మోనా హెన్స్‌మాన్

మోనా హెన్స్‌మాన్ (ఎం.బి.ఈ) (25 ఆగస్టు 1899-5 డిసెంబర్ 1991), మోనా మిట్టర్ గా జన్మించిన ఆమె భారతీయ విద్యావేత్త, స్త్రీవాది, రాజకీయవేత్త. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలిగా, భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో మద్రాసు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. భారత పార్లమెంటులో తొలి మహిళా విఫ్‌గా ఈమె నిలిచింది. ఆమె 1953 నుండి 1960 వరకు ఎతిరాజ్ మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసింది.

మోనా హెన్స్‌మాన్
రాజ్యసభ సభ్యురాలు
In office
1952–1956
నియోజకవర్గంమద్రాసు రాష్ట్రం
మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు
In office
1937-1952
వ్యక్తిగత వివరాలు
జననం
మోనా మిట్టర్

(1899-08-25)1899 ఆగస్టు 25
బరంపురం, గంజాం జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా (ప్రసుత ఒడిశా)
మరణం1991 డిసెంబరు 5(1991-12-05) (వయసు 92)
చెన్నై
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రేసు
జీవిత భాగస్వామిడా. హెన్రీ ఎస్. హెన్స్‌మాన్
సంతానంరాజకుమార్ హెన్స్‌మాన్ (కుమారుడు), బినోదినీ ఎస్. బెనర్జీ (కూతురు), ధీరేన్ బెనర్జీ (ఎకైక మనవడు)

ప్రారంభ జీవితం, విద్య

మార్చు

మోనా మిట్టర్ 1899లో బెర్హంపూర్లో ఆర్.కె.మిట్టర్, బినోదిని బోస్ మిట్టర్‌ల కుమార్తెగా జన్మించింది. ఆమె తండ్రి సైన్యంలో శస్త్రవైద్యుడు, లెఫ్టినెంట్ కల్నల్.[1] భారతదేశంలో ఈమె ఊటీలోని సెయింట్ హిల్డా పాఠశాలలో చదివి, ఆ తరువాత బెడ్ఫోర్డ్ గర్ల్స్ స్కూల్‌లో, లండన్లోని వెస్ట్‌ఫీల్డ్ కాలేజీలో తన విద్యను కొనసాగించింది. ఈమె భాష, సాహిత్యంలలో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించింది.[2]

వృత్తి జీవితం

మార్చు

హెన్స్‌మాన్ తన వృత్తిజీవితంలో ఎక్కువ భాగం ఉన్నత విద్యా రంగంలో గడిపింది. యువ మహిళగా ప్రారంభ సంవత్సరాల్లో ఈమె లాహోర్ కిన్నెయిర్డ్ కళాశాలలో బోధించింది. 1924లో ఆమె చెన్నై మహిళా కైస్తవ కళాశాలలో ఆంగ్ల, ఫ్రెంచి భాషల ఆచార్యిణి అయ్యింది. 1930లో, హెన్స్‌మాన్ మద్రాసు విశ్వవిద్యాలయంలోని అధ్యాపక సెనేట్లో పనిచేసింది. ఈమె 1953 నుండి 1960 వరకు సుబూర్ పార్థసారథి తరువాత ఎతిరాజ్ మహిళా కళాశాలకు రెండవ ప్రిన్సిపాల్ గా ఉన్నది.[3] 1962లో విశ్వవిద్యాలయ మహిళల భారతీయ సమాఖ్యకు మాజీ అధ్యక్షురాలి హోదాలో, ఆస్ట్రేలియన్ ఫెడరేషన్ అఫ్ యూనివర్శిటీ వుమెన్ యొక్క ద్వైవార్షిక సమావేశానికి ఈమె హాజరైంది.[4][5]

క్రైస్తవ మహిళలకు మద్దతు ఇవ్వడంలో హెన్స్‌మాన్ ప్రత్యేక ఆసక్తి చూపింది. 1929లో ఈమె చెన్నైలో వై.డబ్ల్యు.సి.ఎ తొలి భారతీయ అధ్యక్షురాలిగా నియమితురాలైంది. 1937లో, ఈమె ప్రపంచవ్యాప్త వై.డబ్ల్యు.సి.ఎ సంస్థకు ఉపాధ్యక్షురాలిగా ఉన్నది.[2] ఆమె కలకత్తా (1936), ఎడిన్‌బరో (1938)లలో జరిగిన అంతర్జాతీయ మహిళా మండలి సమావేశాలకు హాజరైంది. ఈమె ప్రణాళికా కమిటీలలో ఒకదానికి నాయకత్వం వహించింది. అంతేకాక 1938 లో తాంబరంలో జరిగిన ప్రపంచ మిషనరీ సమావేశానికి ప్రతినిధిగా హాజరైంది.[2]

హెన్స్‌మాన్ మద్రాసులో శాంతి న్యాయమూర్తి, రాజ్యసభలో మద్రాసు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యురాలు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు.[4][6][7][8][9][10][11] భారత పార్లమెంటులో తొలి మహిళా విఫ్‌గా ఆమె నిలిచింది. ఆమె ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.

1937లో, హెన్స్‌మాన్‌ను ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (ఎం.బి.ఈ) లో సభ్యురాలిగా చేశారు.

వ్యక్తిగత జీవితం

మార్చు

మోనా మిట్టర్, తమిళ జాఫ్నా మూలాలున్న వైద్యుడు, హెన్రీ ఎస్. హెన్స్‌మాన్ వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు పిల్లలు, రాజ్‌కుమార్, బినోదిని ఉన్నారు. మోనా మిట్టర్ 1991లో చెన్నైలో 92 సంవత్సరాల వయసులో మరణించింది.

సూచనలు

మార్చు
  1. (4 March 1893). "Naval and Military Medical Services".
  2. 2.0 2.1 2.2 (2016). "Mona Hensman: An Indian Woman at the World Missionary Conference in Tambaram (1938)".
  3. "Former Principals". Ethiraj College for Women. Retrieved 29 November 2017.
  4. 4.0 4.1 "What People are Doing". Canberra Times (ACT : 1926 - 1995). 1962-01-11. p. 5. Retrieved 2020-10-12 – via Trove.
  5. "Indian Delegate Welcomed". Canberra Times (ACT : 1926 - 1995). 1962-01-16. p. 5. Retrieved 2020-10-12 – via Trove.
  6. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 29 November 2017.
  7. "Women Members of Rajya Sabha" (PDF). Rajya Sabha. p. 145. Retrieved 22 November 2017.
  8. India. Parliament. Rajya Sabha. Secretariat (2003). Women members of Rajya Sabha. Rajya Sabha Secretariat. p. 15. Retrieved 29 November 2017.
  9. India. Parliament. Rajya Sabha (1955). Who's who. Rajya Sabha Secretariat. p. 132. Retrieved 29 November 2017.
  10. Sir Stanley Reed (1964). The Times of India Directory and Year Book Including Who's who. Bennett, Coleman & Company. p. 1148. Retrieved 29 November 2017.
  11. "Distinguished Alumni". Women's Christian College. Retrieved 29 November 2017.