ప్రధాన మెనూను తెరువు

సోనూ సూద్ ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

సోనూ సూద్
Sonu sood 2012.jpg
జననంసోనూ సూద్
1972/1973 (age 46–47)[1]
పంజాబ్, భారతదేశం
ఇతర పేర్లుసోనూ,
హాండ్సం విలన్,
రొమాంటిక్ విలన్
జాతిపంజాబీ
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1999 – ఇప్పటివరకు
జీవిత భాగస్వామిసోనాలి

జీవిత విశేషాలుసవరించు

సోనూ సూద్ పంజాబ్ లోని మోగ అనే అనే పట్టణంలో జన్మించాడు. నాగపూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు.

కెరీర్సవరించు

1999 లో కుళ్ళళలగర్ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు. తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించాడు. 2000 లో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో నటించాడు. కానీ బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఉండేది. 2002 లో వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ లో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. తరువాత నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు సాధించాడు. ఆ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం లభించింది.[2]

నటించిన చిత్రాలుసవరించు

మూలాలుసవరించు

  1. Sonu Sood turns producer with Lucky Unlucky - The Hindu
  2. సాక్షి ఫన్ డే, సెప్టెంబరు 11, 2016, 14వ పేజీ

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సోనూ_సూద్&oldid=2049608" నుండి వెలికితీశారు