మైకెల్ హోల్డింగ్

1954, ఫిబ్రవరి 16న జన్మిమ్చిన మైకెల్ హోల్డింగ్ (Michael Anthony Holding) వెస్ట్‌ఇండీస్కు చెందిన ప్రముఖ మజీ క్రికెట్ క్రీడాకారుడు. భయంకరమఇన బౌలింగ్ తో బ్యాట్స్‌మెన్‌లను గడగడలాడించేవాడు. అతని ఎత్తుకు తగ్గట్లు (6' 3 ½") అతని రనప్ (బౌలింగ్ వేసే ముందు పరుగెత్తే దూరం) కూడా చాలా పొడవు. అతనితో పాటు భయంకర బౌలర్లు జోయెల్ గార్నర్, ఆండీ రోబర్ట్స్, మాల్కం మార్షల్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టేవారు. 1980 దశాబ్దంలో వెస్టీండీస్ ప్రపంచ క్రికెట్ లో ఉన్నత దశలో నిల్వడానికింf వీరందరి కృషి కారణం.

మైకెల్ హోల్డింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మైకెల్ ఆంథోనీ హోల్డింగ్
పుట్టిన తేదీ (1954-02-16) 1954 ఫిబ్రవరి 16 (వయసు 70)
కింగ్‌స్టన్, జమైకా
మారుపేరువిస్పరింగ్ డెత్,[1] మైకీ
ఎత్తు192 cమీ. (6 అ. 4 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm fast
పాత్రBowler
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 153)1975 నవంబరు 28 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1987 ఫిబ్రవరి 24 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 18)1976 ఆగస్టు 26 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1987 జనవరి 30 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1973–1989Jamaica
1981Lancashire
1982/83Tasmania
1983–1989Derbyshire
1987/88Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 60 102 222 249
చేసిన పరుగులు 910 282 3,600 1,575
బ్యాటింగు సగటు 13.78 9.09 15.00 12.30
100లు/50లు 0/6 0/2 0/14 0/7
అత్యుత్తమ స్కోరు 73 64 80 69
వేసిన బంతులు 12,680 5,473 38,877 12,662
వికెట్లు 249 142 778 343
బౌలింగు సగటు 23.68 21.36 23.43 20.62
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 13 1 39 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 0 5 0
అత్యుత్తమ బౌలింగు 8/92 5/26 8/92 8/21
క్యాచ్‌లు/స్టంపింగులు 22/– 30/– 125/– 81/–
మూలం: CricInfo, 2009 మే 24

టెస్ట్ క్రికెట్‌లో 60 మ్యాచ్‌లు ఆడి 23.68 సగటుతో 249 వికెట్లు సాధించాడు. ఇందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 13 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను 2 సార్లు సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 92 పరుగులకు 8 వికెట్లు. టెస్టులలో 36 సిక్సర్లు కొట్టి 1000 పరుగుల లోపు పరుగులు చేసిన వారిలో అత్యధిక సిక్సర్లు సాధిమ్చిన వాడిగా రికార్డు సృష్టించాడు.

వన్డే క్రికెట్‌లో 102 మ్యాచ్‌లు ఆడి 142 వికెట్లను సాధించాడు. వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 26 పరుగులకు 5 వికెట్లు. 1979, 1983 లలో ప్రపంచ కప్ క్రికెట్ లో పాల్గొన్నాడు.

ప్రస్తుతం హోల్డింగ్ క్రికెట్ కామెంటేటర్ గా విధులను నిర్వహిస్తున్నాడు.

బయటి లింకులు

మార్చు
  1. "Michael Holding 'Whispering Death' – Athlete Nicknames". Archived from the original on 2021-10-25. Retrieved 2023-07-30.