ముమ్మిడివరం
ముమ్మిడివరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలానికి చెందిన పట్టణం, మండలకేంద్రం. ఇక్కడగల ముమ్మిడివరం బాలయోగి దేవాలయం ఒక ముఖ్య పర్యాటక ఆకర్షణ.
పట్టణం | |
Coordinates: 16°39′N 82°07′E / 16.65°N 82.12°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండలం | ముమ్మిడివరం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 24.65 కి.మీ2 (9.52 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 23,732 |
• జనసాంద్రత | 960/కి.మీ2 (2,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1023 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8856 ) |
పిన్(PIN) | 533 216 |
Website |
చరిత్ర
మార్చు1969 జూలై సంవత్సరం వరకు ముమ్మిడివరం అమలాపురం తాలుకాలో ఉండేది. తరువాతి కాలంలో మండలాలు వచ్చాక ముమ్మిడివరానికి మండల ప్రతిపత్తి కల్పించబడింది.
భౌగోళికం
మార్చుముమ్మిడివరం 16°39′00″N 82°07′00″E / 16.6500°N 82.1167°E,[2] సముద్రమట్టానికి మూడు అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది. ఇది సమీప పట్టణమైన అమలాపురం నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.
జనగణన గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6560 ఇళ్లతో, 23732 జనాభాతో 2465 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 11733, ఆడవారి సంఖ్య 11999.[3]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 22,348.[4] ఇందులో పురుషుల సంఖ్య 10,877, మహిళల సంఖ్య 11,471, గ్రామంలో నివాసగృహాలు 5,573 ఉన్నాయి.
పరిపాలన
మార్చుముమ్మిడివరం నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణ వ్యసస్థ
మార్చుముమ్మిడివరం అమలాపురానికి 13 కి.మీ దూరంలో ఉంది. యానాంకి 20 కి.మీ దూరంలో, జిల్లా రాజధాని కాకినాడకి 45 కి.మీ., రామచంద్రపురంకి 63 కి.మీ. దూరంలో ఉంది. ఎ.పి.ఆర్.టి.సి. వారి సౌజన్యంతో తరచు బస్సు సౌకర్యం ఉంది. దగ్గరలోని రైలు స్టేషను రాజమహేంద్రవరం, కాకినాడ.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో 12ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 21, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 12, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 12, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఆరు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 3 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 5 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 2 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల అమలాపురంలో, పాలీటెక్నిక్ అనంతవరంలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అమలాపురంలో ఉన్నాయి.
భూమి వినియోగం
మార్చు2011 జనగణన ప్రకారం, భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 745 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 23 హెక్టార్లు
- బంజరు భూమి: 4 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1692 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 592 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1127 హెక్టార్లు
- కాలువలు: 1036 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 91 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చుపర్యాటక ఆకర్షణలు
మార్చుబాలయోగి దేవాలయం
మార్చు- ముమ్మిడివరం బాలయోగి దేవాలయం:[5] ముమ్మిడివరంలో బాలయోగి అనే యోగి ఉండేవారు. ఈయన 1950 దశాబ్దంలో తపస్సు చేయడం ప్రారంభించారు. మొదట్లో అడపా తడపా లేచి పళ్ళో, పాలో పుచ్చుకునేవారు. తరువాత ఏళ్ళ తరబడి తపస్సులోంచి లేవకుండా, నిద్రాహారాలు లేకుండా ఉండిపోయేవారు. బాలయోగి ప్రతీ ఏడాది మహాశివరాత్రికి ప్రజలకు దర్శనం ఇచ్చేవారు. 1984 సంవత్సరంలో ఈయనను దర్శనం చేసుకోవడానికి ప్రపంచం నలుమూల నుండి ఐదు లక్షల మంది వచ్చారు.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Falling Rain Genomics.Mummidivaram". Archived from the original on 2007-07-03. Retrieved 2007-08-14.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-10.
- ↑ "A.P.Tourism on The Balayogi Temple". Archived from the original on 2007-09-30. Retrieved 2007-08-14.