నామాలగుండు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. 1965 లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థచే ఆమోదించబడిన మొట్టమొదటి నివాస ప్రాంతాల్లో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిలకలగూడ, సీతాఫల్‌మండి, వారసిగూడ, మైలార్‌గడ్డ మొదలైన ప్రాంతాలు నామాలగుండుకు సమీప ప్రాంతాలుగా ఉన్నాయి.

నామాలగుండు
సమీప ప్రాంతాలు
నామాలగుండు is located in Telangana
నామాలగుండు
నామాలగుండు
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
నామాలగుండు is located in India
నామాలగుండు
నామాలగుండు
నామాలగుండు (India)
Coordinates: 17°25′29″N 78°30′49″E / 17.4247°N 78.5136°E / 17.4247; 78.5136
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500061
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

చరిత్ర

మార్చు

ఈ ప్రాంతంలో రెండు పెద్ద గుండ్లు ఉన్నాయి. ఒకగుండు చిన్న కొండ పైన ఉండగా, రెండవది సీతాఫల్‌మండి నుండి మైలార్ గడ్డ వైపు వెళ్ళే రోడ్డులో ఉంది. మొదటిగుండు ప్రస్తుతమున్న హనుమంతుని ఆలయం వెనుక ఉండేది, కానీ నివాస గృహాల నిర్మాణాలకొరకు అది తీసివేయబడింది. ప్రస్తుతం కళ్యాణ వెంకటేశ్వర ఆలయం ఉన్న ప్రాంతంలో రెండవ గుండు ఉండేది. ఈ గుండ్లపై భారీగా మూడు నిలువు గీతలు నామాల మాదిరిగా ఉండడంవల్ల వీటిని నామాలగుండ్లు అని పిలిచేవారు. అలా ఈ ప్రాంతానికి నామాలగుండు అని పేరు వచ్చింది.

రవాణా వ్యవస్థ

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నామాలగుండు మీదుగా సికింద్రాబాద్, కోఠి, దిల్‍సుఖ్‍నగర్ వంటి వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. సమీపంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషను, సీతాఫల్‌మండి రైల్వే స్టేషనులు ఉన్నాయి.[1]

ఇతర వివరాలు

మార్చు

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నామాలగుండులో నైట్ షెల్టరును ఏర్పాటుచేయడం జరిగింది. ప్రయాణికులకు రాత్రిపూట ఆశ్రయం కలిపించడంతోపాటు నామమాత్ర రుసుముపై భోజన సౌకర్యం కూడా కల్పించబడుతుంది.[2]

విద్యాసంస్థలు

మార్చు
  1. నెహ్రూ హైస్కూల్
  2. వేద విద్యాలయం హైస్కూల్
  3. అమరావతి గ్రామర్ హైస్కూల్[3]

మూలాలు

మార్చు
  1. "Secunderabad Jn Railway Station (SC) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2021-01-14.
  2. నమస్తే తెలంగాణ (14 January 2018). "మరో మూడు నైట్ షెల్టర్లు". Archived from the original on 20 September 2018. Retrieved 20 September 2018.
  3. "Top CBSE Schools Nearby in namalagundu,Hyderabad". www.indiacom.com. Retrieved 2021-01-14.