యాత్ర (2019 సినిమా)
యాత్ర 2019 లో విడుదలైన తెలుగు సినిమా.[1][2]. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రం 2019 ఫిబ్రవరి 8న విడుదలైనది.[3]
యాత్ర | |
---|---|
దర్శకత్వం | మహి. వి. రాఘవ్ |
రచన | మహి. వి. రాఘవ్ |
నిర్మాత |
|
తారాగణం | మమ్ముట్టి జగపతి బాబు సుహాసిని |
ఛాయాగ్రహణం | సత్యన్ సూర్యన్ |
కూర్పు | ఎ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | కె |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | ఫిబ్రవరి 8, 2019 |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు, తమిళము, మళయాలం |
కథ
మార్చుఇది దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్భంగా వివిధ సంఘటనల ఆధారంగా తెరకెక్కబడిన సినిమా. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. ఆ యాత్ర సమయంలో వైఎస్‌ఆర్‌కు ఎదురైన అనుభవాలు. వాటి వల్ల వైఎస్ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులే ఈ సినిమా కథ. వైఎస్ జీవితంలో జరిగిన సంఘటనలు చూపిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు.. ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి.. పాదయాత్ర రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది.. యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి అన్నదే కథ.
తారాగణం
మార్చు- మమ్ముట్టి - వై. ఎస్. రాజశేఖర రెడ్డి
- జగపతి బాబు - వై. ఎస్. రాజారెడ్డి
- సుహాసిని - సబితా ఇంద్రా రెడ్డి[4]
- పోసాని కృష్ణ మురళి - కదిరి ఎం.ఎల్.ఎ సీట్ ఆశించే వెంకటరావు [5]
- రావు రమేశ్ - వై. ఎస్. స్నేహితుడు కె. వి. పి. రామచంద్రరావు[6]
- అనసూయ భరధ్వాజ్ - గౌరు సుచరితా రెడ్డి
- కల్పలత
సాంకేతికవర్గం
మార్చు- సంగీతం : కె
- దర్శకత్వం : మహి వీ రాఘవ
- నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
మూలాలు
మార్చు- ↑ Raja Sekar (June 21, 2018). "Mammootty starts shoot for YSR biopic Yatra;movie to release during Sankaranti 2019". Firstpost. Retrieved 9 July 2018.
- ↑ "Mammootty plays YS Rajasekhara Reddy in upcoming Telugu biopic Yatra, directed by Mahi Raghavg". Firstpost. 6 July 2018. Retrieved 8 July 2018.
- ↑ Nirmal Narayanan (September 13, 2018). "Mammootty's Yatra release date revealed". International Business Times. Retrieved 15 September 2018.
- ↑ SURESH KAVIRAYANI (20 June 2018). "Suhasini to play Sabitha Indra Reddy". Deccan Chronicle. Retrieved 18 September 2018.
- ↑ "is Posani right one to play expressionless ysr aide". Ntv. April 12, 2018. Retrieved 18 September 2018.[permanent dead link]
- ↑ Vyas (May 14, 2018). "Rao Ramesh Roped In For KVP Role In YSR Biopic". The Hans India. Retrieved 18 September 2018.