మొరింగేసి

(మొరింగా నుండి దారిమార్పు చెందింది)

మొరింగేసి (లాటిన్ Moringaceae) కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క ప్రజాతి మొరింగా (Moringa). ఈ ప్రజాతిలో 13 జాతులు ఉన్నవి; అన్నీ ఉష్ణ, సమశీతోష్ణ మండలంలో పెరిగే చెట్లు.

మొరింగేసి
Moringa ovalifolia
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
మొరింగేసి
Genus:
మొరింగా

అన్నింటికన్నా ప్రసిద్ధిచెందిన "మొరింగా ఓలీఫెరా" (Moringa oleifera) బహుళ ప్రయోజనాలున్నమునగ చెట్లు భారతదేశంలో విస్తృతంగా పెరుగుతాయి. ఆఫ్రికా రకం (Moringa stenopetala) కూడా కొంచెం తక్కువగానైనా పెంచబడుతుంది.

మొరింగా చెట్లు పేదరికాన్ని, ఆకలి దేశాల్లో బహుళ ప్రయోజనాలున్నవి. వీటి ఆకులు తొందరగా పెరిగి మనుషులకు, పశువులకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఆకులు మాంసకృత్తులు ఎక్కువగా కలిగివుంటాయి. పశువుల దాణాగా ఉపయోగించినప్పుడు సోయా కంటే బలమైనవి, పాల ఉత్పత్తిని పెంచేవిగా గుర్తించారు.


మొరింగా నుండి బయో ఇంధనం తయారుచేయవచ్చును. విత్తనాలలో 30-50% నూనె లభిస్తుంది, లేదా 112-185 gal/acre/year. నూనెలో 65-75% ఓలియిక్ ఆమ్లం ఉంటుంది.

మొరింగా వర్షాభావ పరిస్థితులలో కూడా పెరుగుతుంది. భూసారం తక్కువగా ఉండే మెట్ట భూములలో (pH between 4.5 and 9) ను కూడా తట్టుకొంటుంది. ఇవి హిమాలయాల మంచుప్రాంతాలు, నారింజలు పెరిగే వాతావరణంలో పెరుగుతాయి.

జాతులు మార్చు

బయటి లింకులు మార్చు