వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 39
← పాత చర్చ 38 | పాత చర్చ 39 | పాత చర్చ 40 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2015 మార్చి 8 - 2015 మార్చి 27
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
కొత్త వాడుకరులకు ఆటోమేటిగ్గా స్వాగతం ( NewUserMessage extension with OnAutoCreate)
మార్చుకొత్త వాడుకరులు ఖాతా సృష్టించుకోగానికి ఆటోమేటిగ్గా స్వాగత సందేశం వచ్చేట్టు చేయడానికి mw:Extension:NewUserMessage అనే పొడిగింతను తెలుగు వికీపీడియాలో సచేతనం చేయాలి. అందుకోసం మీ అంగీకారం తెలుపగలరు --వైజాసత్య (చర్చ) 06:07, 8 మార్చి 2015 (UTC)
- ఫిబ్రవరి 2008లో తెవికీలో ఉప్పెనలా కొత్త సభ్యులు సభ్యత్వం తీసుకోవడంతో ఆటోమేటిక్ స్వాగతం సందేశం అనేది 7 సంవత్సరాల క్రితం నా సూచనను అనుసరించి (చూడండి) ప్రదీప్ గారు తయారుచేశారు. కాని అప్పట్లో అది పూర్తి ఆటోమేటిగ్గా కాకుండా నిరంతరం బాటుద్వారా నడపాల్సి వచ్చేది. అంటే ఎవరో ఒక "బాటు"దారు పనిచేయల్సి వచ్చేది. కాబట్టి కొద్ది కాలం అనంతరం దాన్ని వాడటం తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తి ఆటోమేటిక్ విధానం అందుబాటులో ఉంది కనుక ఇలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:40, 10 మార్చి 2015 (UTC)
మద్దతు ( support)
మార్చు- --Pranayraj1985 (చర్చ) 07:51, 8 మార్చి 2015 (UTC)
- ఇది తెలుగు వికీపీడియాకు చాలా అవసరం. దీని మూలంగా నిర్వాహకుల విలువైన సమయం ఆదా అవుతుంది. తద్వారా వారు మరింతగా వికీ ఆభివృద్ధికి తోడ్పడవచ్చును. చొరవ తీసుకొంటున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 12:48, 8 మార్చి 2015 (UTC)
- --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:47, 8 మార్చి 2015 (UTC)
- గత అనేక సంవత్సరాల అనుభవం ప్రకారం చెప్పాలంటే తెవికీలో చేరిన చాలా మంది సభ్యులు మళ్ళీ ఇక్కడికి రావడం లేదు. సభ్యత్వం పుచ్చుకోవడమే కాని తెవికీ గురించి తెలుసుకోవడం గాని రచనలు చేయడం కాని జరగడం లేదు. వారు ఏదో కొంత సమయం తెవికీలో గడిపి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మనం స్వాగతం పలకడం రివాజుగా మారింది. మనం పెట్టిన స్వాగతాన్నయినా కొత్తగా చేరిన వారిలో ఎందరు చూశారనేది సందేహాస్పదమే. వారు సభ్యత్వం పుచ్చుకోగానే స్వాగతం తెలిపే ఏర్పాటు ఉంటే, వారు ఆయా లింకుల ద్వారా తెవికీ గురించి తెలుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాని ఎవరు, ఏ సమయంలో సభ్యత్వం తీసుకుంటారో తెలియదు, వారికి స్వాగతం పలకడానికి ఆ సమయంలో మనం చురుకుగా ఉండటమనేది అన్ని వేళలలో అందరికీ సాధ్యంకాదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే వైజాసత్యగారు ప్రతిపాదించిన "ఆటోమేటిక్ స్వాగతం " అవసరమేననిపిస్తుంది. అంతేకాకుండా తెవికీలో చేరిన వెంటనే సందేశం రావడం వల్ల వారిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ ఉత్తేజాలు కొత్త సభ్యులకు ప్రేరేపించి రచనలవైపు మళ్ళిస్తుంది. అయితే మనం అనుకుంటున్నదంతా సరైన ఫలితాన్ని ఇస్తుందా లేదా అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. ఈ "ఆటోమేటిక్ స్వాగతం"ను కొంతకాలం పరిశీలించి అప్పటికీ, ఇప్పటికీ ఏమైనా మంచి ఫలితం ఇచ్చిందా అనేది పరిశీలించాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:42, 8 మార్చి 2015 (UTC)
- అనుభవం వున్న వాడుకరుల శ్రమని తగ్గించే ఉపకరణాలను వాడడం మంచిది. {{సహాయం కావాలి}} మూస వాడడం ద్వారా వాడుకరుల సందేహాలకు అందరు సభ్యులు సహాయం చేయడానికి వీలున్నందున, యంత్రం సందేశం ఇస్తే సరిపోతుంది. --అర్జున (చర్చ) 06:10, 10 మార్చి 2015 (UTC)
- Palagiri (చర్చ) 08:48, 10 మార్చి 2015 (UTC)
వ్యతిరేకం (Oppose)
మార్చుతటస్థం (Neutral)
మార్చుఈ విధానం అరవ వాళ్ళు ముందు చేతనం చేసి తిరిగి అచేతనం చేసారు, కారణం - కొత్త సభ్యులతో మరింత దగ్గరగా మెలగాలంటే హ్యూమన్ టచ్ అవసరమని వారి అభిప్రాయం. వైజాసత్య గారు ఇలాంటి కారణం మీకు తోచలేదా? ఎందుకు ఈ పొడిగింత ఇప్పుడు అవసరం, కేవలం స్వాగతం పలికే సభ్యులు కొందరు మన తెవికీలో ఉన్నారు, అలానే కొత్త వాడుకరులను స్వాగతం చేసే పనిని దీక్షగా ఇంకొందరు సభ్యులూ చేస్తున్నారు. ఆటోమేట్ చేసిన పనులు ఇలాంటి హ్యూమన్ టచ్ ను సాధించగలవా? మీ అభిప్రాయాలు జత చేయగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:22, 8 మార్చి 2015 (UTC)
- రహ్మానుద్దీన్ గారూ, చక్కని ప్రశ్నను లేవనెత్తినందుకు ధన్యవాదాలు. వాడుకరికి ప్రత్యేకించి, తొలి అడుగులను పరిశీలించి, వ్రాసిన సందేశానికి మీరన్నట్టు తిరుగులేదు (ఉదాహరణ: వాడుకరి_చర్చ:Pavanjandhyala/పాతచర్చలు_1#స్వాగతం) మనకు క్రమం తప్పక ఆహ్వానించేవాళ్ళు లేకపోలేదు. ప్రస్తుతం యాధాలాపంగా ఇస్తున్న, మూస అచ్చుగుద్దిన సందేశం సభ్యుడు ఇచ్చినా ఒకటే, యంత్రం ఇచ్చినా ఒకటే అని నా ఆలోచన. ఒకసారి యంత్రం స్వాగతం పలికిన తర్వాత, మరోసారి మనుషులు స్వాగతం పలకకూడదన్న నియమేమీ లేదు కదా. --వైజాసత్య (చర్చ) 20:43, 8 మార్చి 2015 (UTC)
- నేను ఇక్కడకు వచ్చిన కొత్తలో యాంత్రికంగా స్వాగతం మూస మొదటి పేజీలో పెడదామని ప్రతిపాదించాను. కానీ నాతో చర్చ చేసిన వారు ఎవరో, ఎప్పుడు చర్చ జరిగిందో నాకు గుర్తు లేదు. పాత వాడుకరులకు గుర్తు ఉండే ఉంటుందని అనుకుంటాను. ఆ నాడు మొత్తము మీద నా ప్రతిపాదనను చర్చ తరువాత, యాంత్రికంగా స్వాగతం మూస అనేది 24 గంటలు ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండాలి కనక సాధ్య పడదని తెలియజేశారు. లింకు మాత్రము దొరికితే ఇక్కడ పొందు పరచుతాను. JVRKPRASAD (చర్చ) 06:42, 9 మార్చి 2015 (UTC)
- నన్ను మొదట ఫలానా వారు ఆహ్వానించారు, నాకు మొదటి సమస్య ఫలానా వారు తీర్చారు, నాకు తొలిగా ఫలానావారు అభినందనలు తెలిపారు. అన్నవి వికీలో కొత్త సభ్యుడికి ఏళ్లు గడిచే కొద్దీ తీపి జ్ఞాపకాలుగా మిగిలే విషయాలు. నాకూ వారందరూ గుర్తున్నారు. కాకుంటే అందుకోసం వైజాసత్య గారన్నట్టుగా హ్యూమన్ టచ్ తో స్వాగతం పలకాలి. ఐతే ఒక్కసారి యాంత్రిక విధానానికి అలవాటు పడ్డాకా వెనుక మనం స్వాగతాలు చెప్తామా? ఉన్న అలవాట్లూ పోతాయా అన్న భయంతో రహ్మాన్ గారున్న సందేహ స్థితిలోనే తటస్థంగా ఉండిపోయాను.--పవన్ సంతోష్ (చర్చ) 06:52, 9 మార్చి 2015 (UTC)
- నేను ఇక్కడకు వచ్చిన కొత్తలో యాంత్రికంగా స్వాగతం మూస మొదటి పేజీలో పెడదామని ప్రతిపాదించాను. కానీ నాతో చర్చ చేసిన వారు ఎవరో, ఎప్పుడు చర్చ జరిగిందో నాకు గుర్తు లేదు. పాత వాడుకరులకు గుర్తు ఉండే ఉంటుందని అనుకుంటాను. ఆ నాడు మొత్తము మీద నా ప్రతిపాదనను చర్చ తరువాత, యాంత్రికంగా స్వాగతం మూస అనేది 24 గంటలు ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండాలి కనక సాధ్య పడదని తెలియజేశారు. లింకు మాత్రము దొరికితే ఇక్కడ పొందు పరచుతాను. JVRKPRASAD (చర్చ) 06:42, 9 మార్చి 2015 (UTC)
- రహ్మానుద్దీన్ గారూ, చక్కని ప్రశ్నను లేవనెత్తినందుకు ధన్యవాదాలు. వాడుకరికి ప్రత్యేకించి, తొలి అడుగులను పరిశీలించి, వ్రాసిన సందేశానికి మీరన్నట్టు తిరుగులేదు (ఉదాహరణ: వాడుకరి_చర్చ:Pavanjandhyala/పాతచర్చలు_1#స్వాగతం) మనకు క్రమం తప్పక ఆహ్వానించేవాళ్ళు లేకపోలేదు. ప్రస్తుతం యాధాలాపంగా ఇస్తున్న, మూస అచ్చుగుద్దిన సందేశం సభ్యుడు ఇచ్చినా ఒకటే, యంత్రం ఇచ్చినా ఒకటే అని నా ఆలోచన. ఒకసారి యంత్రం స్వాగతం పలికిన తర్వాత, మరోసారి మనుషులు స్వాగతం పలకకూడదన్న నియమేమీ లేదు కదా. --వైజాసత్య (చర్చ) 20:43, 8 మార్చి 2015 (UTC)
- ఈ extension సౌలభ్యకరంగా ఉన్నా, మన చిన్న సముదాయానికి సరికాదేమో. మిగతా భారతీయభాషా వికీపీడియనుల అనుభవం దృష్ట్యా హ్యూమన్ టచ్ కు మనం ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందేమో. మనం ఇంకా క్రియేటివ్ గా ఏం చేస్తే కొత్త వాడుకరులను కొంతలోకొంత తెవికీలో సచేతనం చేయవచ్చో ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉంది. --విష్ణు (చర్చ) 07:53, 9 మార్చి 2015 (UTC)
- JVRKPRASAD గారూ, మీ సందేహానికి, పైన చంద్రకాంతరావు గారి వ్యాఖ్య సమాధానం చెబుతుంది. ఇదివరకు ఈ పొడిగింత లేని రోజుల్లో, ఆటోమేటిగ్గా ఆహ్వానించాలంటే బాటు నిరంతరం పనిచేయాలనుకునేవాళ్ళం. కాబట్టి బాగా అవసరమైనప్పుడే కొన్ని సందర్భాల్లో ప్రదీపు గారు బాటు ఉపయోగించి ఆహ్వానించారు. పవన్ సంతోష్ గారూ, విష్ణు గారూ, ప్రస్తుతమున్న స్థితి, ఆటోమేటిగ్గా ఆహ్వానించడం కంటే మెరుగ్గా ఏమీలేదు. ఆహ్వానం ఎవరిచ్చారా అన్నదాని కంటే, మనుషులే చెయ్యగల పనులు (అనగా genuineగా ప్రోత్సహించడం, కృషిని గుర్తిస్తూ పతకాలు ఇవ్వటం వంటి మరచిపోయిన అలవాట్లను తిరిగి కలగజేసుకొంటే బాగుంటుందేమో?) రహ్మానుద్దీన్ గారూ, విష్ణు గారూ, తమిళ వికీలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్న విషయం మరింతగా విశదీకరిస్తే వాటిని మనం ఎలా ఎదుర్కొనగలమో ఆలోచించవచ్చు. --వైజాసత్య (చర్చ) 04:37, 11 మార్చి 2015 (UTC)
Comments
మార్చుHi, I am sharing my views here regarding this topic based on Rahim's request. In Tamil Wikipedia, we have an understanding that bots will not welcome new users (though it is not an uncommon practice in many Wikimedia projects). Simply put, it has the same reasoning why you won't welcome a guest to your home or wedding with a bot. Wikimedia projects are community driven and should aim to encourage the human element in interactions. There are many veteran Wikipedians who distinctly remember who welcomed them when they created a new user account. Many newbie editors feel encouraged and consider it an honour when a veteran editor takes the time to welcome them (thought it is just through a template). Many new editors, when they want to contribute more besides writing articles, this welcoming task is their first easy step to become an all-round Wikipedian. We should leave such small tasks deliberately so it will encourage newbies to try. Even many long time Wikipedians take this task up when they are otherwise busy to contribute intensively. This is just a way to show they are there and care for the project. We even do not welcome bulk messages delivered in user pages through a bot. The same message will have a different response and commitment if asked by a contributor who the user can relate to personally. Having said these, we do use bots in article namespace where they can make a difference in reducing work load for contributors by eliminating mechanical maintenance work. --Ravidreams (చర్చ) 16:50, 13 మార్చి 2015 (UTC)
- Thank you Ravidreams for sharing your experience with us here in Telugu wikipedia. కొత్త వాడుకరులకు ఆటోమేటిగ్గా స్వాగతం చెప్పే పొడిగింత విషయమై సముదాయంలో ఏకాభిప్రాయం కుదరనందున ఈ ప్రతిపాదన విరమిస్తున్నాను. కాకపోతే, మరోదిశగా విష్ణు గారన్నట్టు క్రియేటివ్‌గా ఏం చేయగలమో ఆలోచించాలి. --వైజాసత్య (చర్చ) 03:11, 14 మార్చి 2015 (UTC)
- *వైజాసత్య గారూ, వికీ సాహసయాత్రను పరిశీలించగలరు. ఇది పూర్తిగా ఇంకా స్థానికీకరణ చేయాల్సి ఉంది. ఇంతకు ముందు మీకు ఈ ఆట స్థానికీకరణకు దస్త్రాలను పంచుకున్నాను కూడా, అప్పుడు వీవెన్, నేను, ప్రవీణ్(గంభీర్రావ్) తప్ప ఇంకెవరూ స్థానికీకరణలో పాల్గొనలేదు. ఇంకొద్ది రోజుల్లో స్థానికీకరణ పూర్తయాక సమూహ సభ్యులకి సమీక్షకు ఇది అందించగలను. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:13, 16 మార్చి 2015 (UTC)
- రహ్మానుద్దీన్ గారూ, వికీ సాహసయాత్ర చక్కని ఆలోచన. నేను ఒక మూన్నాలుగు సందేశాలు తర్జుమా చేసి, ఆ తర్వాత దాని గురించి మరిచిపోయాను. నాకు మొన్న వచ్చిన ఆలోచన ఏవిటంటే, తరచుగా సభ్యులను ఆహ్వానించే వాళ్ళు ఒక చిన్న ఆడియో స్వాగతాన్ని రికార్డు చేసి ఇక్కడ ఎక్కించుకుంటే, స్వాగత సందేశంలో దానికి లింకివ్వవచ్చు. అప్పుడు కొత్తవాళ్లు స్వాగతించిన వారి గళంలోనే స్వాగతం వినవచ్చు. ఈ శ్రవణ స్వాగత సందేశంలో కాస్త స్వపరిచయం కూడా ఉంటుందనమాట --వైజాసత్య (చర్చ) 01:36, 17 మార్చి 2015 (UTC)
వికీపీడియా వ్యాసం విస్త్రరణ
మార్చువికీపీడియా వ్యాసం విస్త్రరణ అనే మూసను వాడుకరులకు ఆటోమేటిగ్గా మొదటి పేజీలో వికీపీడియాకు స్వాగతం! క్రింద ఈ కొత్త మూస ఉంచితే బావుంటుంది.
- మూస వివరము క్రింద పొందుపరచు చున్నాను:
తెలుగు వికీపీడియా వ్యాసాలు సంఖ్యతో పాటుగా, వ్యాసములకు నాణ్యత ఎంతో అవసరం. వ్యాసములకు నాణ్యత వంటి అవసరం తక్కువయిన వ్యాసాలు వైపు వాటిని కొద్దిగా శ్రద్ధగా విస్తరించడానికి, ఇక్కడ లింకులో గత 30 రోజుల్లో సృష్టించిన వ్యాసముల జాబితా తేదీ ప్రకారం సూచించ బడినవి. ఇటువంటి వాటిలో కొత్త మరియు పాత వాడుకరులు (సభ్యులు) అయిన మీరందరి పాలుపంచుకునే సేవలు ప్రాతినిధ్యం ఎంతో అమూల్యమైనదని విజ్ఞప్తి చేయడమైనది. JVRKPRASAD (చర్చ) 07:28, 9 మార్చి 2015 (UTC)
- చక్కని సూచన JVRKPRASAD గారు. దీనిని కొంత కాలం ప్రయోగించి కొత్త వాడుకరులపై ఎలాంటి ప్రభావం వుటుందో చూస్తే బాగుంటుందని నా నమ్మకం. తెవికీ మిత్రులు కూడా దీనిపై స్పందిస్తారని ఆశిస్తున్నాను. --విష్ణు (చర్చ) 07:58, 9 మార్చి 2015 (UTC)
- విష్ణు గారు, నమస్కారము. మీ సత్వర సానుకూల స్పందనకు నా ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 08:01, 9 మార్చి 2015 (UTC)
- చక్కని సూచన JVRKPRASAD గారు. దీనిని కొంత కాలం ప్రయోగించి కొత్త వాడుకరులపై ఎలాంటి ప్రభావం వుటుందో చూస్తే బాగుంటుందని నా నమ్మకం. తెవికీ మిత్రులు కూడా దీనిపై స్పందిస్తారని ఆశిస్తున్నాను. --విష్ణు (చర్చ) 07:58, 9 మార్చి 2015 (UTC)
- JVRKPRASADగారికి, మంచి ప్రతిపాదన చేశారు అయితే ప్రస్తుతం {{ స్వాగతం}} మూసలో ఇప్పటికే చాలా సందేశాలున్నాయి. గత సంవత్సరం వాడుకరి పేజీల పరిశీలిస్తే కొత్త వాడుకరుల సందేహాలు చాలా వరకు టైపు చేయటం మరియు ప్రాథమిక విషయాలకు సంబంధించినవి. కొత్తగా చేరేవారు, తెలుగు టైపు నైపుణ్యం సంపాదించడానికే చాలా కాలం పడుతుంది. నాణ్యత పెంచడం అనుభవం వచ్చిన తరువాతే చేయగలరు. అందుకని ఒక పరిమితి దాటి మార్పులు చేసిన వాడుకరులకి ఇటువంటి సందేశం ఉపయోగపడగలదని నా నమ్మకం.మీకు అటువంటి వాడుకరుల వివరాలువికీపీడియా నెలవారి గణాంకాలలో చూడవచ్చు. --అర్జున (చర్చ) 06:06, 10 మార్చి 2015 (UTC)
Infrastructure Scholarship Program
మార్చునమస్కారం,
నమస్కారం, నా పేరు రవిశంకర్ అయ్యక్కన్ను. నేను వికీమీడియా ఇండియా చాప్టర్ లో ప్రోగ్రాం డైరెక్టర్ గా పని చేస్తున్నాను.
