యస్.బి.పి. పట్టాభిరామారావు

బలుసు ప్రభాకర పట్టాభిరామారావు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన సభ్యునిగా, మంత్రిగా పనిచేసాడు. ఐదవ, ఆరవ, ఏడోవ లోక్‌సభలలో (1971- 1984) సభ్యునిగా ఉన్నాడు.

యస్.బి.పి. పట్టాభి రామారావు
జననం1911 డిసెంబరు 30
తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం గ్రామం
పదవి పేరులోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం1971 - 1984
రాజకీయ పార్టీభారతీయ జాతీయ కాంగ్రెస్
భార్య / భర్తయస్.బి.కె. రాజేశ్వరమ్మ
తల్లిదండ్రులుబలుసు బుచ్చి సర్వారాయుడు, లక్ష్మీ వెంకట సుబ్బమ్మ రావు
శాసన సభ్యులు 1952 - 1967
శాసన మండలి సభ్యులు 1968 - 1970
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లో, ఆంధ్ర రాష్ట్రం లో ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రిగా పనిచేసారు

జననం, విద్య మార్చు

పట్టాభి రామారావు తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం గ్రామంలో రావుబహద్దూర్ బలుసు బుచ్చి సర్వారాయుడు (రెండోవ), లక్ష్మీ వెంకట సుబ్బమ్మ రావు దంపతులకు 1911 డిసెంబరు 30 న జన్మించాడు. ఇతనిది కపిలేశ్వరపురం జమీందారి వంశం. పట్టాభి రామారావు కాకినాడ పి.ఆర్. కాలేజీలో బి.ఏ., మద్రాసు లా కాలేజీ నుండి బి.యల్. డిగ్రీలు చదివాడు.ఇతని వివాహం 1926లో యస్.బి.కె. రాజేశ్వరమ్మతో జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు.[1] సోదరుడు యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు కేంద్ర మంత్రిగా, శాసన మండలి సభ్యునిగా పనిచేసాడు.

రాజకీయ జీవితం మార్చు

పట్టాభి రామారావు ఆంధ్రా విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యునిగా (1938 -1952), ప్రో వైస్ చాన్సలర్ గా (1957- 1963) పనిచేసాడు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ప్రో వైస్ చాన్సలర్ గా (1954 - 1962) వరకు పనిచేసాడు. ఇతని కాలంలో సాహిత్య అకాడెమీ, సంగీత అకాడెమీ, ప్రభుత్వ వాచక పుస్తక ప్రచురణ సంస్థలు ఏర్పడ్డాయి[2].

1952 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పామర్రు నుండి ఎన్నికై రాజాజీ మంత్రివర్గంలో వాణిజ్య, గ్రామీణ సంక్షేమ శ్హాఖ మంత్రిగా పనిచేసాడు (1952 ఏప్రిల్ 1 నుండి 1953 సెప్టెంబరు 30 వరకు).[3]

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో విద్య, పరిశ్రమలు,వాణిజ్య శాఖల మంత్రిగా పనిచేసాడు.

1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో పట్టాభిరామారావు పామర్రు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా శాసన సభకు ఏన్నికైనాడు. 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులుగా 1962 వరకు పనిచేసాడు. 1956 లో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో విద్యా శాఖామంత్రిగా,1960లో దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో విద్యా, రవాణా శాఖామంత్రిగా పనిచేసాడు[1].

1962లో తిరిగి పామర్రు నుండి గెలిచి 1967 వరకు ఉమ్మడి ఆంధ్రపదేశ్ శాసన సభలో సభ్యునిగా కొనసాగాడు.

1968 నుండి 1970 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా పనిచేసాడు.

రాజమండ్రి లోక్‌సభా నియోజకవర్గం నుండి వరుగా మూడు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికై ఐదోవ, ఆరోవ, ఏడోవ లోక్‌సభలలో (1971- 1984) సభ్యునిగా కొనసాగాడు[1].ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ, ఆర్థిక శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు.

పురస్కారాలు మార్చు

  • ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ 'కళా ప్రపూర్ణ ' పురస్కారం[1]
  • శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పురస్కారం[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "SBP Pattabhi ramarao, Lok Sabha Member Bioprofile". Lok Sabha Members Bioprofile. Retrieved 4 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Director of Information and Public Relations, Andhra Pradesh. 1978". Retrieved 9 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "1952 Madras Legislative Assembly elections". Retrieved 6 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)