మెదక్ శాసనసభ నియోజకవర్గం
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో మెదక్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]
మెదక్ | |
---|---|
తెలంగాణ శాసనసభలో నియోజకవర్గంNo. 34 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ |
లోకసభ నియోజకవర్గం | మెదక్ లోక్‌సభ నియోజకవర్గం |
ఏర్పాటు తేదీ | 1957 |
మొత్తం ఓటర్లు | 1,99,553 |
రిజర్వేషన్ | జనరల్ |
శాసనసభ సభ్యుడు | |
2వ తెలంగాణ శాసనసభ | |
ప్రస్తుతం | |
పార్టీ | కాంగ్రెస్ |
ఎన్నికైన సంవత్సరం | 2023 |
అంతకుముందు | పద్మా దేవేందర్ రెడ్డి |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చు- మెదక్
- పాపన్నపేట
- రామాయంపేట
- దుబ్బాక
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
- [2]
సంవత్సరం | గెలుపొందిన సభ్యుడు | పార్టీ | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ |
---|---|---|---|---|
1952 | వెంకటేశ్వరరావు | కాంగ్రెస్ పార్టీ | కేవల్ కిషన్‌రావు | సి.పి.ఐ |
1957 | వెంకటేశ్వరరావు | కాంగ్రెస్ పార్టీ | సోమలింగం | స్వతంత్ర అభ్యర్థి |
1962 | కేవల్ ఆనందాదేవి | సి.పి.ఐ | షామక్కగారి కొండల్‌రెడ్డి | స్వతంత్ర అభ్యర్థి |
1967 | రామచంద్రారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | కె.సంగమేశ్వర్ రెడ్డి | స్వతంత్ర అభ్యర్థి |
1972 | కె. రామచంద్రరావు | స్వతంత్ర అభ్యర్థి | దేవేందర్ | కాంగ్రెస్ పార్టీ |
1978 | ఎస్.లక్ష్మారెడ్డి | ఇందిరా కాంగ్రెస్ | కె. రామచంద్రరావు | కాంగ్రెస్ పార్టీ |
1983 | కె. రామచంద్రరావు | తెలుగుదేశం | ఎస్.లక్ష్మారెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
1985 | కె. రామచంద్రరావు | తెలుగుదేశం | ఎం.ఎన్.లక్ష్మీనారాయణ | కాంగ్రెస్ పార్టీ |
1989 | పట్లోళ్ల నారాయణ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | కె. రామచంద్రరావు | తెలుగుదేశం |
1994 | కె. రామచంద్రరావు | తెలుగుదేశం పార్టీ | పట్లోళ్ల నారాయణ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
1999 | కె. రామచంద్రరావు | తెలుగుదేశం | పి.జె.విఠల్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2002 | కరణం ఉమాదేవి | తెలుగుదేశం పార్టీ | పి.శశిధర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2004 | పి.శశిధర్ రెడ్డి | జనతా పార్టీ | కె.ఉమాదేవి | తెలుగుదేశం పార్టీ |
2009 | మైనంపల్లి హన్మంతరావు | తెలుగుదేశం పార్టీ | పి.శశిధర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2014 | పద్మా దేవేందర్ రెడ్డి | తె.రా.స | విజయశాంతి | కాంగ్రెస్ పార్టీ |
2018 | పద్మా దేవేందర్ రెడ్డి | తె.రా.స | అమ్మారెడ్డిగారి ఉపేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2023[3] | మైనంపల్లి రోహిత్ | కాంగ్రెస్ పార్టీ | పద్మా దేవేందర్ రెడ్డి | భారత్ రాష్ట్ర సమితి |
2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుంచి జనతా పార్టీకి చెందిన పట్లోళ్ళ శశిధర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం ఉమాదేవిపై 4449 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. శశిధర్ రెడ్డికి 43369 ఓట్లు రాగా, ఉమాదేవికి 38920 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎం.హన్మంతరావు పోటీ చేయగా [4] కాంగ్రెస్ పార్టీ నుండి టి.శిశిధర్ రెడ్డి పోటీపడ్డాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున బట్టి జగపతి, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై కె.సౌజన్య పోటీపడ్డారు.[5]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (8 November 2018). "మెతుకు సీమ ఘన చరిత్ర". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
- ↑ EENADU (19 April 2024). "పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా". Archived from the original on 19 April 2024. Retrieved 19 April 2024.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009