మూస చర్చ:క్లుప్తస్వాగతం

తాజా వ్యాఖ్య: {{ క్లుప్తస్వాగతం}} విషయం ఖరారు చేయటం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

{{ క్లుప్తస్వాగతం}} విషయం ఖరారు చేయటం మార్చు

వాడుకరి:Chaduvari గారు, {{క్లుప్తస్వాగతం}} మూస సృష్టించినందులకు సంతోషం. దానికి (ప్రస్తుత రూపం), {{స్వాగతం}} మూసకు ముఖ్యమైన అంశాలలో పోలికలేదు. అయితే దానిని ఖరారు చేయటానికి సముదాయం చర్చ లేకుండా వాడటం మొదలు పెట్టటం ( ఉదాహరణ వాడుకరి చర్చ:Singinedi) సరియైన పద్ధతి కాదు. ఏకరూప స్వాగతం గురించి ఇప్పటికే గత చర్చలలో తెలపటం జరిగింది. కావున, ఈ మూస వాడుకను, మీరు, ఇతర సభ్యులు సముదాయ చర్చ జరిగి నిర్ణయం వెలువడే వరకు నిలిపివేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 23:05, 12 ఏప్రిల్ 2021 (UTC)Reply

@Arjunaraoc గారూ,
  1. మనకు వివిధ సందర్భాల్లో వాడేందుకు వివిధ స్వాగతం మూసలున్నాయి. వాటిలో కొన్ని ఇవి:
  2. ఇవి కాకుండా, సమస్యాత్మక వాడుకరుల కోసం ప్రత్యేకంగా స్వాగత మూసలున్నై:
  3. ఇవే కాకుండా ఇంకో పది మూసలైనా ఉంటాయి.
  4. ప్రస్తుతం నేను ఈ మూసను గ్రోత్ ప్రాజెక్టులో చేరిన సభ్యులను ఆహ్వానించేందుకు మాత్రమే వాడుతున్నాను.
  5. ఈ ప్రాజెక్టులో చేరే వాడుకరులను ఆహ్వానించేందుకు ఇతర మూసలు అనుకూలంగా లేకపోవడమే ఇందుకు కారణం.
ఇకపోతే, పై మూసలేవీ వాడకూడదు, ఒక్క "స్వాగతం" మూసను మాత్రమే వాడాలి అనే నిర్ణయం ఎక్కడ తీసుకున్నారో ఆ లింకు ఇవ్వగలరు. __చదువరి (చర్చరచనలు) 05:37, 13 ఏప్రిల్ 2021 (UTC)Reply
చదువరి గారు, మీ వివరణకు ధన్యవాదాలు. తెలుగు వికీలో ఇటీవలి కాలం వరకు అందరూ పాటిస్తున్నది ఒకే ఒక్క {{స్వాగతం}} సందేశం మాత్రమే. ఎవరైనా వికీ సభ్యులైనప్పుడు, తొలిగా సాధారణ సభ్యులే అవుతారు, ఆతరువాతనే ప్రాజెక్టు సభ్యులవుతారు. కావున అందరికీ తొలి స్వాగత సందేశం ఏక రూపంలోనే వుండాలి అన్నది సాధారణజ్ఞానం. మీరు కొత్త ప్రాజెక్టు ప్రారంభించినందున, తొలి సాధారణ స్వాగత సందేశం తరువాత దానికొరకు అదనపు స్వాగత సందేశం చేర్చటంపై నాకు అభ్యంతరం లేదు. అలా కాదంటారా, ఈ విషయాన్ని సముదాయంతో చర్చించండి. అప్పుడు ఆ చర్చ నిర్ణయాన్ని అందరం పాటిద్దాం.--అర్జున (చర్చ) 22:47, 14 ఏప్రిల్ 2021 (UTC)Reply
@Arjunaraoc గారూ, మీరు ఏకరూప స్వాగతం గురించి మాట్టాడారు. అక్కడి నిర్ణయం నాకు మీకూ అందరికీ శిరోధార్యమని ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. అందుకే ఆ లింకు ఇవ్వమని అడిగాను. కానీ మీరు ఇవ్వలేదు. బహుశా నా వాఖ్యను గమనించి ఉండరని భావుస్తున్నాను. కనీసం ఇప్పుడైనా పరిశీలించండి.
