రఘు రాయ్

భారతీయ ఫోటోగ్రాఫరు, ఫోటో జర్నలిస్టు

రఘు రాయ్ (జననం 1942) భారతీయ ఫోటోగ్రాఫరు, ఫోటో జర్నలిస్టు.[1][2] అతను హెన్రీ కార్టియర్-బ్రెస్సన్ కు శిష్యుడు. అతను 1977 లో అప్పటికి యువ ఫోటో జర్నలిస్టైన రాయ్‌ని మాగ్నమ్ ఫోటోస్‌లో చేరడానికి నామినేట్ చేశాడు.

రఘు రాయ్
2015 లో రఘు రాయ్
జననం1942 (age 81–82)
ఝాంగ్, బ్రిటిషు భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిఫొటోగ్రాఫరు, ఫొటో జర్నలిస్టు
క్రియాశీలక సంవత్సరాలు1965 – present

రాయ్ 1960 ల మధ్యలో ఫోటోగ్రాఫరుగా మారాడు. త్వరలోనే న్యూ ఢిల్లీలోని ది స్టేట్స్‌మన్ పత్రికలో చేరాడు. 1976 లో అతను పేపర్‌ను విడిచిపెట్టి, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫరయ్యాడు. 1982 నుండి 1992 వరకు, రాయ్ ఇండియా టుడేకి ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా ఉన్నారు.[3]

అతను 1990 నుండి 1997 వరకు వరల్డ్ ప్రెస్ ఫోటో జ్యూరీలో పనిచేశాడు.[4][5] అతను అనేక పుస్తకాలు రాసాడు. ఇండియా: రిఫ్లెక్షన్స్ ఇన్ కలర్ అండ్ రిఫ్లెక్షన్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ పుస్తకం ప్రసిద్ధి పొందింది.[6][7][8][9]

ప్రారంభ జీవితం

మార్చు

రాయ్ బ్రిటిషు భారతదేశం. పంజాబ్‌లోని ఝాంగ్ గ్రామంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది),[5][10] నలుగురు పిల్లలలో చిన్నవాడుగా జన్మించాడు.[5]

కెరీర్

మార్చు

రాయ్ 1962లో ఫోటోగ్రాఫర్ అయిన తన అన్న శరంపాల్ చౌదరి (ఎస్ పాల్ అని పిలుస్తారు) వద్ద ఫోటోగ్రఫీ నేర్చుకోవడం ప్రారంభించాడు. 1965లో అతను "ది స్టేట్స్‌మన్" వార్తాపత్రికకు చీఫ్ ఫోటోగ్రాఫర్‌గా చేరాడు. 1968 వసంతకాలంలో బీటిల్స్ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు తన సహచరుడు సయీద్ నఖ్వీతో కలిసి ఆశ్రమాన్ని సందర్శించాడు.[11]

రాయ్ 1976 లో "ది స్టేట్స్‌మ్యాన్"ని విడిచిపెట్టి కలకత్తాలో ప్రచురితమైన "సండే" అనే వారపత్రికకు పిక్చర్ ఎడిటర్‌గా పనిచేశాడు. 1971 లో పారిస్‌ ప్రదర్శనలో అతని పనిని చూసిన హెన్రీ కార్టియర్-బ్రెస్సన్, 1977 లో మాగ్నమ్ ఫోటోస్‌లో చేరడానికి రాయ్‌ని నామినేట్ చేశాడు.[6]

రాయ్ 1980లో "సండే" నుండి నిష్క్రమించి, "ఇండియా టుడే"లో పిక్చర్ ఎడిటర్, ఫోటోగ్రాఫర్‌గా చేరాడు. 1982 నుండి 1991 వరకు, అతను ప్రత్యేక సంచికలు, డిజైన్లపై పనిచేశాడు, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఇతివృత్తాలపై సచిత్ర వ్యాసాలను అందించాడు.

గ్రీన్‌పీస్ కోసం, అతను 1984లో భోపాల్‌ రసాయన విపత్తుపై ఒక లోతైన డాక్యుమెంటరీ ప్రాజెక్టు చేశాడు. 1984లో ఇండియా టుడేలో జర్నలిస్ట్‌గా, గ్యాస్ బాధితుల జీవితాలపై దాని ప్రభావాలపై కవర్ చేశాడు. ఈ పని ఫలితంగా ఒక పుస్తకం, ఎక్స్‌పోజర్: ఎ కార్పొరేట్ క్రైమ్ అనే పుస్తకం, మరో మూడు ప్రదర్శనలు రూపుదిద్దుకున్నాయి. విపత్తు 20వ వార్షికోత్సవమైన 2004 తర్వాత యూరప్, అమెరికా, భారతదేశం, ఆగ్నేయాసియాలలో ఈ ప్రదర్శ్నలు నిర్వహించారు. ఈ విషాదం గురించి, భోపాల్ చుట్టుపక్కల కలుషిత వాతావరణంలో జీవిస్తున్న బాధితుల గురించీ మరింత అవగాహన కల్పించడం ద్వారా ప్రాణాలతో బయటపడిన చాలా మందికి ఈ ప్రదర్శన మద్దతు ఇవ్వాలని రాయ్ కోరుకున్నాడు.[12]

