యశస్వి (కవి)
యశస్విగా తెలుగు కవిత్వ ప్రేమికులకు పరిచితులైన వీరి అసలు పేరు సతీష్ కుమార్. యశస్వి వీరి కలంపేరు. కవిసంగమం గ్రూప్ ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా వీరూ, వీరి కవిత్వమూ ప్రాచుర్యం పొందాయి
యర్రంశెట్టి యశస్వి | |
---|---|
జననం | యర్రంశెట్టి సతీష్‌కుమార్ 1975 సెప్టెంబరు 1 నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, |
నివాస ప్రాంతం | హైదరాబాద్ , తెలంగాణ |
వృత్తి | కవి, ఈనాడు టెలివిజన్ లో మానవ వనరుల విభాగానికి మేనేజర్ |
ఉద్యోగం | ఈనాడు |
ఎత్తు | 5.75' |
బరువు | 81 |
మతం | హిందూ |
భార్య / భర్త | శైలజారాణి |
పిల్లలు | శ్రీ యశస్వి |
తండ్రి | రామారావు |
తల్లి | గిరిజావతి |
వెబ్‌సైటు | |
www.blaagu.com/sateesh |
జననం
మార్చుయశస్వి (సతీష్) గిరిజావతి (భాషాప్రవీణ-హిందీ), రామారావు (అసిస్టెంటు ఇంజనీరు, ఆం.ప్ర నీటిపారుదల; రిటైర్డ్ ) దంపతులకు 1975 సెప్టెంబర్ 1 న పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో జన్మించాడు . అన్న భానుకిరణ్ (Ag. MSc. Ph.D) బెంగళురులో ఉంటున్నాడు.
ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం
మార్చుహైదరాబాదు లోని దిల్‍సుఖ్ నగర్ చైతన్యపురి, జైన్ మందిర్ దగ్గర నివసిస్తున్నారు. ఈనాడు టెలివిజన్ వార్తా చానెల్లో (మానవ వనరుల విభాగం, కార్య నిర్వహణ) మేనేజరుగా పనిచేసేవారు. ప్రస్తుతం ఫ్రీ లాన్సర్.
విద్యార్హతలు
మార్చు- మే 1998లో స్నాతకోత్తర పట్టా; ఎంబిఎ. ఆంధ్ర విశ్వవిద్యాలయం
- మే, 1996 లో B.Sc.. తణుకు ప్రభుత్వ కళాశాల
- సెప్టెంబర్ 1992 లో రాష్ట్ర భాషాప్రవీణ, దక్షిణ భారత హిందీ ప్రచారసభ.
ఇతర విద్యార్హతలు
- Diploma in Online Journalism by International Institute of Journalism, In association with INWENT (capacity building international, by Germany )
- Pro in Multimedia and Web design Specialist, ZED CA, ZILS, (Essel Group, Mumbai)
భార్య - పిల్లలు
మార్చుశైలజారాణి - శ్రీ యశస్వి
రచనలు
మార్చుమొదటి కవిత అక్షరాన్ని.. నేనక్క్షరాన్ని, ఈనాడు తెలుగు-వెలుగు ప్రారంభ సంచిక సెప్టెంబర్ 2012 లో ప్రచురితం అయింది. మలి కవితాముద్రణ: తానా సావనీర్ 2013లో, బహుమతి పొందిన కవిత "కొత్తమనిషీ! రాయిలా" సిలికానంధ్రా సుజనరంజని వెబ్ పత్రికలో ..
పుస్తకాలు
మార్చు- తెల్లకాగితం (56 కవితల సంపుటి), ప్రచురుణ: 20.12.2012.
- ఒక్కమాట (150 మంది కవిసంగమం కవుల పరిచయం ""కవితత్వాలు""), ప్రచురుణ: 11.12.2013.
- వేలికొసన.. (66 కవితల సంపుటి), ప్రచురుణ: 20.08.2016.
- VELIKOSANA YASASWI.pdf [1] ఇక్కడ చదువుకోవచ్చు
- రెండుమాటలు (114 మంది కవిసంగమం కవుల పరిచయం ""కవితత్వాలు"") అముద్రితం
- [2] * లో లభ్యం
- లింక్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు Archived 2016-06-07 at the Wayback Machine లేదా
- లింక్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
- పరాం ప్రేయసీ..! భార్యకు రాసిన 50 ప్రేమలేఖల సముచ్చయం విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాహిత్య సృజన
కవితత్వాలు
మార్చుయశస్వి (యర్రంశెట్టి సతీష్‌కుమార్) విలక్షణమైన పంథాలోనే మొత్తం 150 మంది క్రియాశీల కవుల వివరాలను 2013 డిసెంబరులో సంకలనంగా తెచ్చారు.[1] నిండైన కవిత్వం రాయడమే ఒకింత కష్టసాధ్యమనుకుంటే- అటువంటి కవుల్లోని కవిత్వపు శిల్ప-శైలీ విన్యాసాలను టూకీగా విశ్లేషించడం మరింత సంక్లిష్టం. కవిని, కవిత్వాన్ని ఒకే దష్టితో చూడటం వల్ల మాత్రమే ఆయనకు ఇది సాధ్యమైందన్నది స్పష్టం. పరిచయం చేయడంలోనూ కవితాత్మక ప్రయోగాలే ఎంచుకోవడం విశేషం. విలక్షణమైన, సరికొత్త ప్రక్రియగా ముందుకొచ్చిన ఈ సంపుటిలో చోటు చేసుకున్న కవుల్లో అఫ్సర్, వర్చస్వి, జిలుకర శ్రీనివాస్, కవి యాకూబ్, రాళ్లబండి కవితాప్రసాద్, తల్లావఝ్జుల లలితాప్రసాద్, కాసుల లింగారెడ్డి, పులిపాటి గురుస్వామి, శిలాలోలిత, స్కైబాబ, వసీరా వంటివారు ఉన్నారు. శరీరపు బుట్టనిండా కవిత్వపు పూలే (పేజీ: 45), సముద్రాన్ని కళ్లలో దాచుకొని తిరగడం చేపపిల్లలకు తప్పదు కదా (పేజీ: 35), ఇతని చినుకుపాట ఇప్పట్లో వదిలేలా లేదు (పేజీ: 29) వంటి వాక్యాలు ఆయా కవులనే కాదు, సంకలన కర్తనూ పాఠకులకు దగ్గర చేస్తాయి.
