మూసారాంబాగ్
మూసారాంబాగ్ (మూసా రామ్ బాగ్), తెలంగాణలోని హైదరాబాదు నగర పాత శివారు ప్రాంతం.[1][2] 18వ శతాబ్దంలో నిజాం రాజులకు సేవలందించిన ఫ్రెంచ్ మిలటరీ కమాండర్ మోన్సియూర్ రేమండ్ పేరు మీదుగా ఈ ప్రాంతానికి "మూసా-రామ్-బాగ్" అని పేరు పెట్టబడింది. బాగ్ అంటే ఉద్యానవనం అని అర్థం. ఈ ప్రాంతం ఒకప్పుడు భారీ పచ్చదనంతో నిండివుండేది. ఇక్కడి ఆస్మాన్ ఘర్ ప్యాలెస్ సమీపంలో రేమండ్ సమాధి కూడా ఉంది.
మూసారాంబాగ్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°22′23″N 78°30′59″E / 17.3730°N 78.5164°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 036 |
Vehicle registration | టిఎస్ |
లోక్సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మలక్పేట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
చరిత్ర
మార్చురెండవ అసఫ్ జా, నిజాం అలీ ఖాన్కు మోన్సియూర్ రేమండ్ సన్నిహిత మిత్రుడయ్యాడు. 2వ నిజాం గౌరవం పొందడమేకాకుండా స్థానిక ప్రజల ప్రేమను, నమ్మకాన్ని కూడా రేమండ్ సంపాదించుకున్నాడు. ముస్లింలకు, మూసా రహీమ్ గా, హిందువులకు మూసా రామ్ పేరొందాడు.[3][4]
వాణిజ్య ప్రాంతం
మార్చుమూసారాంబాగ్ ప్రాంతంలో నివసించేవారి అవసరాల కొరకు ఇక్కడ అనేక దుకాణాలు ఉన్నాయి. కాపిటల్ (అకా షామ్), బావార్చి వంటి హైదరాబాదీ రెస్టారెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దూరదర్శన్ టీవీ టవర్ కూడా ఉంది.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మూసారాంబాగ్ కు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడ మూసారాంబాగ్ మెట్రో స్టేషను కూడా ఉంది.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Soon you can earn while you pee". IBN Live. Archived from the original on 17 ఏప్రిల్ 2014. Retrieved 13 December 2020.
- ↑ "14 injured in wall collapse at Moosarambagh". Times of India. Archived from the original on 2012-07-08. Retrieved 13 December 2020.
- ↑ "When a French Revolution-modelled Army contingent was established in Hyderabad". The Hindu. The Hindu.
- ↑ Luther, Narendra. Hyderabad, A Biography. Oxford University Press. p. 117. ISBN 019567535-5.