రాంగఢ్ జిల్లా

జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో రాంగఢ్ (హిందీ: रामगढ़ जिला) జిల్లా ఒకటి.

రాంగఢ్ జిల్లా
జార్ఖండ్ పటంలో రాంగఢ్ జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో రాంగఢ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుఉత్తర ఛోటా నాగ్‌పూర్
ముఖ్య పట్టణంరాంగఢ్ కంటోన్మెంట్
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుహజారీబాగ్
 • శాసనసభ నియోజకవర్గాలురాంగఢ్, మండూ, బర్కాగావ్
విస్తీర్ణం
 • మొత్తం1,211 km2 (468 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం9,49,159
 • సాంద్రత780/km2 (2,000/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.92 %
 • లింగ నిష్పత్తి921
ప్రధాన రహదార్లుNH 33 and NH 23
జాలస్థలిఅధికారిక జాలస్థలి
రాజ్రప్ప దేవాలయం దగ్గర దామోదర్ నది

భౌగోళికముసవరించు

రాంగఢ్ జిల్లా 2007 సెప్టెంబరు 12 లో ఏర్పాటయినది. ఇది ఆనాటి హజారిభాగ్ జిల్లా (జార్ఖండ్ స్టేట్ మధ్యలో)నుండి విడదీసి కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. రాంగఢ్ అనగా రాముని కోట అని అర్థము. ప్రస్తుతము ఈ జిల్లా కేంద్రమైన రాంగఢ్ కు ఆ పేరు జిల్లా పేరు రాంగఢ్ నుండి వచ్చింది.

భౌగోళికంసవరించు

రాంగఢ్ 2007 సెప్టెంబరు 12 న జిల్లాగా రూపొందుంచబడింది. హజారీబాగ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరిచేసి ఈ జిల్లా రూపొందించబడుంది.రాంగఢ్ జిల్లా జార్ఖండ్ రాష్ట్రం కేంద్రస్థానంలో ఉంది. జిల్లా గనులు, పరిశ్రమలు, సస్కృతికి కేంద్రంగా ఉంది.[1] జిల్లా " మా చిన్నమస్తా ఆలయం ఉంది. రాంగఢ్ అంటే " రాముని ఇల్లు " అని అర్ధం. జిల్లాకు కేంద్రంగా ఉన్న రాంగఢ్ పట్టణం పేరును జిల్లాకు పెట్టారు.

  • ఈ జిల్లా విస్తేర్ణము: 1360.08 చ.కిలోమీటర్లు.
  • జిల్లా వైశాల్యం 360.08 చ.కి.మీ.
  • సబ్ డివిజన్: రాంగఢ్.
  • ఉపవిభాగం రాంగఢ్
  • రాంగఢ్ లోని బ్లాకులు: రాంగఢ్, గోల, మందు, చితాపూర్, దుల్మి.
  • రాంగఢ్ బ్లాకులు :[2] రాంగఢ్, పత్రటు, గొల, మండు,చితర్పూర్, డుల్మి.
  • జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం గోలా లో వున్నది.
  • జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ గొలాలో ఉంది.
  • అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు.[3]
  • లోక్ సభ నియోజక: హజారీబాగ్
  • పార్లమెంటు సభ్యుడు: జయంత్ సిన్హా
  • విధాన్ సభ నియోజక:
  • రాం ఘర్ ​​: రామ్ ఘర్ పోలీస్ స్టేషను (మినహాయించి జి.పి.ఎస్ తెర్ప (పత్రటు), కోటో, పళని, హపుహుయా, హరికర్పూర్, జెగ్డా, డెయొరియా, బర్గమ, పాళీ, సల్గొ, శంకీ,జబొ, చైంగరి, చికోర్, లపంగ, ఘుటుయా, బర్కకానా, సిధ్వర్ -కలాన్), గోలా పోలీస్ స్టేషను.
  • మండు (పార్ట్): మండు పోలీస్ స్టేషన్లు.
  • బర్కగోయన్ (పార్ట్): జి.పి.ఎస్. రంగార్హ పోలీస్ స్టేషను‌లో తెర్ప, పత్రటు, కోటో, పళని, హపుహుయా, హరిజర్పు జెగ్డా, డెయొరియా, బర్గమ, పాళీ, సల్గొ, శంకీ, జబొ, చైంగర, చికొర్, లపంగ, ఘుటుయా, బర్కకానా, సిద్వర్-కలాన్.
  • 'రాంగఢ్ జిల్లా సరిహద్దులు :[4]
  • ఉత్తర, పశ్చిమ: హజారీబాగ్ జిల్లాలో
  • ఉత్తర, ఈస్ట్: బొకారో జిల్లా
  • ఈస్ట్: పురులియా జిల్లా (పశ్చిమ బెంగాల్)
  • దక్షిణ రాంచీ జిల్లా

పేరువెనుక చరిత్రసవరించు

పురాణ కథనాలను అనుసరించి రాంగఢ్ అంటే " రాముని ఇల్లు " అని అర్ధం. రామాయణ కాలంలో శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఇక్కడ నివసించాడని విశ్వసిస్తున్నారు.

పురాతన చరిత్రసవరించు

భారతభూమిలో మానవ ఆవాసాలు ఆరభం అయిన నాటి నుండి రాంగఢ్ చరిత్రకు సంబంధం ఉందని భావిస్తున్నారు.

  • రాతుయుగం: దామోదర్ నదీతీరంలో రాతియుగంనాటి పనిముట్లు లభించాయి.[5] were found
  • మహాజనపదాలు : మహా శక్తివంతుడైన జరాసంధుని సామ్రాజ్యంలో (మగధ) [6] చోటానాగపూర్ భాగంగా ఉన్నట్లు విశ్వసిస్తున్నారు. ఈ ప్రాంతానికి నాగవన్శీయుడైన ఉగ్రసేన నందుడు రాజుగా ఉన్నాడని భావిస్తున్నారు.

మయూరా సామ్రాజ్యముసవరించు

అశోక చక్రవర్తి (క్రి.పూ 273-232 ) సామ్రాజ్యంలో చోటానాగపూరు ప్రాతంతం అతా సామంత రాజ్యంగ ఉంది. కనుక బుద్ధుని కాలంనాటికి రాంగఢ్ ఉందని ఋజువులు ఉన్నాయి.

బుద్ధిజం, జైనిజంసవరించు

బౌద్ధ కాలానికి ౠజువుగా గోలా గ్రామంలో బుద్ధుని ఆలయం ఉంది. 8వ శతాబ్ధంలో జైన్ తీర్ధంకరులు పర్సనాథ్‌లో నిర్మించిన ఆలయం ఈ ప్రాంతానికి జైనిజంతో ఉన్న సంబంధం తెలుస్తుంది.

గుప్త సామ్రాజ్యంసవరించు

సముద్రగుప్త మహారాజు (సా.శ. 385-380) [6] తూర్పు కనుమల ప్రాంతంమీద దండయాత్రచేసమయంలో రాంగఢ్ మీదుగా ప్రయాణించినాడని భావిస్తున్నారు. ఈ కాలాన్ని భారతదేశ స్వర్ణ యుగమని భావిస్తున్నారు.

  • ఈ ప్రాంతాన్ని ముద్రరాజు పాలించాడు. అందుకు గుర్తుగా ఇక్కడ ముండా గిరిజనులు ఉన్నారని భావిస్తున్నారు.
  • నాగవంశీ కాలంలో రాంగఢ్ ఆధీనంలో చోటానాగపూర్ ఉండేదని భావిస్తున్నారు.

మధ్య యుగంసవరించు

  • ముస్లిం పాలన : తుర్క్- అఫ్ఘన్ కాలంలో (సా.శ. 1206-1526) జార్ఖండ్ అరణ్యప్రాంతం సామంత రాజుల ఆధీనంలో ఉంది. ప్రస్తుత కూడా అందులో భాగంగా ఉన్న రాంగఢ్ 1368 లో సామంత రాజ్యంగా అవతరించింది.[7] రాంగఢ్ రాజ్యానికి మొదటి రాజుగా భగదేవ్ సింగ్ పదవిని చేపట్టాడు.

ఆ సమయంలో రాంగఢ్ రాజధాని సిరాలో ఉండేది. తరువాత రాజధాని ఉద్రా, బాదం, రాంగఢ్, పద్మ ఒకటి తరువాత ఒకటిగా మారింది. 1670 లో రాంగఢ్ పాలన రాజధాని రాంగఢ్‌కు మారింది. రాంగఢ్ రాజ్యాన్ని పద్మరాజా రాజ్యం అని పిలిచేవారు. 1740 లో రాంగఢ్ రాజ్యంలో రాంగఢ్ " రాంగఢ్ జంగిల్ జిల్లాగా " ఉండేది. [8]

ఆధునిక యుగంసవరించు

బ్రిటిష్ పాలన : రెండవ షాహ్ అలాం రాంగఢ్ పాలనాధికారం ఈస్టిండియా కంపనీ పరం చేసాడు.

1771 లో కేప్టన్ కొమాక్ రాంగఢ్ సైనికాధికారిగా నియమినబడ్డాడు.[9] ఆయన ప్రధాన కార్యాలయం చత్రాలో ఉంది. రాంగఢ్ సైనిక జిల్లాలో రాంగఢ్‌లో నాగపూర్, పాలమూ, హజారీబాగ్, చత్రా, గిరిడి, కొడెర్మా ప్రాంతాలు ఉన్నాయి.[10] రాంగఢ్ బెటాలియన్ ప్రధానకార్యాలయం హజారీబాగ్‌లో ఉంది. దీనికి యురేపియన్ కమాండర్‌గా ఉన్నాడు.

ప్రముఖ సాంఘిక సంస్కర్త బ్రహ్మసమాజ స్థాపకుడు అయిన రాజారామమోహనరాయ్ 1805 -1806 లో రాంగఢ్‌లో నివసించాడు. విలియం డిగ్గీ రాంగఢ్ మెజిస్ట్రేట్, రిజిస్టారుగా పనిచేసాడు. రాజారామమోహనరాయ్ కలెక్టరేట్‌లో షెరిస్టేదార్‌గా పనిచేసాడు. అప్పుడు రాజారామమోహనరాయ్ విలియం డిగ్గీ ఒకే సత్రంలో నివసించేవారు. వారిద్దరి మధ్య ఉన్న మైత్రికారణంగా విలియం డిగ్గీ రాంగఢ్‌కు వచ్చే సమయంలో రాజారామమోహనరాయ్‌ను కూడా తనతో తీసుకు వాచ్చాడు.

