చిలకలగూడ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడి ప్రాంతం మధ్య తరగతివారు నివసించడానికి అనువుగా ఉండంతో, దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు ఇక్కడే నివాసాలు ఏర్పరచుకున్నారు. దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న ప్రాంతం ప్రముఖమైనది. పద్మరావునగర్, సీతాఫల్‌మండి, నామాలగుండు, మెట్టుగూడ, పార్సీగుట్ట, మైలర్‌గడ్డ మొదలైన ప్రాంతాలు చిలకలగూడకు సమీపంలో ఉన్నాయి.

చిలకలగూడ
చిలకలగూడ
సమీప ప్రాంతాలు
చిలకలగూడ is located in Telangana
చిలకలగూడ
చిలకలగూడ
Location in Telangana, India
చిలకలగూడ is located in India
చిలకలగూడ
చిలకలగూడ
చిలకలగూడ (India)
Coordinates: 17°25′16″N 78°29′56″E / 17.421°N 78.499°E / 17.421; 78.499
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500061
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

సందర్శన స్థలాలు మార్చు

  1. ఆంజనేయస్వామి దేవాలయం
  2. కట్ట మైసమ్మ-నల్ల పోచమ్మ దేవాలయం[1]
  3. జామియా మసీదు
  4. ఆహ్ల్-హదీథ్ మసీదు
  5. ఈద్గా మసీదు[2]
  6. సి.ఎస్.ఐ. వెస్లీ చర్చి

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చిలకలగూడ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి సమీపంలో సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను, సీతాఫల్‌మండి రైల్వే స్టేషనులు ఉన్నాయి.

జంక్షన్ మార్చు

మెట్రోరైలు రాకతో చిలకలగూడ జంక్షన్ రూపురేఖలు మారిపోతున్నాయి. 128 అడుగుల విస్తీర్ణంలో ఉండే చిలకలగూడ జంక్షన్‌లో కుడి వైపు (సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌), ఎడమ వైపు (బోయిగుడ) మెట్రో మార్గాలు వెళ్తున్నాయి. ఈ జంక్షన్ లో బస్సు, రైలు, మెట్రో రైలు ఒకేసారి పరుగులు పెడతాయి. రోడ్డుపై వాహనాలు వెళ్తుంటే వాటిపై ఉండే రైల్వే బ్రిడ్జిపై రైళ్లు పరుగెడతాయి. ఆపై నిర్మించిన మెట్రో ఆర్వోబీపై మెట్రో రైళ్లు వెళ్తాయి.[3]

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ (5 August 2018). "వైభవంగా సింహవాహిని మహంకాళి బోనాలు - పట్టువస్ర్తాల సమర్పణ". Archived from the original on 9 August 2018. Retrieved 9 August 2018.
  2. సాక్షి (18 July 2015). "అల్లాహ్ కానుక.. ఈద్ ఉల్ ఫితర్ - శతాబ్దాల చరిత్ర చిలకలగూడ ఈద్గా". Archived from the original on 9 August 2018. Retrieved 9 August 2018.
  3. ఆంధ్రజ్యోతి (5 January 2015). "చిలకలగూడ జంక్షన్... స్పెషల్‌ ఎట్రాక్షన్!". Archived from the original on 9 August 2018. Retrieved 9 August 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=చిలకలగూడ&oldid=4149900" నుండి వెలికితీశారు