సత్య హరిశ్చంద్ర (1965 సినిమా)

1965 తెలుగు సినిమా

సత్య హరిశ్చంద్ర విజయా పతాకంపై కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, ఎస్.వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల వంటి తారాగణంతో కూడిన 1965 నాటి పౌరాణిక చలనచిత్రం. సత్యం యొక్క గొప్పదనాన్ని సందేశంగా కలిగిన హరిశ్చంద్ర మహారాజు పౌరాణిక గాథను సినిమాగా మలిచారు. ఈ సినిమా ఆర్థికంగా పరాజయం పాలైంది.

సత్య హరిశ్చంద్ర
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.రెడ్డి
నిర్మాణం కె.వి.రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
ఎస్. వరలక్ష్మి,
నాగయ్య,
ముక్కామల,
రమణారెడ్డి,
రాజనాల,
మాష్టర్ బాబు,
రాజశ్రీ,
మీనాకుమారి,
రేలంగి,
గిరిజ
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్
విడుదల తేదీ ఏప్రిల్ 22, 1965
భాష తెలుగు

స్పందన

మార్చు

సత్య హరిశ్చంద్ర సినిమా భారీ పరాజయాన్ని పొందింది. ఎన్.టి.రామారావు, నాగయ్య వంటి నటులతో కూడిన భారీతారాగణం, కె.వి.రెడ్డి లాంటి ప్రఖ్యాత దర్శకుడు, విజయ ప్రొడక్షన్స్ వంటి విజయవంతమైన నిర్మాణ సంస్థ ఉన్నా ఆర్థికంగా విజయవంతం కాలేదు.[1]

పాటలు

మార్చు
 1. అందాల తనయా ఆనంద నిలయా ఇనవంశమణి వీవెరా దినదినము - ఎస్. వరలక్ష్మి
 2. అదిగో భానుప్రభలు చిమ్ముచు కనులన్‌గ్రమ్మి అనర్ఘ (పద్యం) - ఘంటసాల
 3. ఆడనీవు ఈడనేను సూసుకుంటు కూసుంటే ఎన్నాళ్ళు - స్వర్ణలత,రాజనాల మాటలతో
 4. ఈశ్వరా జగదీశ్వరా ఏమి ఖర్మము పట్టెరా ఎవరి కోపమొ ఎవరి పాపమొ - ఘంటసాల
 5. కలలోననైన నవ్వులకైన ఏనాడు అనృతమంబు పలుకని - ఘంటసాల
 6. కాలకౌశికు ముందు తలయెత్త గలవాడు ఎవడు వాడెవడు - మాధవపెద్ది బృందం
 7. కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా - ఘంటసాల బృందం
 8. తద్దినంపు భోజనం తలచుకుంటె చాలురా నోరూరు చుండెరా - బి. గోపాలం బృందం
 9. తాళి కట్టిన చేత తరుణి కంఠము త్రుంచు వింత యోగము (పద్యం) - ఘంటసాల
 10. ధిల్లాన - పి.లీల,గాయకుడు ?
 11. హే చంద్రచూడ మదనాంతకా శూలపాణే సాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో, .. నమో భూతనాధ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి
 12. నానా దేవ ధనంబులున్ ద్విజుల మాన్యంబుల్ వినా భురిసమస్త (పద్యం) - ఘంటసాల
 13. నీవు మాకు చిక్కినావులే రాజా మేము నీకు దక్కినాములే - సుశీల, పి.లీల
 14. భువిలోని మునులు .. అందాల తనయా ఆనంద ( విషాదం ) - ఎస్. వరలక్ష్మి
 15. భవవేద సారా సదా నిర్వికారా ..నమో భూతనాధ నమో దేవదేవ - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి బృందం
 16. లొకబాంధవా సర్వలోకైక వంద్య నాకు వేవేల జన్మములయందు (పద్యం) - ఎస్. వరలక్ష్మి
 17. వందే సురాణాం సారంచ సురేశం నీల లోహితం (శ్లోకం) - ఘంటసాల
 18. వంశమును నిల్పుకొరకే వివాహమనుచు అగ్నిసాక్షిగ పరిణయ (పద్యం) - ఘంటసాల
 19. విధి విపరీతం విధి విడ్డూరం విధి విలాసమన ఇదేకదా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి,పి. లీల
 20. శ్రీమన్మహా దివ్యతేజో విరాజీ కృపాళూ జగజ్జాల రక్షా - ఎస్. వరలక్ష్మి
 21. సత్యమునకెందు భంగము జరుగువేళ నీవెకదా సర్వరక్ష (పద్యం) - ఎస్. వరలక్ష్మి
 22. సత్యంబు పాలింప సర్వరాజ్యము వీడి ఆలుబిడ్డలతోడ (పద్యం) - ఘంటసాల

పాటలు

మార్చు
కులంలో ఏముందిరా సోదరా, మతంలో ఏముందిరా
మట్టిలో కలిసేటి మడీసీ మడిసికి భేదం ఏముంది ఏముందిరా !
నిలువు బొట్టుతో స్వరగం రాదురా, అడ్డ బొట్టుతో నరకం పోదురా
జుట్టూ బొట్టూ కట్టూలన్నీ పాడెకట్టుతో ఎగిరిపోవురా
జంగాలంతా శివుడే యంటరు దాసరులౌతే భవుడే యంటరు
జంగము దాసరి జగడమాడుకొని వల్లకాటిలో ఒకటై పోదురు
తలకో మతముగా నీతులు గీతులు బోధలు చేసే స్వాములు చివరకు
కాటిరేడు ఈ వీరబాహుని చేతి మీదుగా బూడిదవుదురు
---పింగళి నాగేంద్రరావు,ఘంటసాల,పెండ్యాల నాగేశ్వర రావు, 1965 సత్యహరిశ్చ౦ద్ర,

మూలాలు

మార్చు
 1. ఎం.బి.ఎస్., ప్రసాద్. "రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!". గ్రేట్ ఆంధ్రా. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 13 July 2015.
 • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల' అనే పాటల సంకలనం నుంచి.
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య