రవీంద్ర జడేజా

భారతీయ క్రికెటర్
(రవీంద్ర సింగ్ జడేజా నుండి దారిమార్పు చెందింది)

రవీంద్ర సిన్హ్ అనిరుధ్‌సిన్హ్ జడేజా (జననం 6 డిసెంబరు 1988) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. రవీంద్ర జడేజా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు. ఆయన అనిల్ కుంబ్లే తర్వాత ఐసిసి వన్డే బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి భారతీయ బౌలర్. రవీంద్ర జడేజా 2008-09 రంజీ ట్రోఫీ (42 వికెట్లు, 739 పరుగులు) లో చూపించిన బలమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతను జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి భారత జట్టులో స్థానం సంపాదించాడు.

రవీంద్ర జడేజా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రవీంద్ర సిన్హ్ అనిరుధ్‌సిన్హ్ జడేజా
పుట్టిన తేదీ (1988-12-06) 1988 డిసెంబరు 6 (వయసు 35)
నవగాం ఘెడ్, జాంనగర్ జిల్లా, గుజరాత్, భారతదేశం
మారుపేరురాక్‌స్టార్, సర్ రవీంద్ర జడేజా, జడ్డు,[1]
ఎత్తు1.73 మీ. (5 అ. 8 అం.)
బ్యాటింగుఎడమ చేతి
బౌలింగుఎడమ చేతి ఆర్థోడాక్స్ స్పిన్
పాత్రఆల్‌రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 275)2012 13 డిసెంబరు - ఇంగ్లాండు తో
చివరి టెస్టు2022 1 జులై - ఇంగ్లాండు తో
తొలి వన్‌డే (క్యాప్ 177)2009 ఫిబ్రవరి 8 - శ్రీలంక తో
చివరి వన్‌డే2022 17 జులై - ఇంగ్లాండు తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.8
తొలి T20I (క్యాప్ 22)2009 ఫిబ్రవరి 10 - శ్రీలంక తో
చివరి T20I2024 జూన్ 29 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006–ప్రస్తుతంసౌరాష్ట్ర
2008–2009రాజస్తాన్ రాయల్స్
2011కొచ్చి టస్కర్స్ కేరళ
2012–2015చెన్నై సూపర్ కింగ్స్
2016–2017గుజరాత్ లయన్స్
2018–ప్రస్తుతంచెన్నై సూపర్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే టి 20 ఫస్ట్
మ్యాచ్‌లు 60 171 63 114
చేసిన పరుగులు 2,523 2,447 457 6,579
బ్యాటింగు సగటు 36.56 32.62 24.05 46.65
100లు/50లు 4/17 0/13 0/0 12/34
అత్యుత్తమ స్కోరు 175 నాటౌట్* 87 46 నాటౌట్* 331
వేసిన బంతులు 14,751 8,611 1,213 26,809
వికెట్లు 242 189 50 453
బౌలింగు సగటు 24.71 37.36 28.76 24.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 10 1 0 28
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0 7
అత్యుత్తమ బౌలింగు 7/48 5/36 3/15 7/31
క్యాచ్‌లు/స్టంపింగులు 39/– 63/– 24/– 90/–
మూలం: ESPNcricinfo

వివాహం

మార్చు

రవీంద్ర జడేజా 17 ఏప్రిల్ 2016న రీవా సోలంకిని వివాహమాడాడు.[2] వారిద్దరికీ జూన్ 2017లో కూతురు నిధ్యాన జన్మించింది.[3] రీవా సోలంకిని వివాహనంతరం రివాబా జడేజా గా పిలుస్తున్నారు. ఆమె 2022 గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై ఉత్తర జామ్ నగర్ నుంచి పోటీ చేస్తోంది.[4]

ఆటనుండి విరమణ

మార్చు

2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా 2024, జూన్ 29న జరిగిన 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై గెలిచి టీ20 ప్రపంచ కప్ సాధించిన తరువాత, అంతర్జాతీయ ట్వంటీ20 ఫార్మాటు నుండి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

మూలాలు

మార్చు
  1. Bhattacharjee, Argha (సెప్టెంబరు 30 2017). "Virat as 'Cheeku', Dhoni as 'Mahi' - The fascinating story behind the nicknames of Indian cricketers". DNA India. Retrieved ఫిబ్రవరి 20 2022. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  2. Andhra Jyothy (నవంబరు 7 2022). "ప్రత్యర్థులుగా తలపడనున్న రవీంద్ర జడేజా భార్య, సోదరి!". Archived from the original on నవంబరు 8 2022. Retrieved నవంబరు 8 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  3. The Indian Express (జూన్ 13 2017). "Ravindra Jadeja, wife give baby daughter Sanskrit inspired name" (in ఇంగ్లీష్). Archived from the original on నవంబరు 8 2022. Retrieved నవంబరు 8 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  4. "Gujarat elections : మోదీకి రవీంద్ర జడేజా ధన్యవాదాలు | ravindra jadeja thanks to pm modi after his wife was given bjp ticket to contest gujarat polls yvr". web.archive.org. 2022-11-11. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)