  • 1811 లో రాంగఢ్ బెటాలియన్ ముండా ఉరయాన్, తమడ్ తిరుగుబాటును, కోల్ తిరుగుబాటును అణచడానికి ఉపయోగించబడింది. 1937 లో రాంగఢ్ బ్రిటిష్ ప్రభుత్వ

పోలీస్ స్టేషను‌గా చేయబడింది.

  • 1938 లో బనారస్ రోడ్డును మూసి న్యూ జి.టి రోడ్ ఆరంభించబడింది. అరుణ్ మంఝి, బైను మంఝి సీతాఘర్‌లో కాఫీతోటలను ప్రారంభించారు.
  • 1857 మొదటి దేశీయ తిరుగుబాటు తరువాత రూపు మంఝి పేరు వెలుగులోకి వచ్చింది.
  • 1856 జనవరి 8 న షైక్ భికారి, థాకుర్ ఉపరాన్ సింఘ్ చుట్టుపల్లి లోయలోని మర్రి చెట్టుకు ఉరివేయబడ్డాడు. ఆ మర్రిచెట్టును " పాన్‌యాహి మర్రి " అని పిలువబడింది.
  • 1941లో రాంగఢ్ కంటోన్మెంటు నిర్మించబడింది. రాంగఢ్‌లో (2) సైనిక శిక్షణా కేంద్రాలు ఉన్నాయి: " సిఖ్ రెజిమెంటల్ సెంటర్ ", " పంజాబు రెజిమెంటల్ సెంటర్ "

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంసవరించు

1940 లో ఐ.ఎన్.సి 53 సభ [11][12] మౌలానా అబ్దుల్ కలాం అజిద్ నాయకత్వంలో రాంగఢ్ లోని ఝందాచోక్ (రాంగఢ్ కంటోన్మెంట్) వద్ద నిర్వహించబడింది. మహాత్మాగాంధి ,[13] జహర్లాల్ నెహ్ర, సరదార్ పఠేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద, సరోజినీ నాయుడు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆచార్య జె.బి. క్రిపలానీ, జమన్ లాల్ బజాజ్ (పారిశ్రామికవేత్త), ఇతర స్వంతంత్ర సమర ప్రముఖులు [14] రాంగఢ్ సమావేశంలో పాల్గొన్నారు. [15] రాంగఢ్‌లో మహాత్మాగాంధీ చేత ఖాది, గ్రామీణ పరిశ్రమల ప్రదర్శన ఆరంభించబడింది..[16] అదే సమయంలో తుఫాను, హరికేన్ ఉచ్చస్థాయిలో ఉండడం విశేషం. అదే సమయం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో సమఝౌతాకు వ్యతిరేకంగా సమావేశం ముగిసింది. రాంగఢ్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ " ఆల్‌ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ " పార్టీకి అద్యక్షత వహించాడు. అలాగే " రాడికల్ డెమొక్రసీ " పార్టీకి ఎం.ఎన్.రాయ్ అధ్యక్షత వహించాడు.

స్వతంత్రం తరువాతసవరించు

1947లో స్వతంత్రం వచ్చిన ప్రస్తుత రాంగఢ్ జిల్లా ప్రాంతం మునుపటి హజారీబాగ్ జిల్లాలో భాగం అయింది. 1952లో రాంగఢ్ బ్లాక్ రుఇపొందించబడింది. 1991లో రాంగఢ్ ఉపవిభాగం ఏర్పడ్జింది. 1976లో సిఖ్ రెజిమెంటల్ సెంటర్ మెరుట్ నుండి రాంగఢ్‌ కంటోన్మెంటుకు తరలించబడింది. 2007 సెప్టెంబరు 12 న రాంగఢ్ జిల్లాగా రఒందించబడింది. రాంగఢ్, గోలా, మండు, పత్రతు బ్లాకులు జిల్లాలో చేర్చబడ్డాయి. తరువాత రాష్ట్ర జిల్లాల సంఖ్య 24కు చేరింది.

ప్రముఖులుసవరించు

  • బబుల్ మరాండి జార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. మరాండి రాంగఢ్ ఎం.ఎల్.ఎగా ఎన్నికై ముఖ్యమంత్రి కావడం విశేషం.
  • సిబుసొరన్ రాంగఢ్ లోని నెంరా గ్రామంలో పుట్టాడు. ఆయన 3 మార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన కుమారుడు హేమంత్ సొరం 2013 జనవరి 18న జార్ఖండ్ ఉపముఖ్య మంత్రి అయ్యాడు.
  • 2009లో కొత్తగా రాంగఢ్ బ్లాకు నుండి డుల్మి, చితార్ పూర్ రూపొందించబడ్డాయి.
  • 2012 సెప్టెంబరు 13 న దేశంలో మొదటి సారిగా ప్రభుత్వం కె.సి.సి, ఇంద్ర ఆవాస్ యు.ఐ.డి లేక ఆదార్ కార్డ్ ప్రవేశపెట్టింది [17]
  • 2013 జనవరి 8 న జార్ఖండ్ ప్రభుత్వం హజారీబాగ్ జిల్లా లోని డరి బ్లాక్‌ను రాంగఢ్ జిల్లాలో కలుపబడింది. అలాగే కొత్తగా చైన్ గడ బ్లాక్ ఏర్పాటు చేయబడింది.

[18] అలాగే బొకారో జిల్లా నుండి గోమియా బ్లాక్ నుండి మహుయాతండ్ బ్లాక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి వాటిని రాంగఢ్ జిల్లాలో కలపాలని నిర్ణయించింది. అయినప్పటికీ 2013 జనవరి 18 నుండి జార్ఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నిర్ణయించడం వలన ఈ నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉంది.

  • హెమంత్ సొరెన్ రాంగఢ్ జిల్లాలోని నెంరాలో పుట్టాడు. ఆయన 2013 జూలైలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసాడు.అప్పుడు రాష్ట్ర పతి పాలన ఎత్తి వేశారు.

నైసర్గిక స్వరూపం, నదులుసవరించు

నైసర్గిక స్వరూపంసవరించు

రాంగఢ్ జిల్ల్ చోటానాగపూర్ మైదానంలో ఒక భాగం. రాంగఢ్ ప్రధాన నైసర్గిక భూభాగం.[19] జిల్లాలోని దామోదర్ నది దిగువ, ఎగువ లోయలు మొత్తంగా దామోదర్ లోయ అనిపిలువబడుతుంది. జిల్లాలోని అధిక భాగం దామోదర్ లోయలు ఉన్నాయి.దామోదర్ లోయ ఉత్తర సరిహద్దులో హజారీబాగ్ పీఠభూమి, దక్షిణ సరిహద్దులో రాంచీ పీఠభూమి ఉంది. రాంచి, హజారీబాగ్ పీఠభూమి తూర్పు, పడమరగా ఉన్న దామోద లోయ విడదీస్తుంది.

 
A View of Ranchi Plateau and Damodar Valley, between Ramgarh and Chutupallu

రాంగఢ్ - రాంచీ సరిహద్దులో ఉన్న సముద్రమట్టానికి 1049 మీ ఎత్తులో ఉన్న బర్కా పహర్ (మరంగ్ బురు) [20] జిల్లాలో ఎత్తైనశిఖరంగా భావించబడుతుంది. ఇది రెండు జిల్లాలను వేరు చేస్తుంది.

నదులు, నదీమైదానాలుసవరించు

జిల్లాలో ప్రధాననది దామోదర్. అంతేకాక దామోదర్ నది జిల్లాలో నదీమైదానం ఏర్పరచింది. ఈ నదికి పలు ఉపనదులుకూడా ఉన్నాయి: నైకరి, భైరవి బొకారో నదులు ప్రధానమైనవి.

 
Naikari Dam, Patratu

హిందూ పురాణాలు, ప్రజాకథనాలు దామోదర్ నది నాద్ (నాద్ అంటే పురుష అని అర్ధం)నది అంటే పురుషనది అని వివరిస్తున్నాయి. వీటిలో చిన్నదులు ఉన్నాయి : హుర్హురి, గోమై, బర్కి, కురుం, కొచి, షెర్భుకి, ధొబ్ధాబ్. మొదలైనవి. స్వర్ణరేఖా నది జిల్లా భూభాగంలో దక్షిణం నుండి తూర్పుదిశగా ప్రవహిస్తుంది.[21] స్వర్ణరేఖా నది కదంగరా, ఖాత్గరా మొదలైనవి.

జలపాతాలుసవరించు

రాజ్‌పరా జలపాతం: భైరవి (భెరా), దామోదర్ నదుల సంగమ ప్రాంతంలో ఉంది.

  • ఆనకట్ట : నైకరి ఆనకట్ట, పత్రతు.

భౌగోళికం, ఖనిజ సంపదసవరించు

జిల్లాలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. జిల్లాలో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు, మిథేన్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. అంతేకాక సున్నపురాయి, ఫైర్ క్లే వంటి నిక్షేపాలు కూడా ఉన్నాయి. రాంగఢ్ జిల్లా లోని బొగ్గు నిక్షేపాలు దామోదర్ నదీ తీరంలో ఉన్నాయి. భౌగోళికంగా జిల్లా భూభాగం గోండ్వానా సిస్టానికి చెందింది. " డముడా గ్రూప్ ఆఫ్ లోవర్ గోండ్వానా ఏజ్ "కు చెందిన శిలలు అధికంగా బొగ్గు నిక్షేపాలు ఉంటాయి. ప్రధాంగా జిల్లాలోని దక్షిణ కర్ణపరా వద్ద బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి.[22]

బొగ్గు గనులుసవరించు

" ది కోయల్ ఇండియ లిమిటెడ్ " సబ్సిడరీ " సెంట్రల్ కోయల్ లిమిటెడ్.[23]

  • పై కోయల్ ఫీల్డులు క్రింది ప్రాంతాలలో ఉన్నాయి:-

దక్షిణ కర్నపురా బొగ్గు గనులుసవరించు

  • బర్కా సాయల్ ప్రాంతం.
  • సౌంద డి ( బర్డ్ సౌండ) ) భూ అతర్గత గనులు.
  • సౌంద డి ఓపెన్ కాస్ట్ మైన్స్. (నాట్ ఆపరేషన్ లో)
  • కేంద్ర సౌంద డి అండర్ గ్రౌండ్ మైన్స్
  • సౌంద డి అండర్ గ్రౌండ్ మైన్స్
  • సాయల్ డి అండర్ గ్రౌండ్ మైన్స్
  • ఉరిమరి అండర్ గ్రౌండ్ మైన్స్
  • భుర్కుండ ఓపెన్ కాస్ట్ మైన్స్
  • అర్గద ప్రాంతం :
  • సిర్క ఓపెన్ కాస్ట్ మైన్స్
  • సిర్క అండర్ గ్రౌండ్ మైన్స్
  • అర్గద అండర్ గ్రౌండ్ మైన్స్

రాంగఢ్ గనులుసవరించు

  • 'రాజ్రప్పా ప్రాంతం:
  • రాజ్రప్పా ప్రాజెక్ట్ ( రాం ఘర్ ప్రాజెక్ట్) ఓపన్ కాస్ట్ మైంస్.
  • సి.సి.ఎల్ కోయల్ వాషరీ: రాజ్రప్పా వాషరీ.

