రహదారి ప్రమాదాలు (Road accidents), రహదారి మీద సంభవించే ప్రమాదాలును రహదారి ప్రమాదాలు అంటారు.రహదారి ప్రమాదాలలో సాధారణంగా వాహనాలు ఒకదానినొకటి గాని, లేదా రహదారి మీద నడిచే పాదాచారుల్ని లేదా జంతువుల్ని 'డీకొట్టి' ద్వారా జరుగతాయి.రహదారి ప్రమాదాల వలన రహదారి మీద ప్రయాణించే ప్రయాణికులకు, జంతువులుకు గాయాలు, కొన్ని సందర్బాలలో మరణాలు సంభవిస్తాయి.వాహనాలకు నష్టం జరుగు సందర్బాలు ఉంటాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రమాదాలకు గురైన కొన్ని కార్లను రహదారి కూడలి వద్ద ప్రదర్శించుతున్నారు. ప్రయాణీకులలో భద్రత అవసరం పట్ల అవగాహనను పెంచడానికి ఇలా చేస్తున్నారు

ఇందుకు గల కారణాలు

మార్చు

చోదకుని వైఫల్యాలు

మార్చు
 
ఒక నిముషం సమయం ఆదాచేయడం ఇంతదాకా తెస్తుందని ఒక హెచ్చరిక

రహదారి మీద వాహనాలు నడిపే వ్యక్తుల సామర్థ్యం వారి యొక్క భౌతిక, మానసిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. పరిశోధనలు ద్వారా గుర్తించిన కొన్ని ముఖ్యమైన కారణాలుట [1]

 
ప్రమాదానికి గురైన ఒక కారు
  • దృష్టి లోపాలు, శారీరీక వైకల్యాలు - ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను నివారించడానికి చాలా అధికార సంస్థలు విపులమైన పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని విధాలైన వైకల్యాలున్నవారు తమకు అనుగుణంగా వాహనాలలో ప్రత్యేకమైన మార్పులు చేసుకోవలసి ఉంటుంది;
  • వృద్ధాప్యం - ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను నివారించడానికి అధికార సంస్థలు ఒక వయసు మించిన చోదకులు తిరిగి పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది. వేగం, దృష్టి సునిశితలను ప్రత్యేకంగా పరీక్షిస్తుంటారు. ;
  • అలసట - ఆపకుండా ఎక్కువ దూరం వాహనాన్ని నడపడం, నిద్రలేమి, ఇతర కారణాలవలన అలసట వంటివాటి వలన చోదకుని ఏకాగ్రత దెబ్బ తింటుంది. కనుక ప్రతి రెండు గంటల తరువాత కనీసం 15 నిముషాలు విశ్రాంతి తీసుకోవడం మంచిదని అంటారు.
  • మద్యపానం వంటి మత్తు పదార్ధాల సేవనం. ;
  • కొన్ని మందుల వాడకం - ఉదాహరణకు జలుబు, జ్వరం, వంటి నొప్పులు వంటి అనారోగ్యాలకు వాడే మందులు మత్తును కలుగజేస్తాయి.

మూలాలు

మార్చు
  1. "Research projects, Theme 3: Impairment" (Policy, guidance and research ed.). UK Department for Transport. Archived from the original on 2008-02-22. Retrieved 2008-01-01.


వెలుపలి లింకులు

మార్చు

[[వర్గం:మ


రణాలు]]