మీరు చురుకైన వికీపీడియనా?
మీ వికీపీడియాలో పని మరింత మెరుగుపరుచుకోవాలనుకునేందుకు మీకు ఉపకరణం కావాలా?
(ఉదాహరణకు : కంప్యూటర్, స్కానర్, కెమెరా మొ॥, నెలవారీ ఇంటర్నెట్ బిల్.)
వికీమీడియా ఇండియా మీ తెవికీ సమూహ సభ్యుల ఆమోదంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కాలర్షిప్ కి అభ్యర్థనలను ఇప్పుడు స్వాగతిస్తోంది. http://wiki.wikimedia.in/Infrastructure_Scholarship
నిష్పూచీ:
మాకు నిధుల కొరత ఉంది. మేము మీ సమూహం ద్వారా వచ్చిన అసలైన అభ్యర్థనలన్నిటినీ పరిగణిస్తాము. సమూహం పాల్గొనే విధానాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద స్థాయిలో భవిష్యత్తులో రూపొందిస్తాము.
రవి
PS: ఈ సందేశాన్ని అనువదించి ఇచ్చినందుకు రహ్మానుద్దీన్ కు ధన్యవాదాలు. మీ అందరికీ నాదొకటే విన్నపం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని, మీరూ, మీ ద్వారా అర్హులైన వికీపీడియన్లు ఈ స్కాలర్షిప్ కి అభ్యర్థన చేయగలరు.--Ravidreams (WMIN) (చర్చ) 10:24, 9 మార్చి 2015 (UTC)
సమూహం నుండి
మార్చుఇక్కడ కేవలం ఒక్కరుగా కాక సమూహం నుండి అభ్యర్ధన వెళ్ళడం అవసరం, ప్రణయ్‌తో పాటుగా మరికొందరి అవసరాలను కూడా తీసుకొని మొత్తంగా కమ్యూనిటీ ప్రపోజల్‌గా పెట్టవచ్చు. ఉదా:ప్రణయ్ లాప్ అడుగుతున్నాడు, అయితే వాళ్ళు టాబ్ ఇస్తారనుకుంటా - దానితో పాటు సంవత్సరానికి నెట్ ఇస్తామన్నారు కనుక BSNL వంటి కనెక్షన్లు (750 నెలకు అన్‌లిమిటెడ్ ఉంది)తీసుకొని నెల బిల్లులు ఇవ్వవచ్చు. సంవత్సరానికి ఇస్తారు కనుక మిగతా ఎడ్జస్ట్మెంట్ మనం చేసుకోవచ్చు -వెంకటరమణ గారికి అలా ఇస్తే నెట్ గురించి ఇబ్బంది పడుతున్న ఆయనకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటివి మరెవరికైనా అవసరం అనేది తెలియచేయండి. సమూహంగానీ లేక ఒక్కరిగానో పెట్టవచ్చు...--విశ్వనాధ్ (చర్చ) 12:29, 11 మార్చి 2015 (UTC)
- ఇప్పటి వరకూ ఉన్న మద్దతు సరిపోతుంది అనుకుంటా సభ్యులు త్వరగా మెటాపేజీలో మీ రిక్వస్ట్ పెట్టండి, నా అభిప్రాయం ప్రకారం మిగతా బాషా కమ్యూనిటీల వారి కంటే ముందుండటం అవసరం అనుకుంటున్నాను...--విశ్వనాధ్ (చర్చ) 16:20, 14 మార్చి 2015 (UTC)
- అందరికి నమస్కారం.... వికీమీడియా ఇండియా వారి స్కాలర్షిప్ లో నేను ఒక లాప్‌టాప్ కోసం అభ్యర్థించాలనుకుంటున్నాను. ప్రస్తుతం నావద్ద కంప్యూటర్ కానీ, లాప్‌టాప్ కానీ లేకపోవడంవల్ల ఎక్కువ సమయం వికీలో ఉండలేకపోతున్నాను. నాకు లాప్‌టాప్ ఇవ్వడం ద్వారా మరింత చురుగ్గా వికీపీడియాకు పని చేయగలనని నమ్ముతున్నాను. దయచేసి నా అభ్యర్థనను బలపరచండి. --Pranayraj1985 (చర్చ) 09:27, 11 మార్చి 2015 (UTC)
- ' ప్రణయరాజ్ గారి అభ్యర్ధనకు మద్ధతు తెలుపుతున్నాను.--t.sujatha (చర్చ) 10:57, 11 మార్చి 2015 (UTC)
- ' Pranayraj1985 అభ్యర్ధనను నేను సమర్ధించి, నా మద్దతు తెలియజేస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 11:02, 11 మార్చి 2015 (UTC)
- ' ప్రణయరాజ్ గారికి మద్దతు తెలుపుతున్నాను.--' కె.వెంకటరమణ⇒✉ 11:09, 11 మార్చి 2015 (UTC)
- ' మద్దతు - శశి (చర్చ) 11:11, 11 మార్చి 2015 (UTC)
- 'మద్దతు.Palagiri (చర్చ) 13:46, 11 మార్చి 2015 (UTC)
- ' ప్రణయ్ రాజ్ గత రెండు సంవత్సరాలుగా తెవికీ లో చాలా కృషి చేస్తున్నారు. లాప్‌టాప్ వల్ల ఇంకా విస్తృతంగా తెవికీలో పనిచేయగలరని నా నమ్మకం. తెవికీ పురోగతి దృష్ట్యా నా పూర్తి మద్దతు --విష్ణు (చర్చ) 13:57, 11 మార్చి 2015 (UTC)
- ' ప్రణయరాజ్ వంగరి గారి అభ్యర్ధనకు నా సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:15, 11 మార్చి 2015 (UTC)
- ' ప్రణయ్ రాజు గత మూడు సంవత్సరాలుగా తన పి.హెచ్.డి. పనితో బిజీగా ఉంటూనే తెలుగు వికీపీడియాకు మంచి సేవలందుస్తున్నాడు. అతడు విద్యార్థి కావున వికీసముదాయం నుండి ఇలాంటి సహాయం అందిస్తే అతనికి ఆర్ధిక భారం తగ్గించవచ్చును. మరియు అతడు మరింత ఎక్కువ సమయం తెవికీలో కృషిచేయగలడని భావిస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 14:26, 11 మార్చి 2015 (UTC)
- '..--విశ్వనాధ్ (చర్చ) 14:52, 11 మార్చి 2015 (UTC)
- ' మద్దతు --వైజాసత్య (చర్చ) 15:40, 11 మార్చి 2015 (UTC)
- ' --పవన్ సంతోష్ (చర్చ) 16:05, 11 మార్చి 2015 (UTC)
- ' --Naidugari Jayanna (చర్చ) 16:10, 11 మార్చి 2015 (UTC)
- '--స్వరలాసిక (చర్చ) 03:23, 12 మార్చి 2015 (UTC)
- ' --రహ్మానుద్దీన్ (చర్చ) 04:41, 12 మార్చి 2015 (UTC)
- ' - YVSREDDY (చర్చ) 08:27, 12 మార్చి 2015 (UTC)
- ' - నా మద్ధతు తెలుపుతున్నాను ప్రణయరాజ్ వంగరి గారిని వీలయితే Smart లేదా కీ బోర్డు ఉన్న టాబ్ తీసుకొమని సూచన ఇవి సింమ్ తొ వుంటాయి.ఎక్కడికి అయినా సులువుగా తీసుకుపొవచు , కెమెరా కూడా వుంటుంది --కశ్యప్ (చర్చ) 10:56, 12 మార్చి 2015 (UTC)
- ' --శారద (చర్చ) ప్రణయ్ రాజ్ గారికి నా మద్దతు తెలుపుతున్నాను08:42, 12 మార్చి 2015 (UTC)
- ' - ఎల్లంకి (చర్చ) 13:37, 12 మార్చి 2015 (UTC)]]
- ' - --శ్రీరామమూర్తి (చర్చ) 00:53, 14 మార్చి 2015 (UTC)
- '- Vijayaviswanadh (చర్చ) 05:34, 14 మార్చి 2015 (UTC)
- '- --గుళ్ళపల్లి 09:28, 14 మార్చి 2015 (UTC)
- '- ప్రణయరాజ్ వంగరి గారి అభ్యర్ధనకు నా మద్ధతు తెలుపుతున్నాను. --ప్రవీణ్ కుమార్ గోలివాడ (చర్చ) 12:34, 14 మార్చి 2015 (UTC)
- ' -- ప్రణయ్ రాజ్ గారి అభ్యర్ధన సరైనది. ఈ విషయంలో వారికి నా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాను. -- ఆర్. కార్తీక రాజు (చర్చ) 13:04, 14 మార్చి 2015 (UTC)
- '-- Pranayraj1985 అభ్యర్ధనను నేను సమర్ధించి, నా మద్దతు తెలియజేస్తున్నాను.raj.palgun13
- '- ప్రణయరాజ్ వంగరి గారి అభ్యర్ధనకు నా మద్ధతు తెలుపుతున్నాను. [[Katta Srinivasa Rao (చర్చ) 18:28, 14 మార్చి 2015 (UTC)]]
Based on the application here, WMIN is happy to support this community request. We will get in touch with Pranayraj and send the laptop soon--Ravidreams (WMIN) (చర్చ) 12:29, 22 ఏప్రిల్ 2015 (UTC)
- అందరికీ నమస్కారం, గత కొంత కాలంగా వికీలో అనేకమైన దిద్దుబాట్లు చేస్తూ నిర్వహణకార్యక్రమాలు, మొదటి పేజీ నిర్వహణ నిరంతరంగా చేస్తున్నాను. ఇంటర్నెట్ ఖర్చులు అధికంగా అగుచున్నందున సుమారు నెలకు 3 జి.బి కి పైబడి అగుచున్నది. కనుక ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ బి.ఎస్.ఎన్.ఎస్ సౌకర్యం వినియోగించుకోవాలనుకుంటున్నాను. ఈ సౌకర్యాన్ని వినియోగించి మరిన్ని వ్యాసాలు, తెవికీ సేవలు అందించుటకు సహాయాన్ని అభ్యర్థిస్తున్నాను. సహ సభ్యులు సహకరించగలరు.-- కె.వెంకటరమణ⇒✉ 13:35, 11 మార్చి 2015 (UTC)
- ' రమణగారి అభ్యర్థనకు నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. - --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:52, 11 మార్చి 2015 (UTC)
- 'మద్దతు.Palagiri (చర్చ) 13:57, 11 మార్చి 2015 (UTC)
- ' తెవికీలో రమణ గారి కృషి అమోఘం. వారు అభ్యర్థించిన ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ వ్యవస్థ తెవికీ పురోగతికి మరింతగా తోడ్పడుతుందని నా విశ్వాసం --విష్ణు (చర్చ) 14:02, 11 మార్చి 2015 (UTC)
- ' JVRKPRASAD (చర్చ) 14:04, 11 మార్చి 2015 (UTC)
- ' తెలుగు వికీపీడియాలో రమణగారి కృషి అద్వితీయం. నిర్వహణ బాధ్యతలు, వ్యాసరచనలోను నిరంతరం పనిచేస్తూ ఇటీవల కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారాన్ని దక్కించుకున్నరు. ఇలాంటి వ్యక్తులకు మనం అన్నిరకాలుగా సహాయాన్ని అందించాలని నా అభిలాష.--Rajasekhar1961 (చర్చ) 14:26, 11 మార్చి 2015 (UTC)
- '..--విశ్వనాధ్ (చర్చ) 14:52, 11 మార్చి 2015 (UTC)
- ' మద్దతు --వైజాసత్య (చర్చ) 15:40, 11 మార్చి 2015 (UTC)
- ' --పవన్ సంతోష్ (చర్చ) 16:06, 11 మార్చి 2015 (UTC)
- ' --Naidugari Jayanna (చర్చ) 16:10, 11 మార్చి 2015 (UTC)
- '--స్వరలాసిక (చర్చ) 03:23, 12 మార్చి 2015 (UTC)
- ' --రహ్మానుద్దీన్ (చర్చ) 04:41, 12 మార్చి 2015 (UTC)
- ' - YVSREDDY (చర్చ) 08:27, 12 మార్చి 2015 (UTC)
- ' --కశ్యప్ (చర్చ) 10:55, 12 మార్చి 2015 (UTC)
- ' --[[ఎల్లంకి (చర్చ) 13:34, 12 మార్చి 2015 (UTC)]]
- ' -- [[Katta Srinivasa Rao (చర్చ) 04:09, 13 మార్చి 2015 (UTC)]]
- ' ----శ్రీరామమూర్తి (చర్చ) 00:53, 14 మార్చి 2015 (UTC)
- ' - ---Vijayaviswanadh (చర్చ) 05:34, 14 మార్చి 2015 (UTC)
- ' --Pranayraj1985 (చర్చ) 11:57, 14 మార్చి 2015 (UTC)
- ' -- --t.sujatha (చర్చ) 16:16, 14 మార్చి 2015 (UTC)
- పైన నా ప్రతిపాదనకు మద్దతునిచ్చిన సహసభ్యులకు ధన్యవాదములు. నా వ్యక్తిగత పనుల దృష్ట్యా క్రియాశీలంగా పనిచేయలేకపోవుచున్నందున పైన గల ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నాను.-- కె.వెంకటరమణ⇒✉ 16:22, 18 ఏప్రిల్ 2015 (UTC)
Based on the discussion here, కె.వెంకటరమణ has decided to withdraw the application. Best wishes from WMIN for his contributions as usual.--Ravidreams (WMIN) (చర్చ) 12:31, 22 ఏప్రిల్ 2015 (UTC)
నాకు లాప్ టాప్ డివిడిడ్రైవ్ తోకావలెను. 2.ఇంటర్ నెట్ కనక్షన్ ఫెసిలిటీ కావలెను.