పశ్చిమ బొకారో బొగ్గు గనులుసవరించు

  • కెడియా వాషరీ [24]
  • కుజు ఏరియా: '
  • సరుబెరా ఓపెన్ కాస్ట్ మైన్స్
  • సరుబెరా అండర్ గ్రౌండ్ మైన్స్
  • అరా ఓపెన్ కాస్ట్ మైన్స్
  • కుజు అండర్ గ్రౌండ్ మైన్స్
  • టొపో ఓపెన్ కాస్ట్ మైన్స్
  • టొపో అండర్ గ్రౌండ్ మైన్స్
  • పిండ్ర ఓపెన్ కాస్ట్ మైన్స్
  • పిండ్ర అండర్ గ్రౌండ్ మైన్స్
  • పుండి ఓపెన్ కాస్ట్ మైన్స్
  • కర్మ ఓపెన్ కాస్ట్ మైన్స్
హజారీబాగ్ ఏరియా: '
  • కెడ్ల గ్రౌండ్ మైన్స్ కింద
  • కెడ్ల ఓపెన్ కాస్ట్ మైన్స్
  • జార్ఖండ్ ఓపెన్ కాస్ట్ మైన్స్
  • లైయొ అండర్ గ్రౌండ్ మైన్స్
  • పరెజ్ ఈస్ట్ ఓపెన్ కాస్ట్ మైన్స్
  • తపిన్ ఉత్తర, ఒ.సి
  • తపిన్ దక్షిణ, మిక్స్డ్ (ఒ.సిమ్ &యు.జి).
  • సిసిఎల్ బొగ్గు వాషరీ :' టాటా స్టీల్:[25]
  • పశ్చిమ బొకారో (ఘాటొ) ఓపెన్ మైంస్
  • 1951లో పశ్చిమ బొకారో (ఘాటొ) వద్ద టాటా స్టీల్ సంస్థ దేశంలోని మొదటి కోయల్ వాషరీని స్థాపించింది.
  • మైంస్ రెస్క్యూ స్టేషను (సి.చి.ఎల్) నైసరై (రాంగఢ్).
  • రెస్క్యూ రూం (సి.సి.ఎల్) కెడ్ల.

కాప్టివ్ కోయల్ మైనింగ్ బ్లాకులుసవరించు

కాప్టివ్ కోయల్ బ్లాకులు అల్లొకేటెడ్ [26]

  • జిల్లాలోని భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖ స్థాపించిన పలు సంస్థలు :
  • సుగ్జ : జార్ఖండ్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
  • రౌట : జార్ఖండ్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
  • బురఖప్ : జార్ఖండ్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
  • కొత్రె- బసత్పూర్ : టిస్కో- (టాటా స్టీల్)
  • పత్రతు : జార్ఖండ్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్

కోయల్ బెడ్ మిథేన్సవరించు

కోయల్ బెడ్ మిథేన్ (సి.బి.ఎం) [27] ఇది " పర్యావరణ సహాయక సహజవాయువు " .

  • ఒ.ఎన్.జి.సి దక్షిణ కరంపురా వద్ద సి.బి.ఎం వద్ద శోధనా కార్యక్రమం చేపట్టింది.

అండర్‌ గ్రౌండ్ కోయల్ ఫీల్డ్ గ్లాసిఫికేషన్సవరించు

కోయిల్ ఇండియా లిమిటెడ్ కైతా బ్లాకులో రెండు ప్రదేశాలను యు.జి.సి కొరకు కనిపెట్టింది [28] వాటిలో ఒకటి రాంగఢ్ కోయిల్ ఫీల్డ్ ఒకటి.

మినరల్ రాయల్టీ, ఇతర మినరల్స్సవరించు

మినరల్ రాయల్టీసవరించు

  • 2011-12: 264 కోట్లు
  • 2012-13:[29] 278 కోట్లు

ఇతర ఖనిజాలుసవరించు

సున్నపురాయి: కోయల్ నిక్షేపాలకు సమాంతరంగా తూర్పు, పడమరలుగా సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. ఐరన్ గనులు : రాంగఢ్‌లో బొకారో అండ్ కరంపురా కోయల్ - ఫీల్డ్స్, నోడుల్స్ & లెంటికల్స్ ఇనుప ఖనిజాలు కనిపెట్టబడ్డాయి. ఒకప్పుడు స్థానిక లోహపు వ్యాపారుల ఆధీనంలో ఉండేవి.

పరిశ్రమలు, వ్యవసాయంసవరించు

పరిశ్రమలుసవరించు

రాంగఢ్ జిల్లా తూర్పు భారతదేశంలో పారిశ్రామిక నగరంగా ప్రసిద్ధిచెందింది. ముడి సరుకు లభ్యత కారణంగా జిల్లాలో స్టీల్, స్పాంగ్ ఐరన్, సిమెంట్, రిఫ్రాక్టరి, థర్మల్ పవర్ ప్లాంట్ వంటి పలు ఖనిజ సంబంధిత పరిశ్రమలు స్థాపినచబడ్డాయి.

  • జిల్లాలోని బొగ్గు, ఇతర ఖనిజాలు, ప్రధాన పారిశ్రామిక వాడలు :

ప్రభుత్వ సంస్థలుసవరించు

  • పత్రతు థర్మల్ పవర్ స్టేషను[30] Patratu
  • స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్.ఎ.ఐ.ఎల్) రిఫ్రాక్టరీస్ :[31]
ఐ.ఎఫ్.సి.ఒ , మరర్
భారత్ రిఫ్రాక్టరీస్ లిమిటెడ్ (రాంచీ రోడ్)
  • సి.సి.ఎల్ సెమెంట్ రిపైర్ వర్క్ షాప్ [32] Barkakana

ప్రైవేట్ యాజమాన్య సంస్థలుసవరించు

  • ఆలోకే స్టీల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్,బుధకప్, కర్మ
  • మా చిన్నమస్తికా సిమెంట్, ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్, బుధకప్, కర్మ
  • శ్రీ దుర్గా సిమెంట్ కంపెనీ లిమిటెడ్
  • జిండల్ స్టీల్ & పవర్ లిమిటెడ్ (జె.ఎస్.పి.ఎల్):[33] Balkudra, Patratu
  • ఇండో- అషాహీ గ్లాస్ కంపనీ ( భదానినగర్)
  • బ్రహ్మపుత్రా మెటలిక్స్ లిమిటెడ్ [34] Kamta, Gola
  • జార్ఖండ్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ [35]
  • డి.ఎల్.ఎఫ్ పవర్ లిమిటెడ్, రాజ్‌రప్పా
  • డిఎల్ఎఫ్ పవర్ లిమిటెడ్, అర్గడా
  • అనిందిత ట్రేడ్స్ & ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (స్పాంజ్ ఐరన్ యూనిట్), సెనెగ్రహ
  • చింట్పురాని స్టీల్ ప్రెవేట్ లిమిటెడ్. లిమిటెడ్, ఇంద్రుడు
  • శ్రీ వెంకటేష్ ఐరన్ & అల్లాయ్స్ లిమిటెడ్, లపంగ
  • దయాళ్ స్టీల్స్ లిమిటెడ్, చహ
  • శ్రీ రామ్ పవర్ & స్టీల్ ప్రెవేట్ లిమిటెడ్. లిమిటెడ్, సెరుబెరా
  • రిడీమర్ Engisoft ప్రెవేట్ లిమిటెడ్ (సాఫ్ట్వేర్ కంపెనీ), రాంగడ్

[36]

  • శ్రీనానక్ ఫెర్రో అల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సిలికో మాంగనీస్), రౌతా, రాంచీ రోడ్, రాంగఢ్.

ప్రైవేట్ రంగ సంస్థలుసవరించు

  • లెక్సికన్ ఇండియా కంప్యూటర్ ఎజ్యుకేషన్ లెక్సికన్ ఇండియా చారిటబుల్ సోషల్ చారిటబుల్ ఆర్గనైజేషన్ నుండి సరిటిఫికేట్ అందుకుంది. ఇది కప్యూటర్ విద్య, శిక్షణ ఇస్తుంది. లెక్సికన్ ఇండియా దేశమంత శాఖలను కలిగి ఉంది.
  • రిజిస్టర్ ఆఫీస్ : లెక్సికన్ ఇండియా (లపంగ కాలనీ), భదినీ నగర్, రాంగఢ్, జార్ఖండ్.

రాబోయే ప్రాజెక్టులుసవరించు

  • ముకుంద్ లిమిటెడ్ .[37] (బజాజ్ గ్రూప్) స్టీల్ ప్లాంట్ (బర్లంగ ) [38]
  • బుర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్,[39] పత్రతు.
  • ఇన్లాండ్ పవర్ లిమిటెడ్,[40] ఇన్లాండ్ నాగర్ (గోలా).
  • కరంపురా ఎనర్జీ లిమిటెడ్ (జార్ఖండ్ స్టేట్ ఎలెక్ట్రిక్‌సిటీ బోర్డ్‌కు స్వంతమైన సబ్సిడరీ ):[41]

ఈ ప్రాజెక్ట్ ధుర్మి గ్రామంలో 2×660 మెగావాట్ల బొగ్గు ఆధారిత పవర్ ప్రాజెక్ట్ స్థాపించడానికి ప్రయత్నిస్తుంది.

