మేఘ సందేశం (సినిమా)

మేఘసందేశం 1982 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒక కళాత్మక చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించారు. రమేష్ నాయుడు స్వరపరిచిన ఈ చిత్రంలో పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి. సుశీల, కె. జె. ఏసుదాసు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని విభాగాల్లో నాలుగు పురస్కారాలు ఉందుకుంది. రాష్ట్ర స్థాయిలో బంగారు నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకుంది.

మేఘ సందేశం
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం దాసరి పద్మ
కథ దాసరి నారాయణ రావు
చిత్రానువాదం దాసరి నారాయణ రావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
జయప్రద ,
జయసుధ,
కొంగర జగ్గయ్య
సంగీతం రమేష్ నాయుడు
సంభాషణలు దాసరి నారాయణ రావు
ఛాయాగ్రహణం పి ఎన్ సెల్వరాజు
నిర్మాణ సంస్థ శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియేషన్స్
పంపిణీ తారక ప్రభు ఫిలిమ్స్
విడుదల తేదీ 24 సెప్టెంబరు 1982 (1982-09-24)
నిడివి 151 ని
దేశం భారత్
భాష తెలుగు

రవీంద్రబాబు ప్రముఖ కవి. కళలు, ప్రకృతి పట్ల ఆరాధనా భావం కలవాడు. ఈయన పార్వతి అనే సాధారణ యువతిని వివాహం చేసుకుంటాడు. పార్వతి సోదరుడైన జగన్నాథంకి తన చెల్లెలంటే ప్రాణం. రవీంద్రబాబు పార్వతిని తన భార్యగా అభిమానించినా తన కళకు మాత్రం ఆమె నుంచి స్ఫూర్తి పొందలేకపోతాడు. వీరిద్దరికీ మనస్తత్వాలు మాత్రం పెద్దగా కలవవు. అప్పుడే రవీంద్రబాబుకు పద్మ అనే కళాకారిణి పరిచయం అవుతుంది. ఆమెలో నృత్య కౌశలం, ఆమె పలికించే భావాలు, ఆహార్యం మొదలైనవి రవీంద్రబాబులోని కవికి మంచి ప్రేరణ కలిగిస్తాయి. దాంతో అతను పద్మను ఆరాధించడం మొదలుపెడతాడు. తన భర్త వేశ్యావృత్తికి చెందిన పద్మతో పరిచయం తెలుసుకున్న పార్వతి బాధపడుతుంది. జగన్నాథం ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పద్మతో తన చెల్లెలు కుటుంబం జోలికి రావద్దని హెచ్చరిస్తాడు. దాంతో రవీంద్రబాబు తీవ్రంగా బాధపడతాడు. పద్మ ఆలోచనల్లోనే కాలం గడుపుతూ బయట తిరుగుతుంటాడు. చివర్లో ఒకసారి తన భార్యను కలుసుకుని మరణిస్తాడు.

తారాగణం

మార్చు

సంగీతం.

మార్చు

రమేష్ నాయుడు.

క్రమసంఖ్య పేరుగీత రచననేపథ్యగానం నిడివి
1. "ఆకాశ దేశాన"  వేటూరి సుందర్రామ్మూర్తియేసుదాసు  
2. "ఆకులో ఆకునై పూవులో పూవునై"  దేవులపల్లి కృష్ణశాస్త్రిపి.సుశీల  
3. "పాడనా వాణి కళ్యాణిగా గానం -"  వేటూరి సుందర్రామ్మూర్తిమంగళంపల్లి బాలమురళీకృష్ణ  
4. "ప్రియే చారుశీలె"  జయదేవయేసుదాసు  
5. "ముందు తెలిసెనా, ప్రభూ"  దేవులపల్లి కృష్ణశాస్త్రిపి.సుశీల  
6. "నవరస సుమ మాలిక" (పద్యం)వేటూరి సుందర్రామ్మూర్తియేసుదాసు  
7. "నిన్నటిదాకా శిలనైనా"  వేటూరి సుందర్రామ్మూర్తిపి.సుశీల  
8. "రాధికా కృష్ణా"  జయదేవయేసుదాసు  
9. "శీత వేళ రానీయకు రానీయకు"  దేవులపల్లి కృష్ణశాస్త్రిపి.సుశీల, యేసుదాసు  
10. "సిగలో అవి విరులో"  దేవులపల్లి కృష్ణశాస్త్రి   

బహుమతులు

మార్చు
సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1983 దాసరి నారాయణ రావు జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు చిత్రం గెలుపు
రమేష్ నాయుడు జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీతదర్శకులు గెలుపు
పి సుశీల జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయని గెలుపు
కె జె యేసుదాస్ జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయకుడు గెలుపు
దాసరి నారాయణ రావు నంది ఉత్తమ చిత్రాలు - స్వర్ణ నంది గెలుపు
దాసరి నారాయణ రావు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రం గెలుపు

పురస్కారాలు

మార్చు

విశేషాలు

మార్చు