మోగా
మోగా, భారత పంజాబ్ రాష్ట్రం లోని పట్టణం. గిల్ సమాజానికి చెందిన ప్రముఖ వ్యక్తి, మోగా సింగ్ గిల్ పేరు మీద పట్టణానికి ఈ పేరు పెట్టారు.
మోగా | |
---|---|
City | |
Coordinates: 30°49′19″N 75°10′26″E / 30.822°N 75.174°E | |
దేసం | India |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | మోగా |
జనాభా (2018) | |
• Total | 2,98,432[1] |
• Rank | పంజాబులో 6 వ |
• జనసాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | పంజాబీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 142001 |
టెలిఫోన్ కోడ్ | 1636 |
Vehicle registration | PB-29 |
లింగ నిష్పత్తి | 1000:883 ♂/♀ |
ఇది 1995 నవంబరు 24 న పంజాబ్ రాష్ట్రంలోని 17 వ జిల్లాగా మోగా, మోగా ముఖ్యపట్టణంగా ఏర్పడింది. అప్పటివరకు మోగా, ఫరీద్‌కోట్ జిల్లాలో భాగంగా ఉండేది.. మోగా పట్టణం జాతీయ రహదారి 95 (NH-95 ఫిరోజ్‌పూర్ - లుధియానా రహదారి) పై ఉంది. రోజ్‌పూర్ డివిజన్ పరిధిలోకి వచ్చే 150 గ్రామాల ధరమ్‌కోట్ బ్లాక్‌ను మోగా జిల్లాలో విలీనం చేసారు. NH5 రహదారి, మోగాను చండీగఢ్, సిమ్లా, ఫిరోజ్‌పూర్ లను కలుపుతుంది.
జనాభా
మార్చు2011 తాత్కాలిక జనాభా లెక్కల ప్రకారం మోగా పట్టణ సముదాయంలో 1,59,897 జనాభా ఉంది. వీరిలో పురుషులు 84,808, ఆడవారు 75,089. అక్షరాస్యత రేటు 81.42%.[4]
2001 జనగణనలో,[5] మోగా పట్టణంలో 1,24,624 జనాభా ఉంది. పురుషులు 54%, స్త్రీలు 46%. మోగా అక్షరాస్యత 68%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీ అక్షరాస్యత 66%. జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
విద్య
మార్చుమోగా లోని ప్రముఖ విద్యా సంస్థల జాబితా ఇది.
- కిచ్లు పబ్లిక్ స్కూల్
- మౌంట్ లిటెరా జీ స్కూల్, మోగా
- బాబా కుందన్ సింగ్ మెమోరియల్ లా కాలేజ్, మోగా
ప్రముఖ వ్యక్తులు
మార్చు- నరీందర్ సింగ్ కపనీ, ఫైబర్ ఆప్టిక్స్లో చేసిన రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ సంతతి అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త.
- సిక్కు తీవ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే
- లాలా లజపత్ రాయ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు
- సోను సూద్, భారతీయ చిత్రం నటుడు
- జోగిందర్ సింగ్ సాహ్నాన్, సైనికుడు భారత చైనా యుద్ధంలో చూపిన పరాక్రమానికి పరమవీరచక్ర గ్రహీత.
మూలాలు
మార్చు- ↑ "City Population Census 2019 - Punjab".
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). Nclm.nic.in. Ministry of Minority Affairs. p. 32. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 4 నవంబరు 2020.
- ↑ "Moga City Census 2011 data". Census 2011.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.