ములగాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతం.[1] ఈ ములగాడ ప్రాంతం విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిపాలనలో ఉంది. ఇక్కడ రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. విశాఖపట్నం నగరానికి దక్షిణ అంచున ఈ ములగాడ ప్రాంతం ఉంది.[2][3]

ములగాడ
సమీపప్రాంతం
ములగాడ is located in Visakhapatnam
ములగాడ
ములగాడ
విశాఖట్నం నగర పటంలో ములగాడ స్థానం
Coordinates: 17°41′57″N 83°13′26″E / 17.699095°N 83.224024°E / 17.699095; 83.224024
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Government
 • Typeమేయర్
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
Population
 • Total1,75,575
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530011
శాసనసభ నియోజకవర్గంపశ్చిమ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గంవిశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం

వార్డులు మార్చు

ములగాడ మండలంలోని వార్డులు

  1. మల్కాపురం
  2. గొల్లలపాలెం
  3. ములగాడ

సమీప ప్రాంతాలు మార్చు

ఇక్కడికి 2 కి.మీ.ల దూరంలో మల్కాపురం, 3 కి.మీ.ల దూరంలో గాజువాక, 6 కి.మీ.ల దూరంలో పెదగంట్యాడ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ మార్చు

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం, విశాఖపట్నం నావల్ డాక్‌యార్డ్, కోరమండలం ఇంటర్నేషనల్ వంటి చాలా భారీ పరిశ్రమలు ఇక్కడ నిర్మించబడ్డాయి. ఈ ప్రాంతం విశాఖ పట్టణ ఆర్థిక వృద్ధిలో ఒక భాగంగా ఉంది.

స్థానం, భౌగోళికం మార్చు

విశాఖపట్నం విమానాశ్రయం నుండి 11 కిలోమీటర్లు, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ములగాడ ప్రాంతం ఉంది.

రవాణా మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ములగాడ మీదుగా వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, హెచ్‌బి కాలనీ, మిధిలాపురి కాలనీమొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో గోపాలపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

సంస్థలు మార్చు

ఈ ములగాడ ప్రాంతంలో కోరమాండల్ ఇంటర్నేషనల్, హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, తూర్పు నావికాదళం వంటి భారీ సంస్థలు ఉన్నాయి.

హెచ్‌పిసిఎల్ మార్చు

 
విశాఖపట్నంలో యారాడ కొండ మీదినుండి హెచ్‌పిసిఎల్ దృశ్యం

కోరమాండల్ ఇంటర్నేషనల్ మార్చు

1960ల ప్రారంభంలో అమెరికాలోని ఐఎంసి, చేవ్రన్ కంపెనీలచే స్థాపించబడిన భారతీయ సంస్థ ఈ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. మొదట్లో కోరమాండల్ ఎరువులు అని పిలువబడే ఈ సంస్థ ఎరువులు, పురుగుమందులు, ప్రత్యేక పోషకాల వ్యాపారంలో ఉండేది. ఈ సంస్థ గ్రోమోర్ సెంటర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో గ్రామీణ రిటైల్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది.

హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మార్చు

 
విశాఖపట్నంలోని హిందూస్తాన్ షిప్‌యార్డ్

భారతదేశం తూర్పు తీరంలోని విశాఖపట్నంలో ఉన్న షిప్‌యార్డే ఈ హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్). సింధియా షిప్‌యార్డ్‌గా స్థాపించబడిన దీనిని ది సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్‌లో భాగంగా పారిశ్రామికవేత్త వాల్‌చంద్ హిరాచంద్ నిర్మించాడు. వాల్‌చంద్ 1940 నవంబరులో భూమిని స్వాధీనం చేసుకున్నాడు.

తూర్పు నావికాదళం మార్చు

భారత నావికాదళానికి చెందిన మూడు ప్రధాన నిర్మాణాలలో ఒకటైన తూర్పు నావికాదళం[3] ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. ఇది భారతదేశంలోనే మొదటి, అతిపెద్ద నావికాదళ కమాండ్.

మూలాలు మార్చు

  1. "Mulagada Locality". www.onefivenine.com. Retrieved 2021-05-14.
  2. "Mulagada - Village in Visakhapatnam(u) Mandal". indiagrowing.com. Retrieved 2017-12-17.
  3. 3.0 3.1 "Mandals in Visakhapatnam District, Andhra Pradesh". census2011.co.in. Retrieved 2017-12-17.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 14 May 2021.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ములగాడ&oldid=4149986" నుండి వెలికితీశారు