మాసెచూసెట్స్

(మేసచూసెట్స్ నుండి దారిమార్పు చెందింది)

మాసెచూసెట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని 50 రాష్ట్రాలలో ఒకటి. ఇది ఈశాన్య అమెరికాలోని న్యూ ఇంగ్లాండు ప్రాంతంలోగల రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరాన న్యూ హాంప్షైర్, వెర్మాంట్ రాష్ట్రాలు, పశ్చిమాన న్యూ యార్క్ రాష్ట్రం, దక్షిణాన రోడ్ ఐలాండ్, కనెటికెట్ రాష్ట్రాలు ఉన్నాయి. మాసెచూసెట్స్ రాష్ట్ర రాజధాని, అత్యధిక జనాభా కలిగిన నగరం బోస్టన్. బోస్టన్, దగ్గరి కొన్ని నగరాలను కలిపి గ్రేటర్ బోస్టన్ గా పిలుస్తారు. మాసెచూసెట్స్ రాష్ట్రం లోని 80% మంది ఈ గ్రేటర్ బోస్టన్ లో నివసిస్తున్నారు.[4] అమెరికా జాతీయ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలలో మాసెచూసెట్స్ రాష్ట్రానికి ఒక విశిష్ట స్థానం ఉంది.

మాసెచూసెట్స్
మాసెచూసెట్స్ ను చూపిస్తూ అమెరికా సంయుక్త రాష్ట్రాల పటం
మాసెచూసెట్స్ ను చూపిస్తూ అమెరికా సంయుక్త రాష్ట్రాల పటం
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
బోస్టన్
 - 42.36 ఉ 71.05 ప
పెద్ద నగరము బోస్టన్
జనాభా (2015)
 - జనసాంద్రత
67,94,422 [1]
 - 840/చ.మై
విస్తీర్ణము
 
10,565 [2] చ.మై  
సమయ ప్రాంతం అమెరికా తూర్పు సమయం (ET) సా.స.స -5/-4
అధికార బాష (లు) ఆంగ్లము[3]
పొడిపదం (ISO) US-MA
వెబ్‌సైటు: www.mass.gov

మాసెచూసెట్స్ రాజముద్ర

మొట్టమొదటగా న్యూ ఇంగ్లండ్కి మేఫ్లవర్ నౌకలో వచ్చిన ఐరోపా వలసవాసులు మాసెచూసెట్స్ లోని ప్లిమత్ నగరంలో వారి నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సా.శ. 1692 అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సేలం మంత్రగత్తె విచారణలు ఈ రాష్ట్రంలోనే జరిగాయి. ఈ విచారణల్లో మంత్రగత్తెలుగా అనుమానించబడిన మహిళలను సజీవ దహనం చేసేవారు.[5] 19వ శతాబ్ది చివరిలో బేస్ బాల్, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్ని మాసెచూసెట్స్ లో కనిపెట్టడం జరిగింది.[6][7] ప్రపంచం లోనే ప్రసిద్ధి గాంచిన హార్వర్డ్, మాసెచూసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.[8][9][10] అమెరికాలోని అత్యంత పలుకుబడి కలిగిన రాజకీయ వంశాలైన ఆడమ్స్, కెన్నడీ వంశాల పునాదులు మాసెచూసెట్స్ లోనే మొదలయ్యాయి. 2004 లో స్వలింగ వివాహాలకు న్యాయస్థాన మద్దతునిచ్చిన మొట్టమొదటి అమెరికా రాష్ట్రం మాసెచూసెట్స్.[11]

మూలాలు

మార్చు
  1. "Table 1. Annual Estimates of the Resident Population for the United States, Regions, States, and Puerto Rico: April 1, 2010 to July 1, 2015". December 23, 2015. Archived from the original (CSV) on 2015-12-23. Retrieved January 24, 2016.
  2. "Massachusetts". Archived from the original on 2015-08-21. Retrieved June 10, 2015.
  3. Schwarz, Hunter (August 12, 2014). "States where English is the official language". Retrieved December 29, 2014.
  4. Douglas, Craig. "Greater Boston gains population, remains 10th-largest region in U.S." bizjournals.com. Retrieved April 21, 2015.
  5. "The 1692 Salem Witch Trials". Salem Witch Trials Museum. Retrieved April 21, 2015.
  6. "Springfield College: The Birthplace of Basketball". Springfieldcollege.edu. Archived from the original on 2015-05-04. Retrieved April 21, 2015.
  7. "The International Volleyball Hall of Fame". Volleyball.org. Retrieved April 21, 2015.
  8. "History of Harvard University". Retrieved April 21, 2015.
  9. [1] Times Higher Education. Accessed December 3, 2016.
  10. [2] Accessed January 27th, 2017.
  11. "Massachusetts court strikes down ban on same-sex marriage". Reuters. November 18, 2003. Retrieved April 21, 2015.