మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసింగ్ ఓటింగ్కు పాల్పడ్డాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.[1]

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 - 2024 ఫిబ్రవరి 26
నియోజకవర్గం ఉదయగిరి

వ్యక్తిగత వివరాలు

జననం 1952
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకటసుబ్బమ్మ, వెంకురెడ్డి
జీవిత భాగస్వామి తులశమ్మ
బంధువులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి (అన్నయ్య), మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి (సోదరుడి కుమారులు)
సంతానం ఒక కుమార్తె
నివాసం ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 1952లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా , మర్రిపాడు మండలం , బ్రాహ్మణపల్లి గ్రామంలో వెంకటసుబ్బమ్మ, వెంకురెడ్డి దంపతులకు జన్మించాడు. అతను కావలిలోని జవహర్ భారతి కళాశాలలో 1968లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.[2][3]

రాజకీయ ప్రస్థానం

మార్చు

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బూదవాడ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలై, 2004, 2009లలో ఎమ్మెల్యేగా వరుసగా గెలిచాడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనంతరం వైఎస్సార్‌సీపీ లో చేరాడు.

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 23 మార్చి 2023న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌ వేశారని ప్రాథమిక దర్యాప్తు తరువాత ఆయనను 24 మార్చి 2023న వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.[4] ఆయన డిసెంబర్ 15న తెలుగుదేశం పార్టీలో చేరాడు.[5]

చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని విడి టీడిపికి మద్దతుగా ఉండడంతో వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు.[6][7]

పోటీ చేసిన నియోజకవర్గం

మార్చు
సంవత్సరం నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు ఫలితం
2019 ఉదయగిరి (జనరల్) మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్‌సీపీ 106487 బొల్లినేని వెంకట రామారావు తెలుగుదేశం పార్టీ 69959 గెలుపు
2014 ఉదయగిరి [8] (జనరల్) బొల్లినేని వెంకట రామారావు తెలుగుదేశం పార్టీ 85873 మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్‌సీపీ 82251 ఓటమి
2012 ఉదయగిరి (ఉపఎన్నిక) (జనరల్) మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్‌సీపీ బొల్లినేని వెంకట రామారావు తెలుగుదేశం పార్టీ గెలుపు
2009 ఉదయగిరి (జనరల్) మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 69352 కంభం విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ 55870 గెలుపు
2004 ఉదయగిరి (జనరల్) మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 55076 కంభం విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ 32001 గెలుపు
1999 ఉదయగిరి (జనరల్) కంభం విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ 42534 మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 39220 ఓటమి

మూలాలు

మార్చు
  1. Sakshi (2019). "Udayagiri Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
  2. Sakshi (16 March 2019). "రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
  3. Sakshi (18 March 2019). "నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  4. Andhra Jyothy (24 March 2023). "ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
  5. Andhrajyothy (15 December 2023). "టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి". Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.
  6. NT News (27 February 2024). "ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  7. Eenadu (27 February 2024). "8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  8. Sakshi (24 March 2019). "'గిరి'రాజు ఎవరో...!". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.