- ' --కశ్యప్ (చర్చ) 17:44, 14 మార్చి 2015 (UTC)
- ' ---విశ్వనాధ్ (చర్చ) 05:42, 15 మార్చి 2015 (UTC)
- ' --రహ్మానుద్దీన్ (చర్చ) 07:10, 15 మార్చి 2015 (UTC)
- ' --' కె.వెంకటరమణ⇒✉ 07:22, 15 మార్చి 2015 (UTC)
- ' --పవన్ సంతోష్ (చర్చ) 09:55, 15 మార్చి 2015 (UTC)
- ' --Pranayraj1985 (చర్చ) 07:55, 16 మార్చి 2015 (UTC)
- '--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:19, 23 మార్చి 2015 (UTC)
ఎల్లంకి భాస్కరనాయుడు
మార్చునేను అత్యంత క్రియాశీలక వికిమీడియా వాడుకరిని (full time worker). ప్రతి రోజు, రోజుకి సుమారు 8 గంటల సమయము వికీపీడియా, వికీసోర్సు, విక్షనరీ, వికీకోట్స్ వంటి ప్రాజెక్టులలో వ్రాస్తుంటాను. నాగణాంకాల సంఖ్య అన్నింటిలో కలిపి ఈ నాటికి 1,70,000 దాటినది. నేను వాడుతున్న పి.సి. పాతది. కనుక నాకు ఈ పథకం క్రింద ఒక లాప్ టాప్, కీ బోర్డుతో మరియు ఇంటర్నెట్ చార్జి అందించగలరని మనవి. నేను వాడుతున్న ఇంటర్నెట్ బ్రాడ్ బాండ్. 4. జి.బి., దీనికి నెలకు 600 రూపాయలు. ఒక సంవత్సరం పాకేజి తీసుకుంటే కొంత తక్కువలో వస్తుంది. వికీపీడియాలో మరింత మెరుగైన సేవలు అందించ డానికి నాకు దయయుంచి ఒకలాప్ టాప్ కీబోర్డు, మౌస్ తో , + ఇన్ టర్నెట్ చార్జీలు అందించగలరని మనవి. ఎల్లంకి (చర్చ) 10:47, 14 మార్చి 2015 (UTC) ]]
- నిజానికి నాకు లాప్ టాప్ వాడడము కన్నా డెస్క్ టాప్ పి.సి వాడటమే సౌలభ్యంగా వుంటుంది. కాని లాప్ టాప్ ఉపయోగములో కొన్ని ఇతర సౌకర్యాలుంటాయి. ఉదాహరణకు..... నేను వెళ్ళే అకాడమీలకు గాని, ఇతర వికీమీడియా సమావేశాలకు గాని లాప్ లేనందున కొంత ఇబ్బందిగా వున్నది. బయట ఉపయోగానికి మాత్రమే లాప్ టాప్ కోరడమైనది. రాబోవు కాలంలో ఎక్కువగా ఎక్కువగా అకాడెమీలు చేయవలసిన అవసరమున్నది. వాటి అవసరానికి ఇది చాల ఉపయోగము. అందుకే నా అభ్యర్థన. లాప్ టాప్ కన్నా కీబోర్డు, మౌస్ వున్న చిన్న పరికరము ఇచ్చినా మరింత సౌలభ్యంగా వుంటుంది. లభ్యతను బట్టి అలాంటి పరికరం ఇచ్చినా.... ఇవ్వకపోయినా నా పనిలో మార్పేమి రాదు. కానీ ఇంటర్నెట్ చార్జీలు మాత్రము ఇవ్వవలసినదిగా కోరడమైనది. ఎల్లంకి (చర్చ 02
- 22, 17 మార్చి 2015 (UTC) ]]
- ' --కశ్యప్ (చర్చ) 17:45, 14 మార్చి 2015 (UTC)
- ' ---విశ్వనాధ్ (చర్చ) 05:53, 15 మార్చి 2015 (UTC)
- ' --రహ్మానుద్దీన్ (చర్చ) 07:09, 15 మార్చి 2015 (UTC)
- ' --' కె.వెంకటరమణ⇒✉ 07:25, 15 మార్చి 2015 (UTC)
- ' --పవన్ సంతోష్ (చర్చ) 09:55, 15 మార్చి 2015 (UTC)
- ' --Pranayraj1985 (చర్చ) 07:55, 16 మార్చి 2015 (UTC)
- '--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:19, 23 మార్చి 2015 (UTC)
అందరికీ శుభాశ్శీస్సుల వందనాలు. నాకు [1] ఉచితంగా (తిరిగి ఇవ్వబడనివి) ఇచ్చే ఎన్ని అవకాశములు ఉంటాయో, ఏ రూపంలో ఇచ్చినా, ఎవరు ఇచ్చినా, ఎంతకాలమైనా అన్నీ పుచ్చుకునేందుకు నాకు అభ్యంతరము లేదు. JVRKPRASAD (చర్చ) 15:35, 14 మార్చి 2015 (UTC)
- ' --కశ్యప్ (చర్చ) 17:46, 14 మార్చి 2015 (UTC)
- ' ---విశ్వనాధ్ (చర్చ) 05:54, 15 మార్చి 2015 (UTC)
- ' --' కె.వెంకటరమణ⇒✉ 07:20, 15 మార్చి 2015 (UTC)
- ' మీరు ఇటువంటి అవకాశానికి అన్ని విధాలా అర్హులు. ఐతే ప్రతిపాదన కొంచెం స్పష్టంగా వుంటే బాగుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 10:03, 15 మార్చి 2015 (UTC)
- ' --Pranayraj1985 (చర్చ) 07:55, 16 మార్చి 2015 (UTC)
- '--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:20, 23 మార్చి 2015 (UTC)
జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్, ఎల్లంకి, గుళ్ళపల్లి నాగేశ్వర రావు గార్లకు, అయ్యా, మీ అభ్యర్ధనకు మరింత వివరణ వ్రాస్తే వీటికి నిధులు లేదా వస్తువులు ఇచ్చే అవకాశం ఉంది. చూడబోతే మీ ముగ్గురి దగ్గరా ఏదో ఒక విధమైన కంప్యూటరు ఉన్నట్టుంది. కాబట్టి మీరు ఇంటర్నెట్టు ఖర్చులకు అభ్యర్ధన పెట్టుకుంటే బాగుంటుంది. మరే ఇతర సౌకర్యమో కోరినా బాగుంటుంది. ఉదాహరణకి స్కానరు లేదా డిజిటర్ కెమెరా లాంటివి. అందుకు ప్రతిగా అవి ఉపయోగించి ఏమేమి చెయ్యగలరో ఒక ప్రతిపాదనగా వ్రాస్తే బాగుంటుంది. ఉదాహరణకు ఈ పేజీలోని (http://wiki.wikimedia.in/Infrastructure_Scholarship) అభ్యర్ధన చూడండి. మరీ ఉద్దాత్తంగా ఆలోచిస్తే మీ స్వగ్రామంలోని పాఠశాలకు ఒక కంప్యూటరు అడగండి. దానితో అక్కడ బడిపిల్లలకు వికీశిక్షణ ఇస్తామని ప్రతిపాదన పెట్టండి. ఇప్పుడున్న ఏకవాక్య ప్రతిపాదనలు మాత్రం సమర్ధనీయం కావు. అందరికీ నా మీద కోపం రావచ్చు. పెద్ద మనసుతో క్షమించగలరు --వైజాసత్య (చర్చ) 00:58, 17 మార్చి 2015 (UTC)
- @'Pranayraj1985, @వెంకటరమణ, @జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్, @ఎల్లంకి, @గుళ్ళపల్లి నాగేశ్వర రావు పై వ్యాఖ్య వ్రాసింది ప్రతిపాదనలు మరింత బలోపేతం చేయమనే కానీ, ఆపేయమని కాదు. త్వరత్వరగా మెటా పేజీలో కూడా ప్రతిపాదనలు పెట్టండి ప్లీజ్. లేకపోతే మనం ఈ అవకాశాలను కోల్పోతాం --వైజాసత్య (చర్చ) 23:10, 2 ఏప్రిల్ 2015 (UTC)
- ధన్యవాదాలు వైజాసత్య గారు... నేను బుధవారం అనగా 01.04.2015 రోజునే వికీమీడియా ఇండియా చాప్టర్ వారి మెటా పేజీలో ప్రతిపాదన పెట్టడం జరిగింది. ప్రతిపాదన కోసం ఇక్కడ చూడగలరు. @వెంకటరమణ, @జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్, @ఎల్లంకి, @గుళ్ళపల్లి నాగేశ్వర రావు గారలు నా ప్రతిపాదన ప్రకారం వారివారి ప్రతిపాదనలను వికీమీడియా ఇండియా చాప్టర్ వారి మెటా పేజీ పెట్టగలరు. --Pranayraj1985 (చర్చ) 10:36, 3 ఏప్రిల్ 2015 (UTC)
- Pranayraj1985 గారూ, నేను వికీమీడియా లో లాగిన్ అయినప్పటికీ ఆ పేజీ సంరక్షిత పేజీలా వస్తుంది.ఎడిట్ పేజీలా రావడం లేదు. ఎలా చేర్చాలో తెలియడం లేదు.-- కె.వెంకటరమణ⇒✉ 11:00, 3 ఏప్రిల్ 2015 (UTC)
- కె.వెంకటరమణ గారూ.. నేను లాగిన్ అవ్వడానికి ముందు నాక్కూడా అలానే కనిపించింది. లాగిన్ అయ్యాక ఎడిట్ పేజీలా వచ్చింది. మరి మీకెందుకు రావడంలేదో నాకు తెలియడం లేదు. ఈ విషయంలో వికీమీడియా ఇండియా చాప్టర్ లో ప్రోగ్రాం డైరెక్టర్ గా పని చేస్తున్న రవిశంకర్ అయ్యక్కన్ను గారిని సంప్రదించగలరు.--Pranayraj1985 (చర్చ) 11:06, 3 ఏప్రిల్ 2015 (UTC)
జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ వికీ ప్రతిపాదన విరమణ
మార్చుఅందరికీ నమస్కారములు. నా ప్రతిపాదనకు మద్దతు తెలియజేసిన వారందరకూ ముందుగా ధన్యవాదములు. వైజాసత్య గారు ప్రతిపాదనలు మెటావారికి వీలయినంత త్వరలో అందించమని మంచి సలహా అందించారు. అందరితో పాటుగా నా ప్రతిపాదనకూడా మెటాలో తోటి వాడుకరులు సహాయం పడుతున్నందుకు సంతోషమే కానీ, నావంతుగా నా ప్రతిపాదన విషయం ప్రస్తావించవలసి ఉన్నది. అకౌంటింగ్ కారణాల వల్ల, వీరు అందించే ఈ వస్తువులు WMIN ఆస్తిగా ఉంటాయి. తెలుగు వికీమీడియా సంఘం తరపున దాని సంరక్షకుడుగా ఉండాలి. తెలుగు వికీమీడియా కమ్యూనిటీ భవిష్యత్తులో ఒకవేళ కొంతకాలానికి, కాసేపటికి అవసరము అనుకొని ఉంటే మరో సంఘం సభ్యుడునకు అందజేయుటకు (హ్యాండోవర్) ఈ వస్తువుల కొరకు నాకు అభ్యర్ధనల రూపంలో అభ్యర్థించవచ్చు. ఒక విధంగా ఇటువంటి వస్తువులు ప్రభుత్వ ఆస్తులతో సమానం. వారు ఎలా అందించారో అదేవిధముగా తిరిగి మరో వికీకి కాని, సభ్యునకు కానీ అవసరమయినప్పుడు అందజేయవలసిన అవసరము ఉన్నది. ఆ విధమైన WMIN ఆస్తి నా దగ్గర ఉండటం ఏమంత శ్రేయస్కరము కాదని, నేను ఎంతకాలము ఉంటానో (భూమి మీద) తెలియని విషయం. అందునా నా తదుపరి వికీవారసత్వం అందిపుచ్చుకునే వారు ఉంటారో లేదా ఉన్నారో తెలియని విషయం. ముందుగా నేను అనుకుని, ఆలోచించినది మాత్రం, ఆకలి వేసే వారికి అన్నం పెడతారనే భావంతోనే మరియు ఈ పైన పొందు పరచిన ప్రభుత్వము లాంటి విషయములు ముందుగా తెలిసి జాగ్రత్తగానే నా ప్రతిపాదనతో (అడుక్కున్నాను) అడిగాను. ఈ అన్నివిషయాలు కూలంకషంగా కారణాలు తోటి వాడుకరులు అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. నా వికీ ప్రతిపాదన విరమించుకుంటూ తోటి వాడుకరులు అందించే సహాయము అందుకోగలను అని అనుకుంటున్నాను. ఇంతటితో నా మెటా వికీ ప్రతిపాదన విరమించుకుంటున్నాను. ఎవరి మనసును అయినా నొప్పించిన యెడల క్షంతవ్యుడను. JVRKPRASAD (చర్చ) 14:16, 3 ఏప్రిల్ 2015 (UTC)
General Comments
మార్చుHI, thanks for the overwhelming response for this program from Telugu Community.
It is a deep understanding of the socio economic situation of India that prompted WMIN to launch a program like this. It is aimed at improving every day contributions of deserving contributors who otherwise will face difficulty contributing regularly. So, we just look at the individual contributor's track record and potential to contribute more with this support. The expected outcome using this grant is entirely based on each contributor's ability, interest and limitations. It is not a comparison between any two applicants on who can contribute more. It is not a rewards or entitlement program for contributors who are very active already. If each and every applicant can realize his full potential using this support, that will be a good success measure for this program. So, it is not just about what have you contributed in the past but how this support will make a difference in your contribution that is more important.
We have a limited budget of 75,000 INR for this pilot program this year. Many stakeholders of the movement are keen in assessing the effectiveness of this program. So, we would really like to work with various communities for various kinds of needs, document the learnings and then expand this program gradually.
We have accepted the request from Pranayraj while Kvr.lohith has decided to withdraw his application. Since Pranayraj is working in an institution that is central to the community, we hope that the laptop can also be used for various outreach events happening in his institution.
ఎల్లంకి and గుళ్ళపల్లి నాగేశ్వర రావు reached out to me informally about their requests and community support for the same. But, I would like to politely express our inability to support those requests, at this moment, for the reasons explained above.
We look forward to working together with Telugu community on various other initiatives.
Thanks.--Ravidreams (WMIN) (చర్చ) 13:18, 22 ఏప్రిల్ 2015 (UTC)
కొన్ని బ్లాగుల ప్రామాణికత
మార్చువికీపీడియాలో అత్యంత అరుదైన విషయంలో తప్ప బ్లాగులను మూలాలుగా వినియోగించకూడదన్న నియమం వల్ల నేను వికీలోకి వచ్చిననాటి నుంచీ దాదాపుగా బ్లాగులను సోర్సులుగా ఇచ్చే పని పెట్టుకోవట్లేదు. కాకుంటే కొన్ని బ్లాగుల్లోని సమాచారం, వాటి ప్రత్యేకమైన ప్రామాణ్యత చూసుకుంటే వికీపీడియాలోని వ్యాసాల స్థాయిలో ఉన్నాయి. పుస్తకాల విషయంలో, సినిమాల విషయంలో, పాటల విషయంలో మురళీ గారు రాసే నెమలికన్ను బ్లాగు అటువంటిది. సమాచారం సప్రమాణికంగా ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రామాణ్యత కలిగిన బ్లాగుల విషయంలో కూడా చక్కని సమాచారం ఎదురుగా పెట్టుకుని ఊరుకోవాల్సిందేనా?--పవన్ సంతోష్ (చర్చ) 07:31, 10 మార్చి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, అవసరం లేదు. బ్లాగులో సమాచారం వాడుకోవచ్చు. ఉదాహరణకు భూమి గుండ్రంగా ఉంటుంది అన్న సమాచారం ఒక బ్లాగులో ఏంటి ఎక్కడున్నా వాడుకోవచ్చు. అంటే మీకిప్పుడు ఏమర్ధం అయ్యింది. ఎక్కడైనా ఆధారం చూపించవలసిన విషయాలు వ్రాసినప్పుడు, ఆధారాలు చూపించాలి. అందులో విశ్వసనీయమైన ఆధారాలు మరీ మంచింది. ఉదాహరణకి ఇటీవల విమానప్రమాదంలో చనిపోయిన ఒక మాజీ ముఖ్యమంత్రిని దేశంలోని ఒక పారిశ్రామికవేత్త కుట్రపన్ని చంపించాడని వ్రాశారనుకోండి. ఈ విషయానికి ఎవరైనా ఆధారాలు అడుగుతారు. ఆధారాలు చూపించాలి. అలాంటి వాటికి బ్లాగులను ఆధారంగా చూపకపోవటం మంచిది. నేను ఆధారాలు అవసరంలేదు అనట్లేదు. అలాగే అన్నింటికీ బ్లాగులు ఆధారం చేసుకోండి అనికూడా అనట్లేదు. ప్రస్తుతానికి మరేమూలాలు దొరకనప్పుడు, వివాదాస్పదం కాని విషయాలు వ్రాస్తున్నప్పుడు కాస్త నాణ్యమైన బ్లాగులను ఉదహరించడంలో తప్పేం లేదు. కేవలం బ్లాగు పోస్టులకు ప్రచారం కల్పించడానికే బ్లాగు లింకులు ఇస్తే అలాంటివి తొలగించాలి. ఇతర ప్రామాణిక మూలాలు దొరికినప్పుడు బ్లాగు మూలాలు తీసేసే ప్రయత్నం చెయ్యాలి. --వైజాసత్య (చర్చ) 21:14, 10 మార్చి 2015 (UTC)
- వైజాసత్య గారూ థాంక్యూ. విషయం అర్థమైంది. అలా ఫాలో అవుతాను.--పవన్ సంతోష్ (చర్చ) 01:58, 11 మార్చి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ ఇది కూడా చదవండి, ఉపయోగపడవచ్చు. దీనిని తెలుగులో తర్జుమా చేసి తెవికీలో ఉంచితే మంచిది. మీరు చేయగలరనే నమ్మకంతో...--విష్ణు (చర్చ) 14:33, 11 మార్చి 2015 (UTC)
- వైజాసత్య గారూ థాంక్యూ. విషయం అర్థమైంది. అలా ఫాలో అవుతాను.--పవన్ సంతోష్ (చర్చ) 01:58, 11 మార్చి 2015 (UTC)
- విష్ణు గారూ సరే చదువుతాను. అనువాదం కూడా ప్రయత్నిస్తాను.--పవన్ సంతోష్ (చర్చ) 13:52, 12 మార్చి 2015 (UTC)
స్త్రీవాదం ప్రాజెక్టు
మార్చుభూమి నివసించే మానవులలో ఉత్కృష్టమైన జీవి మానవుడు. మానవులమైన మనం చాలా రకాల విభేదాలతో మనలో మనమే ఘర్షణకు దిగుతున్నాము. అందులో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష ఒక ముఖ్యమైన భాగం. మానవ జనాభా లో సుమారు సగానికి ఉన్న వీరు చాలా రంగాలలో వెనుకబడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సమస్యలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనూ ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరి సమస్యలను గుర్తించి, సంబంధించిన విషయాలపై అంతర్జాలం ద్వారా ప్రజలకు అవగాహన కలిగించడం.
2013లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాదులో ఒక కార్యక్రమం నిర్వహించి ఒక నెలరోజులలో 100 పైగా వ్యాసాలను అభివృద్ధి పరిచాము/ప్రారంభించాము. 2014 లో కూడా ఇలా చురుకుగా పాల్గొని అన్ని భారతీయ భాషల కన్నా తెలుగువారు ముందుంటారని నిరూపించాము. ఇప్పుడు ఆంగ్లం తర్వాత తెలుగులోనే ఈ ప్రాజెక్టు బాగా ముందుకు తీసుకొని పోదామని; అందులకు సభ్యులందరి సహాయ సహకారాలను అభ్యర్ధిస్తున్నాను.
ఆసక్తి కలిగిన సభ్యులు వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం పేజీలో నమోదు చేసుకోమని విన్నపము.--Rajasekhar1961 (చర్చ) 05:27, 11 మార్చి 2015 (UTC)
ఉచిత బహుమతులు
మార్చుఉచిత బహుమతులు కొంతమంది వికీ సభ్యులను ఒక కమిటీ ద్వారా వివిధ రకములయిన బహుమతుల కొరకు ఎంపిక చేసి, వారికి కొరియర్ ద్వారా చేర్చే ఏర్పాటు చేస్తే మంచిదని అనిపిస్తోంది. వాటికి కావలసిన నిధులు (వికీమీడియా ఇండియా చాప్టర్ లేదా ఏమైనా) వచ్చే మార్గాలు ఏమైనా ఉంటే పరిశీలించగలరు. వివిధ రకములయిన బహుమతులు విభాలుగా చేసి, చాలామందికి ఏర్పాటు చేసుకోవచ్చును. JVRKPRASAD (చర్చ) 04:40, 12 మార్చి 2015 (UTC)
ఉచిత బహుమతులు,వాటికి నిధులు,ఏడిట్ల ప్రొత్సాహకాలు,ఇలాంటివి బాగా రాస్తున్న వారికి కొంత ప్రోత్సాహకంగా వున్నా .. ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వసంలొ రాస్తే నాకేమి వస్తుంది అని ఏటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న వాలంటీర్ గా చేయాలనుకుంటుంన్న వారిని , వికిలో తక్కువగా రాసే విషయ నిపుణులను కోంత నిరుత్సాహపరచవచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం --కశ్యప్ (చర్చ) 11:18, 12 మార్చి 2015 (UTC)
SUL finalization update
మార్చుHi all,apologies for writing in English, please read this page for important information and an update involving SUL finalization, scheduled to take place in one month. Thanks. Keegan (WMF) (talk) 19:45, 13 మార్చి 2015 (UTC)
తెలుగు ఊళ్ళు ఫోటో కాంటెస్ట్
మార్చుతెలుగు వికీపీడియాలో వేలాదిగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గ్రామాలు, పట్టణాలు, నగరాల వ్యాసాలు ఉన్నాయి. ఇటీవల తెవికీ సమూహం తెవికీ వ్యాసాల్లో బొమ్మలు చేర్చాలన్న కోణంలో ప్రయత్నాలు సాగిస్తోంది. తెలుగు గ్రామ వ్యాసాల నాణ్యత పెంచుకునేందుకు, రెండు రాష్ట్రాల స్థాయిలో పలువురు కొత్తవాడుకరులను ఆకర్షించేందుకు తెవికీ తెలుగు ఊళ్ళు ఫోటో కాంటెస్ట్ నిర్వహిస్తే బావుంటుంది. పోటీలో రెండు రకాల బహుమతుల్ని నిర్ణయించితే మనకు అన్ని విధాలుగా ఉపయుక్తంగా ఉంటుంది.
- గ్రామాల ఫోటోల్లో నాణ్యతాపరంగా పలువురు మెచ్చిన అద్భుతమైన ఫోటోకు
- ఎక్కువ గ్రామాల ఫోటోలు(ఒకే గ్రామం ఫోటోలు ఎన్ని తీసినా ఒకటిగానే లెక్కించి) తీసినవారు.
వికీ కామన్స్‌లో ఫోటోలు చేర్చడం, తీసిన ఫోటోలను తెలుగు వికీపీడియాలోని సంబంధిత గ్రామాల పేజీలో చేర్చడం ఎంట్రీకి ముఖ్యమైన నియమం. కేవలం కామన్స్‌లో పెట్టి వదిలేసినా, ఇక్కడ తెలుగు వికీపీడియాలో ఉచితం కాని దస్త్రాలలో చేర్చినా వాటిని గణించము. ఇదీ మౌలికంగా కాంటెస్ట్ ముఖ్య నియమాలు. సముదాయం చొరవ తీసుకుని ముందుకువస్తే మన సమస్యకు పరిష్కారంతో పాటుగా కొత్తదారులు తెరుచుకుని తెవికీ వ్యాసాలు నాణ్యతలో అభివృద్ధి చెందే వీలుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 14:09, 14 మార్చి 2015 (UTC)
- ప్రతి వారూ తమ ఊరి పొటోలను ఫేస్బుక్, బ్లాగ్‌లలో అప్లోడ్ చేస్తున్నారు, అలాంటి వారిని మళ్ళించడానికి కేవల్ం ఆలోచన కాకూండా దీనిని విస్తరించాలి. తద్వారా తెలుగు వికీపీడియాలో నాణ్యతను పెంచాలి.
