అనుష్క శెట్టి (తుళు: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) తెలుగు, తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. అదేవిదంగా బాహుబలి సినిమా ద్వారా భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన సినీతారగా గుర్తింపు తెచ్చుకుంది.

అనుష్క శెట్టి

జన్మ నామంస్వీటి శెట్టి
జననం (1980-11-07) 1980 నవంబరు 7 (వయసు 43)
మంగుళూరు, కర్ణాటక.
క్రియాశీలక సంవత్సరాలు 2005—ప్రస్తుతం

వ్యక్తిగత జీవితం

మార్చు

మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల, కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.

అరుంధతి

మార్చు

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి, జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.అనుష్క మొదటీ సినిమాతొనే తనలోని నటిని ఆవిష్కరింఛింది

సినిమా జీవితము

మార్చు
సంవత్సరం సినిమా సినిమాలో పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2005 సూపర్ సాషా తెలుగు తొలి పరిచయం
2005 మహానంది నందినీ తెలుగు
2006 విక్రమార్కుడు నీరజా గోస్వామి తెలుగు
2006 అస్త్రం అనూష తెలుగు
2006 రెండు జ్యోతి తమిళం
2006 స్టాలిన్ తెలుగు ప్రత్యేక నృత్యం
2007 లక్ష్యం ఇందూ తెలుగు
2007 డాన్ ప్రియా తెలుగు
2008 ఒక్క మగాడు భవానీ తెలుగు
2008 స్వాగతం శైలూ తెలుగు
2008 బలాదూర్ భానుమతి తెలుగు
2008 శౌర్యం శ్వేతా తెలుగు
2008 చింతకాయల రవి సునీతా తెలుగు
2008 కింగ్ తెలుగు

అతిధి పాత్రలో

2009 అరుంధతి అరుంధతీ,
జేజమ్మ
తెలుగు ఫిలంఫేర్ తెలుగు ఉత్తమ నటీ బహుమతికి ఎంపిక
Nandi Special Jury Award
2009 బిల్లా మాయా తెలుగు
2009 వేటకారన్ సుశీలా తమిళం
2010 కేడి తెలుగు

అతిధి పాత్రలో

2010 యముడు,సింగం కావ్యా మహాలింగం తెలుగు, తమిళం
2010 వేదం సరోజా తెలుగు Filmfare Award for Best Actress - Telugu
2010 పంచాక్షరి పంచాక్షరీ,
హనీ
తెలుగు
2010 ఖలేజా సుబ్బలక్ష్మీ తెలుగు
2010 తకిట తకిట Herself తెలుగు అతిథి పాత్రలో
2010 నాగవల్లి[1] చంద్రముఖీ తెలుగు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి – తెలుగు నటీ బహుమతికి ఎంపిక
2010 రగడ శిరీషా తెలుగు
2011 వానం సరోజా తమిళం
2011 దైవతిరుమగళ్ అనురాధా రాగునతాన్ తమిళం
2012 శకుని అనుష్కా తమిళం

అతిధి పాత్రలో

2012 తాండవం(సినిమా) మీనాక్షీ తమిళం
2012 ఢమరుకమ్ మహేశ్వరీ తెలుగు
2013 అలెక్స్ పాండియన్ తమిళం
2013 మిర్చి (2013 సినిమా) వెన్నెల తెలుగు
2013 Brindavanomlo Nandakumaradu తెలుగు
2013 సింగం 2 కావ్యా దురైసింగం తమిళం
2013 ఇరణ్డాం ఉలగం (వర్ణ) రమ్యా/వర్ణా తమిళం తెలుగులో అనువదించ బడినది
2014 లింగ తెలుగు
తమిళం
2015 ఎన్నై అఱిందాల్ (ఎంతవాడుగాని) తేన్మోళి తమిళం
2015 బాహుబలి:ద బిగినింగ్ దేవసేన తెలుగు
2015 రుద్రమదేవి (సినిమా) రుద్రమదేవి తెలుగు
తమిళం
2015 సైజ్ జీరొ

ఇంజి ఇడుపళగి

సౌందర్యా(స్వీటి) తెలుగు
తమిళం
ద్విభాషా చిత్రం
2016 సోగ్గాడే చిన్నినాయనా కృష్ణ కుమారి తెలుగు అతిది పాత్రలో
2016 ఊపిరి

తొళా

నందిని తెలుగు
తమిళం
ద్విభాషా చిత్రం,అతిది పాత్రలో
2017 సింగం 3 కావ్యా తమిళం
2017 ఓం నమో వేంకటేశాయ కృష్ణమ్మ తెలుగు
2017 బాహుబలి:ద కంక్లూజన్ దేవసేనా తెలుగు
తమిళం
ద్విభాషా చిత్రం
2018 భాగమతి చంచలా, భాగమతి తెలుగు
తమిళం
ద్విభాషా చిత్రం
2019 సైరా నరసింహారెడ్డి ఝాన్సీ మహారాణి లక్ష్మి భాయ్ తెలుగు

తమిళం

హిందీ

మలయాళం

బహుభాషా చిత్రం, అతిథి పాత్రలో
2020 నిశ్శబ్దం[2] సాక్షి తెలుగు

తమిళం

ఆంగ్లం

హిందీ

మలయాళం

బహుభాషా చిత్రం
2023 మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

మూలాలు

మార్చు
  1. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
  2. "Nishabdham movie: Check out the Anushka's movie twitter review here". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-02. Retrieved 2020-10-13.