వ్యవసాయంసవరించు

రాంగఢ్ జిల్లా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జివిస్తుంటారు. జిల్లాలో ప్రధానంగా 3 వ్యవసాయ సీజన్లు ఉన్నాయి. జిల్లాలో 1) కరీఫ్, 2) రబి, 3) జైద్. బియ్యం, మొక్కజొన్న, రాగి, పండ్లు, కూరగాయలు ప్రధాన పంటలుగా పండించబడుతున్నాయి. [42]

మట్టి, వాతావరణం, అరణ్యం, వన్యమృగాలుసవరించు

మట్టి, వాతవరణంసవరించు

  • మట్టి : జిల్లాలో 2 విధాలైన మట్టి ఉంది : ఎర్రమట్టి, ఇసుక మట్టి.
  • వాతావరణం : ఈ ప్రాంతం చోటానాగపూరు మైదానానికి చెందిన సబ్- హ్యూమిడ్ భూభాగంలో ఉంది. అలాగే సెమీ ఎక్స్‌ట్రీం వాతావరణం కలిగి ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవి పగటి ఉష్ణోగ్రత 40 °Cడిగ్రీల సెల్షియస్ ఉంటుంది. 10 ° డిగ్రీల సెల్షియస్ ఉంటుంది.
  • ప్రధానంగా గుర్తించతగిన 3 సీజన్లు :
  • శీతాకాలం : నవంబరు నుండి ఫిబ్రవరి.
  • వేసవి కాలం : మార్చి నుండి ఫిబ్రవరి
  • వర్షాకాలం : జూన్ నుండి అక్టోబరు

అరణ్యాలుసవరించు

జిల్లాలోని అరణ్యప్రాంత వైశాల్యంజ్ 487.93 చ.కి.మీ. జిల్లా వృక్షజాలం, జంతుజాలంతో సుసంపన్నమై ఉంది. జిల్లాలో ప్రభుత్వం డీర్ పార్కును ఏర్పాటు చేసింది. [43] ఈ పార్క్ వైశాల్యం 25 ఎకరాలు ఉంటుంది. ఇది గోలా గ్రామంలో గోలా - మురి రోడ్డులో ఉంది. [44] ఈ జిల్లాలో మగ ఏనుగులు అధికంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 949,159,[45]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[46]
అమెరికాలోని. డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[47]
640 భారతదేశ జిల్లాలలో. 459 వ స్థానంలో ఉంది.[45]
1చ.కి.మీ జనసాంద్రత. 684 [45]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.06%.[45]
స్త్రీ పురుష నిష్పత్తి. 921:1000 [45]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.92%.[45]
జాతియ సరాసరి (72%) కంటే.

ప్రయాణ సౌకర్యాలుసవరించు

రైలుసవరించు

జిల్లా చక్కగా రైలుమార్గాలతో అనుసంధానించబడి ఉంది. 1927లో బెంగాల్ నాగపూర్ రైల్వే (బి.ఎ.ఆర్) [48] చందిల్ - బర్కకానా సెక్షన్‌లో 116కి.మీ మార్గం నిర్మించబడింది. అదే సంవత్సరం సెంట్రల్ ఇండియా కోయిల్ ఫీల్డ్స్ (సి.ఐ.ఎస్ ) గొమొహ్ - బర్కకానా మార్గాన్ని ఆరంభించింది. 1929లో ఇది డాల్టన్ గంజ్ వరకు పొడిగించబడింది.

  • ప్రస్తుతం జిల్లా రైల్వే నెట్ వర్క్ 2 భాగాలుగా విభజించబడింది: ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే.
  • రాంగఢ్ కంటోన్మెంటు, మీల్, బర్కిపొనా, గోలా రోడ్, హరుబెరా, సిండిమరా, బర్లంగ స్టేషను రాంచీ డివిజన్ భాగంగా ఉన్నాయి.

[49]

  • రాంచీ రోడ్, చైంపూర్, అర్గడా, బర్కకానా జంక్షన్, భుర్కుండా, పత్రతు, టొకిసుద్ స్టేషను ధన్‌బాద్ డివిజన్ భాగంగా ఉన్నాయి.
  • బర్కకానా రైల్వే సబ్ డివిజన్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ లోని ధన్‌బాద్ డివిజన్ భాగం.
  • కొత్త రైలు లైన్ ప్రాజెక్ట్ : (రాంచీ-తతిసిల్వై-సిధ్వర్-బర్కకానా- కుజు-మండు-హజారీబాగ్-బార్హి-కోడెర్మ-తిలైయా)
  • రాంచి- కొడెర్మా - తిలైయా (బీహార్) కొత్త రైలు మార్గం ప్రాజెక్ట్ [50] ఈ జిలా మీదుగా నిర్మించబడుతుంది. జిల్లాలోని సిధ్వర్-బర్కకానా- కుజు, మండుల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. కొత్త రైలు మార్గం ద్వారా రాంచీ - బర్కకానా మార్గం సగానికి తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తరువత బర్కకానా - పాట్నా - ఢిల్లీ దూరం కూడా తగ్గుతుంది.

ప్రధాన రైల్వే స్టేషన్లుసవరించు

బర్కకానా కూడలి :

  • ఎ) బర్కకానా -పాట్నా, పాలము ఎక్స్ప్రెస్ (డైలీ) బి) పాట్నా-బర్కకానా, పాలము ఎక్స్ప్రెస్ (డైలీ) వయా: డాల్టోన్గంజ్
  • ఎ) జబల్‌పూర్-హౌరా, రోజువారీ శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ () బి) హౌరా జబల్‌పూర్, శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ (డైలీ) వయా బాద్
  • ఎ) తాతానగర్ -రూర్కెలా న్యూఢిల్లీ జమ్ముతావి ఎక్స్ప్రెస్ (డైలీ) బి) జమ్ముతావు న్యూఢిల్లీ రూర్కెలా -తాతానగర్ ఎక్స్ప్రెస్ (డైలీ)
  • ఎ) రాంచీ ఢిల్లీ (ఆనంద్ విహార్), జార్ఖండ్ ష్వర్న్ జయంతి ఎక్స్ప్రెస్ (మూడు రోజులు) బి) ఢిల్లీ (ఆనంద్-విహార్) -రాంచి, జార్ఖండ్ ష్వర్న్ జయంతి ఎక్స్ప్రెస్ (మూడు రోజులు)
  • ఎ) బర్కకానా - రాజేంద్రనగర్ (పాట్నా), వయా) డైలీ ఎక్స్ప్రెస్ (స్లిప్, ఎక్స్ప్రెస్ (డైలీ) బి) రాజేందర్ నగర్ (పాట్నా) -బర్కకానా Barkakana స్లిప్: Gomo
  • ఎ) రాంచీ-చొపాన్ ఎక్స్ప్రెస్ (మూడు రోజులు) బి) చొపాన్ -రాంచీ ఎక్స్ప్రెస్ (మూడు రోజులు)
  • ఎ) సంబల్పూర్-వారణాసి ఎక్స్ప్రెస్ (రెండు రోజులు) బి) వారణాసి-సంబల్పూర్ ఎక్స్ప్రెస్ (రెండు రోజులు)
  • ఎ) హౌరా భూపాల్ ఎక్స్ప్రెస్ (వీక్లీ) బి) భూపాల్-హౌరా ఎక్స్ప్రెస్ (వీక్లీ) వయా బాద్
  • ఎ) కొల్కత్తా-అజ్మీర్ ఎక్స్ప్రెస్ (వీక్లీ) బి) అజ్మీర్-కోల్‌కతా ఎక్స్ప్రెస్ (వీక్లీ) వయా బాద్
  • ఎ) కొల్కత్తా-అహమ్మదాబాద్ ఎక్స్ప్రెస్ (వీక్లీ) బి) అహమ్మదాబాద్ - కొలకత్తా ఎక్స్ప్రెస్ (వారానికి ఒకసారి)

వయా బాద్

  • ఎ) సాతరగచి -అజ్మీర్ ఎక్స్ప్రెస్ (వీక్లీ) బి) అజ్మీర్-సాతరగచి ఎక్స్ప్రెస్) (వీక్లీ: వియా తాతానగర్, కాట్నీ, కోటా
  • ఎ) రాంచీ-వారణాసి ఎక్స్ప్రెస్ (నాలుగు రోజులు) బి) వారణాసి-రాంచీ ఎక్స్ప్రెస్ (నాలుగు రోజులు)
  • ఎ) రాంచీ-అజ్మీర్ గ్రిబ్ నవాజ్ ఎక్స్ప్రెస్ (వీక్లీ) బి) అజ్మీర్-రాంచీ గ్రిబ్ నవాజ్ ఎక్స్ప్రెస్ (వీక్లీ) వయా: వారణాసి, ఆగ్రా ఫోర్ట్, జైపూర్
రాంగఢ్ కంటోన్మెంట్: '

జాతీయ రహదారి 33 సమీపంలో బిజులియ నెలకొని పరి భాష రైల్వే స్టేషను రాం ఘర్​​. ఇది నగరం బస్సు స్టాండ్ నుండి ఒక కిలో చుట్టూ ఉంది