- ఇప్పటికే ఇలాంటివి జరిగిన కమ్యూనిటీలను సంప్రదించాలి
- కాంటెస్ట్ కు నియమనిభందనలు తయారు చేయాలి
- కాంటెస్ట్‌కు బహుమతులు ఏమిటి, ఎలా ఇస్తారు చర్చించాలి.. అనుభవం కలిగిన సభ్యులు దీనిపై చర్చించండి. దీనికొరకు సరి అయిన పేరును ప్రతిపాదించండి...--విశ్వనాధ్ (చర్చ) 14:44, 14 మార్చి 2015 (UTC)
అప్పుడెప్పుడో 2012 లో ఒకసారి హైదరాబాద్ లొ https://en.wikipedia.org/wiki/Wikipedia:Wikipedia_Takes_Hyderabad , అప్పటితొ పొలిస్తే జనాల దగ్గర మంచి కెమెరాలు , హై రెజళ్ళూషన్ కెమేరా కల మొబైళ్ళు వున్నాయి. విజయవంతం అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. అవి తవికీలొనికి నేరుగా ఎక్కించవచ్చా లేదా మరొక మాద్యమం కావాలా అన్నది చర్చించుకొవాలి .--కశ్యప్ (చర్చ) 18:03, 14 మార్చి 2015 (UTC)
- కశ్యప్ జీ నేరుగా ఎక్కించడం అంటే వీటిని కామన్స్ ఫ్రీ ఫోటోలుగా ఎక్కిస్తేనే మనకి ఎప్పటికైనా ప్రయోజనం. ఈ మాసివ్ కార్యక్రమంలో పొరబాటునైనా కొన్ని లోకల్ గా నాన్ ఫ్రీ దస్త్రాలుగా చేరినాయంటే ఇంక అవి ఇక్కడ లాక్ అయిపోయే స్థితి వస్తుంది. మాధ్యమం అన్న పదం నాకు సరిగా అర్థం కాలేదు.--పవన్ సంతోష్ (చర్చ) 06:07, 15 మార్చి 2015 (UTC)
- ఈ కాంటెస్ట్ ప్రతిపాదనను మెరుగుపరిచేందుకు విశ్వనాధ్ గారి సలహా మేరకు కొందరు అనుభవజ్ఞులైన కొందరు ఇండిక్ వికీపీడియన్లతో(విశ్వప్రభ వంటివారు) మాట్లాడాను. వారికి తెలిసిన, అవగాహన ఉన్న కాంటెస్ట్ ల అనుభవం నుంచి కొన్ని సలహాలను అందించారు. వాటిపైన ప్రతిపాదనను కొంతమేరకు మెరుగుపరిచాను. అవి పాయింట్లుగా కింద అందిస్తున్నాను చదివి చూడండి:
- దీని కోసం జ్యూరీని నిర్ణయించి ప్రస్తుతం తెవికీలో వ్యాసాల్లో నాణ్యత పెరుగుదల అవసరాలపైన ఆసక్తివున్న కొందరు తెవికీపీడియన్లను చేర్చాలి. వీరిలో తగుసంఖ్యలో ఫోటోగ్రఫీపై విస్తృతమైన ఆసక్తి, ఫోటోల నాణ్యతను లోతుగా చర్చించగల అవగాహన ఉన్నవారు ఉండాలి.
- పోటీలో ముఖ్యమైన కొలబద్దలు నిర్ణయించుకోవాలి.
- రెండు రకాల బహుమతులు అనుకున్నాం కనుక అత్యుత్తమమైన ఫోటోకు ఇచ్చే బహుమతిలో స్కేల్ పాయింట్లుగా మెటాడేటా, ఫోటోగ్రాఫిక్ స్కిల్స్, విశిష్టమైనదేనా కాదా?(ఉదాహరణకు మంచిలి గ్రామవ్యాసంలో ఓ సామాన్యమైన వీధి ఫోటో పెట్టడానికి, ఆ ఊరికి ప్రత్యేకమైన పూతరేకుల తయారీని ఫోటోగా పెట్టడానికి తేడావుంటుంది. విశిష్టమైన పాత గ్రంథాలయాలు, చక్కని ఉదాహరణగా నిలిచి మండువాలోగిలి ఇళ్ళ ఫోటో వంటివాటికి ప్రత్యేకమైన విలువ దక్కాలి), అప్పటికే గ్రామవ్యాసంలో ఫోటో ఉందాలేదా?(ఒకవేళ అదే మొదటి ఫోటో అయితే కొంత విలువ ఆపాదింపబడుతుంది.) ఫోటో గ్రామవ్యాసంలో మాత్రమే కాక మరెక్కడైనా ఉపయోగపడుతోందా లేదా అన్నవి ఉండవచ్చు.
- మరో రకం బహుమతులైన - ఎక్కువ గ్రామాల వ్యాసాల్లో ఫోటోలు చేర్చడానికి స్కేల్ పాయింట్లలో మొదటిదానిగా ఫోటో పెట్టిన గ్రామవ్యాసంలో అదే మొదటి ఫోటోనా అన్నది వస్తుంది(లేకుంటే పాయింట్ల విలువలో తక్కువౌతుంది), అలానే ఫోటో విశిష్టమైనదేనా కాదా? అన్న ప్రశ్న అన్న వాటితో పాటుగా ఇటువంటి ఫోటోలు ఎన్ని గ్రామాల వ్యాసాల్లో చేర్చగలిగారన్న విషయం కీలకమౌతుంది.
- ఇవన్నీ కేవలం కొన్ని ఉదాహరణలే వీటిని ఇంకా సుస్పష్టం చేయాలంటే వీటిపై చర్చ, సూచనలు తీసుకోవాలి. అలానే ప్రతి పోటీదారూ గూగుల్ ఫాం నింపడం ద్వారా పోటోలో తమ వివరాల్ని సబ్మిట్ చేయవచ్చన్న విషయం కూడా ఆలోచించవచ్చు. ఈ పోటీపై మరింతగా చర్చించేందుకు రచ్చబండ వేదిక కాదనిపిస్తోంది. ఇక ఈ పోటీలకు సంబంధించిన సాధారణ చర్చలన్నీ సంబంధిత పేజీ(త్వరలో క్రియేట్ చేయబడుతుంది) చర్చించుకుందాం.--పవన్ సంతోష్ (చర్చ) 11:27, 15 మార్చి 2015 (UTC)
ఈ రోజు జరిగిన మీటింగ్ లొ GPS tag తొ వున్న photo android smart phone , లేదా GPS camera [[Geotagged photograph|]] గల, కొత్త "ఫోటో కాంటెస్ట్" తేదీలొపల తీసిన ఫోటో లని మాత్రమే (మెటాడేటా పరిశీలించి ) అర్హతగా అని చర్చించాము. వీలయితే కొలబద్దలు గా పరిశీలించగలరు.--కశ్యప్ (చర్చ) 18:37, 15 మార్చి 2015 (UTC)
అన్నమయ్య గ్రంథాలయ పుస్తక జాబితా మొదటి, రెండవ విడతలు
మార్చువికీ మిత్రులకు శుభవార్త,
అన్నమయ్య గ్రంథాలయ పుస్తక జాబితా మొదటి, రెండవ విడతలు మనకు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఇక్కడ చూడవచ్చు. వికీమిత్రులకు మంచి సోర్సు అందుబాటులో ఉంది. మీరు వాటిపై ఇంటర్ లింక్స్ చేయగలిగితే వికీకి మరిన్ని కొత్త వ్యాసాలను సృష్టించగలిగే, ఉన్న వ్యాసాలకు మూలాలను చేర్చగలిగే వీలు కలుగుతుంది సహవికీమిత్రులు ఇక్కడ ఉన్న పేజీలలో మార్పులు చేస్తూ వికీవ్యసాలను బలోపేతం చేయగలరని నా కోరిక...--విశ్వనాధ్ (చర్చ) 15:30, 14 మార్చి 2015 (UTC)
‘‘తెలుగు వికీపీడియా యూజర్ గ్రూప్’’ మొదటి అవగాహాన సదస్సు (14.03.2015)
మార్చు14.03.2015 నాడు జరిగిన ‘‘తెలుగు వికీపీడియా యూజర్ గ్రూప్’’ మొదటి అవగాహాన సదస్సులో రహ్మానుద్దీన్, ఎల్లంకి, గుళ్ళపల్లి, వీవెన్ వీరపనేని గారు మరియు ప్రణయ్‌రాజ్ వంగరి పాల్గొన్నారు.
దీనిలో జరిగిన చర్చల వివరాలు. అయితే ఇది సంపూర్ణంకాదు... సదస్సులు జరుగుతున్నకొద్ది చర్చలలో మార్పులు రావచ్చు... సభ్యులు గమనించగలరు.
working plan of User Group
మార్చు- తెలుగు వికీపీడియా సముదాయంకి యూజర్ గ్రూప్ గా చేయడానికి అర్హత ఉందో లేదో చూడాలి.
- యూజర్ గ్రూప్ నియమాలను (బైలాస్) రాసుకోవాలి. వీటిని సముదాయ సభ్యుల ఆమోదం తీసుకోవాలి.
- కార్యనిర్వాహక కమిటీకి కావలసిన అర్హతలు, కార్యనిర్వాహక కమిటీ పదవీకాలం నిర్ణయించుకోవాలి.
- యూజర్ గ్రూప్ కి సంబంధించిన పేజీలను అనువదించాలి.
- యూజర్ గ్రూప్ ను రిజిస్ర్టేషన్ చేయించవచ్చు.. చేయించకపోవచ్చు...
- యూజర్ గ్రూప్ కి సంబంధించిన అవగాహన కోసం సమావేశాలు నిర్వహించాలి. హైదరాబాద్ లో జరిగే నెలవారి సమావేశంలో 30 ని.లు యూజర్ గ్రూప్ కి సంబంధించిన చర్చ జరగాలి.
- అందరికి అవగాహన వచ్చిన తర్వాతే యూజర్ గ్రూప్ కి సంబంధించిన ప్రకటన చేసి, ఓటింగ్ పెట్టి, ఒక నెల సమయం తర్వాత అనుబంధం కమిటీ (Affiliation committee) దరఖాస్తు చెయ్యాలి. అది చూసి వారు సూచనలతో పాటు ప్రశ్నలు వేస్తారు. వాటికి సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. దానికోసం ఇప్పటివరకు ఏర్పడిన యూజర్ గ్రూప్ వాళ్ల చర్చ పేజీలను గమనించాలి. అంతేకాకుండా ప్రశ్న - సమాధానాలను ఎవరికివారుగా కాకుండా సముదాయంలో చర్చించిన తరువాతే అక్కడ ఇవ్వాలి.
యూజర్ గ్రూప్ అంటే ఏమిటి ?
మార్చు- వికీమీడియన్లకు వికీమీడియా ఫౌండేషన్ వారితో నేరుగా సంబంధం ఉంటుంది.
- వికీమీడియా ఫౌండేషన్, ఛాప్టర్ మాదిరిగానే యూజర్ గ్రూప్ ను తన పరిగణలోనికి తీసుకుంటుంది.
- యూజర్ గ్రూప్ వలన ప్రభుత్వ పరమైన, ప్రైవేట్ పరమైన సంస్థలతో ఒక వేదిక ద్వారా కలవడం జరుగుతుంది.
యూజర్ గ్రూప్ బాధ్యతలు
మార్చు- వికీమీడియన్లను ఎంగేజ్ చేసి వారితో వ్యాసాలు రాయించడం, కొత్త ప్రాజెక్టులకు ప్రోత్సహించడం.
- విద్యాసంస్థలు మరియు ఇతర సంస్థలతో కలిసి పనిచేయడం.
- వివిధ రకాల (ఐ.ఈ.జి., పి.ఈ.జి.,టి.పి.ఎస్.) గ్రాంట్లకు అప్లై చేయడం.
యూజర్ గ్రూప్ కి కావలసినవి
మార్చు- 3 నుండి 10 మంది చురుకైన వికీపీడియన్లు.
- గ్రూప్ పరిచయం, గ్రూప్ పేరు, కార్యనిర్వాహణ కమిటీ ఎవరూ ?, సభ్యత్వ నియమాలు ఉండాలి.
- యూజర్ గ్రూప్ ఎందుకు చేస్తున్నాం ? యూజర్ గ్రూప్ లో ఏం చేస్తున్నాం ? అనే విషయాలు అందరికి తెలియాలి. లక్ష్యాలు, పరిధిలు నిక్కచిగా ఉండాలి.
- యూజర్ గ్రూప్ కార్యనిర్వాహణ కమిటీలో ఉన్నవారంతా ఒకే స్థాయిలో ఉండాలా ? లేక ఒక్కొక్కరికి ఒక్కో పదవి ఉండాలా అనేవి నిర్ధిష్టంగా నిర్ణయించుకోవాలి.
- ఇద్దరు వికీపీడియన్లు, వికీమీడియా ఫౌండేషన్ తో ఎప్పుడు అనుసంధానమై ఉండాలి.
- యూజర్ గ్రూప్ కోసం చేస్తున్న పనులు మెటాలో పెట్టాలి.
యూజర్ గ్రూప్ కోసం ఏంఏం చెయ్యాలి ?
మార్చు- యూజర్ గ్రూప్ గురించి అందరికి అవగాహన కల్గించాలి.
- ఖచ్చితమైన లక్ష్యాలు, పరిధులు నిర్ణయించుకోవాలి. (ఈవెంట్స్, అకాడమీలు వంటివి)
- యూజర్ గ్రూప్ కి పేరు.
- యూజర్ గ్రూప్ గురించి మెటాలో పేజీ సృష్టించి, అందరి ఆమోదం (ఇతర భాషల వికీపీడియన్లు, వికీమీడియా ఫౌండేషన్ వారి) తీసుకున్నాక, యూజర్ గ్రూప్ కోసం దరఖాస్తు చేయాలి.
యూజర్ గ్రూప్ కోసం దరఖాస్తు చెేశాక
మార్చు- పేరు గుర్తింపు
- ఖచ్చితమైన లక్ష్యాలు, పరిధులు ఉండాలి.
- కార్యనిర్వాహణ కమిటీలో ఉన్నవాళ్లు మరియు వికీమీడియా ఫౌండేషన్ తో అనుసంధానమై ఉన్నవాళ్లు వారి నిజమైన పేరుతో ఉండాలి.
- సభ్యత్వ నిబంధనలు నిర్ణయించాలి.
- సంవత్సరానికి ఒకసారి నివేదికను ఇవ్వాలి.
--Pranayraj1985 (చర్చ) 10:53, 15 మార్చి 2015 (UTC)
తొందర వద్దు, అలోచన ముద్దు :)
మార్చు- దీని పైన మునుపు ఉదహరించిన ప్రకారం యూజర్ గ్రూప్ కొరకు ఒక పేజీ మొదలుపెట్టి దానిలో చర్చల అనంతరం ముందుకు సాగాలనేది. కాని ఇక్కడ వికీ స్పూర్తికి విరుద్దంగా కార్యక్రమాలు నడుస్తున్నట్టుగా అనిపిస్తున్నది. భవిషత్‌లో తెలుగు వికీ సముదాయం గ్రూపులుగా విడిపోయే సూచనలు. దీనికి ఎవరు ప్రాతినిద్యం వహిస్తున్నా, సహాయం ఎవరు చేస్తున్నా దానికి భవిష్యత్‌లో సమాధానాలు చెప్పుకోవలసి ఉండచ్చు...కాలు జారితే తీసుకోవచ్చు కాని పరువే జారిపోతే..... మిగతా వికీ బాషా వికీయులలో తెలుగు, తెలుగు వికీ సముదాయం ఏ స్థితిలో ఉండబోతున్నదో.......ఎవరినో నిప్పించాలనేది అభిమతం కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే....--విశ్వనాధ్ (చర్చ) 13:37, 15 మార్చి 2015 (UTC)
- ఆ ఆలోచనల కోసమే ఈ అవగాహనా సదస్సులు. ఈ అవగాహన సదస్సులో ఏం ఏం చర్చకు వచ్చాయో వీలుబడిలో వికీలో నేనూ, ప్రణయ్ ఇంకా ఇతర సభ్యులు చేర్చుతారని అనుకుంటున్నాను. యూజర్ గ్రూప్ అవగాహనా సదస్సు అంటే యూజర్ గ్రూప్ సంరచన సదస్సు కాదు, ఇది కేవలం వికీమీడియా ఫౌండేషన్ ద్వారా ఏ ఏ విధాలుగా సహాయం (ఫండింగ్ అవవచ్చు/టెక్నికల్ సహాయం అవవచ్చు/టీపీఎస్/ఐఈజీ/పీఈజీ) తీసుకోవచ్చో లాంటి విషయాలపై చర్చ చేసుకోడనికి. ఈ అవగాహన లేకపోవటం వలననే పీఈజీని ఇద్దరు ఐఈజీ గ్రాంటీలు, స్వయంగా పీఈజీ గ్రాంటీనైన నేను ఉండి కూడా మొన్న పీఈజీలో తప్పిదం జరిగింది, ఆ అభ్యర్థనను వెనక్కు తీసుకున్నాం. ఇలాంటి అవగాహన సదస్సులు ప్రతి తెలుగు వికీపీడియన్ కు సమాచారం చేరే వరకూ ఎన్నో జరగాల్సిన అవసరం ఉంది. వీటిలో ఇది నాందిగా తొలి చిన్న అవగాహన సదస్సు మాత్రమే. ఈ సదస్సులో ఎవ్వరినీ యూజర్ గ్రూప్ మీరు చేసేయండి అని చెప్పడం జరగలేదు. మరి కేవలం అవగాహన కోసం పెట్టుకున్న కార్యక్రమం అందునా పది రోజుల పైబడి వ్యవధితో ప్రకటించిన అవగాహన కార్యక్రమం, దీని వలన గ్రూపిజం ఎందుకు వస్తుంది? ఈ మొత్తం సమావేశంలో ఆయా పేజీలను తెవికీలో చేర్చాలని సంకల్పించాం. ఆ పేజీలు తెలుగులోకి అనువదిస్తే రేపటి రోజు ఐఈజీ గ్రాంటీలకు మీరు ఎదుర్కొన్న సమస్యలు రాకుండా ఉండాలనే. ఇక ఈ విషయమై జవాబుదారీ కూడా పూర్తిగా నేనే తీసుకుంటున్నాను. ఈ విషయమై ఇతర సభ్యులను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా నన్నే నేరుగా సంప్రదించగలరు. అవకాశం చూసుకొని సభ్యులు అడిగితే రెండో అవగాహన సదస్సు కూడా చేయవచ్చు. అందులో ట్రావెల్ అండ్ పార్టిసిపేషన్ సపోర్ట్, బగ్ ట్రయాజ్ లాంటి అంశాలను చర్చించవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:05, 16 మార్చి 2015 (UTC)
- ఈ విషయమై ఇతర సభ్యులను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా నన్నే నేరుగా సంప్రదించగలరు - ఏ ఇతర సభ్యులను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం జరిగిందో తెలియచేయగలరా..? - లేదా ఇబ్బంది పడ్ద సభ్యులు అయినా ఇక్కడ వారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టానో తెలియచేయమని నా విన్నపం....