2003లో, బొంబాయి నగరంలో జియో మ్యాగజైన్ కోసం ఒక అసైన్మెంట్ లో ఉన్నప్పుడు, అతను డిజిటల్ కెమెరాను ఉపయోగించడం ప్రారంభించాడు. "ఆ క్షణం నుండి నేటి వరకు, నేను మళ్ళీ ఫిల్మును ఉపయోగించలేకపోయాను" అని అన్నాడు.[13]

2017 లో అతని కుమార్తె అవనీ రాయ్ తండ్రితో పాటు కశ్మీర్‌ వెళ్లి, అతని జీవితం గురించి లోతుగా తెలుసుకుంది. ఆమె ఈ ప్రయాణంపై రఘు రాయ్: యాన్ అన్‌ఫ్రేమ్డ్ పోర్ట్రెయిట్ అనే ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. దాని ఎగ్జిక్యూటివ్ నిర్మాత అనురాగ్ కశ్యప్.[14]

ఢిల్లీ, సిక్కులు, కలకత్తా, ఖజురహో, తాజ్ మహల్, టిబెట్ ఇన్ ఎక్సైల్, మదర్ థెరిసాతో సహా భారతదేశ సంస్కృతి, ప్రజలపై 18 కంటే ఎక్కువ పుస్తకాలను రఘు రాయ్ రూపొందించాడు. అతని ఫోటో వ్యాసాలు టైమ్, లైఫ్, జియో, ది న్యూయార్క్ టైమ్స్, సండే టైమ్స్, న్యూస్ వీక్, ది ఇండిపెండెంట్, న్యూయార్కర్ వంటి అనేక మ్యాగజైన్‌లు వార్తాపత్రికలలో ప్రచురితమయ్యాయి.[15] అతను వరల్డ్ ప్రెస్ ఫోటో జ్యూరీలో మూడు సార్లు పనిచేశాడు. యునెస్కో వారి అంతర్జాతీయ ఫోటోల పోటీ జ్యూరీలో రెండుసార్లు పనిచేశాడు.[5]

పురస్కారాలు

మార్చు
  • బంగ్లాదేశ్ యుద్ధంలో పని చేసినందుకు 1972లో పద్మశ్రీ [16]
  • USA నుండి ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ (1992)[15]
  • అకాడమీ డెస్ బ్యూక్స్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ అవార్డు - విలియం క్లైన్ 2019 [17]
  • కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) ద్వారా జీవితకాల సాఫల్య పురస్కారం 2017 [18]

ప్రదర్శనలు

మార్చు
  • 1997 రెట్రోస్పెక్టివ్ – నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, న్యూ ఢిల్లీ, ఇండియా.
  • 2002 రఘు రాయ్స్ ఇండియా – ఎ రెట్రోస్పెక్టివ్, ఫోటోఫ్యూజన్, లండన్[19]
  • 2002 వోల్కార్ట్ ఫౌండేషన్, వింటర్‌థర్, స్విట్జర్లాండ్
  • 2003 భోపాల్ - సాలా కన్సిలియార్, వెనిస్, ఇటలీ; ఫోటోగ్రాఫిక్ గ్యాలరీ, హెల్సింకి, ఫిన్లాండ్
  • 2003 ఎక్స్‌పోజర్: పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ కార్పొరేట్ క్రైమ్ – యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, ఆన్ అర్బోర్, USA
  • 2004 ఎక్స్పోజర్ - డ్రిక్ గ్యాలరీ, ఢాకా, బంగ్లాదేశ్; లైకా గ్యాలరీ, ప్రేగ్, చెక్ రిపబ్లిక్
  • 2005 భోపాల్ 1984–2004 – మెల్క్‌వెగ్ గ్యాలరీ, ఆమ్‌స్టర్‌డామ్, నెదర్లాండ్స్
  • 2005 భారతదేశం – మ్యూసీ కాపిటోలిని సెంట్రల్ మోంటెమార్టిని, రోమ్, ఇటలీ
  • 2007 రెన్‌కాంట్రెస్ డి'ఆర్లెస్ ఫెస్టివల్, ఫ్రాన్స్[20]
  • 2012 మై ఇండియా - ఫోటోఫ్రీయో, ఆస్ట్రేలియా
  • 2013 చెట్లు (నలుపు, తెలుపు), న్యూఢిల్లీ
  • 2014 ఇన్ లైట్ ఆఫ్ ఇండియా: రఘు రాయ్ ఫోటోగ్రఫీ, హాంగ్ కాంగ్ ఇంటర్నేషనల్ ఫోటో ఫెస్టివల్, హాంకాంగ్
  • 2015 ట్రీస్, ఆర్ట్ అలైవ్ ఆర్ట్ గ్యాలరీ, ఢిల్లీ[21]
  • 2016, రఘు రాయ్, ఓజస్ ఆర్ట్, న్యూ ఢిల్లీ యొక్క గ్రేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్[22]