  • ఎ) తాతానగర్ - రూర్కెలా న్యూఢిల్లీ జమ్మూతావి ఎక్స్ప్రెస్ (డైలీ) బి) జమ్మూతావి న్యూఢిల్లీ రూర్కెలా -తాతానగర్ ఎక్స్ప్రెస్ (డైలీ)
  • ఎ) రాంచీ ఢిల్లీ (ఆనంద్ విహార్), జార్ఖండ్ షావర్న్ జయంతి ఎక్స్ప్రెస్ (మూడు రోజులు) బి) ఢిల్లీ (ఆనంద్-విహార్) -రాంచి, జార్ఖండ్ షావర్న్ జయంతి ఎక్స్ప్రెస్ (మూడు రోజులు)
  • ఎ) రాంచీ-చోపన్ ఎక్స్ప్రెస్ (మూడు రోజులు) బి) చోపన్ -రాంచీ ఎక్స్ప్రెస్ (మూడు రోజులు)
  • ఎ) సంబల్పూర్-వారణాసి ఎక్స్ప్రెస్ (రెండు రోజులు) బి) వారణాసి-సంబల్పూర్ ఎక్స్ప్రెస్ (రెండు రోజులు)
  • ఎ) రాంచీ-వారణాసి ఎక్స్ప్రెస్ (నాలుగు రోజులు) బి) వారణాసి-రాంచీ ఎక్స్ప్రెస్ (నాలుగు రోజులు)
  • ఎ) రాంచీ-అజ్మీర్ గ్రిబ్ నవాజ్ ఎక్స్ప్రెస్ (వీక్లీ) బి) అజ్మీర్-రాంచీ గ్రిబ్ నవాజ్ ఎక్స్ప్రెస్ (వీక్లీ) వయా: వారణాసి, ఆగ్రా ఫోర్ట్, జైపూర్
రాంచీ రోడ్: '
  • ఎ) జబల్‌పూర్-హౌరా, రోజువారీ శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ () బి) హౌరా జబల్‌పూర్, శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ (డైలీ)
  • ఎ) బర్కకానా- రాజేంద్రనగర్ (పాట్నా),) రోజువారీ (ఎక్స్ప్రెస్ స్లిప్,
  • పత్రు :
  • ఎ) బర్కకానా-పాట్నా, పాలము ఎక్స్ప్రెస్ (డైలీ) బి) పాట్నా-బర్కకానా, పాలము ఎక్స్ప్రెస్ (డైలీ)
  • ఎ) జబల్‌పూర్-హౌరా, రోజువారీ శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ () బి) హౌరా జబల్‌పూర్, శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ (డైలీ)
  • ఎ) తాతానగర్ -రూర్కెలా న్యూఢిల్లీ జమ్ముతావి ఎక్స్ప్రెస్ (డైలీ) బి) జమ్మూ తావి న్యూఢిల్లీ రూర్కెలా-తతానగర్ ఎక్స్ప్రెస్ (డైలీ)
  • ఎ) రాంచీ ఢిల్లీ (ఆనంద్ విహార్), జార్ఖండ్ షావర్న్ జయంతి ఎక్స్ప్రెస్ బి) ఢిల్లీ (ఆనంద్-విహార్) -రాంచి, జార్ఖండ్ షావర్న్ జయంతి ఎక్స్ప్రెస్
  • ఎ) సంబల్పూర్-వారణాసి ఎక్స్ప్రెస్ (రెండు రోజులు) బి) వారణాసి-సంబల్పూర్ ఎక్స్ప్రెస్ (రెండు రోజులు)
  • ఎ) రాంచీ-చొపాన్ ఎక్స్ప్రెస్ (మూడు రోజులు) బి) చొపాన్-రాంచీ ఎక్స్ప్రెస్ (మూడు రోజులు)
  • ఎ) రాంచీ-వారణాసి ఎక్స్ప్రెస్ (నాలుగు రోజులు) బి) వారణాసి-రాంచీ ఎక్స్ప్రెస్ (నాలుగు రోజులు)
  • ఎ) రాంచీ-అజ్మీర్ గ్రిబ్ నవాజ్ ఎక్స్ప్రెస్ (వీక్లీ) బి) అజ్మీర్-రాంచీ గ్రిబ్ నవాజ్ ఎక్స్ప్రెస్ (వీక్లీ)
  • బర్కుండా:
  • ఎ) బర్కుండా - పాట్నా, పాలము ఎక్స్ప్రెస్, (ప్రతిరోజు) బి) పాట్నా - బర్కకానా, పాలము ఎక్స్ప్రెస్, (ప్రతిరోజు)
  • గోలా రోడ్ :
  • ఎ ) తాతానగర్ - రూర్కెలా- ఢిల్లీ- జమ్ముతావి ఎక్స్ప్రెస్
  • తాతానగర్- రూర్కెలా- ఢిల్లీ- జమ్మూతావి ఎక్స్ప్రెస్, (ప్రతిరోజు) బి) జమ్ముతవి- ఢిల్లీ- రూర్కెలా- తాతానగర్ ఎక్స్ప్రెస్

రహదారిసవరించు

జిల్లాలలో ప్రధాన రవాణా రహదారిమార్గంలో జరుగుతుంటాయి. జిల్లాలో 3 ప్రధాన అతివేగ రహదారి మార్గాలు ఉన్నాయి: జాతీయ రహదారి 33, జాతీయ రహదారి 33& ఎస్.హెచ్2) జిల్లా మీదుగా పోతున్నాయి.

  • స్టేట్ అధారిటీ ఆఫ్ జార్ఖండ్ పత్రతు- ధన్‌బాద్ మధ్య 4 వే రహదారి మార్గం నిర్మించడానికి ప్రణాళిక వేస్తుంది. ఈ మార్గం సాయల్, నయ మొర్, చాస్ మొర్, రాజ్‌గంజ్ మీదుగా నిర్మించబడుతుంది.[51]

జాతీయ రహదారిసవరించు

  • ప్రధాన రహదార్లు :[52] జాతీయ రహదారి 33-23 జిల్లాని దాటి పోతున్నాయి.
  • జాతీయ రహదారి 23 మహాత్మా గాంధీ చౌక్ (రాంగఢ్ కంటోన్మెంటు) వద్ద జాతీయ రహదారి 33 తో అనుసంధానించబడుతుంది.
  • జాతీయ రహదారి 33: జిల్లాలోని మండు-కుజు- రాంగఢ్ నుండి చుతుపలు. 4 లైన్ నిర్మాణం పూర్తి అయింది.
 
NH 33 Between Ramgarh and Chutupallu
 
State Highway No.2 between Patratu and Ranchi
  • జాతీయ రహదారి 23: జిల్లాలో రాంగఢ్-చితాపూర్-గోలా. భూమిసేకరణ జరుగుతుంది.

రాష్ట్ర రహదారి, ఇతర ప్రధాన మార్గాలుసవరించు

  • రాష్ట్ర రహదారి నంబర్ 2 :[53]
  • రాంగఢ్-బర్కకానా- భుర్కుండా- పత్రతు- కంకె-రాంచీ (4 లైనుల మార్గం నిర్మాణదశలో ఉంది )57 కి.మీ పొడవు.
  • నైసరి (రాంగఢ్- అర్గడ- సిర్క-గిడ్డి ఎ రోడ్డు [54] 17.40 కి.మీ పొడవు.
  • కుజు (నయా మోర్) -అర- సరుబెర- కెడ్ల- ఘటో-జార్ఖండ్ కొలియరి-లైయొ రోడ్
  • కుజు (నయా మోర్) -రెలిగర రోడ్
  • ఘటొ-పరెజ్- తపిన్- చర్హి రోడ్
  • చితర్పూర్ (రాజ్‌రప్పా మోర్) -రాజ్‌రప్పా ప్రాజెక్ట్, రాజ్‌రప్పా మందిర్ రోడ్
  • బోల్ -రాజ్‌రప్పా మందిర్ రోడ్. (ఈ రోడ్డు వర్షాకాలంలో రాజ్‌రప్పా మందిర్ వెళ్లరు)
  • బోల్ -మురి రోడ్
  • బోల్ -సికిద్రి - ఒర్మంఝి రోడ్

వాయుమార్గంసవరించు

  • సమీపంలో ఉన్న విమానాశ్రయం : రాంచీ వద్ద ఉన్న బిర్స ముండ ఎయిర్పోర్ట్ ( 45కి.మీ). ఇక్కడి నుండి ఢిల్లీ, పాట్నా, కొలకత్తా వంటి ప్రధాననగరాలకు విమానసౌకర్యం లభిస్తుంది.

.

ఆరోగ్యసంరక్షణసవరించు

ఆరోగ్యసంరక్షణసవరించు

సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్

  • సెంట్రల్ ఆసుపత్రి,[55] Nai Sarai, Ramgarh. (District largest hospital)
  • జూబ్లీ రీజనల్ ఆసుపత్రి. కెడ్లంగర్
  • సిల్వర్ జూబ్లీ ఆసుపత్రి (రాజ్‌రప్పా ప్రాజెక్ట్)

రాష్ట్ర ప్రభుత్వంసవరించు

సాదర్ ఆసుపత్రి: రాంగఢ్ బ్లాక్ సమీపంలో.

  • రెఫరల్ ఆసుపత్రి: తూటి జర్నా.
  • ప్రైవేట్ నగర్
  • టాటా సెంట్రల్ హాస్పిటల్, వెస్ట్ బొకారో డివిజన్ (ఘాటో)
  • బ్రిందావన్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (పి) లిమిటెడ్, Ranchi Road, Ramgarh.
  • సాయినాథ్ హాస్పిటల్, తానా చోక్, రాంగఢ్ కంటోన్మెంట్ (రాంగఢ్)

విద్యసవరించు

పాఠశాలలుసవరించు

  • కేద్ర ప్రభుత్వ పాఠశాలలు :-
  • కేంద్రియ విద్యాలయ :[56] ఎ)రాంఘడ్ కంటోన్మెంట్, బి) భుర్కుండ సి) పత్రతు, డి) బర్కకానా
  • ప్రైవేట్ పాఠశాలలు:-
  • డి.ఎ.వి పబ్లిక్ పాఠశాల:[57] ఏ)ఎన్.టి.ఎస్. బర్కకానా, బి) రాజ్‌రప్పా ప్రాజెక్ట్, సి) కెడ్లా, డి) అగ్రసెన్.డి.ఎ.వి భరెక్ నగర్
  • శ్రీ గురు నానక్ సీనియర్ సెకండరీ స్కూల్, రాంగడ్ కంటోన్మెంట్ చేయలేకపోతున్నారా
  • సిద్దార్ధ పబ్లిక్ స్కూల్, రాంగడ్ కంటోన్మెంట్ చేయలేకపోతున్నారా
  • సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, Rishipattanam (సమీప Chutupallu)
  • సరస్వతి విద్యా మందిర్: ఎ) రాజ్‌రప్పా ప్రాజెక్ట్ బి) సిర్క సి) సరుబెర
  • రాధా గోవింద పబ్లిక్ స్కూల్, రాంగడ్ కంటోన్మెంట్
  • హోలీ క్రాస్ స్కూల్, ఘటొతాండ్
  • సెయింట్ ఆన్స్ స్కూల్, కైత, రాంగడ్ కంటోన్మెంట్
  • రాంప్రసాద్ చంద్ర భాన్ పబ్లిక్ స్కూల్, రాంగడ్ కంటోన్మెంట్.
  • నెహ్రూ పిల్లలు కాన్వెంట్ హై స్కూల్, రాజీవ్ నగర్, ఘాటో తండ్

'రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు'

  • మహాత్మా గాంధీ మెమోరియల్ హై స్కూల్, రాంగడ్ కంటోన్మెంట్
  • కుజు హై స్కూల్ (కుజు)
  • ఎస్.వి.ఎన్ హై స్కూల్, ఘాటోతండ్
  • ఇతర స్కూల్స్:
  • సైనిక పాఠశాల :[58] Ramgarh Cantt. (Army Welfare Education Society)

కళాశాలలుసవరించు

  • కాంస్టిట్యుయంట్ కాలేజీలు.[59]
  • రాంగఢ్ కాలేజ్[60] Ramgarh.
  • నాన్ కాంస్టిట్యుయంట్ కాలేజీలు[61]
  • సి.ఎన్. కాలేజ్, రాంగడ్
  • జే.ఎమ్ కాలేజ్,భుర్కుండ
  • జూబ్లీ కళాశాల, భుర్కుండ
  • పి.టి.పి.ఎస్ కాలేజ్, పత్రతు.

