మురళీకృష్ణుడు

మురళీకృష్ణుడు 1988 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం.[1] ఇందులో నాగార్జున, రజని ముఖ్యపాత్రల్లో నటించారు.

మురళీ కృష్ణ
దర్శకత్వంకోడి రామకృష్ణ
నిర్మాతఎస్. గోపాల రెడ్డి
రచనభార్గవ్ ఆర్ట్స్ యూనిట్
నటులునాగార్జున, రజని
సంగీతంకె. వి. మహదేవన్
ఛాయాగ్రహణంకె. ఎస్. హరి
కూర్పుకె. సత్యం
నిర్మాణ సంస్థ
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల
1988 జూన్ 3 (1988-06-03)
నిడివి
131 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

మురళీకృష్ణ ఒక ధనవంతుల అబ్బాయి. సరదాగా అమ్మాయిల వెంటపడుతూ ఉంటాడు. కృష్ణవేణి ఓ మధ్యతరగతి అమ్మాయి. భర్తను కోల్పోయిన తల్లి అనారోగ్యంతో ఉంటుంది. ఆమెను పోషించుకోవడానికి ఓ డ్రామా కంపెనీలో నృత్య శిక్షకురాలిగా పనిచేస్తుంటుంది. ఒకసారి మురళీకృష్ణ కారు డ్రైవరు కృష్ణవేణిని కారులో ఆమె ఆఫీసు దగ్గర దింపుతాడు. ఆమె కంపెనీలో పనిచేసే వారందరూ ఆమె, మురళీకృష్ణ ప్రేమలో ఉన్నారని ఊహించుకుంటారు. ఆమె ద్వారా మురళీకృష్ణ నుండి తమ కంపెనీకి పెద్ద మొత్తంలో విరాళం రాబట్టమనీ అలా చేస్తే ఆమెకు ఆఫీసులో కొన్ని సౌకర్యాలు కలుగజేస్తామని ఆశ పెడతారు. ఆమె వాళ్ళముందు కాదనలేక తనకీ, మురళీకృష్ణకు మధ్య బంధం ఉన్నట్టు చెబుతుంది.

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. ఆశిష్, రాజాధ్యక్ష. "మురళీకృష్ణుడు". indiancine.ma. Retrieved 8 February 2018.[permanent dead link]