పోతే, మీరు లేవనెత్తిన ప్రాజెక్టు సభ్యులు, "సాధారణ జ్ఞానం" వగైరాల గురించి ప్రస్తుతం నేనేమీ చెప్పను. ఎందుకంటే పైన మీరు చెప్పిన ఏకరూప.. చర్చలో తీసుకున్న నిర్ణయమేంటో తెలిస్తే ఇక్కడి చర్చ అంతా పూర్వపక్షమైపోయే అవకాశం ఉంది. అందువలన దాని గురించి ఇప్పుడు మాట్టాడి ప్రయోజనం లేదు. మీరు ఆ లింకు ఇవ్వకపోతే అప్పుడు ఆ విషయాల గురించి చర్చించుకోవచ్చు.
ఇకపోతే సముదాయంతో చర్చ - సముదాయం నిర్ణయం శిరోధార్యమని పైన చెప్పే ఉన్నాను. __ చదువరి (చర్చరచనలు) 01:37, 15 ఏప్రిల్ 2021 (UTC)Reply
@Chaduvari గారు, నేను నా స్పందనలో తెలిపినట్లు, ఒకే ఒక్క {{స్వాగతం}} మూసమాత్రమే సాంప్రదాయకంగా వాడుతున్నాము. ఇతరులు వేరేవిధంగా వాడుతున్నప్పుడు వారికి స్వాగతం మూసనే వాడమనికోరిగా వారు అంగీకరించారు(ఉదాహరణ: వాడుకరి_చర్చ:ప్రభాకర్_గౌడ్_నోముల#కొత్త_సభ్యులను_స్వాగతించడం). ఇది ఇంతకుముందే తెలిపాను. ఇటీవలి కాలంలో స్వాగతం మూసపై ధ్యాసపెట్టిన వారు నేను, మీరే. ఎక్కువమందికి ఈ మూసపై ధ్యాస లేదు, కావున ఏవైనా ఇతర ప్రతిపాదనలుంటే, చర్చలద్వారా ఏకాభిప్రాయం కుదురుతున్నందున (ఉదాహరణ వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_39#వికీపీడియా_వ్యాసం_విస్త్రరణ) ఇంతవరకు వేరేమూస వాడలేదు అందువలన సముదాయ నిర్ణయం ప్రసక్తేలేదు. వికీపీడియాలో సాంప్రదాయాలను మీరు గౌరవించకుండా, ఏకపక్షంగా కొత్త మూసలు వాడటం, అభ్యంతరం చెప్పిన తరువాత కూడా, అధికారి హదాలో వున్న మీరు కొనసాగించడం సరికాదు. ఇలా చేయుట వికీపీడియాలో ఘర్షణ వాతావరణాన్ని పెంచిపోషించుతున్నట్లువుతుంది. కావున మీరు ఈ కొత్త వాడుక వెంటనే నిలిపివేయండి. మీరు రచ్చబండలో చర్చ ప్రారంభించండి, లేక నన్ను ప్రారంభించమంటారా తెలపండి. అర్జున (చర్చ) 09:31, 16 ఏప్రిల్ 2021 (UTC)Reply
@Arjunaraoc గారూ, మీ మాటలు మారుతున్నై.. ఏకరూప గురించి మాట్టాడారు. లింకు ఇమ్మని 13 న అడిగాను, మూడు రోజుల పాటు ఇవ్వలేదు, దాని గురించి చెప్పలేదు. ఇప్పుడు అసలు అలాంటి నిర్ణయం జరగనే లేదని చెబుతున్నారు. ఒకే మూస వాడాలనే నిర్ణయమేదీ జరగలేదు కాబట్టి, వికీలో అనేకమైన స్వాగతం మూసలున్నాయి కాబట్టీ, వికీ విధానాలకు వ్యతిరేకం గాని ఏ మూసనైనా వాడవచ్చునన్నమాట. కొత్త మూసలో వికీవిధానాలకు విరుద్ధమైన విషయమేమీ లేదు. కాబట్టి నేను చేసిన పని వికీవిధానాలకు విరుద్ధం కాదు. మీ ఏకైక అభ్యంతరం నిలబడడం లేదు.
