రసములు
రసం ఒక భావోద్వేగ స్థాయి (emotional state). ప్రాచీన భారత దేశపు భరతముని తన నాట్య శాస్త్రం లో ఎనిమిది రసాలను నిర్వచించారు. ఈ రసాలను సాధించే కళాకారుడు ఒక్కో రసం ద్వారా (వలన) ఒక్కో భావాన్ని ప్రేక్షకులలో సృష్టించ గలుగుతాడు. తరువాత అవసరాన్ని బట్టి వాడు కోవటానికి అనుగుణంగా ఈ ఎనిమిదింటికీ శాంత రసాన్ని ఉపగుప్తుడు జోడించాడు. నటనకూ నాట్యానికీ సమానంగా ఉపయోగ పడే ఈ రసాలు ఈనాటికీ మన భారతీయ కళలకు మూలాధారం. ప్రతీ కళాకారుడూ ఈ రసాలను ఎరిగి ఉండటం ఎంతైనా అవసరం. ఈ రసాలను సాదించటాన్ని రసాభినయం అంటారు.
భాషా విశేషాలు
మార్చుతెలుగు భాషలో రసము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] రసము [ rasamu ] rasamu. సంస్కృతం n. అనగా Juice, fluid, liquid, extract, essence. Taste, flavour, రుచి. Taste, sentiment, emotion, passion, affection, humour. Quicksilver, పాదరసము. The షడ్రసములు or six flavours are మధురము or తీసి sweet; ఆమ్లము or పులుసు sour; తిక్తము or వగరు astringent; లవణము or ఉప్పు salt; కటువు or కారము pungent; కషాయము or చేదు bitter. రసఖండమైన భూమి లేదా రసవత్తైన భూమి strong soil, which is not exhausted. నీరసమైన భూమి land that is exhausted. కోపరసము the spirit of wrath. దయారసము the spirit of love, kind feelings. ఈ పద్యములో రసము లేదు this is a tasteless verse. విరసమైన మాటలు rude language. The nine నవరసములు or humours produce the following స్థాయీభావములు (symptoms.) 1. శృంగారరసము (love) produces రతి enjoyement. 2. వీరరసము (honour) produces ఉత్సాహము daring. 3. కరుణారసము (mercy) begets విస్మయము marvel. 5. హాస్యరసము (merriment) produces హాస్యభావము laughter. 6. భయానకరసము (timidity) leads to భయము fright. 7. బీభత్సరసము (austerity) begets జుగుప్స sarcasm. 8. రౌద్రరసము (wrath) leads to క్రోధము cruelty. 9. శాంతరసము. (gentleness) produces శమభావము calmness. రస కర్పూరము rasa-karpūramu. n. A white sublimate or muriate of mercury, కర్పూరరసము. రసగుండు rasa-gunḍu. n. A ball coated with quicksilver, రసము పూరిన గుండు. రసజ్ఞు rasa-gnya. n. The tongue, నాలుక. రజజ్ఞత rasa-gnyata. n. Skill, judgement, taste, critical discernment, తెలివి. రసజ్ఞుడు rasa-gnyuḍu. n. A man of taste, a critic. గుణదోషములనెరిగినవాడు. రసదాడి or రసదాళి rasa-dāḍi. n. Sugar cane. చెరుకు. "మమధురస్థూలదాడిమబీజములతోడ, దసరారురసదాడిగనెలతోడ." A. ii. 85. A fine sort of plantain. అరటిలో భేదము. రసదాళిక rusa-dāḷika. n. A kind of sugar, చెరుకుదినుసు. రసన rasana. n. The tongue., నాలుక. రసనేంద్రియము rasan-ēndriyamu. n. The sense of taste. రసవటి rasa-vati. n. A kitchen. వంట ఇల్లు. రసవర్గములు rasa-vargamulu. n. plu. The various condiments or ingredients such as salt, pepper, &c. సంబారములు. రసవాదము rasa-vādamu. n. Alchemy, chemistry, పాదరసమును కట్టి బంగారుచేయు విద్య. రసవాది rasa-vādi. n. An alchemist, a chemist, రసమును కట్టి బంగారు చేయువాడు. రససిందూరము rasa-sindūramu. n. A sort of factitious cinnabar, made