రాంజగన్

నటుడు
(రాం జగన్ నుండి దారిమార్పు చెందింది)

రాంజగన్ ఒక ప్రముఖ తెలుగు నటుడు. మహాత్మ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. శివ సినిమాలో నాగార్జున స్నేహితుల్లో ఒకడిగా నటించాడు. తరువాత పలు సీరియళ్ళలో కూడా నటించాడు.

రాంజగన్
ఒక ముఖా ముఖి కార్యక్రమంలో రాంజగన్
జననం
జగన్మోహన్[1]

ఇతర పేర్లుడొక్కా
వృత్తినటుడు
పిల్లలు2

ఆయనది పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరకువాడ. ఇంటర్మీడియెట్ చేశాక మైన్స్ సర్వేయింగ్‌లో డిప్లొమో చేయడానికి గూడూరు వెళ్లాడు. అక్కడ సినిమాతో ఆయన అనుబంధం మొదలైంది. రూమ్మేట్స్‌తో కలిసి విపరీతంగా సినిమాలు చూశాడు. అప్పుడే నటన మీద ఆసక్తి కలిగింది. మంచి కమెడియన్‌ని అవ్వగలనన్న నమ్మకంతో హైదరాబాద్ వచ్చి మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు.[2]

ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్నప్పుడే శోభన్‌బాబు హీరోగా చేసిన ‘మాంగల్యబలం’ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికి ఇండస్ట్రీ ఇంకా మద్రాసులోనే ఉండటంతో ఆ సినిమా పూర్తయ్యాక మద్రాస్ వెళ్లిపోయాడు. కొన్ని సినిమాలు చేశాక ‘శివ’లో చాన్స్ వచ్చింది. ఆ సినిమాతోనే బ్రేక్ కూడా వచ్చింది.

సమాజానికి సేవ చేయడంలో తన వంతుగా అక్షయపాత్ర ఫౌండేషన్‌కి ప్రతి యేటా విరాళాలు పంపిస్తాడు.

కుటుంబం

మార్చు

అమ్మాయి ఎంబీయే చదువుతోంది. బాబు ఇంజినీరింగ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు.

నటించిన చిత్రాలు

మార్చు

తెలుగు

మార్చు
  1. మాంగల్య బలం (1985 సినిమా) (తొలి చిత్రం)
  2. శివ (1989)
  3. షాక్ (2006)
  4. మహాత్మ (2009)
  5. 16 డేస్ (2009)
  6. దమ్మున్నోడు (2010)
  7. హోమం (2008)
  8. ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
  9. మిస్టర్ గిరీశం (2009)

సీరియళ్ళు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ప్రకాశ్‌రాజ్‌కీ నీకూ ఏంటి గొడవ?". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 9 January 2018. Retrieved 9 January 2018.
  2. Namasthe Telangana (21 October 2021). "బాన్సువాడ అల్లుడిని!". Archived from the original on 1 నవంబరు 2021. Retrieved 1 November 2021.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=రాంజగన్&oldid=3799083" నుండి వెలికితీశారు