మేదరమెట్ల

ఆంధ్రప్రదేశ్ కొరిశపాడు మండలంలోని గ్రామం


దీనితో పోలిన పేరుగల తెలంగాణా రాష్ట్రంలోని మరియొక గ్రామం కొరకు, మేదరమట్ల చూడండి.

గ్రామం
పటం
Coordinates: 15°43′00″N 80°01′00″E / 15.716667°N 80.016667°E / 15.716667; 80.016667
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంకొరిశపాడు మండలం
Area
 • మొత్తం16 km2 (6 sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08593 Edit this on Wikidata )
పిన్‌కోడ్523212 Edit this on Wikidata

మేదరమెట్ల బాపట్ల జిల్లా కొరిశపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చరిత్ర మార్చు

మేదర వృత్తి చేసేవారు తొలిగా గ్రామంలో ఆవాసం ఏర్పరుచుకోవడం వల్ల మేదరమెట్ల గ్రామానికి ఆ పేరు ఏర్పడిందని గ్రామనామాలు అధ్యయనం చేసిన బాలగంగాధరరావు పేర్కొన్నాడు.[1] ఈ గ్రామాభివృద్ధికి 1949 నుండి 1986 వరకూ యర్రం కోటిరెడ్డి, మన్నే సీతారామయ్య తదితరులు కృషిచేశారు. 1986 నుండి 2001 వరకూ, 15 ఏళ్ళపాటు సమస్యాతకంగా ముద్ర పడిన తదుపరి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సిమెంటురోడ్లు ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్ ఏర్పడటంతో భూముల ధరలు పెరిగినవి. భారీ పరిశ్రమలు ఏర్పడటంతో ఉపాధి అవకాశాలు మెరుగైనవి.[2] ఈ గ్రామ సమీపంలో తమ్మవరం వెళ్ళే దారిలో మిరపకాయలను వినియోగించి నూనె తీసే ఒక కర్మాగారం 2013లో ఏర్పాటుచేసారు. ఈ కర్మాగారంలో సుమారు 600 మందికి పైగా పనిచేస్తున్నారు.

భౌగోళికం మార్చు

 సమీప గ్రామాలు

కొరిశపాడు 4 కి.మీ, కొత్తకోట 4 కి.మీ, బొడ్డువాని పాలెం 5 కి.మీ, రావినూతల 5 కి.మీ, కుర్రావానిపాలెం 7 కి.మీ.

గ్రామ పంచాయతీ మార్చు

  • ఈ గ్రామ మేజర్ పంచాయతీ 1959 జూలై 26 న ఏర్పడింది.[3]
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో పేరం నాగలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగామన్నే దుర్గారావు ఎన్నికైనాడు.[4]

విద్యా సౌకర్యాలు మార్చు

ఇక్కడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, శారద డిగ్రీ కళాశాల ఉన్నాయి. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు, హ్యాండ్ బాల్ పోటీలలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో తమ సత్తా చాటుచున్నారు [5] ఈ పాఠశాల విద్యార్థి పి.సాయికిరణ్, స్కూల్ గేంస్ ఫెడెరేషన్ ఆధ్వర్యంలో 2015, నవంబరు-14 నుండి 17 వరకు, పశ్చిమగోదావరి జిల్లాలోని నారాయణపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-17 క్రికెట్ పోటీలలో తన ప్రతిభ చాటి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు.[6]

మౌలిక వసతులు మార్చు

రవాణ సౌకర్యాలు మార్చు

జాతీయ రహదారి 16, నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి లకు కూడలి ఈ గ్రామం దగ్గరలోనే ఉంది.

రక్షిత మంచినీటి పథకం మార్చు

స్థానిక తమ్మవరం రహదారిలో నాలుగున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పథకానికి, తమ్మవరం ద్వారా, గుండ్లకమ్మ జలాశయం నీరు వచ్చుచున్నది. ఈ నీటిని ఫిల్టర్లద్వారా శుద్ధిచేసి, చుట్టుప్రక్కల 22 గ్రామాలకు పంపవలసియుండగా, ప్రస్తుతం పది గ్రామాలకే ఈ శుద్ధినీరు పంపించున్నారు[7]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మార్చు

శ్రీ యర్రం చిన్న పోలిరెడ్డి గారి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం కలదు
  • జయంతి నర్సింగ్ హోమ్
  • చరణ్ నర్సింగ్ హోమ్
  • డా.పున్నయ్య గారి హాస్పిటల్
  • చంద్ర హాస్పిటల్స్

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

 
గ్రామంలోని రామాలయ చిత్రం.
  • శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం:గ్రామంలోని అద్దంకిరోడ్డులోని ఈ ఆలయంలో, వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించెదరు.
  • శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం
  • శ్రీ షిర్డీ సాయి మందిరం
  • శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం (భద్రాచలం నుంచి తెచ్చిన తలాంబ్రాలతో కళ్యాణం జరుగుతుంది)
  • అభయ ఆంజనేయ స్వామి వారి వెలిసిన ఆలయం

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

మూలాలు మార్చు

  1. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక". Archived from the original on 2014-09-02. Retrieved 2014-03-16.
  2. ఈనాడు ప్రకాశం; జులై-20,2013. 8వపేజీ.
  3. ఈనాడు ప్రకాశం/అద్దంకి, సెప్టెంబరు 26, 2013.
  4. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, సెప్టెంబరు-10; 2వపేజీ.
  5. ఈనాడు ప్రకాశం; 2014, డిసెంబరు-21; 9వపేజీ
  6. ఈనాడు ప్రకాశం; 2015, నవంబరు-26; 15వపేజీ.
  7. .ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, జూన్-15; 1వపేజీ.

వెలుపలి లంకెలు మార్చు