with zinc, mercury, blue vitriol and nitre, ఔషధవిశేషము. రససిద్ధి rasa-siddhi. n. Alchemy, రసవాదము. "ధమనీయఖంబున గ్రాలించిమెరుంగుపసిడి గనెరససిద్దిన్." R. vi. 10. రసాంజనము a kind of collyrium. అంజనవిశేషము. రసాతలము rasā-talamu. n. A name of Hades. పాతాళలోకము. రసాభాసము ras-ābhāsamu. n. Bad taste, inelegance. adj. Disagreeable, disgusting. విరసమైన. ఆ శ్లోకమును దిద్ది రసాబాసము చేసాడు in correcting the verse he has spoiled it, he showed bad taste in correcting it. రసాభాసముగా మాట్లాడినాడు he spoke coarsely. ఆ యిల్లు నిండా రసాభాసముగా నున్నది that house is very disagreeable. ఊరేగుచుండగా వాన వచ్చి అంతా రసాభాసమైపోయినది when the marriage procession was going on, there was a shower and everything was upset. రసాయనము ras-āyanamu. n. A panacea, a medicine preventing old age and prolonging life, జరావ్యాధిహరౌషధము. Butter milk, sweet curds, గోరసము, చల్ల. Poison, విషము. "తననచో మాధుర్యమెనయు నా యివి చూడుమన్నట్లు మేలి రసాయనములు, ఒప్పుగా గిన్నియల నుంచి యపచరించి." T. iii. 18. టీ రసాయనములు, తీసిగలిగిన పదార్థములు. రసాల rasāla. n. A pudding or mess of curds, mixed up with sugar and spices. పెరుగులో ననేక ద్రవ్యములు వేసి చేసినది. రసాలము rasālamu. n. The sugar cane, చెరుకు. Also, the sweet mango tree, తియ్య మామిడి చెట్టు. రసావళ్లు ras-āvaḷḷu. n. A kind of cakes. "తన యింటనప్పుడాయితమొనరించిన కమ్మదావు లొలుకు రసావళ్లును మినుప వడలు జాపట్లును గోదుమ పిండివంటలున్ గలవనినన్." Vish. iii. 377. రసి or రసిక rasi. [Tel.] n. The pus, or matter of a sore, serum. పుంటి చీము. రసిక rasika. [Skt.] n. A woman of taste. రసికురాలు. రసికత or రసికత్వము rasikata. [Skt.] n. Good taste or judgement. రసజ్ఞత. రసికుడు rasikuḍu. A man of taste. శృంగారాది రసములను గ్రహించువాడు, రసజ్ఞుడు. రసితము rasi-tamu. n. Sound noise, thunder. ధ్వని, ఉరుము.
నవరసాలు
మార్చుशृन्गाारहास्यकरुणः रौद्रवीरभयानकः बीभत्साद्भुतशान्ताच्यत्येते नवरसास्मृतः నవరసాలనూ వివరించే సంస్కృత శ్లోకం
తొమ్మిది ప్రాథమిక రసాలను నవరసాలు అంటారు. అవి:
- శృంగార రసం లేదా ప్రేమ రసం Śṛngāram (शृन्गाारं)
- హాస్య రసం (Hāsyam) (हास्यं)
- కరుణ రసం (Karuṇam) (करुणं)
- రౌద్ర రసం (Raudram) (रौद्रं)
- వీర రసం (Vīram) (वीरं)
- భయానక రసం (Bhayānakam) (भयानकं)
- బీభత్స రసం (Bībhatsam) (बीभत्सं)
- అద్భుత రసం (Adbhutam) (अद्भुतं)
- శాంత రసం (Śāntam) (शान्तं)
భావాలు
మార్చునవరసాలలో మొదటి ఎనిమిది రసాలకూ సంబంధించిన భావాలను నాట్యశాస్త్రంలో భరతముని ఇలా చెప్పారు:
- రతి (Love)
- హాస్యం (Mirth)
- శోకం (Sorrow)
- క్రోధం(Anger)
- ఉత్సాహం (Energy)
- భయం (Terror)
- జుగుప్స (Disgust)
- విస్మయం (Astonishment)
ప్రదర్శకులు
మార్చుకీర్తిశేషులు పద్మశ్రీ మణి మాధవ చక్యర్ గారిని రసాభినయంలో ప్రామాణికంగా భావిస్తారు. నవరసాల్ని వాటి అంచుల వరకూ ప్రదర్శించటంలో ఆయనది అసాధారణ సామర్థ్యం. ఆయన నవరసాభినయం సంగీత్ నాటక్ అకాడమీ లాంటి ఎన్నో పురావస్తు ప్రదర్శనశాలల్లో భద్రపరిచారు.