ఇకపోతే, ఇప్పుడు వాడుకలో ఉన్న "స్వాగతం" మూసనెందుకు వాడడం లేదు అని అడుగుతున్నారు. నేను నా మొదటి వ్యాఖ్య లోనే చెప్పాన్సార్.. ఆ మూస గ్రోత్ వాడుకరులకు పొసగదు అని. ఆ మూసలో దోషాలున్నై. వాటిని సవరిస్తే దాన్ని వాడవచ్చు.
ఇక, ఘర్షణ గురించి: మీతో ఘర్షించే ఉద్దేశం నాకు లేదు సార్. మీతోనే గాదు, ఎవరితోనూ ఘర్షించను. ఆ సత్తా గాని, సమయం గాని నాకు లేదు. మృదువుగా పని జరక్కపోతే, ఒక నమస్కారం పెట్టి తప్పుకుంటానంతే. మరి నేను మూసను ఎందుకు వాడానో వివరణ ఇస్తాను.. మీరు గమనించారో లేదో, నేను నిన్న ఆ మూసను వాడలేదు, మీరు ఏకరూప నిర్ణయానికి లింకు ఇస్తారేమో చూద్దామని ఆగాను. కానీ ఈరోజు కూడా మీరు లింకు ఇవ్వలేదు. పైగా మీరు మామూలుగా రాసినట్లే ఉదయాన్నే వచ్చి ఇతర పేజీల్లో రాసారు గానీ దీనికి మాత్రం ఏ సమాధానమూ రాయలేదు. అంచేతనే ఇవ్వాళ మళ్ళీ వాడాను. ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నానంటూ మీరు నాపై సత్యదూరమైన ఆరోపణలు చేసారు కాబట్టి నేను ఈ వివరణ ఇచ్చాను. అయితే, మీరు కొత్త వాడుకను వెంటనే నిలిపివేయమన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆ మూసను వాడడం ఆపేస్తాను.
మరి, చర్చ మీరు మొదలెడతారా నేను మొదలెట్టనా అని అడిగారు.. మీరు పెద్దలు, అనుభవజ్ఞులు. మీరే మొదలెట్టండి. నేను మిమ్మల్ని అనుసరిస్తాను. __ చదువరి (చర్చరచనలు) 10:09, 16 ఏప్రిల్ 2021 (UTC)Reply
@Chaduvari గారు, కొత్త మూస వాడుక నిలిపినందులకు ధన్యవాదాలు. వికీపీడియా:రచ్చబండ#కొత్త_సభ్యులకు_తొలి_స్వాగత_సందేశం లో చర్చ ప్రారంభించాను. అర్జున (చర్చ) 22:37, 16 ఏప్రిల్ 2021 (UTC)Reply
@Arjunaraoc గారూ, సరైన కారణమేమీ లేకుండా నేను చేసే పనికి అడ్డుపడి, నేను చేసే పని అపుజేయించి, దీనిని తేలుస్తానంటూ రచ్చబండలో చర్చమొదలుపెట్టి, వారం దాటి పోయింది. ఇప్పటి వరకూ ఫలితం తేలలేదు.సాధాఅరణంగా చర్చలు వారం పాటు జరిగాక నిర్ణయం చేస్తారు. కాని మీరు మొదలుపెట్టిన చర్చలో ఇంకా నిర్ణయం రాలేదు. చర్చలో మీరూ నేనూ కాకుండా ఒకే వ్యక్తి పాల్గొన్నారు. ఆయన అడిగిన మౌలికమైన ప్రశ్నలకు మీ దగ్గరి నుండి సమాధానం లేదు. చర్చపై మీరే ముందడుగు వెయ్యలేదు. పైగా
ఇక్కడ మీరు చేసిన అభియోగాలకు ఒక్క ఋజువు కూడా చూపించలేక పోయారు. ఒక విధానపు ప్రాతిపదిక గాని మార్గదర్శకపు ప్రాతిపదిక గానీ మీ వాదనకు మద్దతుగా చూపించలేక పోయారు. అయినా సరే.., కేవలం మీరు చెప్పారనే ఉద్దేశంతో, మీ దగ్గర కారణమేమీ లేకపోయినా సరే, మీపై గౌరవంతో నేను చేస్తున్న పనిని ఆపాను. కానీ, చర్చ మొదలై వారం దాటిపోయింది కాబట్టి, ఇక ఆపు చెయ్యను, మళ్ళీ నా పని కొనసాగిస్తాను. మీరు మొదలుపెట్టిన పై చర్చలో వెలువడ్డ నిర్ణయాన్ని పాటిస్తాను. __ చదువరి (చర్చరచనలు) 01:20, 24 ఏప్రిల్ 2021 (UTC)Reply
