈ గ్రామానికి చెందిన శ్రీ యార్లగడ్డ వెంకటేశ్వర్లుకు, ప్రతిష్ఠాత్మక గాంధేయన్ యంగ్ టెక్నాలజీ ఇన్నొవేషన్, బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసోసియేషన్ కౌన్సిల్ పురస్కారం లభించింది. కొత్తఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో, రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి సమక్షంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇండియా కార్యదర్శి శ్రీ కె.వి.జయరాఘవన్ గారి చేతులమీదుగా, 2015,మార్చ్-8వ తేదీనాడు, వీరికి ఈ పురస్కారం అందజేసినారు. ఈ పురస్కారం క్రింద వీరికి రు. 15 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేసినారు. వీరు ప్రస్తుతం, బెంగుళూరులోని జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైన్ టిఫిచ్ రీసెర్చ్ సెంటరులో పరిశోధనలు కొనసాగించుచున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే అన్ని రకాల బ్యాక్టీరియాల నిర్మూలనకు పనికి వచ్చే ఔషధాలు తయారుచేయుచున్నామని, ఆ ప్రయోగాలు తుదిదశలో ఉన్నవని, ఆయన తెలియజేసినారు.
గణాంకాలు
మార్చు2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,186. ఇందులో పురుషుల సంఖ్య 2,138, మహిళల సంఖ్య 2,048, గ్రామంలో నివాస గృహాలు 1,031 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 864 హెక్టారులు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
వెలుపలి లంకెలు
మార్చు
ఈ పేరుతో ఒకటికంటే ఎక్కువ గ్రామాలున్నాయి. వాటి లింకులకోసం అయోమయ నివృత్తి పేజీ ముప్పవరం చూడండి.