మేడిపల్లి సత్యం

మేడిపల్లి సత్యం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు.[2] మేడిపల్లి సత్యం ఉస్మానియా యూనివర్సిటీ నుండి రాజకీయాల్లోకి వచ్చి 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఉస్మానియా యూనివర్సిటీ నుండి 2023లో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఏకైక విద్యార్థి నాయకుడు.[3]

మేడిపల్లి సత్యం
మేడిపల్లి సత్యం


ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
03 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు సుంకే ర‌విశంక‌ర్
నియోజకవర్గం చొప్పదండి

వ్యక్తిగత వివరాలు

జననం 25 జూన్ 1980
కోరుట్లపెట గ్రామం, యల్లారెడ్డిపేట్ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు మేడిపల్లి భూపాల్
జీవిత భాగస్వామి రూపా దేవి
సంతానం 2
నివాసం ఇంటి.నెం 4-153/11, మధురానగర్, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ భారతదేశం[1]
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

మేడిపల్లి సత్యం 1979లోతెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా[4], యల్లారెడ్డిపేట్ మండలం, కోరుట్లపెట గ్రామంలో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు బొప్పాపుర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో, 1999లో కామారెడ్డిలోని జి.వీ.ఎస్.జూనియర్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్, 2002లో డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి బీఏ, ఉస్మానియా యూనివర్సిటీ నుండి 2005లో ఎం.ఏ.(పొలిటికల్ సైన్స్) 2012లో పొలిటికల్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

మేడిపల్లి సత్యం విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తితో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి, కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఆయన 31 అక్టోబర్ 2017లో రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి[5] 2018లో పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడయ్యాడు.[6]

మేడిపల్లి 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి సుంకే ర‌విశంక‌ర్ చేతిలో ఓడిపోయాడు. ఆయన 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్‌పై 37,439 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై[7], 2023 డిసెంబర్ 9న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[8]

రాజకీయ పదవులు మార్చు

మూలాలు మార్చు

  1. "Election Commission of India - Medipally Satyam 2023 Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 27 December 2023. Retrieved 27 December 2023.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. Disha (5 December 2023). "ఓయూ నుంచి మరో ఎమ్మెల్యే.. చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం విజయం". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  4. Sakshi (4 December 2023). "చొప్పదండి ఎమ్మెల్యేగా సిరిసిల్ల జిల్లా వాసి". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  5. Sakshi (31 October 2017). "కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న రేవంత్‌ రెడ్డి". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  6. Deccan Chronicle (14 May 2022). "Farmers kept in police station before land survey, alleges Congress". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  7. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అధ్యక్షా..!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  8. Namaste Telangana (10 December 2023). ".. అనే నేను శాసనసభ సభ్యుడిగా!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.