పుస్తకాలు

మార్చు
  • 1974 ఎ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ ఇందిరా గాంధీ, నచికేతా పబ్లికేషన్స్, ఇండియా
  • 1983 ఢిల్లీః ఎ పోర్ట్రైట్, ఢిల్లీ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్/ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్, ఇండియా/యుకె
  • 1984 ది సిక్కులు, లస్టర్ ప్రెస్, ఇండియా
  • 1985 ఇందిరా గాంధీ (పుపుల్ జయకర్ లస్టర్ ప్రెస్, ఇండియా తో)
  • 1986/87 తాజ్ మహల్, టైమ్స్ ఎడిషన్స్, సింగపూర్ రాబర్ట్ లాఫోంట్, ఫ్రాన్స్ రిజోలి పబ్లికేషన్స్, USA
  • 1988 డ్రీమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్ బుక్స్ ఇంటర్నేషనల్, సింగపూర్ (ఎల్ 'ఇండే ఆర్థౌడ్, ఫ్రాన్స్)
  • 1989 కలకత్తా, టైమ్ బుక్స్ ఇంటర్నేషనల్, ఇండియా
  • 1990 ఢిల్లీ అండ్ ఆగ్రా (లాయ్ క్వోక్ కిన్, నితిన్ రాయ్ హంటర్ పబ్లికేషన్స్, ఇంక్., USA తో)
  • 1990/91 టిబెట్ ఇన్ ఎసిలియో, మొండోరి, ఇటలీ (టిబెట్ ఇన్ ఎక్సిలే క్రానికల్ బుక్స్, USA)
  • 1991 ఖజురాహో, టైమ్ బుక్స్ ఇంటర్నేషనల్, ఇండియా
  • 1994 రఘు రాయ్స్ ఢిల్లీ, ఇండస్/హార్పర్ కాలిన్స్, ఇండియా
  • 1996/01 డ్రీమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ ఎడిషన్స్, సింగపూర్/గ్రీన్విచ్, UK ISBN ISBN 9789812046062
  • 1996 ఫెయిత్ అండ్ కంపాషన్ః ది లైఫ్ అండ్ వర్క్ లేదా మదర్ థెరిసా, ఎలిమెంట్ బుక్స్, USA.  ISBN 9781852309121ఐఎస్బిఎన్ 9781852309121
  • 1997 మై ల్యాండ్ అండ్ ఇట్స్ పీపుల్, వఢేరా గ్యాలరీ, ఇండియా
  • 1998 మ్యాన్, మెటల్ అండ్ స్టీల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, లిమిటెడ్, ఇండియా
  • 2000 రఘు రాయ్... ఇన్ హిస్ ఓన్ వర్డ్స్, రోలి బుక్స్, ఇండియా
  • 2000 లక్షద్వీప్, యుటి ఆఫ్ లక్షద్వీప్
  • 2001 రఘు రాయ్స్ ఇండియా-ఎ రెట్రోస్పెక్టివ్, అసాహి షింబున్, జపాన్
  • 2002 భోపాల్ గ్యాస్ విషాదం (సరోపా ముఖర్జీ తులికా పబ్లిషర్స్ తో కలిసి, ఇండియా)
  • 2003/04 సెయింట్ మదర్ః ఎ లైఫ్ డెడికేటెడ్, టైమ్లెస్ బుక్స్, ఇండియా మేరే తెరెసా లా మార్టినియర్, ఫ్రాన్స్
  • 2004 ఎక్స్పోజర్ః పోర్ట్రైట్ ఆఫ్ ఎ కార్పొరేట్ క్రైమ్, గ్రీన్పీస్, నెదర్లాండ్స్
  • 2004 ఇందిరా గాంధీః ఎ లివింగ్ లెగసీ, టైంలెస్ బుక్స్, ఇండియా
  • 2005 రొమాన్స్ ఆఫ్ ఇండియా, టైమ్లెస్ బుక్స్, ఇండియా
  • 2005 మదర్ థెరిస్సాః ఎ లైఫ్ ఆఫ్ డెడికేషన్, హ్యారీ ఎన్. అబ్రామ్స్, USA.  ISBN 9780810958753ఐఎస్బిఎన్ 9780810958753
  • 2008 రఘు రాయ్ యొక్క ఇండియాః రిఫ్లెక్షన్స్ ఇన్ కలర్, హౌస్ బుక్స్.  ISBN 9781905791965ఐఎస్బిఎన్ 9781905791965
  • 2010 ఇండియాస్ గ్రేట్ మాస్టర్స్ః ఎ ఫోటోగ్రాఫిక్ జర్నీ ఇంటు ది హార్ట్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ [23]
  • 2011 ది ఇండియన్స్ః పోర్ట్రెయిట్స్ ఫ్రమ్ మై ఆల్బమ్, పెంగ్విన్ బుక్స్.  ISBN 978-0-670-08469-2ISBN 978-0-670-[24]
  • 2013 బంగ్లాదేశ్ః ది ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్, నియోగి బుక్స్.  ISBN 978-93-81523-69-8ఐఎస్బిఎన్ 978-93-81523-69-8
  • 2013 ట్రీస్, ఫోటోంక్, ఇండియా
  • 2014 ది టేల్ ఆఫ్ టూః యాన్ అవుట్గోయింగ్ అండ్ యాన్ ఇన్కమింగ్ ప్రైమ్ మినిస్టర్ది టేల్ ఆఫ్ టూః అవుట్గోయింగ్ అండ్ ఇన్ కమింగ్ ప్రైమ్ మినిస్టర్
  • 2014 విజయనగర సామ్రాజ్యంః పునరుత్థానం యొక్క శిధిలాలు, నియోగీ పుస్తకాలు.  ISBN 978-93-83098-24-8ఐఎస్బిఎన్ 978-93-83098-24-8

