యోగివేమన (1947 సినిమా)

యోగి వేమన 1947 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. వాహిని పిక్చర్స్ బ్యానర్ పై కదిరి వెంకటరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావులు సంగీతాన్ని అందించారు.[1]

యోగి వేమన
(1947 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.రెడ్డి
నిర్మాణం బి.యన్.రెడ్డి,
మూలా నారాయణ స్వామి
తారాగణం చిత్తూరు నాగయ్య,
ముదిగొండ లింగమూర్తి,
ఎమ్.వి.రాజమ్మ,
దొరైస్వామి,
పార్వతీబాయి,
కృష్ణవేణి,
బెజవాడ రాజారత్నం,
పద్మనాభం
సంగీతం చిత్తూరు నాగయ్య,
ఓగిరాల రామచంద్రరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ వాహినీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఈ చిత్రంలో వేమన పాత్రధారి చిత్తూరు నాగయ్య. ఈ చిత్రంలో నాగయ్య నటన ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. నాగయ్య నటనతో పాటు కె వి రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. 1947వ సంవత్సరములో దేశానికి స్వతంత్రము వచ్చిన వెంటనే విడుదలయిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంలో నాగయ్య నటన ఒక ఎత్తు, ఆయన పాడిన పాటలు పద్యాలు ఒక ఎత్తు. తన అద్భుతమైన గాత్రంతో నాగయ్య వేమన పద్యాలను చక్కగా గానం చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆ పాటలు ఇప్పటికి "క్లాసిక్స్"గా పరిగణింపబడుతున్నాయి.

తారాగణం

మార్చు
  • చిత్తూరు నాగయ్య
  • ఎం.వి. రాజమ్మ
  • ముడిగాండ లింగమూర్తి
  • కాంతామణి
  • ఆర్. రామి రెడ్డి
  • వి. లక్ష్మీకాంతం
  • ఎ. సీత
  • రాయప్రోలు సుబ్రమణ్యం
  • పార్వతి బాయి

సాంకేతిక నిపుణులు

మార్చు
 
  • రన్ టైం : 174 నిమిషాలు
  • సినిమాటోగ్రఫీ - మార్కస్ బార్ట్‌లీ
  • సహాయ దర్శకుడు - కమలాకర కామేశ్వరరావు
  • నేపథ్యగానం - చిత్తూరు నాగయ్య, బెజవాడ రాజారత్నం
  • కోరియోగ్రఫీ - వేదాంతం రాఘవయ్య
  • దర్శకత్వం: కదిరి వెంకటరెడ్ది
  • స్టూడియో: వాహిని పిక్చర్స్
  • నిర్మాత: కదిరి వెంకట రెడ్డి;
  • రచయిత: కదిరి వెంకట రెడ్డి, కె. కామేశ్వర రావు, సముద్రాల రాఘవచార్య;
  • ఛాయాగ్రాహకుడు: మార్కస్ బార్ట్లీ;
  • ఎడిటర్: సి.పి. జంబులింగం, పి.వి. కోటేశ్వరరావు;
  • స్వరకర్త: చిత్తూరు.నాగయ్య, ఒగిరాలా రామచంద్రరావు;
  • గీత రచయిత: సముద్రాల రాఘవాచార్య

పాటలు

మార్చు
చందమామ జూలై 1947 సంచికలో యోగి వేమన ప్రకటన.
  1. అందాలు చిందేటి నా జ్యోతి ఆనందమొలికేటి నా జ్యోతి - నాగయ్య
  2. ఆపరాని తాపమాయెరా పాలేందుమౌళి ప్రాపుగోరి - ఘంటసాల, ఎం.వి. రాజమ్మ
  3. ఇదేనా ఇంతేనా జీవిత సారము ఇదేనా.. అంతులేని జీవన - నాగయ్య
  4. కనుపించుమురా మహదేవా కనులారా నిను కాంచి - నాగయ్య
  5. చదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు (పద్యాలు) - నాగయ్య
  6. జీవహింస మానండి జీవుల మీవలె ప్రేమించండి - నాగయ్య
  7. తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి (పద్యాలు ) - నాగయ్య
  8. తడవాయె ఇక లేవరా పోపోరా స్వామి తడవాయె - ఎం.వి. రాజమ్మ
  9. తడవాయె ఇక లేవరా పోపోరా స్వామి తడవాయె - నాగయ్య
  10. మాయను పడకే మనసా సాయము కలిమి సతమని నమ్మి - బెజవాడ రాజారత్నం
  11. వదలజాలరా నా వలపుదీర్పరా నిన్ను వదలజాలరా మనసారా - నాగయ్య
  12. వచ్చేపోయే తాడిలోన కోతి ఉన్నాది కోతిమూతిలోన - బేబి కృష్ణవేణి బృందం
  13. వెలదులార ముదముమీర నలుగిడ రారే - బృందం
  14. సేవకజన శుభకారి భవనాశ చంద్రమకుట చర్మాంభరధారి - ఎం.వి. రాజమ్మ

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Yogi Vemana (1947)". Indiancine.ma. Retrieved 2020-09-08.

బాహ్య లంకెలు

మార్చు
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య