స్వాగత సందేశంలో మార్పుల గురించిన చర్చ కోసం రచ్చబండలో వెతకగా దొరికిన 19 సెప్టెంబరు 2019 నాటి తాజా లింకు (వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_69#స్వాగతం_మూస_మెరుగు) చూడండి. --అర్జున (చర్చ) 09:40, 16 ఏప్రిల్ 2021 (UTC)Reply
@Arjunaraoc గారూ, ఒకే మూస వాడాలి, ఇతర మూసలు వాడకూడదు అనే నిర్ణయం ఏదీ జరగలేదని గత మీ వ్యాఖ్యలో చెప్పేసారు. ఇప్పుడు, ఇదిగో ఫలానా చోట్ల చర్చలు జరిగాయంటూ మీరు మూడు లింకులిచ్చారు. నేను ఆ లింకులను పరిశీలించాను. వాటిలో ఏముందో చూద్దాం:
  1. వాడుకరి_చర్చ:ప్రభాకర్_గౌడ్_నోముల#కొత్త_సభ్యులను_స్వాగతించడం: (ఇద్దరు పాల్గొన్నారు) ఇది ఒక వాడుకరి చర్చ పేజీలో మీకు ఆ వాడుకరికీ మధ్య జరిగిన చర్చ. అందులో మీరు "కొత్త సభ్యులందరికీ ఎవరు స్వాగతించినా ఒకే విధమైన స్వాగత సమాచారం చేర్చడం మెరుగైంది" అని మీ అభిప్రాయం చెప్పారంతే.
  2. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_39#వికీపీడియా_వ్యాసం_విస్త్రరణ: ఈ సంభాషణలో నలుగురు మట్లాడారు. ఈ సంభాషణ వస్తువే వేరు. ఈ మూస మాత్రమే వాడాలి వేరేది వాడకూడదు అనే ప్రసక్తే రాలేదక్కడ.
  3. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_69#స్వాగతం_మూస_మెరుగు: ఇక్కడ కూడా ఇది మాత్రమే వాడాలి వేరేది వాడకూడదు అనే ప్రసక్తే రాలేదు. పైగా అదసలు చర్చే కాదు. అదొక మోనోలాగ్ - మీరొక్కరే మాట్లాడారు.
ఈ లింకులను ఎందుకిచ్చారో అర్థం కావడం లేదు. కేవలం స్వాగతం మూస ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇచ్చినట్టుగా ఉందంతే. ఈ లింకులు మన చర్చకు ఏ విధంగా పనికొస్తాయి!!? చదువరి (చర్చరచనలు) 10:28, 16 ఏప్రిల్ 2021 (UTC)Reply
@Chaduvari గారు, ఆ లింకులు, ఈ స్వాగతం సందేశం గురించిన ఇతర రచ్చబండ లింకులు పరిశీలిస్తే, ఏ విధంగా ఒకే మూస వాడడం అనే సాంప్రదాయం ఏర్పడిందని, అలాగే ఇతరులు వేరే రకంగా వాడుతుంటే, వారు కూడా ఏకరూపంలో వాడడం మొదలుపెట్టారో అర్ధం చేసుకుంటారని ఇచ్చానండి. అర్జున (చర్చ) 22:40, 16 ఏప్రిల్ 2021 (UTC)Reply
@Arjunaraoc గారూ ఆ లింకుల్లో ఇది మాత్రమే వాడాలి వేరేవి వాడకూడదు అనే చర్చే జరగలేదు. అసలు ఈ విషయం గురించిన ప్రసక్తే లేని లింకులు ఇచ్చి ఒకే మూస వాడడం అనే సాంప్రదాయం ఏర్పడించి చూడమంటారేంటి? మీ ధోరణి సమంజసంగా లేదు. __ చదువరి (చర్చరచనలు) 05:18, 17 ఏప్రిల్ 2021 (UTC)Reply
Return to "క్లుప్తస్వాగతం" page.