- మీరెవరికి ఫోన్ చేసారో మీకు తెలుసు. నాకు తెలీదు, కానీ వారు ఇబ్బంది పడిన విషయము నాకు తెలుసు. ఇతర జవాబులు కింద ప్రశ్నానుసారం జవాబిచ్చాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:13, 16 మార్చి 2015 (UTC)
- ఈ విషయమై ఇతర సభ్యులను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా నన్నే నేరుగా సంప్రదించగలరు - ఏ ఇతర సభ్యులను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం జరిగిందో తెలియచేయగలరా..? - లేదా ఇబ్బంది పడ్ద సభ్యులు అయినా ఇక్కడ వారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టానో తెలియచేయమని నా విన్నపం....
మొదట మీరు ప్రతిపాదన పెట్టినపుడు నేను అడిగిన దానికి జవాబు రాలేదు. ప్రణయ్ కోరిక మేరకు పెట్టినట్టుగా చూపించారు.
- ప్రణయ్ ముందుగా ఈ సమావేశాలు పెట్టాలని ఎక్కడైనా రాసాడా ?
- * ఇక్కడే అవగాహనా సదస్సు అని వ్రాసాడు. అక్కడ నమోదును మీరు యూజర్ గ్రూప్ నమోదుగా భావించి ఉండవచ్చు, కానీ అది ఆ రెండు రోజులూ భోజనాది సదుపాయాల కోసం ప్రతి సమావేశానికీ అడిగేదే. ఇక్కడ నమోదు చేసుకోటం అంటే ఆ సదస్సు కోసమని తెవికీ యూజర్ గ్రూప్ కోసం కాదు - ఈ విషయం మీకింకా అర్ధమయిందా లేదా? ముందుగా మరెక్కడా వ్రాయలేదు, కానీ మనం అనుకున్నట్టుగానే తెవికీ11 అయిన తరువాత జరిగే నెలవారీ సమావేశాలకు జరపాలని అనుకున్నాము. ఆ విధంగా ప్రణయ్ నాకు సూచిస్తే ఇలా చేద్దాము అని చెప్పాను. తెవికీ సభ్యులు ఇలాంటి అవగాహనలను ప్రోత్సహించాలి గానీ, దీనిని వేరే కార్యక్రమంగా ఎందుకు ఊహించుకుంటున్నారు?
- * విశ్వనాధ్- - తెవికీ యూజర్ గ్రూప్ గా అవ్వాలంటే ఎం చెయ్యాలి అన్న విషయమై రెండు రోజుల కార్యశాల చేస్తున్నాం. అని పైన ప్రణయ్ స్పష్టంగా రాసారు. చేస్తున్నాం అన్నారు కాని చేయాలని ఆలోచన అని గాని ఇలా చేద్దామా అని గాని, చెస్తే బావుంటుంది అని గాని రాయలేదు. - ఇది నిర్వహించాలని సీఐఎస్ వారిని సంప్రదిద్దాము అని ఉంది కాని ముందుగా ఎవరిని సంప్రదిద్దాం అని ప్రశ్నలేదు. ముందుగా అన్నీ డిసైడ్ అయ్యక నామకహ పెట్టాం ఇక్కడ అనిపించారు అంతే -
- ఇతర సభ్యులు ఎవరైనా అలా కావాలని అడిగారా ?
- * టీటీటీ అప్పుడు ఈ విషయమై విస్తృతంగా చర్చించుకున్నాము. భాస్కరనాయుడు గారు, నాగేశ్వర రావు గారు, సుజాత గారు, మీనా గాయత్రీ ఆ సంవాదాల్లో ఉన్నారు. మీనా గాయత్రి ఈ సమావేశానికి ముందస్తుగా వస్తానని చెప్పి తరువాత విరమించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ అవగాహన సదస్సు మీరు తెవికీ యూజర్ గ్రూప్ సంరచన సదస్సు ఎందుకు అనుకున్నారు? - ఆ విధంగా ఎక్కడ వ్రాసి ఉంది.
- * విశ్వనాధ్- పైన చెప్పాను -మీరు తెవికీ యూజర్ గ్రూప్ సంరచన సదస్సు అనేదానికొరకే సమావేశం
- దీనికి నిబద్దతలు ఎవరు నిర్ణయించారు ?
- * అవగాహనా సదస్సుకు నిబద్ధతలేమిటి?
- * విశ్వనాధ్- 2000 ఎడిట్స్ అని ఎవరు పెట్టారు, ఎవరు పాల్గొనవచ్చు, పాల్గొన కూడదు అనేవి ఎవరు నిర్ణయించారు.
- దీనికి సంభందించిన చర్చలు ఏవైనా నడిచాయా ?
- * ఇంతకు ముందు మీరూ, నేనూ, ప్రణయ్, పవన్ సంతోష్ - మనం అసఫ్ తో జరిపిన చర్చ మొదటిది. ఆ తరువాత టీటీటీలో జరిగినవే. కాకపోతే భాస్కరనాయుడు గారితో ఈ విషయం తెవికీ11 ముందస్తు సదుపాయాలు, హోటల్ బుకింగ్ కి వెళ్ళినపుడూ చర్చించాను.
- * విశ్వనాధ్- హైదరాబాద్ లో సమావెశం నిర్వహించాలనుకున్నపుడు ఎవరితో చర్చించారు, చర్చల్లో ఏకాభిప్రాయం వచ్చిందా ?
- CIS ద్వారా సమావేశం జరపాలని ఎవరు ప్రతిపాదించారు ?
- * మనం - ఐసీసీకి వెళ్ళిన తెవికీపీడియన్లము. ఇక ఈ అవగాహన తెవికీపీడియన్లలో రావాలన్నది అందరి కోరికే.
- CIS ఎవరిని ప్రతినిధిగా పంపాలనుకుంది, ఎవరికి తెలియపరచింది. ?
- * సీఐఎస్ ద్వారా నేను వచ్చి అవగాహన సదస్సు నిర్వహించాను. మొదట 22,23 తేదీల్లో చేయమని నాకు చెప్పడం జరిగింది. అయితే ఉగాది ఉండటం వలన, నెలవారీ సమావేశానికి దూరమవటం వలన ఈ తేదీ తీసుకోటం జరిగింది.
- * విశ్వనాధ్- 22,23 తేదీల్లో చేయమని నాకు చెప్పడం జరిగింది అని రాసారు- ఎవరు చెప్పారు ? మీకు ఎవరైనా రచ్చబండ ద్వార కాని మెయిల్లో కాని చెప్పారా ?
తెలుగు సభ్యులు కలిగిన సమూహం అనేది అసలు ఒకటుందా, లేక ఎవరైనా ఏదైనా సమూహానికి సంభందం లేకుండా చేయచ్చా, తెలియచేయగలరు ?
- తెవికీ సభ్యులు కలిగిన హైదరాబాద్ లో ఉండే సమూహ సభ్యులు ఈ సమావేశానికి అందుబాటులో ఉన్నారు గనుక పాల్గొన్నారు, ఇలాంటివి మరిన్ని జరుగుతాయి. సమూహ సభ్యుల ఆమోదంతోటే ఇవి జరుగుతాయి. సమూహం సహాయం లేకుండా జరగదు, అవగాహన సదస్సు దాదాపు ప్రకటన జరిగాక పది రోజులకి జరిగింది. ఒక్కరు నమోదు చేసినా జరుగుతుంది. ఇందులో అవగాహన మాత్రమే అని తెలపటం జరిగింది, అయినా వికీ యూజర్ గ్రూప్ నిర్మాణం జరిగిపోతుంది, దాని వల్ల సమూహానికి అపాయం అనుకున్న వారి అవగాహన లోపాన్ని తీర్చడానికే ఈ సదస్సు, అలా అవగాహన రాహిత్యం వ్యక్త పరచిన వారికి మరొక సమావేశంలో ఇవే విషయాలు చర్చకు వస్తాయి. ఈ విషయాల పై చర్చ జరిగి అవగాహన వస్తేనే ఐఈజీ, పీఈఎజీ, టీపీఎస్, వంటి గ్రాంటులకి మనం సులభంగా అభ్యర్థన చేసుకోగలమన్నది నా అభిప్రాయం, దాంతో ఏకీభవించిన వారు వచ్చారు. రాని వారు త్వరలో తెలుసుకుంటారు. మరొక విషయం, ఈ సదస్సు జరిగాకనే యూజర్ గ్రూప్ (మాత్రమే కాక ఇతర గ్రాంట్ పేజీలన్నీ కూడా) తెవికీలో చేర్చాలని నిర్ణయించడం జరిగింది. కాస్త సమయం, తీరిక దొరికాక ఆయా పేజీలు తెవికీలోకి వస్తాయి. ఒక సహ తెవికీపీడియన్ కి అవగాహన కల్పించటం ఎంత ఉత్తమమో ఒక సహ సభ్యునికి తప్పుడు సమాచారం అందించడం అంత ఘోరం. ప్రయోగశాల గురించి అంతకన్నా ఘోరమయిన వివరణ నేను మరెక్కడా వినలేదు. సదస్సు పూర్తి అయ్యాక ఎన్ని రోజులకి నివేదిక అడగవచ్చు? అందరం వాలంటీర్లం మనకు తీరిక కలిగినపుడు మాత్రమే వ్రాయగలం. కాస్త ఓపిక పట్టగలరు.
- * విశ్వనాధ్- ఇక ఈ పేరాపై నా జవాబు నేను తెవికీ యూజర్ గ్రూప్ తప్పా రైటా అని అనలేదు. సమావెశం ఒక్కరి నిర్ణయంతో ఎలా చేస్తారు అని అడిగాను. అలా నిర్వహించాలంటే ముందుగా అందరికీ తెలిసేలా , ఏకాభిప్రాయం ద్వారా నిర్వహించాలని చెప్పాను. నిర్ణయాలు తీసుకొన్న్ తదుపరి కాకుండా మూందుగా చెప్పి చేయడం వలన మంచిదే అని నా అభిప్రాయం. గత 8 సంవత్సరాలుగా వికీలో రచనలు చేస్తున్న నాకు తప్పుడు సమాచారం అందించవలసిన అవసరం లేదు. ( అన్నమయ్య, తప్పుడు సమాచారమే కాదు సమాచార చౌర్యం అతి ఘోరం :) )వికీ ఉన్నతిని ఎప్పుడూ స్వాగతిస్తాను. కాని రాజకీయాలు ఉండకూడదు, ఎకపక్ష నిర్ణయాలు మంచిది కాదని చెప్పే ఒక ప్రయత్నం. మీకెంత అర్ధమయితే అంత...--
....--విశ్వనాధ్ (చర్చ) 06:26, 16 మార్చి 2015 (UTC)
ఏం జరుగుతోంది ఇక్కడ
మార్చుసముదాయానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలన్నీ సముదాయం బయటే జరిగే పరిస్థితి చాలా ప్రమాదకరం. నేను ఇదివరకు చెప్పినట్టు వివిధ గ్రూపులకు, సంస్థలకు వివిధ లక్ష్యాలు ఉంటాయి. సి.ఐ.ఎస్ లక్ష్యాలలో తెలుగు వికీపీడియాకు సహాయపడటం ఒకటైనా, సి.ఐ.ఎస్ అన్ని లక్ష్యాలు తెలుగు వికీపీడియా లక్ష్యాలు కావని గుర్తించాలి. తిరుపతిలో ఉత్సవాలు బాగా జరిగినట్టు నివేదించారు. తీరా చూస్తే చాలా రోజుల తర్వాత 11 వ వార్షికోత్సవం జరగలేదన్నారు. అందులో కొన్ని విషయాలు సముదాయంలో వెల్లడించకూడదని నిశ్చయించుకున్నారు. మీరు సముదాయంలో వెల్లడించలేని విధంగా పనులు చేస్తున్నారంటే, ఇందులోని లెక్కలు, పత్రాలు సరిగానే సాగుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. లెక్కల్లో కూడా తేడాలున్నట్టు కశ్యప్ గారి వ్యాఖ్యల వళ్ళ తెలుస్తుంది. సముదాయం పెంపొందడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సి.ఐ.ఎస్ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఇక్కడ సముదాయం లేదని మీరు స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. వీలైనంతగా తొందరలో 11వ వార్షికోత్సవానికి ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని ఎక్కడ ఖర్చు చేశారు, ఏవి ఎందుకు జరగలేదు అన్న సంగతి సముదాయంలో సి.ఐ.ఎస్ ప్రతినిధులు, ఈ కార్యక్రమం నిర్వహించిన వారు వ్రాయాలని కోరుతున్నాను. --వైజాసత్య (చర్చ) 14:01, 15 మార్చి 2015 (UTC)
- వైజాసత్య గారూ ఇక్కడ కొన్ని విషయాలు సముదాయంలో వెల్లడించరాదన్న విషయాన్ని సూచించిన వ్యక్తిని నేను కనుక నేనే మాట్లాడాల్సివస్తోంది. విషయమేంటంటే తెవికీ 11వ వార్షికోత్సవానికి ముందస్తుగా జరిగిన సమావేశాల్లో విష్ణు సమూహం బయట నుంచి పలు రంగాల నిపుణుల్ని తీసుకువచ్చి మాట్లాడించాలన్న సూచన చేయడం హాజరైన కార్యనిర్వాహక సభ్యుల్లో ముఖ్యులైన కశ్యప్ ఒక నిపుణుణ్ణి తీసుకువస్తానని చెప్పడం జరగింది. ఈ విషయాన్ని సమావేశానికి హాజరైన అందరూ వికీలో చొరవ తీసుకున్నందుకు హర్షించి అంగీకరించారు. మిగిలినవారూ తెలిసిన నిపుణుల్ని సంప్రదించాలని సూచించారు. ఆపైన కశ్యప్ ఆ నిపుణుడితో మాట్లాడి, ఆయన అంగీకారాన్ని స్వీకరించి విషయాన్ని రెండు రోజుల కార్యక్రమాలను ప్రణాళిక వేసేందుకు చొరవతీసుకుని స్కైపులో కలుస్తున్న కార్యవర్గసభ్యులకు సమాచారం అందించారు. అంతకుమునుపే నిపుణుని కోరికమేరకు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేశారు. ఈ విషయాలు తెలుసుకున్నాకా రహ్మానుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ఆ నిపుణుడు వికీకి వ్యతిరేకమని తీవ్రమైన ఆరోపణలు చేసి, ఆయన కార్యక్రమానికి రావద్దన్నారు. నిపుణుడు వికీని అభివృద్ధి చేసేందుకు వ్రాసిన వ్రాతలన్నీ కశ్యప్ ప్రొడ్యూస్ చేశారు. వారిద్దరి మధ్యా వాగ్వివాదం తీవ్రంగా సాగింది.(మెయిల్స్‌లో) విష్ణును కలగజేసుకోమని ఎవరో కోరగా ఆయన నిర్వహణ కమిటీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలనడంతో ఈ వ్యవహారంపై నిర్వహణ కమిటీ స్కైప్‌లో చర్చించుకునేందుకు సమావేశమయ్యాము. 11వ వార్షికోత్సవాలకు ఆ నిపుణుడు రావాలని నిర్ణయం తీసుకుంటే కార్యక్రమానికి తాను రాబోవడంలేదని రెహ్మాన్ ముందస్తుగా కమిటీసభ్యులకు తెలిపారు. సమావేశంలో కశ్యప్ పాల్గొనలేదు.. రెహ్మాన్ కూడా. ఆ సమావేశంలో సూటిగా విషయాన్ని చర్చించారు. నిపుణుడు వికీపై విద్వేషం చూపారనడానికి ఏ విధమైన ఆధారాలూ చూపలేకపోయాం, పైగా కశ్యప్ ఆ నిపుణుడు తెవికీని సమర్థిస్తూ, తెవికీలో వాలంటీర్లుగా పాల్గొనాలని ప్రోత్సహిస్తూ వ్రాసిన వ్యాసాలను ముందుగానే ప్రొడ్యూస్ చేయడం వంటివి పరిగణనలోకి వచ్చాయి. చివరకు తేలిన విషయమేంటంటే ఆ వ్యక్తి తెవికీ 11వార్షకోత్సవాలకు హాజరవ్వాలని, అలానే రహ్మాన్ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోకుండా అర్థంచేసుకుని కార్యక్రమానికి రావాల్సిందని కోరాం. ఇక ఈ విషయాన్ని బయట పబ్లిగ్గా తెలియజేయకూడదని నిర్ణయించుకోవడానికి ముఖ్యకారణం వివాదానికి కేంద్రబిందువైన నిపుణుడికి ఈ విషయమంతా తెలియకపోవడమూ, ఆయన పొరబాటేమీ లేకుండానే ఇలాంటి వివాదంలో వారి పేరు బయటకురావడం సరికాదని సమావేశంలోని వ్యక్తులు నిర్ణయించుకోవడమూను. కార్యక్రమానికి ముందుగా హెచ్చరించినట్టే రెహ్మాన్ రాలేదు, మేమనుకున్నట్టు సమస్య అంత తేలికగా సర్దుమణగలేదు. చివరికి ఇలాంటి పరిస్థితిలో ఈ విషయాన్ని వెల్లడించాల్సి వస్తోంది. ఇదండీ సంగతి.--పవన్ సంతోష్ (చర్చ) 17:03, 15 మార్చి 2015 (UTC)
- ఇది చర్చించదగ్గ ప్రాముఖ్యత ఉన్న విషయమేమీ కాదు. స్వేచ్ఛా సాఫ్టువేర్ వాడుకరులకీ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులను ప్రోత్సహించే వారికి మధ్య ఉండే వాగ్వివాదమే. తిరుపతి సభలకు హాజరైన సభ్యులకు సదరు నిపుణుడి నైపుణ్యం తెలిసాక ఈ విషయమై మాటలాడాల్సిన అవసరం లేదు. ఇంకా అతడికి సంబంధించి తెవికీ పై అతని దృక్కోణం తెవికీ 11 లో పాల్గొన్న అందరికీ విదితమే. ఇక ఈ విషయం ఏ విషమ పరిస్థితికీ దారి తియ్యలేదు. లేని పోని అపోహలు సృష్టించాల్సిన అవసరం లేదు. నిన్న నేనూ, కశ్యప్ కలిసి మాట్లాడుకున్నపుడు కూడా ఈ విషయమై మా ఇద్దరిదీ ఏకాభిప్రాయమనే తెలిసింది. ఇది బయట చెప్పకూడని, వికీలో మాట్లాడకూడని విషయమని నేను అనుకోను - నా వ్యక్తిగత విషయమనే నమ్ముతాను. శ్రీధర్ చాలా సందర్భాలలో బాహ్యంగానే తెవికీని విమర్శించారు - శైశవ స్థితిలో ఉందనీ, తప్పుల తడకనీ, అలా చెప్పిన సందర్భాలలో ఒకసారి మీకు ఆ తప్పులు కనిపిస్తే సవరించవచ్చు కదా అని ఆయనను నేను అడిగినపుడు ఆయన నుండి తిరస్కారం వచ్చింది - నన్ను పలు సామాజిక మాధ్యమాలలో బ్లాక్ చేసారు (అందువలనే ఆయా విషయాలు సహసభ్యులు అడిగినపుడు నిరూపణ చెయ్యలేక పోయాను, కానీ ఈ విషయాన్ని ఒక వ్యక్తికి చెప్పినా అతను దీనిని ఆ చర్చలో ప్రస్తావనకు తేలేదు, నేను ఆ సమావేశంలో లేకపోయినా ఆ విషయం నాకు తెలియడం యాదృచ్ఛికమే!). తెవికీ10 సమయంలో ఆయనను ఒక వికీ సబంధిత శీర్షిక ప్రచురించమని అడిగినపుడూ సహకారం లేదు. స్థానికీకరణను వెక్కిరించారు, అందువలన ఆయన వస్తే నేను రాను అన్నాను. ఇది వ్యక్తిగతం. తిరుపతి సభలకు రాకపోతే తెవికీ ప్రగతికి నేను అడ్డంకి అనుకునే వారు అది ఏ విధంగానో చెప్పవచ్చు. నా వ్యక్తిగత విషయాల పై అభిరుచులపై చర్చించడం సమయం వృథానే! తెవికీ అభివృద్ధి కి దోహద పడే విషయాలను చూద్దాం. వైజాసత్య గారూ, ఎక్స్పెన్స్ స్టేట్మెంట్లు అన్నీ పబ్లిక్ చేయకపోవడం, డైరెక్ట్ వెండార్ ట్రాన్సాక్షన్ (హోటల్ బిల్లులు లాంటివి నేరుగా వెండర్ కి సొమ్ము అప్పజెప్పడం వంటి విషయాలు కశ్యప్ గారికి కొత్తగా అనిపించి) ఈ విషయమై కశ్యప్ అలా స్పందించానని నాకు నిన్న ముఖాముఖీ కలిసినపుడు చెప్పారు. ఇంకా నాకు సబంధించి వ్యక్తిగతమైన ఏ విషయంలో మీకు సందేహాలున్నాయో నేరుగా మెయిల్ ద్వారా సంప్రదించగలరు. ఇక్కడ చర్చించి సమయం వృథా చేసుకోవటం మంచిది కాదు. --రహ్మానుద్దీన్ (చర్చ) 03:51, 16 మార్చి 2015 (UTC)
