మేకపాటి విక్రమ్ రెడ్డి

మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022లో జరిగిన ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 82,742 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 జూన్ 2022 - ప్రస్తుతం
ముందు మేకపాటి గౌతమ్ రెడ్డి
నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1975
బ్రాహ్మణపల్లి, మర్రిపాడు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి
బంధువులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (బాబాయి), మేకపాటి గౌతమ్ రెడ్డి (సోదరుడు)[1]

జననం, విద్యాభాస్యం

మార్చు

మేకపాటి విక్రమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి దంపతులకు జన్మించాడు. ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యాభ్యాసం, ఐఐటీ చెన్నైలో బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్ చేసి అమెరికాలో స్పెషలైజ్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో ఎం.ఎస్ పూర్తి చేశాడు. ఆయన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత విక్రమ్ రెడ్డి తమ సొంత అంతర్జాతీయ సంస్థ అయిన 'కేఎంసీ'కి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

మేకపాటి విక్రమ్ రెడ్డి తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి మరణాంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2022లో జరగనున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా 2022 జూన్ 1న బీ ఫారం అందుకొని[3] జూన్ 2న వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశాడు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,742 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[4]

మూలాలు

మార్చు
  1. Eenadu (28 April 2022). "అన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్‌రెడ్డి". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  2. Eenadu (26 June 2022). "ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  3. HMTV (1 June 2022). "మేకపాటి విక్రమ్ రెడ్డికి బీ ఫారం అందజేసిన సీఎం జగన్". Retrieved 7 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. The News Minute (26 June 2022). "Atmakur bye-poll: YSRCP retains seat by huge majority" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.