మోత్కూర్ పురపాలకసంఘం

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పురపాలక సంస్థ
(మోత్కూర్ పురపాలక సంఘం నుండి దారిమార్పు చెందింది)

మోత్కూర్ పురపాలక సంఘం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పురపాలక సంఘం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని, తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

మోత్కూర్ పురపాలక సంఘం
మోత్కూర్
మోత్కూర్ పురపాలక సంఘ భవనం
స్థాపనఆగస్టు 2, 2018
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

మేజర్ గ్రామ పంచాయితిగా ఉన్న మోత్కూర్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా సమీపంలోని కొండగడప, భుజిలాపురం గ్రామాలను కలుపుకొని 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది. మోత్కూర్ పురపాలక సంఘం మొత్తం విస్తీర్ణం 54.71 చ.కి.మీ.[1] ఇందులో 12 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 15,924 జనాభా ఉండగా అందులో పురుషులు 8,030 మంది, మహిళలు 7894 మంది ఉన్నారు.[2]

పాలకవర్గం

మార్చు

మోత్కూర్ పురపాలక సంఘంలోని 12 వార్డులకు 2020, జనవరి 21న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 12 వార్డులలో 7 వార్డులు తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపొందగా, 5 వార్డులు కాంగ్రెస్ గెలుపొందింది. 7వ వార్డు కౌన్సిలర్ తీపిరెడ్డి సావిత్రి మున్సిపల్ చైర్మన్ గా, 8వ వార్డు కౌన్సిలర్ బొల్లెపల్లి వెంకటయ్య వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.[2] 2020, ఫిబ్రవరి 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సమక్షంలో నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది.[3][4]

  • 1వ వార్డు: పురుగుల వెంకన్న (టిఆర్ఎస్)
  • 2వ వార్డు: కారుపోతుల శిరీష (కాంగ్రెస్)
  • 3వ వార్డు: లెంకల సుజాత (కాంగ్రెస్)
  • 4వ వార్డు: ఎర్రబెల్లి మల్లమ్మ (కాంగ్రెస్)
  • 5వ వార్డు: మలిపెద్ది రజిత (కాంగ్రెస్)
  • 6వ వార్డు: వనం స్వామి (టిఆర్ఎస్)
  • 7వ వార్డు: తీపిరెడ్డి సావిత్రి (టిఆర్ఎస్) చైర్మన్
  • 8వ వార్డు: బొల్లెపల్లి వెంకటయ్య (టిఆర్ఎస్) వైస్ చైర్మన్
  • 9వ వార్డు: దబ్బెటి విజయ (టిఆర్ఎస్)
  • 10వ వార్డు: బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి (టిఆర్ఎస్)
  • 11వ వార్డు: గుర్రం కవిత (కాంగ్రెస్)
  • 12వ వార్డు: కూరెళ్ళ కుమారస్వామి (టిఆర్ఎస్)

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 23 July 2020.
  2. 2.0 2.1 Mothkur Muncipality, about Muncipality. "Ward council Details, Mothkur Municipality". www.mothkurmunicipality.telangana.gov.in. Archived from the original on 23 జూలై 2020. Retrieved 23 July 2020.
  3. నమస్తే తెలంగాణ, తెలంగాణ (5 February 2020). "దేశంలో విశేష ప్రజాదరణ కలిగిన ఒకే ఒక్క పార్టీ టీఆర్‌ఎస్‌: మంత్రి జగదీష్‌ రెడ్డి". ntnews. Archived from the original on 23 July 2020. Retrieved 23 July 2020.
  4. ఆంధ్రప్రభ, ముఖ్యాంశాలు (5 February 2020). "సంచలనాలకు కేంద్ర బిందువుగా టీఆర్ఎస్ : జగదీష్ రెడ్డి". www.prabhanews.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 July 2020. Retrieved 23 July 2020.

వెలుపలి లంకెలు

మార్చు