సుంకే ర‌విశంక‌ర్

సుంకే ర‌విశంక‌ర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున చొప్పదండి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]

సుంకే రవి శంకర్
సుంకే ర‌విశంక‌ర్


పదవీ కాలం
2018 - 03 డిసెంబర్ 2023
ముందు బొడిగె శోభ
తరువాత మేడిపల్లి సత్యం
నియోజకవర్గం చొప్పదండి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970, జూన్ 30
బూరుగుపల్లి, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రాఘవులు, రాజమ్మ
జీవిత భాగస్వామి దీవన
సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు

జననం, విద్య

మార్చు

రవిశంకర్ 1970, జూన్ 30న రాఘవులు, రాజమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, గంగాధర మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో జన్మించాడు.[3] 1986లో పదవ తరగతి పూర్తిచేసి, బిఏ వరకు చదువుకున్నాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి, తరువాతికాలంలో విద్యాసంస్థలు స్థాపించాడు.[4] కరీంనగర్ జిల్లా ప్రైవేట్ కళాశాలల అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

రవిశంకర్ కు దీవనతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.

రాజకీయ విశేషాలు

మార్చు

2001 తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం ప్రారంభించారు. 2009లో ప్రజా రాజ్యం పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రవిశంకర్, 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి సొంత ఇంటికి తిరిగి వచ్చాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపెల్లి సత్యంపై 42,127 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. "Sunke Ravi Shankar | MLA | Choppadandi | Karimnagar | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-29. Retrieved 2021-08-25.
  2. "Ravi Shankar Sunke(TRS):Constituency- CHOPPADANDI (SC)(KARIMNAGAR) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-08-25.
  3. "Member's Profile – Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-25.
  4. Telugu, TV9 (2021-02-07). "MLA Sunke Ravi Shankar: భవిష్యత్‌ అంతా విద్యార్థులదే అని టీచర్‌ అవతారమెత్తిన ఎమ్మెల్యే సుంకెరవిశంకర్‌..." TV9 Telugu. Retrieved 2021-08-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Choppadandi Assembly Election Result 2018: TRS' Ravi Shankar Sunke wins by margin of 42,127 votes". www.timesnownews.com. Retrieved 2021-08-25.
  6. "Choppadandi Election Result 2018 Live Updates: Ravi Shankar Sunke of TRS Wins". News18 (in ఇంగ్లీష్). 11 December 2018. Retrieved 2021-08-25.