సాంకేతిక విద్యా సంస్థలుసవరించు

  • ఇంజనీరింగ్ కాలేజీలు.
  • 2013లో ఆరంభించబడిన " రాంగఢ్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ "
  • రాంగఢ్‌లో " ఉమంస్ ఇంజనీరింగ్ కాలేజ్ " స్థాపించాలని ప్రయిపాదించింది. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఇది మొదటిది [62]

మెడికల్ కాలేజ్సవరించు

  • ప్రభుత్వం ఈ జిల్లాలో " ఇ.ఎస్.ఐ మెడికల్ కాలేజ్ "ను స్థాపించాలని ప్రణాళిక చేస్తుంది.[63]
  • మేనేజ్మెంటు కాలేజ్ :
  • బిర్స ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బి.ఐ.ఇ. రాంగఢ్) [64] started in 2012 at Ramgarh

మార్కెట్స్, వినోదంసవరించు

'మార్కెట్' ': మార్కెట్లలో రామ్ పత్రతు, భుర్కుండా, కుజు, గోలా ప్రధానమైనవి.

సినిమా హాళ్ళుసవరించు

  • రాం ఘర్ ​కంటోన్మెంటు : 1) న్యూ శాంతి సినిమా 2) రాజీవ్ టాకీస్ 3) శాంతి టాకీస్ (క్లోజ్డ్) 4) అశోక్ టాకీస్ (క్లోజ్డ్)
  • కుజు : గీతాంజలి టాకీస్ (మూసివేయబడింది)
  • భుర్కుండ : 1) లక్ష్మీ టాకీస్ 2) జనతా టాకీస్
  • పత్రతు : వీణా టాకీస్
  • ఫిల్మ్‌ సిటీ :[65]

జార్ఖండ్ ప్రభుత్వం పత్రతు సమీపంలో ఆధునిక ఫిల్మ్‌ సిటీ నిర్మించాలని ప్రణాళిక చేస్తుంది.

క్లబ్బులుసవరించు

  • రోటరీ క్లబ్: నియర్ మహాత్మా గాంధీ చోక్ (రాంగఢ్ కంటోన్మెంటు)
  • రోటరీ క్లబ్ ఆఫ్ రాంగఢ్ [66] held its inaugural meeting on 5 November 1961
  • లయింస్ క్లబ్ : ఎ) రాంగఢ్ కంటోన్మెంటు బి) భుర్కుండా .
  • జింఖాన క్లబ్ :[35] రాంచీ రోడ్ ( రాంగఢ్).

మ్యూజియంసవరించు

చితేర్‌పూర్ వద్ద జరినా ఖటూన్ మ్యూజియం కం రీసెర్చి సెంటర్ ఉంది.

సంస్కృతిసవరించు

రాంగఢ్ సంస్కృతి విభిన్నమైనది. రాజ్‌రప్పా మందిరం, టూటి జర్నా మందిర్ వంటి వివాహవేడుకలు నిర్వహించడానికి అనుకూల ప్రాంతాలు ఉన్నాయి.

ఉత్సవాలు, సంతలుసవరించు

జిల్లాలో అత్యంత ఉత్సాహంతో జరుపుకునే ఉత్సవాలలో దీపావళి, హోళి, చాథ్, దసరా లేక దుర్గాపూజ లేక నవరాత్రి, శ్రీరామనవమి, కర్మ, సర్హుల్, తుసు, ఈద్, సరస్వతి పూజ, మకర సంక్రాంతి, జీవిత్పుత్రిక లేక జితియా (హిందీ: जिउतिया) [67] మొదలైనవి ప్రధానమైనవి. గనులు, పరిశ్రమలు అధికం కావడంతో విశ్వకర్మ పూజ కూడా చక్కగా నిర్వహించబడుతుంది. రాజ్‌రప్పా మందిరం వద్ద నిర్వహించే మకర సంక్రాంతి సంత [68] పెద్ద ప్రజలను ఆకర్షిస్తుంది. జితియా సందర్భంలో కూడా సంత నిర్వహించబడుతుంది [69] కర్మ, ఇతర పండుగలు.

ఆహారంసవరించు

రాంగఢ్ జిల్లాలో పలు విధమైన ఆహారాలు, వంటకాలు అందుబాటులో ఉన్నాయి. రోటీ, పుల్కా, అన్నం లేక బాత్, డాల్, సబ్జి లేక తర్కరి, అచర్ లేక ఊరగాయ వంటివి సాధారణంగా ప్రతిగృహంలో తయారుచేయబడుతుంటాయి. ప్రాంతీయ వాసుల అభిమాన అల్పాహారాలలో దుస్కా, వడ ప్రధానమైనవి. దుస్కా చేయడానికి బియ్యం, మినపప్పు అవసరం. వడచేయడానికి మినపప్పు అవసరం. జిల్లాలో ప్రత్యేకంగా వెదురు మొలకల పకోడాలు, గుమ్మడిపూల పకోడా, ఖుర్కి లేక పుట్టగొడుగుల తర్కరి మొదలైన వంటకాలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. రజ్‌రప్పా వద్ద లభించే ఖొయా పెడాలు కూడా ప్రబల ఆహారాలలో ఒకటిగా భావిస్తుంటారు.

పర్యాటక ఆకర్షణలుసవరించు

యాత్రీక ప్రదేశాలుసవరించు

టూటి ఝర్నా ఆలయంసవరించు

టూటీ ఝర్న ఆలయం రాంగఢ్ కంటోన్మెంటుకు 7 కి.మీ దూరంలో జాతీయరహదారి 33 పాట్నా - రాంచి రహదారిలో ఉంది. ఇక్కడ శివలింగం మీద జలపాతం నుండి నేరుగా పడుతుంది. సమీపం లోని దిగ్వర్ గ్రామంలో ఉన్న రఘునాథ్ బాబా, పలువురు దిగ్వర్ గ్రామవాసులు ఈ ఆలయం నిర్వహణ చేస్తుంటారు. రాంచీ - పాట్నా రహదారి నుడి దిగ్వర్ గ్రామానికి చేరుకునే మార్గంలో 2-3 కి.మీ దూరంలో ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు.

మాయాతుంగి ఆలయంసవరించు

రాంగఢ్‌కు దక్షిణంగా 5 కి.మీ దూరంలో చుతుపలు లోయలో మాయాతుంగి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పర్వతరాజు పుత్రిగా భావించబడుతుంది. సుందరమైన ప్రకృతి అందాలతో అలరారే ఈ ప్రదేశం ప్రముఖ విహారప్రదేశంగా ఉంది. ఇది సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తున ఉంది. ఈ శిఖరానికి చేరుకోవడానికి 15 నిమిషాల సమయం చాలు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో కర్మా ఉత్సవం ఉత్సాహభరితంగా నిర్వహిస్తుంటారు. అలాగే సమీప గ్రామాల నుండి వచ్చే ప్రజలు సంతను కూడా నిర్వహిస్తుంటారు. ఈ కొండ మీద ఆరాధనలు జరిపితే వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ ప్రజలు విశ్వసిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఆలయంలో దుర్గాపూజ, నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నారు.

కతియా శివమందిర్సవరించు

కతియా శివమందిర్:[70] ఈ పురాతన శివాలయం జాతీయరహదారి 23 పక్కన రాంగఢ్ కంటోన్మెంటుకు 3 కి.మీ దూరంలో ఉంది. దీనిని జాతీయ స్మృతి చిహ్నంగా ప్రకటించింది. ఈ ఆలయం 1670లో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉన్న శివలిగం రెండు అంతస్తుల ఎత్తున ఉంటుంది. ఈ ఆలయంలో కొంత భాగాన్ని ఒకప్పుడు సైనిక స్థావరంగా వాడుకున్నారు. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది.

కెరె మఠంసవరించు

కెరే మఠం ఆలయం[71] ఇది ఒక గౌతమ బౌద్ధాలయం. జాతీయరహదారి 23 పక్కన మాత్వా-తండ్ గ్రామంలో ఉంది.

గురుద్వారా సింఘ్ సభసవరించు

1940లో రాంగఢ్ లోని సిక్కు ప్రజలు షివాజి రోడ్ వద్ద చిన్న రూములో గురుద్వారా సింఘ్ సభను స్థాపించి ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి గురుద్వారా రూపంలో బ్రహ్మాండమైన ప్రత్యేకభవనం నిర్మించబడింది. ఇందులో కేంద్రంగా ఉన్న సమాధి, మీనార్లు దీనికి ప్రత్యేక ఆకర్షణ తీసుకు వచ్చింది. గురుద్వారా సాహెబ్ దర్బార్ హాల్ బహుసుందరంగా ఉంటుంది.

