మూలా వెంకటరంగయ్య

భారతీయ చలన చిత్ర నిర్మాత, రచయిత.

మూలా వెంకటరంగయ్య భారతీయ చలన చిత్ర నిర్మాత, రచయిత. వాహినీ స్టూడియో ద్వారా చిత్రాలను నిర్మించిన వెంకటరంగయ్య తెలుగు , తమిళ సినిమాలకు రచనలు కూడా చేశాడు.

మూలా వెంకటరంగయ్య
Moola Venkata Rangaiah.jpg
మూలా వెంకటరంగయ్య
జననం
మూలా వెంకటరంగయ్య

మరణం12 మే, 2004
వృత్తివ్యాపారం, తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్
తల్లిదండ్రులు
నాగిరెడ్డికి మూలా వెంకటరంగయ్య చేత వాహిని స్టూడియో అమ్మకపు పత్రం

జీవిత విషయాలుసవరించు

వెంకటరంగయ్య అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి నారాయణస్వామి కల్లు వ్యాపారంతో ధనవంతుడై తర్వాతికాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైన స్థాపించి వ్యాపారాల్ని విస్తరించాడు.[1][2]

సినిమారంగంసవరించు

తండ్రి నారాయణస్వామి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డితో కలిసి 'వాహినీ పిక్చర్స్' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా నిర్మించిన చిత్రాల నిర్మాణ బాధ్యతలను వెంకటరంగయ్య చూసుకునేవాడు. ఆ తరువాత వాహినీ స్టూడియో నిర్మించారు. ఇది దక్షిణ ఆసియాలో అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది.[3][4]

1950లో నారాయణస్వామి మరణించాడు. దాంతో వెంకటరంగయ్య కొంతకాలం స్టూడియోను నడిపి, 1961లో బి.నాగిరెడ్డికి వాహినీ స్టూడియోను అమ్మేశాడు. నాగిరెడ్డి ఆ స్టూడియోను విజయ వాహిని స్టూడియోస్ గా మార్చుకున్నాడు.

ఇతర వివరాలుసవరించు

వెంకటరంగయ్య తాడిపత్రి పురపాలక సంఘం చైర్మన్ గా కూడా పనిచేశాడు.[1][2]

మరణంసవరించు

వెంకటరంగయ్య అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామంలో 2004, మే 12న మరణించాడు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "The story in a road name - CHEN". The Hindu. 2009-12-07. Retrieved 2020-08-28.
  2. 2.0 2.1 "Telugu Cinema - Research - "Telugu Cinema - past and the present" by Gudipoodi Srihari". Idlebrain.com. Retrieved 2020-08-28.
  3. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Narayana Swamy Moola పేజీ
  4. "Bhatktha Potana (1943) - Anantapur". The Hindu. 2011-12-11. Retrieved 2020-08-28.