మొదటి ప్రోలరాజు
| |||||||||||||||||||||||||||||||||||||||
‡ రాణి
|
మొదటి ప్రోలరాజు (1030 - 1075) మొదటి బేతరాజు కుమారుడు. అతనికి అరికేసరి/అరిగజ కేసరి, కాకతి వల్లబ బిరుదులు ఉన్నాయి. ఖాజీపేట, పిల్లల మర్రి, పాలంపేట శాసనాలు ఇతని ఘనకార్యాలను పేర్కొంటున్నాయి.[1]
ఇతని పాలన కాలం సా.శ. 1053 ప్రాంతంలో వేయించిందే శనిగరం శాసనం.
మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుని కొప్పం దండయాత్రలలో సహకరించాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్యప్రతాపాలకు మెచ్చి అతనికి హనుమకొండను వంశపారంపర్యపు హక్కులను ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు. పశ్చిమ చాళూక్యుల వరాహ రాజ చిహ్నాన్ని ఉపయోగించుకోవడానికి సోమేశ్వరుడు అతనికి అనుమతినిచ్చాడు.[2]
ఇతడు తన రాజ్యానికి పొరుగున ఉన్న వేములవాడ, కార్పర్తి, గుణసాగరం మొదలైన ప్రాంతాలను జయించాడు. భద్రంగుని సబ్బి మండలాన్ని ఆక్రమించాడు.
మొదటి ప్రోలరాజు ఓరుగల్లు సమీపంలో అరిగజకేసరి పేరుతో పెద్ద చెరువును తవ్వించాడు. ప్రస్తుతం దీనిని కేసరి సముద్రంగా పరిగణిస్తున్నారు.
మూలాలు
మార్చు- ↑ "2007 Miracle Yearbook". 2007. doi:10.15385/yb.miracle.2007.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ https://www.sakshieducation.com/GII/History/2-kakatiya.pdf