రాజ్‌రప్పా మందిర్సవరించు

ప్రఖ్యాత " మాతా చిన్మస్తిక ఆలయం " (హిందీ: मां छिन्नमस्तिका मंदिर) [72] ఇది రాజ్‌రప్పా (హిందీ: రాజ్‌రప్పా) సమీపంలో రాంగఢ్‌ కంటోన్మెంట్‌కు 20కీమీ దూరంలో దామోదర్, భైరవి నదీ (బెరా) సంగమంలో ఉంది. ఈ ఆలయ ప్రసక్తి పురాణాలు, వేదాలలో ఉంది. పురాతన శక్తి ఆరాధనకు ఇది బలమైన సాక్ష్యంగా ఉండేది. హిదువుల యాత్రలో చినమస్తిక ఆలయం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక్కడకు సంవత్సరం అంతా దేశం నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు. ఇది అతిపురాతనమైన ఆలయం. ఆలయ నిర్మాణం తాంత్రిక ప్రాముఖ్యత కలిగిన ఆలయనిర్మాణాన్ని తలపిస్తుంది. అయినప్పటికీ దీని నిర్మాణ కాలం నిర్ణయించబడలేదు. ఇక్కడ పెద్ద ఎత్తున వివాహవేడుకలు జరుగుతుంటాయి. శిరోరహిత చినమస్తికాదేవి తామరపుష్పం కండియో, రాతి శరీరాల మీద నిలబడి ఉంటుంది. పురాతన ఆలయం చుట్టూ పలు చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి. మహావిద్యా, ( తార,షోడసి,భువనేశ్వరి, భైరవి, బగ్లా, కమ్ల, మాతంగి, ధుమవతి) వరుస నిర్మించబడింది. ఇతర ఆలయాలలో సూర్యాలయం, శివాలయం, హనుమాలయం, మాతా కాళీ ఆలయం మొదలైనవి ఉన్నాయి. పురాణకథనాలు దామోదర్ అంటే శివుడు అని, భైరవి అంటే శక్తి అని వివరిస్తున్నాయి. దామోదర్ నది బబైరవి నదితో సంగమిస్తున్న ఈ ప్రదేశం అతి పవిత్రమైనదని భావిస్తున్నారు. దామోదర్ నదికి ఎగువన ప్రవహిస్తూ భైరవీ నది దిగువన ఉన్న దామోదర్ నదితో సంగమిస్తుంది. భక్తులు పూజ నిర్వహించే ముందు నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు.

 
Maa Chhinnamasta Temple
 
Dakshina Kali temple
 
Temples of Mahavidyas built in a series

రాజ్‌రప్పా ఆలయం ప్రముఖ శక్తిపీఠం మాత్రమే కాక విహారకేంద్రంగా కూడా ఆకర్షిస్తూ ఉంది. పర్యాటకులు ఇక్కడ దేవిని ఆరాధిస్తూనే అరణ్యాలు, కొండలు, పచ్చదనం, నదులతో మిశ్రితమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. ఇక్కడి మార్కెట్లలో వంటసామగ్రి, ఆహారం, పాలు, వంటకు కావలసిన పదార్ధాలు, తాజా కూరగాయలు లభ్యమౌతాయి. ప్రస్తుతం మందిర్ సమితి కేర్ టేకర్ ఏజంట్ సాయంతో భైరవీ నదీ తీరంలో కొంతభాగాన్ని విహార ప్రదేశంగా మార్చారు. వారు కొంత ప్రదేశం, చటై, టేబులు మొదలైనవి అందిస్తారు. వీటిని పొందడానికి నామ మాత్రం రుసుము చెల్లించాలి. వర్షాకాలంలో ఈ ప్రాంతం బదీజలాలతో నిండి పోతుంది.

 
Damodar River (western side) Rajrappa Mandir
 
Damodar River (estern side) Rajrappa Mandir

చేరుకునే మార్గంసవరించు

వాయు మార్గం సమీపంలో ఉన్న విమానాశ్రయం " రాంచీ " (70 కి.మీ దూరం)

రైలు మార్గం ' సమీపంలో ఉన్న రైల్వే స్టేషను రాంగఢ్ కంటోన్మెంటు 28 కి.మీ దూరం, రాంచీ రోడ్ (30 కి.మీ దూరం), బర్కరకానా (33 కి.మీ దూరం), రాంచీ (70 కి.మీ దూరం),కొడెర్మా (135 కి.మీ దూరం).

రహదారి మార్గం : రాంగఢ్ కంటోన్మెంటు నుండి ట్రెక్కర్ లేక జీపులో రాజ్‌పరా మందిరం చేరుకోవచ్చు. పాత బస్ స్టాపు వద్ద తెల్లవారు ఝాము నుండి ట్రెక్కర్ లేక జీపు అద్దెకు లభిస్తాయి.

బస్ సర్వీస్ రాంగఢ్ కోపరేటివ్ సొసైటీ ఒక బస్ సర్వీస్‌ను మాత్రమే అందిస్తుంది. ఇది రాంచు, రాజ్‌పరా మందిరం వరకు రాంగఢ్ కంటోన్మెంటు మీదుగా పోతుంది.

  • 'కొత్త బస్ స్టాండు నుండి క్రమానుగత బసు సౌకర్యం లభిస్తుంది.

రహదారి మార్గం :

సవరించు

  • రాంచీ నుండి వస్తున్న పర్యాటక మార్గం: జంషెడ్పూర్, హజారీబాగ్: రాం ఘర్ కంటోన్మెంట్- చితార్పూర్, (రాజ్‌రప్పా మోర్) -రాజ్‌రప్పా మందిర్ (28 కిమీ)
  • బాద్, బొకారో, మురి నుండి పర్యాటక రహదారి మార్గం.
  • గొలా రాజ్‌రప్పా మందిర్ (13కి.మీ). (వర్షాకాలంలో వెళ్లరు)
  • గొలా చితార్పూర్ (రాజ్‌రప్పా మోర్) -రాజ్‌రప్పా మందిర్
  • వసతి :
  • లో, మీడియం బడ్జెట్ హోటల్స్ రాంగఢ్ కంటోన్మెంట్ వద్ద అందుబాటులో ఉన్నాయి.
  • జార్ఖండ్ పర్యాటక శాఖ: ఇందులో పర్యాటక రాజ్‌రప్పా మందిరంలో ఒక కొత్త మెగా కాంప్లెక్స్ నిర్మించింది:
  • యోగ కేంద్రం (మంథన్)
  • ధ్యానం లేదా ధయాన్ సెంటర్ (మోక్షం)
  • ధర్మశాల (భవనం రకం) ఎ) అలకానంద బి) మందాకిని సి) భాగీరధి
  • ధర్మశాల (విశ్రాంతి గృహం) 16 డీలక్స్ గదులు ఉంటాయి.
  • వివాహం, ఇతర వేడుక ప్రయోజనం కోసం నిర్మిస్తారు. కాంప్లెక్స్ సిద్ధంగా, త్వరలోనే ప్రజల కోసం తెరవబడుతుంది.

చారిత్రక స్మారక చిహ్నాలుసవరించు

మహాత్మా గాంధీ సమాధి శాంతల్ :[12] శాతల్ ప్రాముఖ్యతను అధికం చేస్తున్న మహాత్మా గాంధీ సమాధి ( ప్రాంతీయ వాసులు గాంధి ఘాట్ అంటారు) రాంగఢ్ లోని దామోదర్ నదీ తీరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని మోహన్‌దాస్ 1940లో రాంగఢ్‌లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో కరంచంద్ గాంధి విజయం చేస్తున్నారు.[73] మహాత్మా గాంధీని కాల్చి చంపిన తరువాత సంఘటనా స్థలంలో ఉన్న మట్టిని దేశంలోని వివిధ ప్రాతాలకు పంపారు. అటువంటి ప్రదేశాలలో ఒకటి రాంగఢ్ ఒకటి. తరువాత ఈ ప్రదేశంలో గంధిసమాధి నిర్మించబడింది. ఆరంభంలో గాంధిసమాధి సమీపంలో గాంధీజీ పుట్టినరోజు, వర్ధంతిరోజున ప్రదర్శన ఏర్పాటు చేయబడుతుండేది. అయినా ప్రస్తుతం ఈ ప్రదేశం నిర్లక్ష్యానికి గురైంది. ఈ సమాధి నల్లని గ్రానైట్ రాళ్ళతో చేయబడింది.

 
Mahatma Gandhi Samadhi Sathal, Ramgarh

చైనా సమాధిసవరించు

చైనా సమాధి:[74] రాంగఢ్‌ కంటోన్మెంటుకు ఇది 5కి.మీ దూరంలో ఉంది. చైనా కబ్రిస్థాన్ ప్రఖ్యాత చారిత్రిక స్మారక చిహ్నం. రెండవప్రపంచ యుద్ధం ఆరంభం అయిన తరువాత సాంస్కృతిక ఉద్యమానికి చెందిన గొప్ప నాయకుడు " మాత్సే తుంగ్‌కు "కు వ్యతిరేకంగా అలాగే మిత్రరాజ్యాల బృదానికి మదాతుదారులైన కొంతమంది సైనికులు పట్టుబడి రాంగఢ్‌లో బంధించబడ్డారు. తరువాత కొంతకాలానికి ఈ సైనికులు ఆకలి, పాముకాటుకు బలై మరణించారు. మరణించిన సైకులందరినీ మూకుమ్మడిగా సమాధి చేసిన ప్రాంతంలో " చైనా కబ్రిస్తాన్ " నిర్మించబడింది. ఇక్కడ దాదాపు 667 సమాధులు ఉన్నాయి. ఈ సమాధుల మధ్య స్థాపించిన స్తంభం మీద " చ్యాన్ కి సేక్ " స్మారక చిహ్నాలు చెక్కబడ్డాయి. ఈ సమాధి భూమి మొత్తం వైశాల్యం 7 ఎకరాలు. ఇక్కడి నుండి ఒక భౌద్ధాలయం కనిపిస్తూ ఉంటుంది. ఈ సమాధి ప్రాంతంలో 3 సైనిక స్థావరాలు ఉన్నాయి. సమాధి ప్రదేశంలో పక్కా మర్గాలు, అనమైన పూలమొక్కలు చోటు చేసుకున్నాయి. రాంగఢ్ చారిత్రక సంఘటనలకు ఇది తార్కాణంగా నిలిచింది.

రాంగఢ్ లోని అద్భుత ప్రదేశాలు :[75][76][77]సవరించు

రాంగఢ్ పలు స్మారకచిహ్నాలకు ఆలవాలమై ఉంది. చితార్పూర్,గోలా, కుజు వద్ద ఉన్న స్మారకచిహ్నాలు (మెగలిత్స్) కనిపెట్టబడ్డాయి.