మూలాలు

మార్చు
  1. Raghu Rai: The Man Who Redefined Photojournalism in India
  2. Imaging India
  3. Lee, Kevin (14 November 2012). "Invisible Interview: Raghu Rai, India – Part 1". Invisible Photographer Asia. Retrieved 18 September 2014.
  4. "Home | World Press Photo". www.worldpressphoto.org. Retrieved 2022-08-11.
  5. 5.0 5.1 5.2 5.3 Day, Elizabeth (17 January 2010). "Raghu Rai | Interview". The Observer. Retrieved 18 September 2014.
  6. 6.0 6.1 "Pocketful of Rai". Time. 14 March 2011.
  7. Chaudhuri, Zinnia Ray (18 December 2015). "In pictures: Raghu Rai's five-decade career captures the essence of India". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-16.
  8. Bawa, Jaskirat Singh (2015-11-14). "Raghu Rai on the Story Behind His Five Most Iconic Photographs". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2021-01-16.
  9. "A good photographer needs fire in the belly, says award-winning photojournalist Raghu Rai". The New Indian Express. Retrieved 2021-01-16.
  10. "Oh my god! This was what it used to be". Mid-Day. 11 December 2010.
  11. "The Beatles and Me: In the Maharishi's Ashram, 50 Years Ago". The Wire. Retrieved 2022-06-01.
  12. "Picturing disaster". The Hindu. 15 September 2002.
  13. Lee, Kevin (14 November 2012). "Invisible Interview: Raghu Rai, India – Part 3". Invisible Photography Asia. Retrieved 18 September 2014.
  14. Ramnath, Nandini (30 July 2018). "In film on Raghu Rai, a daughter looks up to the light and tries to emerge from under the shadow". Scroll.in. Retrieved 16 September 2020.
  15. 15.0 15.1 all-about-photo.com. "Raghu Rai". All About Photo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-28.
  16. "Raghu Rai chosen as first recipient of newly instated international photography award". Business Standard India. Press Trust of India. 2019-09-16. Retrieved 2021-01-16.
  17. "The Magnum Digest: September 13, 2019". Magnum Photos. 13 September 2019. Retrieved 2019-09-16.
  18. Ahluwalia, Harveen (2017-03-23). "Raghu Rai conferred with Lifetime Achievement award". mint (in ఇంగ్లీష్). Retrieved 2021-01-16.
  19. "Photography Exhibition: Raghu Rai's India". Photofusion. Archived from the original on 2020-07-03. Retrieved 2020-07-03.
  20. "Presentation of the festival - Les Rencontres d'Arles". www.rencontres-arles.com. Archived from the original on 2019-03-30. Retrieved 2020-07-03.
  21. "Framing Flora". Verve Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-04-27. Retrieved 2021-01-16.
  22. "Picturing Time With Raghu Rai". Verve Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-01-27. Retrieved 2021-01-16.
  23. "Ragas in frames". The Hindu. 20 August 2010.
  24. "Sees, Shoots And Leaves". Tehelka. Vol. 8, no. 9. 5 March 2011. Archived from the original on 2016-08-25.
"https://te.wikipedia.org/w/index.php?title=రఘు_రాయ్&oldid=4306262" నుండి వెలికితీశారు