- వైజాసత్య గారూ ఇక్కడ కొన్ని విషయాలు సముదాయంలో వెల్లడించరాదన్న విషయాన్ని సూచించిన వ్యక్తిని నేను కనుక నేనే మాట్లాడాల్సివస్తోంది. విషయమేంటంటే తెవికీ 11వ వార్షికోత్సవానికి ముందస్తుగా జరిగిన సమావేశాల్లో విష్ణు సమూహం బయట నుంచి పలు రంగాల నిపుణుల్ని తీసుకువచ్చి మాట్లాడించాలన్న సూచన చేయడం హాజరైన కార్యనిర్వాహక సభ్యుల్లో ముఖ్యులైన కశ్యప్ ఒక నిపుణుణ్ణి తీసుకువస్తానని చెప్పడం జరగింది. ఈ విషయాన్ని సమావేశానికి హాజరైన అందరూ వికీలో చొరవ తీసుకున్నందుకు హర్షించి అంగీకరించారు. మిగిలినవారూ తెలిసిన నిపుణుల్ని సంప్రదించాలని సూచించారు. ఆపైన కశ్యప్ ఆ నిపుణుడితో మాట్లాడి, ఆయన అంగీకారాన్ని స్వీకరించి విషయాన్ని రెండు రోజుల కార్యక్రమాలను ప్రణాళిక వేసేందుకు చొరవతీసుకుని స్కైపులో కలుస్తున్న కార్యవర్గసభ్యులకు సమాచారం అందించారు. అంతకుమునుపే నిపుణుని కోరికమేరకు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేశారు. ఈ విషయాలు తెలుసుకున్నాకా రహ్మానుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ఆ నిపుణుడు వికీకి వ్యతిరేకమని తీవ్రమైన ఆరోపణలు చేసి, ఆయన కార్యక్రమానికి రావద్దన్నారు. నిపుణుడు వికీని అభివృద్ధి చేసేందుకు వ్రాసిన వ్రాతలన్నీ కశ్యప్ ప్రొడ్యూస్ చేశారు. వారిద్దరి మధ్యా వాగ్వివాదం తీవ్రంగా సాగింది.(మెయిల్స్‌లో) విష్ణును కలగజేసుకోమని ఎవరో కోరగా ఆయన నిర్వహణ కమిటీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలనడంతో ఈ వ్యవహారంపై నిర్వహణ కమిటీ స్కైప్‌లో చర్చించుకునేందుకు సమావేశమయ్యాము. 11వ వార్షికోత్సవాలకు ఆ నిపుణుడు రావాలని నిర్ణయం తీసుకుంటే కార్యక్రమానికి తాను రాబోవడంలేదని రెహ్మాన్ ముందస్తుగా కమిటీసభ్యులకు తెలిపారు. సమావేశంలో కశ్యప్ పాల్గొనలేదు.. రెహ్మాన్ కూడా. ఆ సమావేశంలో సూటిగా విషయాన్ని చర్చించారు. నిపుణుడు వికీపై విద్వేషం చూపారనడానికి ఏ విధమైన ఆధారాలూ చూపలేకపోయాం, పైగా కశ్యప్ ఆ నిపుణుడు తెవికీని సమర్థిస్తూ, తెవికీలో వాలంటీర్లుగా పాల్గొనాలని ప్రోత్సహిస్తూ వ్రాసిన వ్యాసాలను ముందుగానే ప్రొడ్యూస్ చేయడం వంటివి పరిగణనలోకి వచ్చాయి. చివరకు తేలిన విషయమేంటంటే ఆ వ్యక్తి తెవికీ 11వార్షకోత్సవాలకు హాజరవ్వాలని, అలానే రహ్మాన్ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోకుండా అర్థంచేసుకుని కార్యక్రమానికి రావాల్సిందని కోరాం. ఇక ఈ విషయాన్ని బయట పబ్లిగ్గా తెలియజేయకూడదని నిర్ణయించుకోవడానికి ముఖ్యకారణం వివాదానికి కేంద్రబిందువైన నిపుణుడికి ఈ విషయమంతా తెలియకపోవడమూ, ఆయన పొరబాటేమీ లేకుండానే ఇలాంటి వివాదంలో వారి పేరు బయటకురావడం సరికాదని సమావేశంలోని వ్యక్తులు నిర్ణయించుకోవడమూను. కార్యక్రమానికి ముందుగా హెచ్చరించినట్టే రెహ్మాన్ రాలేదు, మేమనుకున్నట్టు సమస్య అంత తేలికగా సర్దుమణగలేదు. చివరికి ఇలాంటి పరిస్థితిలో ఈ విషయాన్ని వెల్లడించాల్సి వస్తోంది. ఇదండీ సంగతి.--పవన్ సంతోష్ (చర్చ) 17:03, 15 మార్చి 2015 (UTC)
మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులను ప్రోత్సహించే విషయంలో స్వేచ్ఛా సాఫ్టువేర్ వాడుకరుల వివాదం వలన తను తిరుపతికి రాని విషయం నిన్న రహ్మన్ (చర్చ) చెప్పారు, తిరుపతి సభలలొ నిపుణుడు తీవికీ మీద అబిప్రాయం చెపుతున్నప్పుడు చర్చ పక్కదారి పట్టినది యూనీకోడు అనుఫాంట్ల వినియోగం గురించి జరిగినది, దానితొ అసలు విషయ్ంమాట్లాడకుండానే సమయం గడిచిపోయినది, ఇహ బడ్జెట్టు విషయానికి వస్తే సి.ఐ.ఎస్ వారివద్ద ఉన్న్ రసీదులతొ మిగిలిన ఖర్చుల వివరాలు నాకు అందచేస్తాంము అని చెప్పారు దానిని పరిశీలించాలి. మనం ఇక్కడ జరిపే ఏ చర్చలూ వృధా ఆని అనుకోను, మనం రచ్చబండ అని పేరు పెట్టుకొని ఆ పేరుకు గౌరవం ఇవ్వకపోతే ఎలా :) --కశ్యప్ (చర్చ) 07:06, 16 మార్చి 2015 (UTC)
- చర్చ పక్క దారి పట్టినా మాట్లాడగలగడమే నైపుణ్యం, అప్పుడే నిపుణులవుతారు. ఇక ఇది నా వ్యక్తిగత విషయం అనీ నేను ప్రతి ఒక్క ఆర్గనైజింగ్ కమిటీ వారికీ తెలిపాక ఇది మళ్ళీ చర్చకు తేవటం, వ్యక్తిగత విషయాలు ఇక్కడ చర్చించాలంటే నా కనీస కన్సెంట్ ఉండాలి. అది అత్యల్ప జ్ఞానం. ఇక బిల్స్ నేను పరిశీలించి వాటి స్కాన్స్ మీకు త్వరితంగా అందిస్తాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:17, 16 మార్చి 2015 (UTC)
- ఇలాంటి విషయాలన్నీ మూలనపెట్టబట్టే, వికీపీడియాలో ఇప్పటికే ఒక సీనియర్ సభ్యున్ని కోల్పోయాము. విషయం వివరంగా తెలియజేసిన పవన్ సంతోష్ గారికి ధన్యవాదాలు. మీకు, ఆ సదరు నిపుణునికి ఉన్నది ఏదేమైనా అది ఇక్కడ అనవసరం. ఈ విషయమై మీరు ప్రవర్తించిన తీరు ప్రొఫెషన్లగా అనిపించలేదు. తెలుగు వికీపీడియా తరఫున, సి.ఎస్.ఐ ప్రతినిధిగా సహకారం అందిచటం మీ ఉద్యోగధర్మం కాదా? సమయానికి విష్ణు గారు కలుగజేసుకొని సముదాయపు నిర్ణయాన్ని గౌరవించమనటం ఇందులో హర్షదాయకమైన విషయం. --వైజాసత్య (చర్చ) 10:41, 16 మార్చి 2015 (UTC)
- ఒక సీఐఎస్ ఏ౨కే ఉద్యోగిగా తెవికీ ౧౧ కి నా తరఫున చెయ్యాల్సిన వాటికన్నా ఎక్కువే చేసాను. దగ్గరుండి పీఈజీ పేజీ సృష్టింపచేయించాను, హోటల్ బుక్ చేసి వచ్చాను. తిరుపతిలో ఈవెంట్ కి ముందొక రెండు రోజులు వెళ్ళి ఉంటే ఎస్వీయూలో వికీపీడియా శిక్షణ చేసేందుకు వీలు కలిపించి వచ్చాను, సహసభ్యులు నేను చేసిన సహాయాన్ని అందుకోని స్థితిలో/గుర్తించలేని స్థితిలో ఉన్నారాయె. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:19, 16 మార్చి 2015 (UTC)
- ఇలాంటి విషయాలన్నీ మూలనపెట్టబట్టే, వికీపీడియాలో ఇప్పటికే ఒక సీనియర్ సభ్యున్ని కోల్పోయాము. విషయం వివరంగా తెలియజేసిన పవన్ సంతోష్ గారికి ధన్యవాదాలు. మీకు, ఆ సదరు నిపుణునికి ఉన్నది ఏదేమైనా అది ఇక్కడ అనవసరం. ఈ విషయమై మీరు ప్రవర్తించిన తీరు ప్రొఫెషన్లగా అనిపించలేదు. తెలుగు వికీపీడియా తరఫున, సి.ఎస్.ఐ ప్రతినిధిగా సహకారం అందిచటం మీ ఉద్యోగధర్మం కాదా? సమయానికి విష్ణు గారు కలుగజేసుకొని సముదాయపు నిర్ణయాన్ని గౌరవించమనటం ఇందులో హర్షదాయకమైన విషయం. --వైజాసత్య (చర్చ) 10:41, 16 మార్చి 2015 (UTC)
- వైజాసత్య గారు మంచి చర్చనే లేవదీశారు. మనం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తప్పకుండా సమూహంతో చర్చించిన తర్వాతనే తీసుకోవడం తెలుగు వికీపీడియా పురోగతికి మంచిది. దీని మూలంగా విభేదాలు తగ్గుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు చెప్పినది సి.ఐ.ఎస్. యొక్క కార్య ప్రణాలిక వేరు; తెవికీ ప్రణాలిక వేరు అని సభ్యులు అర్ధం చేసుకోవడం మంచిది. ఇక నేను చెప్పదలచుకొన్న మరొక ముఖ్యమైన విషయం ఆలోచించుకోండి. అదేమంటే తిరుపతి సమావేశం పూర్తయి ఒక నెలరోజులయింది. ఇక దానికి సంబంధించిన కార్యక్రమాల్ని మనం మొదలుపెట్టడం మంచిది. చురుకుగా పనిచేస్తున్న సభ్యుల సమయం సుదీర్ఘ చర్చల మీద కాకుండా చేయాల్నిన పనుల మీద వెచ్చిస్తే; తెవికీ సమాచారం వృద్ధిచెందుతుంది. మనం తెవికీ సమూహంలో చేయాల్నిన పనులు చాలా ఉన్నాయి. ముందుకు పోదాం రండి. కలసికట్టుగా పోదాం.--Rajasekhar1961 (చర్చ) 11:28, 16 మార్చి 2015 (UTC)
- రహ్మానుద్దీన్ గారూ, మీరు తెవికీ చేస్తున్న కృషికి ధన్యవాదాలు. కానీ నా మాట వింటేనే సహాయం చేస్తాను, నా దారి లేకుంటే రహదారి అనేకంటే, కాస్త సంయమనం పాటించి వ్యవహరిస్తే మరింతగా ముందుకు వెళ్ళగలరు. నేను పై వ్యాఖ్యలో కోల్పోయామన్న సీనియర్ సభ్యులు అహ్మద్ నిసార్ గారు. ఇక ఈ చర్చలో ఎలాగూ వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మీరు వికీ వ్యతిరేకి అన్న సదరు నిపుణుడు చాలా ఏళ్ళక్రితమే తెవికీలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి, తదితర అంశాలపై దృశ్యకాలను సృష్టించి వికీ ప్రచారం చేశారు.--వైజాసత్య (చర్చ) 00:42, 17 మార్చి 2015 (UTC)
- ఆంధ్రప్రదేశ్ లో ఇస్లామ్ ప్రాజెక్టు ఇందుకు కారణం కాదని మీరు చెప్పగలరా? ఈ ప్రాజెక్టు ఐఈజీకి రాక ముందు నుండే నాతో ఆయన చర్చించారు, నేను ఇది స్వంత పరిశోధన కావున తగదు అని చెప్పాను, ఇవి ఆఫ్ వికీ సంగతులు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:37, 17 మార్చి 2015 (UTC)
- నేను వీలైనంతవరకు వికీ సభ్యులతో వికీలోనే మాట్లాడుతుంటాను. మొహమ్మీద చెప్పలేనిదేది వ్రాయను. బయటేం జరిగిందో నాకెలా తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు మీరేదో ఆయన్ను ఇక్కడ వెళ్ళడించవద్దని శాసించినట్టున్నారు (బహుశా యూజర్ గ్రూపు గురించేననుకుంటాను). ఆయన అందుకు నిరసనగా వెళ్ళిపోయారు. అందులో ఏదో పెద్ద రహస్యమున్నట్టు పెద్ద యాగీ చేశారు. ఎందుకు ఈ రహస్య మంతనాలు. మనకు అవసరమా? అదే నేను చెప్పేది. --వైజాసత్య (చర్చ) 07:02, 17 మార్చి 2015 (UTC)
- రహ్మానుద్దీన్ గారూ, మీరు తెవికీ చేస్తున్న కృషికి ధన్యవాదాలు. కానీ నా మాట వింటేనే సహాయం చేస్తాను, నా దారి లేకుంటే రహదారి అనేకంటే, కాస్త సంయమనం పాటించి వ్యవహరిస్తే మరింతగా ముందుకు వెళ్ళగలరు. నేను పై వ్యాఖ్యలో కోల్పోయామన్న సీనియర్ సభ్యులు అహ్మద్ నిసార్ గారు. ఇక ఈ చర్చలో ఎలాగూ వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మీరు వికీ వ్యతిరేకి అన్న సదరు నిపుణుడు చాలా ఏళ్ళక్రితమే తెవికీలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి, తదితర అంశాలపై దృశ్యకాలను సృష్టించి వికీ ప్రచారం చేశారు.--వైజాసత్య (చర్చ) 00:42, 17 మార్చి 2015 (UTC)
ఎందుకు జరిగింది
మార్చువైజాసత్య గారు అసలు "ఏం జరుగుతోంది ఇక్కడ" అని అడిగినప్పుడు దానికి వీలున్నంత సూటిగా మనం సమాధానాలు ఇవ్వడం చేయాలి. కాని చర్చ ఎటో వెళ్ళింది. వైజాసత్య గారి లాంటి సినీయర్ తెవికీపీడియన్ ఈ ప్రశ్న వేసారు అంటేనే ... మనలో Communication Gap ప్రస్పుఠంగా కానవస్తుంది అని నేననుకుంటున్నాను. ఇలాంటి Communication Gap మన తెవికీ సముదాయ ప్రగతికి ముఖ్యమైన ఆటంకము. ఈ Communication Gap తెవికీ ఉగాది మహోత్సవంలో, తెవికీ దశాబ్ది ఉత్సవాలలో, ఐ.సి.సి. మరియు తెవికీ ౧౧వ వార్షికోత్సవాలలో (ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులలో)నేను చూసిన అతి పెద్ద ఛాలెంజ్. ఇది ప్రతీ ఉత్సవ కమిటీ సభ్యుడికి తెలిసినదే అని నా నమ్మకం. దానికై మనం చేయవలసినది... దాదాపు తెవికీకి మరియు మన సముదాయానికి సంబందించిన ప్రతీ విషయం, చర్చ, నిర్ణాయక విషయాలు వికీలో పెట్టడమే. ఇది వైజాసత్య గారి లాంటి సీనియర్ వికీపీడియనులు అంటున్న Golden rule of Wikipedia. దీనిని అందరూ ఆచరించాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ఏ సమావేశ కమిటీ సభ్యులైనా. ప్రణయ్ రాజ్ ప్రతీ off-wiki చర్చలను తెవికీలో పెట్టే విషయంలో నాకు ఆదర్శం. తెవికీ 11వ వార్షికోత్సవానికి సంబందించి నిపుణులను పిలిస్తే మంచిది అనే చర్చ జరిగిన సమావేశం minutes తెవికీలో మరియు ఇతర ఉత్సవ కమిటీ సభ్యులందరికీ తెలియజేయకపోవడం మొదటి వైఫల్యం. అక్కడినుండే ఈ communication gap పెరుగుతూ పోయింది. ఆ సమావేశంలో నేను ఉన్నందున నేనూ క్షమార్థినే. ఇక వైజాసత్య గారు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసినంతలో కొన్ని వివరణలు.
//సముదాయానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలన్నీ సముదాయం బయటే జరిగే పరిస్థితి చాలా ప్రమాదకరం.// - నాకు తెలిసి నేను చూసినంతలో ఇది ఇప్పటి వరకు జరగలేదు.. ఇక జరగబోదు అని నా నమ్మకం.
//తిరుపతిలో ఉత్సవాలు బాగా జరిగినట్టు నివేదించారు. తీరా చూస్తే చాలా రోజుల తర్వాత 11 వ వార్షికోత్సవం జరగలేదన్నారు. // - ఇలా ఎవరన్నారో కాని, వాస్తవానికి విరుద్ధం. కార్యక్రమ నివేదిక తెవికీలో ఉందనుకుంటా. లేకుంటే ఉత్సవ కమీటీ దీనికి బాద్యత తీసుకొంటుందని నా నమ్మకం. As part of verifiability మచ్చుకు ఈ వార్తా కథనం చూడండి.