ప్రకృతి పర్యాటకంసవరించు

  • నైకరి ఆనకట్ట : నైకరి నది మీద నిర్మించబడిన ఆనకట్ట " నైకరి లేక పి.టి.పి.ఎస్ ". పత్రతుకు 5 కి.మీ దూరంలో ఇతర చిన్న నదులు ఉన్నాయి. అరణ్యాలు, కొండలు, నదుల మధ్య ఉన్న నైకరి ఆనకట్ట రాంగఢ్ లోని అందమైన విహారప్రదేశాలలో ఒకటి.[78]
  • ధుర్- దురియా- జలపాతం :ధుర్దురియా జలపాతం సిధ్వర్ జలపాతం సమీపంలో ఉంది. ఇది రాంగఢ్‌కు 4కి.మీ దూరంలో ఉంది. ఈ జలపాతం షెర్భుకి నదీజలాలతో ఏర్పడింది. సిధ్వర్ గ్రామం నుండి ఎగువ భూమి ఆరంభం ఔతుంది కనుక జలపాతం చేరడానికి సిధ్వర్ నుండి రహదారి మార్గం నిర్మించబడింది. ఈ జలపాతం ఎత్తు 50 అడుగులు.[79]
  • ఆం-ఝరియా- జలపాతం : ఇది హల్వాడి, సిధ్వర్ గ్రామానికి వెళ్ళే మార్గంలో ఉంది.[79]
  • నిమి జలపాతం : నిమి జలపాతం భుర్కుండా నుండి 5 కి.మీ దూరంలో నిమి గ్రామం సమీపంలో ఉంది.
  • ధారా జలపాతం : ధారా జలపాతం గోలాబ్లాక్ లోని ఖాకర గ్రామం సమీపంలో ఉంది. ఈ జలపాతం చేరడానికి ప్రభుత్వం జాతీయరహదారి 23 నుండి గోలా పీటర్‌వార్ వరకు రహదారి నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది.[80]
  • గాంధౌనియా (హిందీ: गंधौनिया (गरम पानी कुंड) : రాంగఢ్‌కు 20 కి.మీ దూరంలో మండూ సమీపంలో ఉంది. ఇది ఒక వేడినీటి ఊట.[81]
  • చుతుపల్లు : ఇది రాంగఢ్‌కు 10 కి.మీ దూరంలో రాంగఢ్‌ - రాంచీ మార్గంలో జాతీయరహదారి 33 పక్కన కొండశిఖరం మీద అద్భుత సౌందర్యంతో అలరారుతూ ఉంది. చుతుపల్లు దాటిన తరువాత ఉన్న పలు దబాలు, మోటళ్ళు పర్యాటకులకు చక్కని ఆహారం అందిస్తున్నాయి. కొండ మార్గంలో కనుపిస్తున్న మైమరపించే దృశ్యాలు పర్యాటకులకు అద్భుత అనుభూతిని మిగిలిస్తుంది. .
     
    A view from Ramgarh Mountain Pass from Ramgarh to Ranchi
  • బంకెట్టా జలపాతం: ఇది చుతుపల్లు వద్ద ఉంది. ఈ గుహవద్ద చప్పట్లు కొడితే పైకప్పు నుండి వర్షం పడుతున్న ప్రతిధ్వని వస్తుంది.
  • లిరిల్ జలపాతం : రాంగఢ్, చుతుపల్లు మద్య ఉన్న జలపాతం వద్ద పాత లిరిల్ సబ్బు ప్రకటన చిత్రీకరించబడింది. అందుకని దీనిని లిరిల్ జలపాతం అంటున్నారు. ఇది ఒక అద్భుత విహారప్రాంతం.
  • బార్సోపాని : ఇది రాంగఢ్‌కు 30 కి.మీ దూరంలో ఉంది. రాంగఢ్‌ నుండి హజారీబాగ్ మార్గంలో చర్హి సమీపంలో ఉంది. ఈ గుహవద్ద చప్పట్లు కొడితే పైకప్పు నుండి వర్షం పడుతున్న ప్రతిధ్వని వస్తుంది.
  • హుంద్రు జలపాతం : ఇది సుబర్నరేఖా నదీజలాలతో ఏర్పడింది. ఈ జలపాతం రాంచి - రాంగఢ్ సరిహద్దులో ఉంది .[21]
  • పర్యాటకులు రహదారి మార్గంలో హజారీబాగ్, ధన్‌బాద్, బొకారో: ఇది అతి దగ్గర మార్గమైనా వర్షాకాలంలో ఇది అనుకూలంకాదు.
  • రాంగఢ్ ఒర్మంజి బ్లాక్- సికిద్రి - హుద్రు జలపాతం:[54] (రాంగఢ్ నుండి హుంద్రు ఫాల్ 42.12 కి.మీ దూరంలో ఉంది)
  • రాంగఢ్ -ఒర్మంజి బ్లాక్ 21 కి.మీ, ఒర్మంజి బ్లాక్ నుండి సికిద్రి -హుద్రు 21.12.
  • గోలా- సిక్ద్రి- హుద్రు జలపాతం మార్గం సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది.
  • రాంగఢ్ - ఒర్మంజి బ్లాక్- గెస్టల్సుద్-హుద్రు జలపాతం.
  • గోలా-సికిద్రి-గెటల్సుద్-హుద్రు జలపాతం.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-30. Retrieved 2014-07-20.
  2. http://www.mapsofindia.com/maps/jharkhand/tehsil/ramgarh.html
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2014-07-20.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-09-07. Retrieved 2014-07-20.
  5. http://www.jharkhandtourism.in/History/hazaribag.htm
  6. 6.0 6.1 District gazetteer, hazaribagh chapter IV, page no. – 65
  7. District Gazetteer, Hazaribagh, Chapter IV, Page no.- 68
  8. District Gazetteer, Hazaribagh, Chapter IV, Page no.- 69
  9. District Gazetteer, Hazaribagh Page no.- 70,
  10. District Gazetteer, Hazaribagh Chapter IV, Page no.- 72
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-01. Retrieved 2014-07-20.
  12. 12.0 12.1 Danik jagran Ranchi Page No.14, 2 October 2011
  13. http://www.gandhimedia.org/cgi-bin/gm/gm.cgi?action=view&link=Images/Photographs/Personalities/Mahatma_Gandhi/1940&image=IMPHPEMG
  14. http://www.mkgandhi-sarvodaya.org/gphotgallery/1933-1948/pages/g7.htm
  15. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-12-11. Retrieved 2014-07-20.
  16. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-11-22. Retrieved 2014-07-20.
  17. http://epaper.prabhatkhabar.com/epapermain.aspx?pppp=2&queryed=9&eddate=9/14/2012%2012:00:00%20AM
  18. http://epaper.jagran.com/epaper/09-jan-2013-269-ranchi-edition-ramgarh.html
  19. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-10-28. Retrieved 2014-07-20.
  20. Survey Of India, toposheet No.F45B6, 2009.
  21. 21.0 21.1 Survey Of India, toposheet No.F45B11 and 73/E.
  22. http://fossil.energy.gov/international/Publications/Coal_Beneficiation_Workshop/DT_OP_CCL_presentation.pdf
  23. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-09. Retrieved 2014-07-20.
  24. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-31. Retrieved 2014-07-20.
  25. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-22. Retrieved 2014-07-20.
  26. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-12-30. Retrieved 2014-07-20.
  27. http://fossil.energy.gov/international/Publications/cwg_nov05_cbm_kanchan.pdf
  28. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-06-06. Retrieved 2014-07-20.
  29. Danik Hindustan Dated 04.04.2013 Page no.5 (04.04.2013)
  30. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-31. Retrieved 2014-07-20.
  31. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-02. Retrieved 2014-07-20.
  32. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-31. Retrieved 2014-07-20.
  33. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-19. Retrieved 2014-07-20.
  34. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-22. Retrieved 2014-07-20.
  35. 35.0 35.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-11-13. Retrieved 2014-07-20.
  36. "About Company". Archived from the original on 2013-02-01. Retrieved 2014-07-20.
  37. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-09. Retrieved 2014-07-20.
  38. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-08-21. Retrieved 2014-07-20.
  39. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-03. Retrieved 2014-07-20.
  40. http://inlandpower.in/
  41. Danik Hindustan Hindi (Ranchi) Page6 date10.02.13
  42. :Page 147, Bihar a physical, Economic and Regional Geography by Enayat Ahmad
  43. "Deer park in Ramgarh". The Telegraph. Calcutta, India. 2012-06-05.
  44. "Proposal to ward off tuskers in 30 villages in Ramgarh district". The Times Of India. 2012-03-21. Archived from the original on 2013-12-30. Retrieved 2014-07-20.
  45. 45.0 45.1 45.2 45.3 45.4 45.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  46. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  47. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Delaware 897,934
  48. http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,397
  49. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-30. Retrieved 2014-07-20.
  50. Jaipuriar, Vishvendu (2011-01-19). "Off Track". The Telegraph. Calcutta, India.
  51. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-30. Retrieved 2014-07-20.
  52. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-10. Retrieved 2014-07-20.
  53. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-10-30. Retrieved 2014-07-20.
  54. 54.0 54.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-12-30. Retrieved 2014-07-20.
  55. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-09. Retrieved 2014-07-20.
  56. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-03-18. Retrieved 2014-07-20.
  57. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-02-21. Retrieved 2014-07-20.
  58. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-31. Retrieved 2014-07-20.
  59. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-16. Retrieved 2014-07-20.
  60. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-13. Retrieved 2014-07-20.
  61. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-19. Retrieved 2014-07-20.
  62. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-10-30. Retrieved 2014-07-20.
  63. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-03. Retrieved 2014-07-20.
  64. http://www.bite.edu.in/about-b-i-t-e/ About B.I.T.E. Ramgarh
  65. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-10. Retrieved 2014-07-20.
  66. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-12-31. Retrieved 2014-07-20.
  67. http://www.jagran.com/jharkhand/ramgarh-9737516.html
  68. http://www.onlytravelguide.com/jharkhand/spiritual/rajrappa.php
  69. http://www.jagran.com/jharkhand/ramgarh-8243959.html
  70. http://epaper.jagran.com/epaper/27-jul-2012-269-ranchi-edition-ramgarh-Page-9.html
  71. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-10. Retrieved 2014-07-20.
  72. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-02. Retrieved 2014-07-20.
  73. http://www.mkgandhi-sarvodaya.org/gphotgallery/1933-1948/pages/g6.htm
  74. http://epaper.jagran.com/epaper/09-nov-2012-212-ranchi-edition-ranchi.html
  75. Gupta, Amit (2009-06-12). "ASI green light to Honhe megalith excavation". The Telegraph. Calcutta, India.
  76. Jaipuriar, Vishvendu (2009-02-19). "Enemy man for heritage sites". The Telegraph. Calcutta, India.
  77. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-22. Retrieved 2014-07-20.
  78. http://www.jagran.com/jharkhand/ramgarh-9987852.html
  79. 79.0 79.1 http://www.jagran.com/jharkhand/ramgarh-9990878.html
  80. http://www.jagran.com/jharkhand/ramgarh-10018100.html
  81. http://www.jagran.com/jharkhand/ramgarh-9990893.html

External linksసవరించు