మలి ప్రయత్నంగా ఒక్కమాట కవితత్వాలకు కొనసాగింపుగా #రెండుమాటలు పేర మరో 150 మంది మీద కవితత్వాలు రాస్తున్నారు.
వృత్తిగత అనుభవం
మార్చు- ఈనాడు జర్నలిజం స్కూలులో 13సంవత్సరాల నుంచి కార్యనిర్వాహకునిగా ఉపనియామకం. (రామోజీ గ్రూపు ఈటీవి వార్తా ఛానళ్ల మానవవనరుల విభాగంలో మేనేజరు )
నిర్వహించిన విధులు
మార్చు- జర్నలిజం స్కూలు నిర్వహించే పత్రిక, టీవీ, వెబ్ మాధ్యమాల పి.జి డిప్లొమా కోర్సు కార్యనిర్వహణ.
- నోటిఫికేషను, రాష్ట్రస్థాయిలో పరీక్ష నిర్వహణ, బృందచర్చ, ముఖాముఖీ ఎంపికల ఏర్పాట్లలో భూమిక, ఎంపికైన అభ్యర్థుల శిక్షణలో భాగంగా విధివిధానాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ.
- శిక్షణార్థుల, సమన్వయకర్తల, బోధకుల సంధాత, సాంకేతిక సహాయకారి, సంక్షేమ అధికారి.
ప్రగతి నిర్థారకాలు
మార్చు- వందల మంది పాత్రికేయుల తయారీలో, శిక్షణలో, వ్యక్తిత్వ వికాసంలో భాగస్వామ్యం,
- రామోజీ గ్రూపులోని అనుబంధ సంస్థల నిర్వహణ, ఏర్పాట్లలోనూ అనుభవం.
వృత్తి గతానుభవం
మార్చు- ICFAI విశ్వవిద్యాలయంలో కార్యనిర్వాహక హోదాలో 2002 ఫిబ్రవరి నుంచి 2005 సెప్టెంబర్ వరకు
- వేరు –వేరు విధుల్లో పలు శిక్షణ, సాంకేతిక విద్యాసంస్థల్లో పనిచేశారు.
బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు
మార్చుబహుమానాలు
- 2013లో సిలికానాంధ్ర నిర్వహించిన విజయ నామ ఉగాది కవితా పొటీల్లో ద్వితీయ బహుమతి.
బిరుదులు
- కవిసంగమం కవుల కవి గాగుర్తింపు
- ఫేస్ బుక్ కవి సంగమం సమూహం అడ్మిన్, సమూహం సభ్యులు
- 2014లో హైదరాబాద్ దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం ఆహ్వానం పై కవిసమ్మేళనంలో పాల్గొన్నారు.
వ్యాపకాలు
మార్చు- సాహిత్యపఠనం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ,ఫేస్.బుక్ కవిసంగమం గ్రూపు నిర్వహణ
- జీవితం పై అవగాహన పెంపొందించుకునే ప్రయత్నంలో అనుభూతులను కవిత్వీకరించడం.
- తెలుగుయూనికోడ్ ఫాంట్ల సహాయంతో పుస్తకాల రూపకల్పన.
‘తెల్లకాగితం’, ‘ఒక్కమాట’, వేలికొసన.. పుస్తకాలిలా రూపొందినవే
మిత్రులు, సహకవులు "వర్చస్వి" లోకాస్సమస్తా కవిత్వసంపుటి; ఎన్ వి యం వర్మ కలిదిండి రచించిన నేనుమాత్రం ఇద్దరిని కవిత్వసంపుటి తెలుగుయూనికోడ్ ఫాంట్ల సహాయంతో వీరి ప్రమేయంతో రూపొందించినవే.
ఇతర లంకెలు
మార్చు- జయనామసంవత్సర ఉగాది రోజున దూరదర్శన్ సప్తగిరిలో కవిత్వ పఠనం
- వీరి వేలికొసన.. https://lookaside.fbsbx.com/file/Yasaswi.swf? బ్రౌజర్లో తెరిచి చదువుకోండి
మూలాలు
మార్చు- ↑ "కవితాత్మకంగా కవుల తత్వాలు ఒక్కమాట-నమస్తే తెలంగాణాలో వ్యాసం". Archived from the original on 2014-01-24. Retrieved 2014-05-20.