//అందులో కొన్ని విషయాలు సముదాయంలో వెల్లడించకూడదని నిశ్చయించుకున్నారు. //ఇది కూడా అవస్తవమే. మీకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు వైజాసత్య గారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. నాతో పాటుగా ఉత్సవ కమిటీ సభ్యులంతా మరియు ఇతర తెవికీపీడియనులు కూడా.
//ఇందులోని లెక్కలు, పత్రాలు సరిగానే సాగుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది// దీని గురించి CIS-A2K తరఫున నేను గ్యారంటీ ఇవ్వగలను. కశ్యప్ గారి అకౌంటులోకి కొంత డబ్బు అడ్వాంస్ గా తప్ప (కొన్ని చిన్న ఖర్చులకోసం) మిగతా పెద్ద ఖర్చులన్నీ (ఉత్సవ కమీటీ సూచనమేరకు) CIS బ్యాంకు అకౌంటు నుండే direct గా జరిగాయి. ప్రతీది cheque మరియు bank transfer కావడం వలన లెక్కలలో తేడా రాకుండా (నేను ముఖ్యంగా)సి.ఐ.ఎస్. జాగ్రత్త పడుతుంది. ఉత్సవ కమిటీ పంపించిన బిల్స్ అన్నీ CIS అకౌంట్స్ వెరిఫికేషేన్ తరవాతే ఖర్చుల చిట్టా మెటా వికీలో పెట్టడం జరుగుతుంది. ఇకబిల్స్ అన్నిటినీ సి.ఐ.ఎస్. ఆడిటర్స్ ప్రతి మూడు నెలలకు చెక్ చేస్తారు. వికీమీడియా ఫౌండేషన్ వారు గత ఏడాది సి.ఐ.ఎస్ అంకౌంటింగ్ సిస్టంస్ చూసి one of the best transparent systems గా feedback ఇచ్చారు. మీకు ఇంకా సందేహాలు ఉన్నా సూచనలు ఉన్నా తెలియజేయగలరు.
//లెక్కల్లో కూడా తేడాలున్నట్టు కశ్యప్ గారి వ్యాఖ్యల వళ్ళ తెలుస్తుంది.// కశ్యప్ గారు ఎలాంటి తేడాలు ఉన్నాయో తెలియజేయండి. మీకు సందేహాలు ఉంటే మొదట సి.ఐ.ఎస్. అకౌంట్స్ ని సంప్రదించండి. సంతృప్తి చెందకుంటే ఇ-మెయిల్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంత వరకు మీరు నాతో ఎన్నో సార్లు ఫోనులో మాట్లాడారు, మరియు తెవికీ 11వ వార్షికోత్సవానికి సంబందించి ప్రతీ ఇ-మెయిలు సంభాషణలో నేను, నాతో పాటు సి.ఐ.ఎస్ ఎక్సికూటివ్ డైరెక్టరు మరియు ఇతర ఉత్సవ కమిటీ సభ్యులు కాపీలో ఉన్నారు. మీరు ఈ కార్యక్రమానికి కోశాధికారిగా ఉన్నారు. ప్రతి ఖర్చు ఉత్సవ కమీటీ నిర్ణయం మేరకు జరిగిందే.
//సముదాయం పెంపొందడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సి.ఐ.ఎస్ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఇక్కడ సముదాయం లేదని మీరు స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.//ఈ వాక్యాలు మీరు ఉద్వేగంలో రాసినవిగా నేను బావిస్తున్నాను, వైజాసత్యగారు. అది కూడా communication gap వళ్ళ వచ్చిందేమో అని నా అంచనా. తెవికీ ఉగాదిమహోత్సవాలు, తెవికీ దశాబ్ది ఉత్సవాలు, తెవికీ 11వ వార్షికోత్సవ ఉత్సవాలు మన తెవికీ సముదాయం, మన తెవికీ సముదాయం పెంపొందించడానికోసం, మన తెవికీ సముదాయ సభ్యుల ఆధ్వర్యంలో జరిగినవే. సి.ఐ.ఎస్-ఎ.టు.కే సూచనలు, సహాయ సహకారాలు మాత్రమే అందించింది. ఇలాంటి support దాదాపు చాలా భారతీయ భాషా వికీ సముదాయాలకు అందించడం జరిగింది.
//వీలైనంతగా తొందరలో 11వ వార్షికోత్సవానికి ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని ఎక్కడ ఖర్చు చేశారు, ఏవి ఎందుకు జరగలేదు అన్న సంగతి సముదాయంలో సి.ఐ.ఎస్ ప్రతినిధులు, ఈ కార్యక్రమం నిర్వహించిన వారు వ్రాయాలని కోరుతున్నాను.// తప్పకుండా. ఇది మీరు అడగపోయినా మనం తప్పక చేయాల్సిన పని. కశ్యప్ గారు బిల్స్ అన్నీ మొన్ననే (ఆదివారం నాడు) సి.ఐ.ఎస్.కి పంపించారు, వాటిని సి.ఐ.ఎస్ అకౌంట్స్ వారు పరీశీలించిన తరువాత మెటా వికీ లో మరియు తెవికీలో పెడదాం.
మునుముందు తెవికీ సమూహ కార్యక్రమాలు చేయాలనుకున్నా మనం ఈ సూచనలు దృష్టిలో ఉంచుకోవడం మంచిది.
- ఒక వార్షికోత్సవం లాంటి కార్యక్రమం చేయడంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి.
- ఉత్సవ కమిటీలో సభ్యులుగా ఉండాలనుకునేవారు ఈ ఒడిదుడుకులను ఎదురుకోక తప్పదు. ఎదురుకోగలిగితేనే బాద్యతలు స్వీకరించండి.
- ప్రతీ సమావేశానికి ఉద్దేశ్యాలు, కార్యక్రమ ప్రణాళిక ముందుగానే ఖరారు చేసుకోవాలి.
- సమావేశానికి సంబందించిన ముఖాముఖి చర్చల సారాంశం తెవికీలో చేర్చి సభ్యుల దృష్టికి తీసుకురావడం తప్పనిసరి.
- సమావేశాలకి advanced గా ప్రణాళిక వేసుకొని పనులు ప్రారంభించాలి. చివరి నిముషం వరకు పనులను ఉంచకూడదు.
- కమిటీ సభ్యులు ఒక బాద్యత తీసుకుంటే, తప్పని సరిగా దానికి కట్టుబడి చేయాలి.
- సమావేశం ఖర్చులు 7 నుండి 10 రోజులలొపు సముదాయంతో పంచుకునేటట్టుగా ప్రయత్నించాలి
- సమావేశం రిపోర్టు కూడా సభ్యులందరూ చొరవ తీసుకొని పూర్తి చేయాలి. ఇది కేవలం ఉత్సవ కమిటీ వారి పని మాత్రమే కాదు, మనందరిదీ.
చివరగా ఇలాంటి కార్యక్రమాలలో ప్రతీదీ అనుకున్నట్టు జరగకపోవచ్చు, మనకు నచ్చని విషయాలు జరగవచ్చు - ఇవి తెవికీ ప్రగతికి అవరోధం కానంతవరకు చూసి చూడనట్లుగా పోవడం, వ్యక్తిగత దూషణలకు దిగకుండా ఉండడం మన తెవికీ సముదాయ శ్రేయస్సుకి దోహదమవుతాయి. మనం సాధించింది కొంత సాధించవలసింది ఎంతో ఉంది. If you want to go fast go alone, if you want to go far go together - African proverb. మనం చేరాల్సిన తెవికీ గమ్యం సుదూరం, కలిసి ముందుకు సాగుదాం. --విష్ణు (చర్చ) 13:53, 17 మార్చి 2015 (UTC)
నేను లెక్కలలొ తేడాలు అన్నది తెలుగు వికిపీడియా దశాబ్ది ఉత్సవాల గురించి,నాకు WMF, CIS Budget Reporting వివరాల పట్ల ప్ర్రాదమిక అవగాహన మాత్రమే ఉండటంతో , PEG గ్రాంటు రహ్మనుద్దిన్ పేరుమీద తనే Lead గా ఉండటం వలన PEG లొ సమర్పించిన దానికి నేను బాద్యత తీసుకోలేదు వాటి వివరాల గురించి ఎప్పుడూ కార్యవర్గ సభ్యుడిని అయిన నాకు ఎటువంటి మైయిల్ రాలేదు వికి10 జరిగిన వారం లోపలే 20 ఫిబ్రవరి 2014 న తెలుగు వికిపీడియా దశాబ్ది ఉత్సవాల వివరాలు పంపాను తరువాత 30 April 2014 నుండి 6 July 2014 న రహ్మానుద్దీన్ (ప్రణయ్ మెటాలొ పూర్తి చేసారు. అప్పటికి నేను వెరే పనుల మీద వుండటం వలన నేను దృస్టిపెట్ట లేదు. వార్షికోత్సవానికి నాకు CIS ద్వరా అందిన 150000 రుపాయలకు "ఇప్పటి వరకూ వచ్చిన గ్రాంటులన్నీ తెవికీ సభ్యులు ఎలా వాడుకున్నారు అనే విషయమై కూడా చర్చించుకోవాలి. --రహ్మానుద్దీన్ (చర్చ) 10:51, 4 మార్చి 2015 (UTC) " అన్న దానికి నేను ఇలా చెప్పవలసి వచ్చినది. నేను వికి10 కి నేను సమర్పించిన ₹.1,53,297 లెక్కలకు , రహ్మానుద్దీన్ PEG లొ సమర్పించిన లెక్కలకు ₹.6,62,100/- కు పోంతన లేదు అన్న విషయాన్ని దయచెసి నేను ఇచ్చిన లంకెలు చూడండి, అక్కడ హోటల్ బిల్లు , వికీపునస్క్తారాం కాంకుండా ,మిగిలిన ఖర్చులు ఎప్పుడు పెట్టారు తెలపలేదు ఉదా: Offline CD 25000,SWAGs Banners 5000,Posters 800,Video Shooting 10000 , Banners, Posters 15000, Print Media 20000 . Infra Venue,20000 ,Wifi, Internet 15000 ,Projector 8000 etc.. నాకు తెలిసి ఇవి ఖర్చు చెయలేదు వీలయితే ఉత్సవకమీటీ వారు కూడా పరిశీలీంచి ద్రువపరచ గలరు, లేదా పాత మెయిల్స్ ,ఫోటోలు చూడగలరు.
ఇక తెవికీ కి అబ్యర్దించిన మొత్తం సొమ్ము Total Amount: Rs. 3,82,500 /- లలో అసలు ఎంత మంజూరు అయ్యాయి అన్న విషయం CIS వారిని నుండి నాకు ఇప్పటి దాకా తెలియదు, చివరకు ఐదు రొజులముందు నేను అబ్యర్దించిన 1, 07,500 లొ విష్ణు గారి చోరవ వలన 75,000 మంజూరు అయ్యాయి , అనుకున్న వికీపీడియన్లు రాకపోవటంతో , సమయం తక్కువ గా ఉండటం వలన ఆందులో Rs. 68771 ఖర్చు అయ్యాయి. రహ్మానుద్దీన్, భాస్కర్ నాయుడు గారు ఎంపిక చేసిన హోటల్ బిల్లులు CIS బ్యాంకు అకౌంటు నుండే direct గా జరిగాయి. ఉత్సవ కమీటీ జరిపిన చర్చలలొ మనం పూర్తి నిజాయితీగా, ఇతరులకు రొల్ మోడల్ లాగ జరిగిన లెక్కలు జరిగినట్లు సంమర్పించాలి , ప్రతి ఖర్చు ఉత్సవ కమీటీ నిర్ణయం మేరకు జరగాలి అని విష్ణు గారు సూచించారు దాని నేను పూర్తిగా గౌరవించాను, నాకు పంపిన రుసుము , బ్యాంకు స్టేట్మెంట్ తొ సహా నాకు తెలిసి అన్ని వివరాలు సరిగానే ఇచ్చాను చివరకు మీ సూచన మేరకు స్టాలులో టీలు, అద్యక్షులు, కార్యదర్శి సంతకాలతో సహా, నేను చేతి నుండి పెట్టిన ఖర్చులు అన్నిటికీ కూడా నేను ఓచర్లు ఇచ్చాను.
ఇక పోతే తిరుపతిలో ఉత్సవాలు అనుకున్నంత బాగా జరగలేదు వికీపీడియన్లు రాలేదు, అప్పుడు అనుకున్న ప్రణాళికలు ఇప్పటి దాక పూర్తి స్థాయిలలొ జరగలేదు,అందుకు ఉత్సవ కమీటీ సభ్యుడిగా నేను కూడా దీనికి బాద్యత తీసుకోంటుంన్నాను , ప్రతిదీ ఏడిట్ల సంఖ్య తొనో, ఎక్కువ మంది కొత్త వాడుకరులు లేని సమావేశాలను మనం తవికీ ప్రగతి గా చూపించలేము !. అద్యక్షులు ఎల్లంకి భాస్కర్ నాయుడు వారి స్నేహితులవలన మనకు ప్రతికలలో ప్రచారం జరిగినది అసలు పత్రికల వారిని పిలవాలని మనం ప్రణాలిక వేసుకోలేదు. మనం, మన వికీ అభివృద్ది కొసం మనలాంటి ఎంతోమంది విరాళాల నుండి లక్షల రూపాయలు వెచ్చించి కార్యకమాలు చేస్తుంన్నప్పుడు ఇలాంటి చర్చలు ఎంతొ అవసరం. మన తెవికీ సముదాయ సభ్యులలో క్రియాశిలంగా సి.ఐ.ఎస్-ఎ.టు.కే వారు ఉండటం వలన, వారు రాక ముందు నుండి తెవికీలొ అంత గా లేని ఉత్సవాలు, సదస్సులు , గ్రాంటు లు , ట్రైనింగు అన్నీ వారే బాద్యతతో ముందుకు నడపటంవలన సి.ఐ.ఎస్ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి తెవీకీ ఉన్నదేమో అన్న నా అనుమానం విష్ణు గారి వివరణతొ తీరినది :) , ఎవరికన్నా ఇబ్బంది కలిగితే మన్నించండి --కశ్యప్ (చర్చ) 10:35, 18 మార్చి 2015 (UTC)
- కశ్యప్ గారు ఇది ఇప్పుడే చూసానండీ. ప్రస్తుతం ప్రయాణంలో ఉన్నాను. దీనికి (తెవికీ దశాబ్ది ఉత్సవాలు మరియు CIS గ్రాంటు మంజూరు విషయాలు) సంబంధించి విపులంగా త్వరలోనే తెలియజేస్తాను. నాకు తెలిసినంతవరకు అంతా సజావుగానే ఉంది.బడ్జెటు, గ్రాంటు, ఖర్చుల ఖాతా process ల గురించి వివరణ ఇస్తే మీ అనుమానాలు పఠాపంచలవుతాయి అని అనుకుంటున్నాను.
- కాని మీకు సంవత్సరం క్రితం నాటి తెవికీ దశాబ్ది ఖర్చులగురించి సందేహాలు ఉంటే మీరు ముందే అడిగివుంటే ఇంకా బావున్ను. మనం గత సంవత్సరంలో ముఖాముఖి ఎన్నో మార్లు కలుసుకున్నాం, ఫోనులో, స్కైపులో మాట్లాడుకున్నాం. మీకున్న సందేహాలు అడగటానికి ఇప్పటి వరకు వేచిచూడాల్సింది కాదు. జరిగిందేదో జరిగిపోయింది,ఇక ముందు మీరు కాని తెవికీ మిత్రులు ఎవరికైనా, సముదాయ పరంగా లేక CIS పరంగా వీకీ నిధుల ఖర్చుపై ఎలాంటి సందేహాలున్నా ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడం ఉచితం. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు ఉండకూడదు. ఇలా చేయడం వలన మనమధ్యలో communication gap పెరగకుండా ఉంటుంది. మీరు ఇప్పటికైనా మీ సందేహాలను మనందరితో పంచుకున్నారు-ధన్యవాదాలు. మరింత వివరణ ఇక్కడే త్వరలోనే.--విష్ణు (చర్చ) 04:31, 19 మార్చి 2015 (UTC)
విష్ణు గారూ నేను పోయిన నెలలోనే నేను PEG తెవికీ గ్రాంటు కోసం అబ్యర్ధన చేస్తుంన్నప్పుడు మాత్రమే నేను రహ్మనుద్దిన్ PEG గ్రాంటును చూసాను,ఒక వేళ రిపోర్టు పెడుతున్నప్పుడు నాకు మరియు కార్యనిర్వాహక వర్గానికి ఒక మెయిలు చేస్తే బాగుండేది,నాకు మాత్రం PEG గ్రాంటు గురించి ఎటువంటి మెయిలు రాలేదు.అతరువాత తెవికీ 11 పనులలో మూడవ రోజు మాట్లాడాలి అనుకొన్నాను, ఈ విషయం సహవికీపీడియన్లు కోందరికి, కమిటీ సభ్యులకు తెలిపాను మరలా వారి సూచన మేరకు కోంచెం సున్నితం అయిన అంశం కావటం వలన విరమించుకొన్నాను. అయితే యుజర్ గౄపు చర్చలో ఖర్చుల ఖాతాల కోసం రిపోర్టు తయారు చేయటంలొ గల సందేహాలలో బాగంగా మీమ్ములను స్పూర్థిగా తీసుకొని పంచుకున్నాను. మొన్న ఆదివారం చర్చలలో కూడా రహ్మానుద్దీన్గారు నాకు వివరణ ఇస్తాను అని చెప్పారు.అయితే నేను చేసినది ఆరోపణ అని ఓక నోటు పుస్తకం చూపి అందులొ రాసి ఇమ్మన్నారు ఇంకా Hyderabad Book fair - 2014 - Telugu Wikimedia Stall, నేను బాద్యత తీసుకోని 15000 రుపాయల విలువ అయిన స్టాలును ఉచితంగా తీసుకోని,35000 వరకు మార్కేట్టులొ ఖరీదు చేసే 30000 కరప్రతాలు రూ:20000 కు మాత్రమే ప్రింటు చేయించి,నేను పదిరోజుల పాటు,రోజుకు రేండువందల రూపాయల food and Tea,Snaks for 3 - 5 per volunteers లను ముందు ఓచర్ ఇంకా బిల్లులు పెట్టి Requests to CIS-A2K లొ మొత్తం ఖర్చు రాసి, అన్ని కాపీలు CIS కు పంపితే మిగిలిన మిగిలిన సొమ్ము తెవికీ 11 ఖర్చుల కోసం వెచ్చిచండి మెత్తం బిల్లులు ఒక సారి ఇవ్వండి అని చెప్పి తరువాత ఇవి ఒప్పుకోము , మీతో స్నాక్స్ తిన్నవారి అందరి సంతకాలు ఏవి, ఆదివారం బోజనం బిల్లు ఎందుకు పెట్టారు, రెండువందల రూపాయలు ఎవరి కోసం చేసారు అని ఆడిగారు, మా ఆడిటర్లకు అన్ని బిల్లులు కావాలి మీరు బిల్లులు ఇవ్వలేదు కాబట్టి మీకు తెవికీ 11 కి నిధులు ఇవ్వలేము అన్నారు ఇది నన్ను ముందుగా ఎటువంటి communication లేకుండా ఈవెంట్ ముందు ఇలాంటి సాంకేతిక కారణాలు చెప్పి ముందుగానే చేతి మీద నుండి ఖర్చు పెట్టండి తరువాత ఇస్తాము అని చెప్పటం ఇబ్బంది పెట్టింది నేను విసిగి విరమించు కోంటాను అన్న తరువతా మీ పూచితో CIS నుండి నగదు వచ్చినది. అంత ఖచ్చితం గా వుండే CIS ఆడిట్ పైన నాకు తెవికీ దశాబ్ది ఉత్సవాలు మరియు CIS గ్రాంటు మంజూరులో వచ్చిన సందేహాలను ఆడిగాను :) --కశ్యప్ (చర్చ) 08:53, 19 మార్చి 2015 (UTC)
తెలుగు వికీపీడియా శిక్షణ దృశ్యకాల తయారీ
మార్చుతెలుగు వికీపీడియా శిక్షణకు కావాల్సిన దృశ్యకాల(వీడియోల) తయారీకి క్రైస్ట్ విశ్వవిద్యాలయం వారు వారి స్టూడియోను అందిస్తున్నారు. ఈ వీడియోల కోసం స్క్రిప్ట్ ఆంగ్లంలో అందుబాటులో ఉంది. లింక్ : https://drive.google.com/file/d/0B4BeJbzyBC2nc2JOck9EWFloNlk/view?usp=sharing
ఈ స్క్రిప్ట్ ని ఆంగ్లం నుండి తెలుగుకి స్థానికీకరించడానికి మార్గం ఏదో, సభ్యులు సూచించగలరు. ఈ స్క్రిప్టుని వికీపీడియా పేరుబరిలో చేర్చి, అక్కడే స్థానికీకరణ చెయ్యాలా, లేక వికీసోర్స్ లో ఈ పని చెయ్యాలా, లేక ట్రాన్స్లేట్ వికీ/గూగుల్ డాక్స్ లాంటి వికీకాని వేదిక పై చెయ్యాలా? సభ్యులు ఈ వీడియో రికార్డింగ్ కి సహకరించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 03:39, 16 మార్చి 2015 (UTC)
గుగుల్ డాక్స్ వంటివి అనివాద పనులకు కొంచెం సులువుగా ఉంటాయి ఇది క్రియేటీవ్ కాబట్టి వీకీ సోర్స్ లో పెట్టలేమేమో , నాకు తెలుగు స్థానికీకరణలొ కొంత ప్రవేశం ఉన్నది, నేను సహకరించగలను --కశ్యప్ (చర్చ) 07:35, 16 మార్చి 2015 (UTC)
వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మార్చి 15, 2015 సమావేశం నివేదిక
మార్చుమార్చి 15, 2015నాడు జరిగిన తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశ నివేదికను రాయడం జరిగింది. నివేదిక కొరకు సమావేశ పేజి ని చూడగలరు. ఇక్కడ రాసినవి కూడా నిర్ణయాలు కావు... చర్చాంశాలు మాత్రమే.... సభ్యులు గమనించగలరు...
