యముడు 3
యముడు 3 2017లో విడుదలైన తెలుగు సినిమా. సింగం 3 పేరుతో తమిళంలో జ్ఞానవేల్ రాజా సమర్పణలో స్టూడియో గ్రీన్, పెన్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించగా సూర్య, అనుష్క, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై శివకుమార్ మల్కాపురం 2017 ఫిబ్రవరి 9న విడుదల చేశాడు.
యముడు 3 | |
---|---|
దర్శకత్వం | హరి |
రచన | హరి |
నిర్మాత | శివకుమార్ మల్కాపురం |
తారాగణం | సూర్య అనుష్క శ్రుతి హాసన్ రాధిక శరత్‌కుమార్ |
ఛాయాగ్రహణం | ప్రియన్ |
కూర్పు | వి.టి.విజయన్ |
సంగీతం | హారిస్ జయరాజ్ |
నిర్మాణ సంస్థ | సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా |
విడుదల తేదీ | 9 ఫిబ్రవరి 2017 |
సినిమా నిడివి | 154 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకర్ణాటకకు చెందిన పోలీస్ కమిషనర్ దారుణ హత్యకు గురవుతాడు. దీనిని పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరసింహం(సూర్య)ను డిప్యూటేషన్ మీద అక్కడికి రప్పించుకుంటాడు హోం మినిస్టర్(శరత్ బాబు). అక్కడకు చేరుకున్న నరసింహం, కమీషనర్‌ను చంపింది మధుసూదన్ రెడ్డి (శరత్ సక్సేనా) ఈ గ్యాంగ్ వెనక ఆస్ట్రేలియాలో ఉండే విఠల్ (అనూప్ సింగ్) హస్తం ఉందని తెలుసుకొని పట్టుకోవడానికి ఆస్ట్రేలియాకు బయలుదేరతాడు. అక్కడికి చేరుకున్న నరసింహకు కొన్ని ఎదురవుతాయి. వాటిని ఎలా అధిగమించాడు. అసలు అనూప్ కమీషనర్‌ను చంపడానికి గల కారణాలు ఏంటి? నరసింహ ఈ మిషన్‌ను పూర్తి చేయగలిగాడా లేదా అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
- నిర్మాత: మల్కాపురం శివకుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి
- సంగీతం: హరీష్ జయరాజ్
- సినిమాటోగ్రఫీ: వి.టి.విజయన్
- మాటలు: శశాంక్ వెన్నెలకంటి
మూలాలు
మార్చు- ↑ Zee Cinemalu (9 February 2017). "'సింగం-3' రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.