మైలార్‌గడ్డ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.
మైలార్‌గడ్డ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] సికింద్రాబాదుకు శివారు ప్రాంతంగా ఉంది. సికింద్రాబాద్ స్టేషను నుండి అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ మైలార్‌గడ్డ, మధ్యతరగతి ప్రజల నివాసప్రాంతంగా ఉంది.[2]
మైలార్‌గడ్డ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°25′40″N 78°30′53″E / 17.4277°N 78.5148°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 061 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు |
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో చిలకలగూడ, పద్మారావు నగర్, సీతాఫల్‌మండి, నామాలగుండు, డేటా కాలనీ, కేశవ్ నగర్ కాలనీ, వాకర్ టౌన్, బాబన్ బస్తీ, అనురాధ రెసిడెన్సీ, ఇందిరా నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మైలార్‌గడ్డ మీదుగా సికింద్రాబాద్, కోఠి, చార్మినార్, లంగర్‌హౌస్, ఇసిఐఎల్ బస్ స్టేషను వంటి ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[4] ఇక్కడికి సమీపంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషను, సీతాఫల్‌మండి రైల్వే స్టేషనులు ఉన్నాయి.[5]
ప్రార్థనా స్థలాలు
మార్చు- సాయిబాబా దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- అయ్యప్ప దేవాలయం
- శ్రీ కనకదుర్గ దేవాలయం
- మసీదు-ఎ-అక్సా
- మసీదు ఇహ్ అబూబకర్
- జామియా మసీదు
విద్యాసంస్థలు
మార్చు- రైల్వే డిగ్రీ కళాశాల
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్
- సిట్రస్ ఏవియేషన్
- ఎంఎస్ క్రియేటివ్ స్కూల్
- ఓం సాయినికేతన్ స్కూల్
- అమరావతి గ్రామర్ స్కూల్
- జాన్సన్ గ్రామర్ స్కూల్
మూలాలు
మార్చు- ↑ "Mylargadda Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-29.
- ↑ "Mylarguda Main Road, Mylargadda, Padmarao Nagar, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-29.
- ↑ "Secunderabad Jn Railway Station (SC) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com. Retrieved 2021-01-29.