ముఖ్య గమనిక: నాకున్న కొద్ది సమయంలో నేను నివేదికలు మరియు ఇతరలములు సరైన విధంగా రాయలేకపోతున్నాను. గత వారంరోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా.... వీలున్నపుడు వ్యాసాలు రాయడానకే తప్ప నివేదికలు రాయడానికి, మరియు ఇతర పనులు చేయడానికి నాకు అనుభవం లేదని తెలిసింది. కనుక నేను చేస్తున్న ఈ పనిని మరేవరైనా తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇప్పటివరకు నాకు సహకరించిన అందరికి నా ధన్యవాదాలు --Pranayraj1985 (చర్చ) 08:44, 16 మార్చి 2015 (UTC)
వ్యక్తుల వ్యాసాల్లో సంతకాల సంగతి
మార్చువికీపీడియాలోని వ్యక్తుల వ్యాసాలలో సంతకాలు అదనపు ఆకర్షణగా ఉంటాయి. ప్రస్తుతం నేనూ, రాజశేఖర్ గారు, వైజాసత్య గారూ మీనా గాయత్రీ కృషిచేస్తున్న తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు(డీఎల్ఐ ప్రాజెక్టే)లో చాలా పుస్తకాల్లో ముందుపేజీల్లో రచయితలు చేసిన సంతకాలు, ఆటోగ్రాఫులు దొరుకుతున్నాయి. కొన్నింటిలో ఐతే ముందుమాట చివర్లో అచ్చులోకి మార్చిన ముందుమాట వ్రాసిన పెద్దవారి సంతకాలూ ఉన్నాయి. ఇవన్నీ తెవికీలోని ఆయా వ్యక్తుల పేజీల్లో చేర్చేందుకు నా వంతుగా నేనూ ప్రయత్నం చేస్తున్నాను. ఐతే ఆయా వ్యక్తులు మరణించి అరవైయేళ్ళు కాకుంటే వారి సంతకానికీ కాపీహక్కులు ఉంటాయి కదా. (టెక్నికల్‌గా మాట్లాడితే అదీ వాళ్ళ కృతే అవుతుంది.) అందుకని వాటిని సముచిత వినియోగం కింద ఇక్కడ లోకల్ ఫైలుగా ఎక్కించాలంటే సముచిత వినియోగపు దస్త్రాల ఎక్కింపులో సినిమా పోస్టర్, పుస్తక ముఖపత్రం వంటివి ఉన్నట్టుగా ప్రముఖుల సంతకం అనో ఆటోగ్రాఫ్ అనో ఏదైనా ఫార్మాట్ ఉంటే బావుంటుంది. ఇది లేక చాన్నాళ్ళుగా చేర్చడంలో సమయం వృధా అవడంతోపాటుగా సరైన లైసెన్స్‌లో చేర్చట్లేదేమోనన్న అనుమానమూ వస్తోంది.--పవన్ సంతోష్ (చర్చ) 04:36, 17 మార్చి 2015 (UTC)
కొత్తరకం చర్చా పేజీలు (ఫ్లో)
మార్చుచర్చా పేజీలను ఆధునీకరించేందుకు వికీమీడియా వాళ్ళు ఒక ప్రాజెక్టును ప్రారంభించారు. దీన్ని పరీక్షించి, వారి తగిన సూచనలు గట్రా చేయటానికి తెలుగు వికీపీడియాలో కొందరిని మీరు ప్రయత్నిస్తారా అని అడిగారు. అందుకు నేను సరే అన్నాను. ఈ అధునాతనమైన చర్చా పేజీల వళ్ళ చాలా సౌలభ్యాలు ఉన్నాయి. చివరికి అన్ని వికీల్లోని చర్చా పేజీలు ఇలా రూపుదిద్దుకుంటాయి కాబట్టి మనం ఈ అవకాశాన్ని అందుపుచ్చుకొని, వీటిని ప్రయోగించి, ఈ ప్రాజెక్టులో పనిచేసేవారికి తెలియజేస్తే వాళ్ళు తగు మార్పులు చేస్తారు. ఈ ప్రాజెక్టును గురించిన మరింత సమాచారం వికీపీడియా:ఫ్లో లో ఉంది. అలాగే వికీపీడియా చర్చ:ఫ్లో లో ప్రయోగాత్మకంగా ఒక సందేశం వ్రాసి చూడండి. మనకు నచ్చితే రచ్చబండ, తదితర పేజీల్లో లిమిటెడుగా దీన్ని వ్యవస్థాపితం చెయ్యించవచ్చు. పూర్తిస్థాయిలో ఈ ప్రాజెక్టును బయటికితెచ్చినప్పుడు అన్ని పేజీల చర్చలు ఈ కొత్త పద్ధతికి మారతాయి --వైజాసత్య (చర్చ) 10:05, 18 మార్చి 2015 (UTC)
- ఫ్లో చాలా బావుంది. కాకపోతే మనకు చర్చపేజీల్లో తేలిగ్గా మార్కప్ లాంగ్వేజ్ రాసుకోవడానికి పనికివచ్చే ఉన్నత, ప్రత్యేక అక్షరాలు, సహాయం, మూలాలు చేర్చండి వంటి ఉపకరణాలు లేవు. అవి లేకుంటే మార్కప్ కోడ్ లో రాసుకోలేమని కాదు కానీ ఎంతైనా అలవాటైన ప్రాణం కదా.--పవన్ సంతోష్ (చర్చ) 03:37, 19 మార్చి 2015 (UTC)
- పై ప్రశ్నకి సంబంధించిన చర్చ వికీపీడియా చర్చ:ఫ్లోలో జరుగుతోంది.--పవన్ సంతోష్ (చర్చ) 03:42, 19 మార్చి 2015 (UTC)
గౌతమీ గ్రంథాలయంలో నిన్న జరిగిన అవగాహనా కార్యక్రమంలో వికీ గురించి వివరిస్తూ వెతికితే ఏదైనా సమాచారం దొరుకుతుంది - అడగండి చూపిస్తాం అని చెప్పాం. కొందరు అడిగాక ఒక పెద్దాయన రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి గురించి అడిగారు. మాకు అనుమానమే - ఉండదు అని, అయినా లేకపోతే సృష్టించవచ్చు అని వెదికాం, ఆశ్చర్యంగా అది అన్నమయ్య గ్రంధాలయ జబితాలోని ఆయన రాసిన రెండు రచనలను చూపించింది. ఈ విధంగా నాకు గౌతమీ గ్రంథాలయ సిబ్బందికి జాబితా ఆల్‌లై చేయడం ద్వారా ఉండే ఉపయోగాలను చూపించే అవకాశం కలిగింది. ఈ వ్యాసాన్ని IP అడ్రస్‌తో అక్కడున్న వారితో మొదలుపెట్టించాం. అడిగిన పెద్దాయన ఎవరో గాని ఆయనకు - దానిని వెంటనే అభివృద్ది చేసిన వాడుకరి:Kvr.lohith గారికి కృతజ్ఞతలు...--విశ్వనాధ్ (చర్చ) 06:22, 19 మార్చి 2015 (UTC)
carchalu
మార్చుteviki lo vyasaala abhivruddhi, vyaasaala srushti kante anavasara(avasara) carchalake sabhyulu ekkuvagaa krushi cestunnaru.idena tewiki abhivruddhi? sorry to users who work hard in wikipedia articles.--117.204.45.109 15:03, 19 మార్చి 2015 (UTC)
- ఈ ప్రశ్నకు సమాధానమివ్వటం నా వ్యాసాలు వ్రాసే సమయానికి కోతపెడుతున్నది కావున సమాధానం ఇవ్వట్లేదు (ఉత్తినే..జోక్) నమస్కారం అజ్ఞాతవర్యా, ఈ విషయం నాకు బాగా అవగతమేనండి. ఎందుకంటే నేను ఎన్ని వందల గంటలు చర్చలకు సమాధానాలు వ్రాస్తూ వెచ్చించానో నాకే తెలియదు. కానీ నలుగురు కలిసి పనిచేస్తున్నప్పుడు చర్చలు తప్పవు మరి. మీరే ఆలోచించండి, మీకో ఆలోచన వచ్చింది, ఇక్కడ అజ్ఞాతంగా వ్రాశారు. ఎవరూ సమాధానం వ్రాయకపోతే ఏమనుకుంటారు? తెవికీలో ఇంతమంది ఉన్నా దండగ, నా గోడు ఒక్కరూ పట్టించుకోరూ అనుకుంటారు. అవునా? కాదా? హ్హిహ్హిహ్హి --వైజాసత్య (చర్చ) 17:16, 20 మార్చి 2015 (UTC)
- @వైజాసత్యచక్కగా సమాధానమిచ్చారు. అజ్ఞాత సభ్యుడు ఏదైనా వికీలో ఇతరులతో కలిసి పనిచేస్తే కదా చర్చల అవసరం తెలిసేది. --అర్జున (చర్చ) 06:52, 21 మార్చి 2015 (UTC)
కవి సమ్మేళనం
మార్చుఈ రోజు తెలుగువారికి ఉగాది పర్వదినం. తోటి సభ్యులందరికీ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగువారందరికీ నా మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెవికీ వాడుకరులకు ఒక అభ్యర్ధన. ఈరోజున చాలా ప్రదేశాలలో జరిగే ఉగాది కవి సమ్మేళనం గురించి, పంచాంగ శ్రవణం గురించిన వ్యాసాలు ప్రారంభించి అభివృద్ధి చేయగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:36, 21 మార్చి 2015 (UTC)
- రాజశేఖర్ గారూ ఉగాది శుభాకాంక్షలు. క్షమించాలి. నేను వీలుచిక్కినప్పుడు ప్రారంభించి కొంతవరకూ ప్రయత్నిస్తాను. కాకుంటే నా ప్రాజెక్టు చివరిరోజులు కావడంతో నేను నమ్మకంగా ఏమీ చెప్పలేకున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 09:32, 21 మార్చి 2015 (UTC)
- మొలకస్థాయిలో ప్రారంభించాను. అభివృద్ధి చేద్దాం. మీరెవరైనా నిన్న తీసిన ఫోటోలుంటే చేర్చండి.--పవన్ సంతోష్ (చర్చ) 02:47, 22 మార్చి 2015 (UTC)
సరదా సరదాగా
మార్చు
ఆవు చేలో పడితే ? ఒక ఆవు చేను (పొలం)లో పడితే అనే సంఘటనపై మన తెవికీ సభ్యులు ఎలా స్పందిస్తారో ఊహావ్యాఖ్యలు పొందుపర్చాను. ఇది కేవలం సరదా కోసమేనని ప్రత్యేకంగా ఎలాంటి వారిని ఉద్దేశించి, వ్యతిరేకించి పెట్టిన వ్యాఖ్యలు కావని గమనించగలరు. ఈ ఊహా సంఘటనపై సభ్యులు ఈ విధంగానే స్పందిస్తారని కాకుండా గత కొంత కాలంగా ఆయా సభ్యులు చేసిన వ్యాఖ్యలు గమనించి వారి ఆహాభావాలు మాత్రమే తీసుకోవడమైనది. చురుకుగా ఉన్న సభ్యులకు ఎవరి వాక్యనిర్మాణాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి ఇక్కడ సభ్యుల పేర్లు కూడా ఇవ్వబడలేదు. దీన్ని తేలిగ్గా తీసుకోగలరని మరోసారి విజ్ఞప్తి. ఇది రచ్చబండకు సంబంధం లేకున్నా సభ్యులందరి దృష్టిలో రావడానికి ఇక్కడ పెట్టాను. ఇక చదవండి --
|
- అబ్బా..హ్హాహ్హాహ్హా...హ్హిహ్హిహ్హి చంద్రకాంతుల వారు అందుకోండి వందవందనాలు. కొన్ని స్టైల్సు ఎవరివో అర్ధం కాకపోయినా, అర్ధమైనవి భాఘా నవ్వించాయి. వ్యంగ్యం ఇరగదీశారు సార్. అజ్ఞాతసభ్యుడొకాయన వాడుకరి పెట్టెలపై సెటైరు వేసినప్పిడు వచ్చిన నవ్వు..ఇదిగో మళ్ళీ ఇప్పుడొచ్చింది. --వైజాసత్య (చర్చ) 23:06, 25 మార్చి 2015 (UTC)
- :) :) చాలా చక్కగా పరిశీలించి రాసారు. రచ్చబండైనా పరవాలేదు, ఇంకాఇలాంటి పటాసులుంటే ఉంటే పేల్చేయండి--విశ్వనాధ్ (చర్చ) 01:47, 26 మార్చి 2015 (UTC)...
- అదరగొట్టేశారు. సర్. నా వరకూ నేను కనిపెట్టేశాను. నా వైఖరి ఇక్కడేగా పట్టేశారు. విశ్వనాథ్ గారిది నేను పనిచేస్తున్న తొలిరోజుల్లో అన్న వ్యాఖ్య, ఆవు మేసిన పటాలు, తెలుగినక్స్ అర్జున గారేమోననుకుంటున్నాను. ఆవును వెళ్ళగొట్టే విషయం నానుతున్న విషయమే^మనమందరమూ రెండు మూడుసార్లు కలిసి మాట్లాడుకుందాం అన్నది రెహ్మాన్ గారు, ఇది కేవలం ఆలోచన మాత్రమేనని, నిర్ణయాలు అందరి సమక్షంలో జరుగుతాయని గమనించమన్నది ప్రణయ్ రాజ్ గారే కావచ్చు, ప్రక్కచేనులో వారెలా పరిష్కరించుకున్నారో లింకులతో సహా వివరించి హిహ్హిహ్హి అని నవ్వింది వైజా సత్యగారే, మిగిలినవి నాకు తెలియట్లేదు కానీ ఐడియా, రాసినవిధానం హైలెట్. విజిల్సూ, క్లాప్స్ తో సహా అభినందనలు.--పవన్ సంతోష్ (చర్చ) 08:24, 26 మార్చి 2015 (UTC)
- :) :) చాలా చక్కగా పరిశీలించి రాసారు. రచ్చబండైనా పరవాలేదు, ఇంకాఇలాంటి పటాసులుంటే ఉంటే పేల్చేయండి--విశ్వనాధ్ (చర్చ) 01:47, 26 మార్చి 2015 (UTC)...
- అబ్బా..హ్హాహ్హాహ్హా...హ్హిహ్హిహ్హి చంద్రకాంతుల వారు అందుకోండి వందవందనాలు. కొన్ని స్టైల్సు ఎవరివో అర్ధం కాకపోయినా, అర్ధమైనవి భాఘా నవ్వించాయి. వ్యంగ్యం ఇరగదీశారు సార్. అజ్ఞాతసభ్యుడొకాయన వాడుకరి పెట్టెలపై సెటైరు వేసినప్పిడు వచ్చిన నవ్వు..ఇదిగో మళ్ళీ ఇప్పుడొచ్చింది. --వైజాసత్య (చర్చ) 23:06, 25 మార్చి 2015 (UTC)
- సభ్యుడు:C.Chandra Kanth Rao గారు చెప్పవలసిన సంగతి నొప్పించకుండా చెప్పే ప్రయత్నం బాగా చేశారు.:-) తెవికీ పరిణామక్రమంలో ప్రస్తుత స్థితినుండి మెరుగవటానికి పరిమాణం పై ధ్యాస తగ్గించి నాణ్యతపై ధ్యాసపెట్టాలి. అలాగే నిర్వహణ లో సభ్యులందరు పాల్గొనాలి. ఉదా:తొలగించవలసిన బొమ్మలు,వ్యాసాలు లాంటివి హెచ్చరికపెట్టెలవరకే వుండిపోతున్నవి. సభ్యులకు అవగాహన పెంచడానికి తోడ్పడాలి.--అర్జున (చర్చ) 10:12, 27 మార్చి 2015 (UTC)
- స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. పవన్ సంతోష్ గారూ, మీరిచ్చిన లింకు పనిచేయట్లేదు. మీరు ఊహించిన వాటిలో మూడు సరైనవి. నేను ఒక్కొక్కరికి సంబంధించి ఒక్క వ్యాఖ్య మాత్రమే పెట్టాను. ఐపీ అడ్రస్‌తో వ్రాసే సభ్యుడిది మాత్రం 2 సార్లు వచ్చిందనుకోండి. ఎందుకంటే అతను సభ్యునిగా మరియు ఐపీ అడ్రస్‌తోనూ చెప్పిన 2 వ్యాఖ్యలు పెట్టాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:07, 27 మార్చి 2015 (UTC)